"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."
పనామా కాలువ
పనామా కాలువ (ఆంగ్లం : Panama Canal) మానవ నిర్మిత కాలువ. ఈ కాలువ పనామా దేశంలో గలదు. ఈ కాలువ పసిఫిక్ మహాసముద్రాన్ని, అట్లాంటిక్ మహాసముద్రాన్ని కలుపుతోంది. ఈ కాలువ నిర్మాణ కార్యక్రమం అతిపెద్దదైనది, క్లిష్టమైనది. రెండు మహాసముద్రాలను కలిపే కాలువ కార్యక్రమం. ఈ కాలువ రెండు ఖండాలైన ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా లను విడదీస్తున్నది. న్యూయార్క్ నుండి శాన్ ఫ్రాన్సిస్కో కు వెళ్ళాలంటే, దక్షిణ అమెరికా దక్షిణాగ్రం "కేప్ హార్న్" దగ్గర నుండి 22,500 కి.మీ. లేదా 14,000 మైళ్ళు ప్రయాణించ వలసి వుండేది. కానీ ఈ పనామా కాలువ నిర్మాణం వలన ఈ ప్రయాణ దూరం 9,500 కి.మీ. లేదా 6,000 మైళ్ళ దూరం వరకు దాదాపు సగం ప్రయాణ దూరం తగ్గిపోయింది.[1]
చరిత్ర
అమెరికా ఖండానికి రెండు వైపులా ఉన్న అట్లాంటిక్ సముద్రం , పసిఫిక్ సముద్రంలను వేరు చేస్తూ అమెరికాకు చెందిన సన్నని భూ భాగం ఉంది . దీని మీద కృత్రిమంగా కాలువను తవ్వి రెండు సముద్రాలను కలిపారు. ఈ కృత్రిమ కాలువనే పనామా కాలువ అంటారు. 1881 లోనే ఫ్రాన్స్ దీని నిర్మాణాన్ని చేపట్టింది. ఇంజనీరింగ్ పరిజ్ఞానం, సమస్యలు , పని చేసే వారి కొరత వలన ఫ్రాన్స్ దీని నిర్మాణం మధ్యలోనే ఆపేసింది. తరువాత అమెరికా దీని నిర్మాణ భాద్యతలను తీసుకుని నిర్మాణాన్ని పూర్తి చేసింది. 1914 ఆగష్టులో ఈ కాలువను ప్రారంభించారు.
16 వ శతాబ్దంలోనే ఉత్తర ,దక్షిణ అమెరికాలను కలిపేటటువంటి అతి సన్నని భూబాగాన్ని తవ్వి అట్లాంటిక్, పసిఫిక్ సముద్రాలను కలపాలకున్నారు. కెనాల్‌కి కావాల్సిన సాంకేతికత లేకపోవడం వలన మానేశారు.
పనామా కాలువ ప్రాజెక్టును ఫ్రాన్స్‌కు అప్పగించారు. సూయజ్ కాలువ నిర్మాణంలో ముఖ్య ఇంజనీరుగా పనిచేసిన ఫెర్నాండెండ్ డి లెస్సిప్స్ ఈ పనామా కాలువకు ఇంజనీరుగా పనిచేశాడు. ఆ భూబాగం మొత్తం గరుకుగా ఉండే అతి పెద్ద వర్షారణ్యం. ఎప్పుడూ కాలువ పనులు జరుగుతూ, వర్షాలు పడుతూ ఉండడం వలన అక్కడ విపరీతమైన వ్యాధులు వ్యాపించాయి.ఈ కారణంగా కొన్ని వందల మంది ఈ నిర్మాణంలో చనిపోయారు.
పనామా కాలువ ప్రాజెక్ట్ అత్యధిక సవాళ్లతో కూడుకుని ఉండటం , కొన్ని వందల మంది అక్కడ చనిపోవడం వంటి కారణాల వలన ఫ్రాన్స్ ఈ పనామా కాలువ నిర్మాణాన్ని చేపట్టలేకపోయింది. ఈ ప్రాజెక్ట్‌ను వదిలేయడం ద్వారా ఫ్రాన్స్ ప్రభుత్వానికి ధన నష్టం వచ్చింది. ఆ తరువాత ఏడు సంవత్సరాల వరకు ఎలాంటి పనులు ప్రారంభం కాలేదు.
ఫ్రాన్స్ పనామా కాలువ నిర్మాణ పనులను వదిలినవెళ్లిన తరువాత అమెరికా 1904 లో దీని నిర్మాణ భాద్యతలను తీసుకుంది. ఇంజనీరింగ్ నిపుణులతో, మట్టిని తొలిగించే అధునాతన యంత్రాలు ,వాహనాలతో పనులను ప్రారంభించింది.
1904 సంవత్సరం మే 6 న అప్పటి అమెరికా అధ్యక్షుడు ఈ పనామా కాలువ నిర్మాణ ప్రాజెక్ట్‌కు ముఖ్య ఇంజనీర్‌గా జాన్ ఫిండ్లే వాల్లేస్ను నియమించాడు.అమెరికా దీని భాద్యతలు తీసుకున్న తరువాత దీని అభివృద్ది పనులను వేగవంతం చేసింది. అధునాతన పరిజ్ఞానాలతో ప్రేళుల్లు, డ్రిల్లింగ్, కన్వేయర్ బెల్ట్ ద్వారా మట్టిని తొలగించడం వంటి పనులు చేశారు.
పదేళ్ల తరువాత పనామా కాలువ నిర్మాణం పూర్తయింది. కొన్ని వేల మంది వర్కర్లు, ఇంజనీర్ల శ్రమ తరువాత పనామా కృత్రిమ కాలువ నిర్మాణం పూర్తయింది. నౌకల కోసం ప్రత్యేకంగా కాలువను 1914 లో ప్రారంభించారు. 80 కిలోమీటర్ల పొడవు ఉన్న ఈ కాలువలో నౌకలు నిలవడానికి రెండు పాత్ వే లను నిర్మించారు.
పనామా కాలువ నిర్మాణం ద్వారా మూడు కృత్రిమ నదులు ఏర్పడ్డాయి. మరి కొన్ని ఆనకట్టల నిర్మాణం కూడా జరిగింది. పనామా జలసంధిలో అతి ముఖ్యమైన భాగం గాటన్ నది, 33 కిలోమీటర్లు పొడవు ఉన్న ఈ నది గుండా నౌకలు ప్రయాణిస్తుంటాయి.
పనామా కాలువ వెంబడి షిప్పింగ్ ఇండస్ట్రీకు చెందిన ఆధునాతమైన సాంకేతికతలు ఎప్పటికప్పుడు రూపుదిద్దుకుంటూనే ఉన్నాయి. షిప్పింగ్ ఇండస్ట్రీని విస్తరించే వ్యవస్థలు, అతి పెద్ద షిప్ లాంచింగ్ పోర్టులు, వివిధ రకాల ఆకారాలలో రూపొందించి పనామా కెనాల్ ద్వారా ఎంతటి పెద్ద నౌకలైనా కెనాల్ నుండి ఉప నదులలోకి కూడా ప్రయాణించే వీలును కల్పించారు.
పనామా కాలువలో నౌకలు నిలబడే ప్రదేశంలో నీటి ఎత్తు యొక్క అసమతుల్యత వలన నౌకలు మరియు నౌకాశ్రయంలోని ఫ్లాట్ ఫామ్ మధ్య ఎత్తు సమానంగా ఉండదు. దీనిని సమతుల్యం చేయడాని అతి పెద్ద ట్రాకుల ద్వారా కొన్ని లక్షల గ్యాలన్ల నీటిని నౌకలు నిలబడే ప్రదేశంలోకి నింపుతూ ఉండాలి. అలా మూడు అతి పెద్ద ట్యాంకులు నిరంతరం నీటిని నింపితే అపుడు నౌక సుమారుగా 90 అడుగుల ఎత్తుకు చేరుకుంటుంది.నౌకలు ఈ పనామా కాలువలోని నిర్ణీత ప్రదేశాలలోకి వచ్చినప్పటికి సరైన క్రమంలో అవి నిలబడవు, వాటిలోని సరుకును దించాలన్నా , నింపాలన్నా నౌకలు వివిధ రకాల కోణాలలో మళ్లాల్సి ఉంటుంది. ఇది సాధ్య కాదు కాబట్టి, కేబుల్స్ ద్వారా కనెక్ట్ అయి ఉండే వెసెల్స్ను, హై కెపాసిటి ట్రాక్షన్ యంత్రలను ఇందుకు వినియోగిస్తారు.
పనామా కాలువ నిర్మాణం పూర్తి అయిన తరువాత 1999 వరకు మెయింటెనెన్స్, రుసుము వసూలును అమెరికా చేసేది. ఆ తరువాత పనామా దేశానికి అప్పగించింది అమెరికా. పూర్తిగా షిప్పింగ్ ఇండస్ట్రీ మీద ఆధారపడిన దేశంగా పనామా నిలిచింది. పనామా కాలువ గుండా ప్రయాణించే అన్ని నౌకల ద్వారా కొన్ని మిలియన్ డాలర్ల ఆదాయం లభిస్తోంది.
ఈ పనామా కాలువ ద్వారా సుమారుగా 14,000 మందికి పైగా ఉపాధి లభించింది. అందులో 5,000 మంది వరకు పనామా దేశానికి చెందిన వారే ఉన్నారు. దీని నిర్మాణ సమయంలో ప్రతి కూల వాతావరణ పరిస్థితుల కారణంగా భయంకరమైన దోమలు కుట్టి జ్వరాలు వచ్చి 25,000 మందికి పైగా మృత్యువాత పడ్డారు. వ్యాధుల బారిన పడ్డ వారిని కూడా ఆ సమయంలో చంపేశారు. పనామా దేశం పనామా కాలువను ప్రస్తుతం ఆధునిక నౌకల అవసరార్థం విస్తరించే దిశగా ప్రణాళికలు చేస్తుంది. అందుకోసం 2007 లో పనామా దేశం దీని విస్తరణను చేపట్టింది. 4,500 కంటైనర్లకు పైగా మోసుకెళ్లే నౌకలు ఈ విస్తరించిన కాలువ గుండా ప్రయాణించవచ్చు. ప్రపంచ వ్యాప్తంగా అత్యంత పెద్ద కంటైనర్ నౌకలు అన్ని కూడా ఈ కాలువ గుండా సులభంగా ప్రయాణించగలవు. ఈ విస్తరించిన కాలువ 110 అడుగుల వెడల్పు, 1,000 అడుగుల పొడవు ఉంది.
పనామా కాలువలో ఏడాదిలో దాదాపుగా 13,000 నుండి 14,000 వరకు నౌకలు ప్రయాణిస్తాయి. 1914 నుండి కొన్ని కోట్ల నౌకలు ఈ పనామా కాలువ గుండా ప్రయాణించాయి. ఒక్క 2010 లోనే 10 లక్షల నౌకలు ఈ కాలువ గుండా ప్రయాణించాయి.ఈ కాలువ రెండు ఖండాలైన ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికాలను విడదీస్తోంది. న్యూయార్క్ నుండి శాన్ ఫ్రాన్సిస్కో కు వెళ్ళాలంటే దక్షిణ అమెరికా "కేప్ హార్న్" దగ్గర నుండి 22,500 కి.మీ. ప్రయాణించవలసి ఉంటుంది. కానీ ఈ పనామా కాలువ నిర్మాణం వలన ఈ ప్రయాణ దూరం 9,500 కి.మీ. దూరం వరకు అంటే దాదాపు సగం దూరం తగ్గిపోయింది. పనామా దేశానికి ఉత్తర భాగంలో ఉన్న నికరగాన్ అనే దేశంలో పనామా కెనాల్ తరహాలో నిర్మించడానికి 2013 లో చైనాకు చెందిన సంస్థ ముందుకు వచ్చినట్లు నికరగావ్ దేశం ప్రకటించింది. అయితే ఇది అందుబాటులోకి వస్తే పనామా కాలువలో నౌకల రద్దీ తగ్గే అవకాశం ఉంది.అప్పుడప్పుడు కాలువకు ఇరువైపులా ఉన్న మట్టి జారి కాలువలో పడటం, నిర్వహణ పనులు, ప్రమాదాలు తప్ప పనామా కాలువ 24 గంటలు తెరిచే ఉంటుంది. ఏడాదిలో అన్ని రోజులు కూడా నిరంతరం నౌకలకు ఎంట్రీ ఉంటుంది[2].
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న 160 దేశాలకు సంభందించి ఈ పనామా కాలువతో సంభందాలున్నాయి. దీని ద్వారా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న 17,000 నౌకాశ్రయాలతో రవాణా సంభందాలున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న షిప్పింగ్ ఇండిస్ట్రీకి పనామా కాలువ కేంద్ర బిందువుగా ఉంది.
వాణిజ్యం
పనామ కాలువలో రవాణా ప్రపంచంలోని సరుకులో 45 శాతం జరుగుతుంది, ఈ ప్రాజెక్ట్ పనామా యొక్క ఆర్ధికవ్యవస్థకు,పరిశ్రమకు కూడా కీలకమైనది. ఇది ప్రస్తుతం ప్రపంచ వాణిజ్యంలో 6% దీని ద్వారా జరుగుతుంది[3].
ప్రత్యేకతలు
ఇవీ చూడండి
మూలాలు
- ↑ Scott, William R. (1913). The Americans in Panama. New York, NY: Statler Publishing Company.
- ↑ "history of Panama canal". history.com. Archived from the original on 2021-04-04. Retrieved 2021-04-04.
- ↑ "Business of Panama canal". fathom.world. Archived from the original on 2021-04-04. Retrieved 2021-04-04.
బయటి లింకులు
- 2700 digitised National Archives public domain images Photos of the building and early days of the Panama Canal digitised by GoZonian.org from the US National Archives and Records Administration. Originally from 8 x 10 glass plates.
- Making the Dirt Fly, Building the Panama Canal Smithsonian Institution Libraries
- Official website of the Panama Canal Authority — Has a simulation that shows how the canal works
- Canalmuseum — Panama Canal History, Documents, Photographs and Stories