"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

పట్నం శేషాద్రి

From tewiki
Jump to navigation Jump to search

పట్నం శేషాద్రి మహబూబ్ నగర్ జిల్లాలోని గద్వాల ప్రాంతానికి చెందిన కవి. రెవిన్యూ శాఖలో ఉద్యోగిగా పనిచేసి, విరమణ చేశారు. ప్రస్తుతం సాహిత్య ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నారు. పరిపాలనలో భాగంగా విరివిగా తెలుగు భాష వాడకాన్ని ప్రోత్సహించిన అధికారిగా అప్పటి (2013) అధికార భాషా సంఘం అధ్యక్షుడు మండలి బుద్ధప్రసాద్ నుండి అవార్డును స్వీకరించాడు.

కుటుంబనేపథ్యం

వీరి తండ్రి గద్వాలకు చెందిన పట్నం నర్సప్ప, తల్లి పాగుంటమ్మ.

విద్యాభ్యాసం

గద్వాలలో డిగ్రీ వరకు చదివిన శేషాద్రి, తరువాత ఎం.ఎస్సీ., వృక్షశాస్త్రం చదివారు. అందులో పరిశోధన చేసి డాక్టరేట్ పట్టాను పొందారు.

ఉద్యోగ జీవితం

1985లో మెదక్ జిల్లాలోజగదేవ్‌పూర్ మండలంలో తాహశిల్దారుగా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించారు. తరువాత వరంగల్ డి.ఆర్.వో. గా, నిజామాబాద్ జిల్లా అధనపు సంయుక్త కలెక్టర్ గానూ పనిచేశారు.

సాహిత్య జీవితం

మెదక్ జిల్లా జగదేవ్‌పూర్ మండలంలో పనిచేస్తున్నప్పుడు అక్షరాస్యతా ఉద్యమంలో భాగంగా ఆ జిల్లాలో మంజీరా అక్షరప్రభ కార్యక్రమం జరిగింది. ఆ కార్యక్రమంలోని పాటలు, సాహిత్యం వీరిని సాహిత్యం వైపు నడిపించాయి. ఆ తర్వాత తానే పాటలు, కవితలు, నానీలు రాయడం మొదలు పెట్టారు. ఇప్పటి వరకు మూడు పుస్తకాలు ప్రచురించబడ్డాయి. మరో రెండు పుస్తకాలు ప్రచురణకు సిద్ధంగా ఉన్నాయి. ఆచార్య ఎన్. గోపి తాను రాసిన 'రాతి కెరటాలు ' అనే వచన కవితాసంపుటిని శేషాద్రికి అంకితమిచ్చాడు.

రచనలు

  1. కవితాసుమాలు: 41 కవితలతో కూడిన ఈ సంకలనం 2007లో వెలువడింది. దీనిని ప్రముఖ కవి ఎన్. గోపి ఆవిష్కరించారు.
  2. అక్షరదళాలు: ఇది నానీల సంపుటి. 2008లో వెలువడిన ఈ పుస్తకాన్ని సి. నారాయణరెడ్డి ఆవిష్కరించారు.
  3. విచిత్ర వర్ణాలు: ఇది వచన కవితా సంపుటి 2015 జనవరిలో వెలువడింది. దీనిని అప్పటి నిజామాబాద్ జిల్లా కలెక్టర్ రోనాల్డ్ రాస్ ఆవిష్కరించారు[1].

మూలాలు

  1. అక్షర దళపతి శేషాద్రి,మహబూబ్ నగర్ జిల్లా ఎడిషన్, పేజి సంఖ్య-9, ఈనాడు దినపత్రిక, తేది:08.10.2015

Lua error in మాడ్యూల్:Authority_control at line 369: attempt to index field 'wikibase' (a nil value).