పల్లెంపాటి వెంకటేశ్వర్లు

From tewiki
Jump to navigation Jump to search
దస్త్రం:Pallempati vankateswararao.png
పల్లెంపాటి వెంకటేశ్వర్లు

పల్లెంపాటి వెంకటేశ్వర్లు ప్రముఖ పారిశ్రామికవేత్త, కాకతీయ సిమెంట్స్‌ వ్యవస్థాపకుడు, మేనేజింగ్‌ డైరెక్టర్‌.[1]

జీవిత విశేషాలు

ఆయన గుంటూరు జిల్లా అమర్తలూరు మండలం, మోపర్రు గ్రామంలో వీరయ్య, నర్సమ్మ దంపతులకు సెప్టెంబరు 5 1927 న జన్మించాడు[2]. ఆయన నల్గొండ జిల్లా దొండపాడు లో 1979లో ‘కాకతీయ సిమెంట్‌ ఫ్యాక్టరీ’ని ప్రారంభించారు. అనతికాలంలోనే ఖమ్మం జిల్లా కల్లూరులో చక్కెర ఫ్యాక్టరీ, విద్యుత్‌ సంస్థలను ఏర్పాటుచేసి, ప్రముఖ పారిశ్రామికవేత్తగా ఎదిగారు. వెంకటేశ్వర్లు లోగడ టీటీడీ పాలకమండలి చైర్మన్‌గా సేవలందించారు. సికింద్రాబాద్‌ పద్మారావునగర్‌లోని శ్రీ శివానంద ఆశ్రమం అధ్యక్షుడిగానూ బాధ్యతలు నిర్వహించారు. పలు ఆలయాల నిర్మాణంలో ప్రధాన పాత్ర పోషించారు.

వ్యక్తిగత జీవితం

ఆయనకు భార్య సామ్రాజ్యం, కుమారుడు వీరయ్య, నలుగురు కుమార్తెలున్నారు. పెద్దకుమార్తె లక్ష్మీనళిని భర్త జస్టిస్‌ జాస్తి చలమేశ్వర్‌ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఉన్నారు. రెండవ కుమార్తె శ్రీమతి జాస్తి త్రివేణి భర్త కీర్తి ఇండస్ట్రీస్ ఎం.డి.శ్రీ జాస్తి శేషగిరిరావు. మూడవ కుమార్తె శ్రీమతి జెట్టి శాంతిదేవి భర్త గ్రీన్ సోల్ పవర్ క్రిస్టల్ ప్రైవేట్ లిమిటెడ్ ఛైర్మన్ శ్రీ జెట్టి శివరామప్రసాద్. నాల్గవ కుమార్తె శ్రీమతి కోనేరు సుకుమారి భర్త శ్రీ కోనేరు శ్రీనివాస్, అమెరికాలో సాఫ్ట్ వేర్ ఇంజనీరు.

మరణం

అనారోగ్య సమస్యలతో హైదరాబాద్‌ కేర్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన జనవరి 11 2016 న సోమవారం తన 90వ యేట మరణించారు.[3]

మూలాలు

ఇతర లింకులు