"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

పరుసవేది

From tewiki
Jump to navigation Jump to search

పరసువేది ప్రాచీన భారతీయులు నమ్మిన "కుహనా శాస్త్రం" అనడమా కళ అనడమా అన్నది తేల్చుకోవలసిన విషయమే. ఏదైనా క్షుద్ర లోహాన్ని బంగారంగా ఎలా మార్చవచ్చునో ఈ ప్రక్రియ వివరిస్తుందని ప్రతీతి[1]. ఈ రకం మూఢ నమ్మకం మధ్య యుగంలో ప్రపంచ వ్యాప్తంగా ఉండేది. నీచ లోహాలని ఉత్తమ లోహాలుగా మార్చగలిగే మహత్తర శక్తి ఉన్న రాళ్లు ఉన్నాయనిన్నీ, కేవలం స్పర్శామాత్రంగా ఈ రాళ్లు ఇనుము వంటి లోహాలని బంగారంగా మార్చగలవనీ పూర్వం నమ్మేవారు. ఈ రాళ్లని స్పర్శవేది అనేవారు. ఈ మాట బ్రష్టరూపమే పరసువేది అయి ఉంటుంది. దీనిని ఇంగ్లీషులో philosopher's stone అనేవారు. ఈ రకం కుహనా శాస్త్రాన్ని ఇంగ్లీషులో "ఆల్కెమీ" (alchemy) అనేవారు. ఈ గుడ్డి నమ్మకాలని పారద్రోలి, పేరు మారితేకాని పోకడ మారదనే ఉద్దేశంతో "ఆల్కెమీ" అన్న పేరుని మార్చి "కెమెస్ట్రీ" అని పేరు పెట్టేరు.

ఇతర పఠనాలు

మూలాలు

ఇతర లింకులు

Commons-logo.svg
వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.