"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

పలమనేరు బాలాజీ

From tewiki
Jump to navigation Jump to search
పలమనేరు బాలాజీ
జననం
పలమనేరు, చిత్తూరు జిల్లా
వృత్తిరచయిత

పలమనేరు బాలాజీ చిత్తూరు జిల్లాకు చెందిన రచయిత.[1] చిత్తూరు జిల్లా రచయితల సమాఖ్యకు కన్వీనరుగా వ్యవహరించాడు.[2] ఈయన కవితలు ద్రవిడ విశ్వవిద్యాలయం ద్వారా పలు భాషల్లోకి అనువాదమయ్యాయి. కథ, కవిత, నవల, విమర్శ రంగాల్లో చేసిన సేవకు గాను కేంద్ర సాహిత్య అకాడెమీ ఆయనను శాంతి నికేతన్ సందర్శనకు ఆహ్వానించారు. అనేక విశ్వవిద్యాలయాల్లో ఆయన రచనలపై పరిశోధనలు సాగుతున్నాయి. తెలుగు భాషా ప్రతినిథిగా ఆయన పలు అంతర్జాతీయ సమావేశాల్లో పాల్గొన్నాడు.

పురస్కారాలు

  • మాటల్లేని వేళ కవిత్వానికి గాను స్మైల్ పురస్కారం
  • ఇద్దరి మధ్య కవిత్వానికి నూతలపాటి పురస్కారం
  • నేల నవ్వింది నవలకు గాను కందుకూరి వీరేశలింగం స్మారక పురస్కారం

మూలాలు

  1. "పలమనేరు బాలాజీకి తెలుగు విశ్వవిద్యాలయ పురస్కారం". prajasakti.com. ప్రజాశక్తి. Retrieved 21 August 2017.
  2. "Chittoor as the fountain head of substantive literature". thehindu.com. ది హిందూ. Retrieved 21 August 2017.

Lua error in మాడ్యూల్:Authority_control at line 369: attempt to index field 'wikibase' (a nil value).