"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

పాట్ బుకానన్

From tewiki
Jump to navigation Jump to search
పాట్ బుకానన్
Patrickjbuchanan.JPG
పాట్ బుకానన్
జననం (1938-11-02) 1938 నవంబరు 2 (వయస్సు: 82  సంవత్సరాలు)
వాషింగ్టన్, డి.సి.,
అమెరికా సంయుక్త రాష్ట్రాలు
వృత్తిరచయిత, political commentator
రాజకీయ పార్టీరిపబ్లికన్‌ (1960లు–1999, 2004–ప్రస్తుతం)
Reform (1999–2000)
మతంTraditionalist Catholic
జీవిత భాగస్వామిShelley Ann Scarney
తల్లిదండ్రులుWilliam Baldwin Buchanan II and Catherine Elizabeth Crum Buchanan

పాట్రిక్ జోసెఫ్ "పాట్" బుకానన్ (1938 నవంబరు 2న పుట్టాడు) ఒక అమెరికన్ మితవాద రాజకీయ వ్యాఖ్యాత, రచయిత, సిండికేటెడ్ కాలమిస్ట్, రాజకీయవేత్త మరియు బ్రాడ్‌కాస్టర్. బుకానన్ అమెరికా అధ్యక్షులు రిచర్డ్ నిక్సన్, గెరాల్డ్ ఫోర్డ్, మరియు రోనాల్డ్ రీగన్‌లకు సీనియర్ సలహాదారుగా ఉండేవాడు, మరియు CNN యొక్క క్రాస్‌ఫైర్ ఒరిజనల్ హోస్ట్‌గా వ్యవహరించేవాడు. ఇతడు 1992 మరియు 1996లలో రిపబ్లికన్‌ల తరపున అధ్యక్ష పదవికి నామినేషన్ కోసం ప్రయత్నించాడు. ఇతడు 2000 అధ్యక్ష ఎన్నికల సమయంలో రిఫార్మ్ పార్టీ టికెట్‌ కోసం పోటీలో నిలబడ్డాడు.

ఇతడు ది అమెరికన్ కన్జర్వేటివ్ మేగజైన్‌కు సహ వ్యవస్థాపన చేయడమే కాక, ది అమెరికన్ కాజ్[1] అనే ఫౌండేషన్‌ని ప్రారంభించాడు. ఇతడి రచనలు హ్యూమన్ ఈవెంట్స్, నేషనల్ రివ్యూ, ది నేషన్ మరియు రోలింగ్ స్టోన్ వంటి పత్రికలలో ప్రచురితమయ్యాయి. ఇతడు ప్రస్తుతం మార్నింగ్ జో షోతో పాటుగా MSNBC కేబుల్ నెట్‌వర్క్‌లో రాజకీయ వ్యాఖ్యాతగా ఉంటున్నాడు మరియు ది మెక్‌లాఫ్లిన్ గ్రూప్ రెగ్యులర్‌గా కూడా ఉంటున్నాడు.

Contents

వ్యక్తిగత జీవితం

ఒక అక్కౌంటింగ్ సంస్థలో భాగస్వామిగా ఉన్న విలియం బాల్డ్విన్ బుకానన్ (వర్జీనియా, 1905 ఆగస్టు 15 – వాషింగ్టన్, D.C., జనవరి 1988) కుమారుడైన బుకానన్ వాషింగ్టన్, D.C.లో పుట్టాడు, విలియం భార్య కేథరీన్ ఎలిజబెత్ (క్రుమ్) బుకానన్ (చార్లెరోయి, వాషింగ్టన్ కంట్రీ, పెన్సిల్వేనియా, 1911 డిసెంబరు 23 – ఆక్టన్, ఫెయిర్‌ఫాక్స్ కౌంటీ, వర్జీనియా, 1995 సెప్టెంబరు 18) ఒక నర్స్ మరియు గృహిణి.[2][3] బుకానన్‌కు ఆరుగురు సోదరులు (బ్రెయిన్, హెన్రీ, జేమ్స్, జాన్, థామస్ మరియు విలియం జూనియర్) మరియు ఇద్దరు సోదరిలు (కేథరీన్ థెరెస్సా మరియు ఏంజెలా మేరీ, మారుపేరు బే).[4] బే రొనాల్డ్ రీగన్ హయాంలో U.S. కోశాధికారిణిగా పనిచేసింది. బుకానన్‌కు ఇంగ్లీష్, జర్మన్, స్కాట్స్ ఐరిష్, మరియు ఐరిష్‌లలో వారసులు ఉన్నారు.[2] ఇతడి ముత్తాత అమెరికా అంతర్యుద్ధంలో సమాఖ్య సైన్యం తరపున పోరాడాడు. ఇతడు సన్స్ ఆఫ్ కాన్ఫెడరేట్ వెటరన్స్‌[5]లో సభ్యుడు మరియు రాబర్ట్ ఇ. లీ ఆభిమాని.[6]

బుకానన్ కేథలిక్ చర్చ్ మతం పుచ్చుకుని, బ్లెస్సెడ్ శాక్రమెంట్ స్కూల్ మరియు జెసూట్‌లు-నడిపిన గొంజగా కాలేజ్ హైస్కూలులో చదివాడు. జార్జ్‌టౌన్ విశ్వవిద్యాలయం విద్యార్థిగా ఇతడు ROTCలో ఉండేవాడు కాని ప్రోగ్రాంలో పోటీ చేసేవాడు కాడు. 1960లో పట్టభద్రుడయిన తర్వాత ఇతడు సైన్యంలో చేరి సేవలందించవలసిందిగా నోటీసు అందుకున్నాడు. అయితే, ప్రతిక్రియా కీళ్లనొప్పి కారణంగా కొలంబియా జిల్లా సైనిక మండలి బుకానన్‌ను సైనిక సేవనుంచి మినహాయించి, ఇతడిని 4-Fగా వర్గీకరించింది. ఇతడు కెనడా మరియు క్యూబాల మధ్య వాణిజ్య విస్తరణపై థీసీస్ పూర్తిచేసి, 1962లో కొలంబియా నుండి జర్నలిజంలో మాస్టర్ డిగ్రీ అందుకున్నాడు.

బుకానన్ శ్వేతసౌథం ఉద్యోగిని షెల్లీ ఆన్ స్కార్నీని 1971లో వివాహమాడాడు.[7]

వృత్తి జీవితం

సెయింట్ లూయిస్ గ్లోబ్-డెమోక్రాట్ సంపాదకీయ రచయిత

బుకానన్ 23 ఏళ్ల ప్రాయంలో సెయింట్ లూయిస్ గ్లోబ్-డెమోక్రాట్లో చేరాడు. 1961లో క్యూబాపై యునైటెడ్ స్టేట్స్ ఆర్ధిక దిగ్బంధం విధించిన తొలి సంవత్సరంలో కెనడా- క్యూబాల మధ్య వాణిజ్యం మూడు రెట్లు పెరిగింది. బుకానన్న్ ఈ పత్రికలో పని ప్రారంభించిన ఎనిమిది వారాల తర్వాత ది గ్లోబ్-డెమోక్రాటిక్ పత్రిక బుకానన్ రూపొందించిన కొలంబియా మాస్టర్స్ ప్రాజెక్టును ""ఎర్ర క్యూబాకు అమ్మకాలు సాగిస్తున్న కెనడా - మరియు పురోగతి అనే పేరుతో ఎనిమిది కాలమ్‌ల వ్యాసాలను తిరిగి రాసి ప్రచురించింది. బుకానన్ మెమోయిర్ రైట్ ఫ్రం ది బిగినింగ్ ప్రకారం ఈ వ్యాసం అతడి వృత్తిజీవితంలోనే మైలురాయిలా నిలిచింది. అయితే ఆర్ధిక దిగ్బంధనం కమ్యూనిస్టు పాలనను బలోపేతం చేసిందని, అందుకే తాను దానికి వ్యతిరేకంగా నిలబడ్డానని బుకానన్ తర్వాత ఒక సందర్భంలో చెప్పాడు[8] 1964లో అసిస్టెంట్ ఎడిటోరియల్ పేజ్ ఎడిటర్‌గా బుకానన్ పదవీ ఉన్నతి పొందాడు తర్వాత బారీ గోల్డ్‌వాటర్స్ అధ్యక్ష ఎన్నికల ప్రచార కార్యక్రమానికి మద్ధతు పలికాడు. అయితే, గ్లోబ్-డెమోక్రాటిక్ పత్రిక గోల్డ్‌వాటర్‌ను బలపర్చలేదు, పత్రికకు, అప్పటి అధ్యక్షుడు జాన్సన్‌కు మధ్య లోపాయికారీ ఒప్పందం ఉందని బుకానన్ ఊహించాడు. బుకానన్ తర్వాత ఇలా గుర్తు చేసుకున్నాడు: "మితవాద ఉద్యమం దాని పరాజయాలనుండి ఎల్లప్పుడూ పురోగతి బాటలో నడిచింది... గోల్డ్‌వాటర్ క్యాంపైన్ గురించి చింతించే ఒక్కగానొక్క మితవాదిని కూడా నేను ఊహించలేను"[6] మితవాది మనస్సాక్షి ఇటీవలి తాజా ప్రచురణలో ముందు మాట (పాట్ బుకానన్ రాశాడు) ప్రకారం బుకానన్ యంగ్ అమెరికన్స్ ఫర్ ఫ్రీడమ్ సభ్యుడు మరియు ఈ సంస్థ కోసం పత్రికా ప్రకటనలను రాసిపెట్టాడు. న్యూయార్క్ నగరంలోని నిక్సన్, ముద్గే, రోస్, గుత్రీయ్, అలెగ్జాండర్, మరియు మిఛెల్ చట్ట కార్యాలయాల్లో బుకానన్ 1965లో కార్యనిర్వాహక సహాయకుడిగా పనిచేశాడు.

శ్వేతసౌథంలో నిక్సన్ కోసం పని

మరుసటి సంవత్సరం, ఇతడిని నిక్సన్ అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో తొలి సలహాదారుగా ఎన్నుకున్నారు. ఇతడు ప్రధానంగా ప్రతిపక్ష పరిశోధకుడుగా పనిచేశాడు. అంకితభావం కల మద్దతుదారులపై అతడి ఉపన్యాసాలు గురిపెట్టడంతో అచిర కాలంలోనే అతడికి "మిస్టర్ ఇన్‌సైడ్ అనే మారు పేరు వచ్చేసింది.[9]

బుకానన్ 1966 మరియు 1968ల ప్రచార కార్యక్రమాలన్నింటిలో నిక్సన్‌తో పాటు విస్తృతంగా పర్యటించాడు. ఇతడు పశ్చిమ యూరప్, ఆఫ్రికా పర్యటనల్లో పాల్గొన్నాడు, మరియు ఆరు-రోజుల యుద్ధం తర్వాత వెంటనే మధ్యప్రాచ్యంలో కూడా పర్యటించాడు. 1969లో నిక్సన్ ఓవల్ ఆఫీసును చేపట్టినప్పుడు, బుకానన్ శ్వేతసౌథం సలహాదారుగా,మరియు నిక్సన్ మరియు ఉపాధ్యక్షుడు స్పైరో ఆగ్న్యూసలహాదారుగా, ఉపన్యాస లేఖకుడుగా పనిచేశాడు. బుకానన్ నిశ్శబ్ద మెజారిటీ అనే పదబంధాన్ని కనిపెట్టి, కోట్లాది మంది డెమోక్రాట్లను నిక్సన్ వైపు మళ్లించిన వ్యూహానికి రూపురేఖలు దిద్దడంలో సాయపడ్డాడు. 1972లో జరిగిన ఒక సమావేశంలో ఇతడు ప్రసంగిస్తూ, శ్వేతసౌథం "అమెరికా రాజకీయాల్లోని ప్రభుత్వ వ్యతిరేక సంప్రదాయం లేదా భూమికను తిరిగి కైవసం చేసుకునే దిశగా కదలాలని సూచించాడు.[10] రాజకీయ వ్యూహాన్ని వృద్ధిపర్చడం, అధ్యక్షుడి డైలీ న్యూస్ సమ్మరీని ప్రచురించడం, న్యూస్ కాన్ఫరెన్సుల కోసం సంక్షిప్త ప్రతులను సిద్ధపర్చటం వంటివి ఇతడి రోజువారీ విధులు. 1972లో నిక్సన్ చైనా పర్యటనలో మరియు 1974లో మాస్కో, యాల్ట్, మిన్స్‌క్ శిఖరాగ్ర సమావేశంలో బుకానన్ కూడా తోడుగా వెళ్లాడు. డెమోక్రాటిక్ ప్రత్యర్థి జార్జ్ మెక్‌గోవర్న్‌పై ఉగ్రవాదిగా ముద్రవేయాలని, శ్వేతసౌథం టేపులు కాల్చి వేయాలని ఇతడు నిక్సన్‌కు సూచించాడు.[9]

వాటర్‌గేట్ కుంభకోణం చివరి రోజుల్లో కూడా బుకానన్, అధ్యక్షుడి ప్రత్యేక అసిస్టెంట్‌గా కొనసాగాడు. కొంతమంది ఇతనిని డీప్ త్రోట్‌లాగా తప్పుగా అనుమానించినప్పటికీ, తప్పుచేసినట్లు ఇతడు ఆరోపణల బారిన పడలేదు. వాటర్‌గేట్ కుంభకోణంపై పత్రికలకు ఉప్పందించిన అసలు వ్యక్తి FBI అసోసియేట్ డైరెక్టర్ మార్క్ ఫెల్ట్ అని 2005లో బయటపడినప్పుడు బుకానన్ అతడిని క్షుద్రుడు, "నిజాయితీ హీనుడు, మరియు "నేరస్థుడు అని వర్ణించాడు.[11] నిక్సన్ క్యాంపైన్‌లోని ఎటాక్ గ్రూప్‌లో తన పాత్ర కారణంగా, బుకానన్ 1973 సెప్టెంబరు 26న సెనేట్ వాటర్‌గేట్ కమిటీముందు హాజరయ్యాడు. అతడు ప్యానెల్‌కి చెప్పాడు:

The mandate that the American people gave to this president and his administration cannot and will not be frustrated or repealed or overthrown as a consequence of the incumbent tragedy.[9]

నిక్సన్ 1974లో రాజీనామా చేసినప్పుడు, రాబోయే అధ్యక్షుడు గెరాల్డ్ ఫోర్డ్ కింద ప్రత్యేక అసిస్టెంట్‌గా బుకానన్ కొంతకాలం కొనసాగాడు. ఛీఫ్ ఆఫ్ స్టాఫ్ అలెగ్జాండర్ హైగ్ దక్షిణాఫ్రికా రాయబారిగా బుకానన్ నియామకాన్ని ఆమోదించాడు కాని, ఫోర్డ్ దాన్ని తిరస్కరించాడు.[9]

బుకానన్ వాటర్‌గేట్‌పై ఇలా వ్యాఖ్యానించాడు:

The lost opportunity to move against the political forces frustrating the expressed national will ... To effect a political counterrevolution in the capital
 1. దారిమార్పు మూస:Em dash... there is no substitute for a principled and dedicated man of the Right in the Oval Office.[9]

పదవికి రాజీనామా చేసిన చాలా కాలం తర్వాత, బుకానన్ విశ్వాసపాత్రుడని నిక్సన్ పేర్కొన్నాడు, అతడు యూదు వ్యతిరేకి కాదని, "విద్వేషి కాడని, పైగా "అచ్చమైన అమెరికా దేశ భక్తుడు అని నిక్సన్ చెప్పాడు. తను పాటించిన "ఒంటరివాదపు విదేశీ విధానం వంటివాటిపై బుకానన్ కొన్ని నిశ్చితాభిప్రాయాలు ఉండేవి కానీ వాటిని తాను వ్యతిరేకించినట్లుగా నిక్సన్ చెప్పాడు. బుకానన్ అధ్యక్షుడయ్యేవాడని మాజీ అధ్యక్షుడు భావించలేదు, వ్యాఖ్యాత "వినేవాడిగా ఉండాలని నిక్సన్ చెప్పాడు.[12]

వార్తా వ్యాఖ్యాత

బుకానన్ మళ్లీ తన కాలమ్ రచనకు వచ్చేశాడు, ప్రసార హోస్ట్‌గా రాజకీయ వ్యాఖ్యాతగా ప్రతిరోజూ కనిపించసాగాడు. లిబరల్ కాలమిస్ట్ టామ్ బ్రాడన్‌తో కలిసి ప్రతిరోజు మూడు గంటల పాటు నడిచే బుకానన్–బ్రాడెన్ ప్రోగ్రాం గా పిలువబడిన రేడియో షోకు అతడు కో-హోస్ట్ బాధ్యత నిర్వర్తించాడు. ఇతడు 1978 నుంచి 1984 దాకా, NBC రేడియోలో రోజువారీ వ్యాఖ్యానాలు చేశాడు. బుకానన్ ది మెక్‌లాఫ్లిన్ గ్రూప్ మరియు CNN' క్రాస్‌ఫైర్ (బుకానన్-బ్రాడెన్ ద్వారా ఇది ప్రభావితమైంది) లలో రెగ్యులర్‌ ఉద్యోగిగా తన టీవీ కెరీర్‌ను ప్రారంభించాడు మరియు ది కేపిటల్ గ్యాంగ్ అతడికి దేశవ్యాప్త గుర్తింపు తీసుకువచ్చింది. క్రాస్‌ఫైర్ లో అతడు నెలకొల్పిన ప్రమాణాలు 1982 మరియు 1999 మధ్యలో జరిగాయి; బ్రాడెన్‌తో సహా మైఖేల్ కీన్స్‌లే, జువాన్ విలియమ్స్, మరియు బిల్ ప్రెస్ వంటి వారు అతడి భాగస్వాములుగా పనిచేశారు.

మెక్‌లాఫ్లిన్ గ్రూప్‌లో బుకానన్ రెగ్యులర్ ప్యానలిస్ట్‌గా ఉన్నాడు. అతడు చాలా ఆదివారాలు జాన్ మెక్‌లాఫ్లిన్‌, లిబరల్ న్యూస్‌వీక్ విలేకరి ఎలెనోర్ క్లిఫ్ట్, నయా మితవాది మోనికా క్రోలీలతో కలిసి షోలలో కనిపించాడు.

రీగన్ కోసం శ్వేతసౌథంలో పని

బుకానన్ 1985 నుంచి 1987 దాకా శ్వేతసౌథం కమ్యూనికేషన్స్ డైరెక్టర్‌గా పనిచేశాడు. నికరాగువాలో శాండినిస్టా ప్రభుత్వ వ్యతిరేకులకు సాయపడటానికి, ప్రత్యర్థి తిరుగుబాటుదారులకు మద్దతు తెలుపడానికి అతడు ఐ యామ్ ఎ కాంట్రా టూ అనే పదబంధాన్ని వెలుగులోకి తీసుకొచ్చాడు. 1985లో బిట్‌బర్గ్ జర్మన్ సైనిక స్మశానాన్ని సందర్శించాలని అధ్యక్షుడు రీగన్ చేపట్టిన పథకాన్ని బుకానన్ బలపర్చాడు. ఈ సమాధిలో పూడ్చిపెట్టబడిన వెర్మాక్ట్ సైనికులలో 48 మంది వాఫెన్ ఎస్ఎస్ నాజీ సభ్యులు కావడం గమనార్హం. యూదు గ్రూపుల బహిరంగ నిరసనలను అధిగమించి ఈ పర్యటన సజావుగా సాగింది. ఈ పర్యటన గురించి యూదునేతలతో శ్వేతసౌథం జరిపిన సమావేశం గురించి ఒక ఇంటర్వ్యూలో రచయిత ఎలీ వైసెల్ వర్ణించాడు:

The only one really defending the trip, was Pat Buchanan, saying, 'We cannot give the perception of the President being subjected to Jewish pressure.'[13]

వైసెల్ కట్టుకథ అల్లాడని, 1992లో ABCకి ఇచ్చిన ఇంటర్వ్యూలో బుకానన్ నిందించాడు:

I didn't say it and Elie Wiesel wasn't even in the meeting. [...] that meeting was held three weeks before the Bitburg summit was held. If I had said that, it would have been out of there within hours and on the news.[14]

1986లో నేషనల్ రిలిజియస్ బ్రాడ్‌కాస్టర్స్‌లో చేసిన ఉపన్యాసంలో, బుకానన్ "రీగన్ విప్లవం,"

Whether President Reagan has charted a new course that will set our compass for decades
 1. దారిమార్పు మూస:Em dashor whether history will see him as the conservative interruption in a process of inexorable national decline
 2. దారిమార్పు మూస:Em dashis yet to be determined.

గురించి చెప్పాడు. సంవత్సరం తర్వాత అమెరికా రాజకీయాలలోనే అతి పెద్ద శూన్యం రొనాల్డ్ రీగన్ పక్కనే పొంచిఉన్నదని అతడు వ్యాఖ్యానించాడు.[9] ఆమె సోదరుడు రీగన్ కోసం పనిచేస్తుండగా, బే బుకానన్ 1986లో "బుకానన్ ఫర్ ప్రెసిడెంట్" ఉద్యమాన్ని ప్రారంభించింది. మితవాద ఉద్యమానికి ఒక నేత అవసరముందని కాని బుకానన్ ప్రారంభంలో సందిగ్ధంలో ఉండేవాడని ఆమె చెప్పింది.[9] శ్వేతసౌథం వదిలిపెట్టాక, అతడు తన కాలమ్‌ రచనకు, క్రాస్‌ఫైర్ కు తిరిగి వచ్చేశాడు. తదనంతరం కెంప్ తన విరోధిగా మారినప్పటికీ అతడు జాక్ కెంప్ గౌరవార్థం 1988 అధ్యక్ష పోటీనుంచి వైదొలిగాడు.[10]

రాజకీయ జీవితం

1992 ప్రెసిడెన్షియల్ ప్రైమరీలు

1990లో బుకానన్ పాట్రిక్ జె. బుకానన్: ఫ్రమ్ ది రైట్ అనే పేరుతో న్యూస్‌లెటర్ ప్రచురించాడు, ఇది తన చందాదారులకు బంపర్ స్టిక్కర్‌ను పంపింది, దాంట్లో ఇలా రాసి ఉంది: "రీడ్ అవర్ లిప్స్! నో న్యూ టాక్సెస్."[15]

1992లో, అధ్యక్షుడు జార్జ్ హెచ్. డబ్ల్యు బుష్‌కు ప్రత్యర్థిగా తాను సవాలు చేయడానికి కారణాలను బుకానన్ వివరించాడు:

If the country wants to go in a liberal direction, if the country wants to go in the direction of [Democrats] George Mitchell and Tom Foley, it doesn't bother me as long as I've made the best case I can. What I can't stand are the back-room deals. They're all in on it, the insider game, the establishment game
 1. దారిమార్పు మూస:Em dashthis is what we're running against.[6]

బహుళ సంస్కృతీయవాదం, గర్భస్రావం మరియు స్వలింగ సంపర్కుల హక్కులుకు వ్యతిరేకతతో పాటు, అతడు వలసల తగ్గింపు మరియు సామాజిక మితవాదంపై వేదికను నడిపాడు. న్యూ హాంప్‌షైర్ ప్రైమరీ పోటీలో 38 శాతం ఓట్లు గెల్చుకోవడం ద్వారా, బుకానన్ తీవ్రంగానే బుష్‌ (ఇతడి ప్రజాదరణ తగ్గిపోతోంది)కు సవాలు విసిరాడు. ప్రాథమిక ఎన్నికలలో, బుకానన్ మొత్తం 30 లక్షల ఓట్లను రాబట్టుకున్నాడు.

బుకానన్ తర్వాత బుష్‌కే తన మద్దతుని ఇచ్చి, 1992లో రిపబ్లికన్ నేషనల్ కన్వెన్షన్‌లో, కీలక ఉపన్యాసం ఇచ్చాడు, ఇది తర్వాత సంస్కృతి యుద్ధ ప్రసంగంగా పేరొందింది, ఈ ప్రసంగంలో "అమెరికా ఆత్మ కోసం మన దేశంలో మత యుద్ధం జరుగుతోందని" అతడు వర్ణించాడు. ప్రసంగంలో అతడు బిల్ మరియు హిల్లరీ క్లింటన్ గురించి పేర్కొన్నాడు:

The agenda Clinton & Clinton would impose on America
 1. దారిమార్పు మూస:Em dashabortion on demand, a litmus test for the Supreme Court, homosexual rights, discrimination against religious schools, women in combat units
 2. దారిమార్పు మూస:Em dashthat's change, all right. But it is not the kind of change America needs. It is not the kind of change America wants. And it is not the kind of change we can abide in a nation we still call God's country.[16]

అతడి ప్రసంగం ఎంతగా హర్షధ్వానాలు అందుకుందంటే, ప్రసంగం బుష్/క్వేల్ టికెట్ నుండి మితవాదులను దూరం చేసిందని అతడి వ్యతిరేకులు ప్రకటించేశారు కూడా.[17]

ప్రచార నమూనా నుంచి

బుకానన్ తిరిగి అతడి కాలమ్ మరియు క్రాస్‌ఫైర్ కు వచ్చేశాడు సమాఖ్యతత్వం, సాంప్రదాయిక విలువలు, జోక్యందారీ పద్ధతులపై వ్యతిరేకత వంటి వాటిని ప్రోత్సహించడానికి, అతడు 1993లో ది అమెరికన్ కాజ్, ఒక మితవాది విద్యా సంస్థను స్థాపించాడు. వర్జీనియా కేంద్రంగా పనిచేసే వియెన్నా సంస్థ అధ్యక్షురాలిగా బే బుకానన్, దాని ఛైర్మన్‌గా పాట్ పనిచేశారు.[18]

మ్యూచువల్ బ్రాడ్‌కాస్టింగ్ సిస్టమ్ కోసం మూడు గంటల టాక్ షో కోసం బుకానన్ బుకానన్ అండ్ కంపెనీ హోస్ట్‌గా రేడియోకు 1993 జనవరి 5న తిరిగి చేరుకున్నాడు. ఇది అతడిని బారీ లిన్, బాబ్ బెకెల్, మరియు క్రిస్ మాథ్యూస్‌లతో పాటు టైమ్ స్లాట్ ప్రత్యర్థి రష్ లింబాఘ్ టాక్ షోలో కో-హోస్ట్‌లకు వ్యతిరేకంగా నిలిపింది. తన 1996 క్యాంపైన్ ప్రారంభంచడానికి, బుకానన్ ఈ ప్రోగ్రాంనుండి 1995 మార్చి 20న తప్పుకున్నాడు.

1996 ప్రెసిడెన్షియల్ ప్రైమరీలు

1996లో రిపబ్లికన్ నామినేషన్‌కు బుకానన్ దాదాపు గెలిచినట్లే అనిపించింది. డెమోక్రాటిక్ అధ్యక్షుడు (బిల్ క్లింటన్) మరోసారి ఎన్నికవడానికి చూస్తుండగా, రిపబ్లికన్ టికెట్‌పై రిపబ్లికన్ పార్టీలో ప్రత్యర్థి అంటూ ఎవరూ లేకుండాపోయారు. నిజానికి, ఓడించబడిన అధ్యక్షుడు జార్జ్ H. W. బుష్ మరోసారి అధికారం చేపట్టడానికి ఆసక్తి చూపడం లేదని స్పష్టం కావడంతో, సెనేట్ మెజారిటీ నేత కన్సాస్‌కు చెందిన సెనేటర్ రాబర్ట్ డోల్ పార్టీ ఫ్రంట్ రన్నర్‌గా ముందుపీఠికి వచ్చాడు, ఇతడికి చాలా బలహీనతలు ఉన్నాయని గుర్తించబడ్డాడు. నార్త్ అమెరికన్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ (NAFTA)కు డేల్ వ్యతిరేకతను అఢ్డం పెట్టుకుని బుకానన్, డేల్‌కి పోటీగా రిపబ్లికన్ నామినేషన్ కోసం ప్రయత్నించాడు. టెక్సాస్‌కు చెందిన సెనేటర్ ఫిల్ గ్రామ్ మాజీ టెన్నెస్సీ గవర్నర్ లామర్ అలెగ్జాండర్ మరియు మల్టీ మిలియనీర్ ప్రచురణకర్త స్టీవ్ ఫోర్బ్స్‌లు నామినేషన్‌కు ఇతర అభ్యర్థులు.

బుకానన్ అధ్యక్ష క్యాంపైన్ కో-ఛైర్మన్ లారీ ప్రాట్ తెల్ల జాత్యహంకారుల మరియు మిలీషియా నేతల ఆధ్వర్యంలో నిర్వహించబడిన రెండు సమావేశాలకు హాజరయ్యాడనన్న వార్తల ఆధారంగా లిబరల్ పబ్లిక్ ఇంటెగ్రిటీ సెంటర్ ఫిబ్రవరిలో నివేదికను జారీ చేసింది. జాత్యహంకారవాదంతో తనకు ఎలాంటి పొత్తూ లేదని ప్రాట్ తిరస్కరించాడు, న్యూ హాంప్‌షైర్ ప్రైమరీ జరగడానికి ముందు దీన్ని పథకం ప్రకారం అల్లిన కట్టుకథగా పేర్కొన్నాడు. తాను ప్రాట్‌ను నమ్ముతున్నానని బుకానన్ మాంచెస్టర్ యూనియన్ లీడర్ కు తెలిపాడు. "ఈ ఆరోపణలకు సమాధానమివ్వడానికి" ప్రాట్ సెలవు తీసుకున్నాడు, "కాబట్టి క్యాంపైన్‌లో కలవరానికి అవకాశం ఉండదు."[19]

ఫిబ్రవరి న్యూ హాంప్‌షైర్ ప్రైమరీని గెల్చుకోవడానికి 3,000 ఓట్లతో బుకానన్, సెనేటర్ బాబ్ డోల్‌ను ఓడించి, తన క్యాంపైన్‌కు చక్కటి ప్రారంభాన్నిచ్చాడు. అతడు ఇలా మరి మూడు రాష్ట్రాలను (అలాస్కా, మిస్సోరి మరియు లూసియానా) గెలుచుకున్నాడు, లోవా కాకసస్‌లో డోల్ కంటే కొద్దిగా వెనుకబడ్డాడు. పార్టీని సంవత్సరాలుగా నియంత్రిస్తోందని అతడు నమ్ముతున్న వాషింగ్టన్ ముఠా వ్యవస్థ (డోల్ ద్వారా ఆపాదించబడింది)కు వ్యతిరేకంగా క్షేత్రస్థాయిలో మితవాద అభిప్రాయాన్ని కూడగట్టడానికి తను చేపట్టిన తీవ్రమైన క్యాంపైన్ అతడి అద్భుత వాగ్ధాటిని ఉపయోగించుకుంది. నాషువాలో తర్వాత జరిగిన ర్యాలీలో, అతడు చెప్పాడు:

We shocked them in Alaska. Stunned them in Louisiana. Stunned them in Iowa. They are in a terminal panic. They hear the shouts of the peasants from over the hill. All the knights and barons will be riding into the castle pulling up the drawbridge in a minute. All the peasants are coming with pitchforks. We're going to take this over the top.[20]

క్యాంపైన్‌లో ఉన్నప్పుడు బుకానన్ తన మద్దతుదారులలో ఒక నినాదం ఉపయోగించేవాడు, "రైతులు పంగలకర్రలుతో వస్తున్నారు. తరచుగా వీరు పంగలకర్రతో కనిపిస్తుంటారు.

సూపర్ సోమవారం ప్రైమరీలలో, డోల్ భారీ మెజారిటీతో బుకానన్‌ను ఓడించాడు. రిపబ్లికన్ ప్రైమరీలలోని మొత్తం ఓట్లలో ఇరవై ఒక్క శాతం మాత్రమే సాధించగలిగిన బుకానన్ తన క్యాంపైన్‌ను మార్చి నెలలో సస్పెండ్ చేశాడు. అయితే రిపబ్లికన్ పార్టీ తరపున ప్రో-ఛాయిస్ అభ్యర్థి[ఉల్లేఖన అవసరం]గా డోల్ ఎంపిక చేయబడినట్లయితే తాను U.S. టాక్స్‌పేయర్స్ పార్టీ (ఇప్పుడు కాన్‌స్టిట్యూషన్ పార్టీ)ని నడుపుతానని బుకానన్ ప్రకటించాడు. అయితే, డోల్ జాక్ కెంప్‌ను ఎంచుకున్నాడు, అతడు బుకానన్ ఆమోదాన్ని అందుకున్నాడు. 1996 క్యాంపైన్ తర్వాత, బుకానన్ తన కాలమ్ రచనకు, క్రాస్‌ఫైర్‌ కు తిరిగి వచ్చేశాడు. అతడు 1998లో ది గ్రేట్ బిట్రేయల్‌ తో పాటు పలు పుస్తకాలను రాయడం మొదలుపెట్టాడు.

2000 ప్రెసిడెన్షియల్ క్యాంపైన్

రిపబ్లికన్‌లను (డెమోక్రాట్లతో పాటు) ఒక "హైవే పార్టీ"గా తోసిపుచ్చుతూ, రిపబ్లికన్ పార్టీనుండి వైదొలుగుతున్నట్లు బుకానన్ 1999 అక్టోబర్‌లో ప్రకటించాడు. అతడు రిఫార్మ్ పార్టీ నామినేషన్ కోసం ప్రయత్నించాడు. పలు సంస్కరణవాదులు ఇంద్రియాతీత ధ్యానంపై ఆధారపడిన లోవా వైద్యుడు జాన్ హగెలిన్‌కు మద్దతు పలికారు. పార్టీ సంస్థాపకుడు రాస్ పెరోట్ అభ్యర్థిని ఎంచుకోలేదు కాని, అతడి మాజీ పోటీదారు పాట్ చోయేట్ మాత్రం బుకానన్‌ను ఎంచుకున్నాడు.

బుకానన్‌కు అనుకూలంగా భారీ ఆధిక్యతను కల్పించిన పార్టీ ఓపెన్ ప్రైమరీ ఎన్నికల ఫలితాలను హగెలిన్ మద్దతుదారులు "కళంకితమైనవిగా ఆరోపించారు. లాంగ్ బీచ్ కన్వెన్షన్ సెంటర్ కాంప్లెక్స్‌‍లో వేర్వేరు ప్రాంతాల్లో రిఫార్మ్ పార్టీ విభాగాలు ఏకకాలంలో పలు కన్వెన్షన్‌లను ఏర్పర్చసాగాయి. రెండు కన్వెన్షన్‌ల ప్రతినిధులు ప్రైమరీ బ్యాలట్ ఫలితాలను తోసిపుచ్చి, డెమోక్రాటిక్ మరియు రిపబ్లికన్ కన్వెన్షన్‌లకు లాగే, అక్కడికక్కడే తమ అధ్యక్ష అభ్యర్థులను ఎంపిక చేయడానికి ఓట్లు వేశారు. ఒక కన్వెన్షన్ బుకానన్‌ను నామినేట్ చేయగా మరొకటి హగెలిన్‌‌కు మద్దతు పలికింది, ప్రతి శిబిరమూ చట్టబద్ధమైన రిఫార్మ్ పార్టీగా తమకు తాము ప్రకటించుకున్నాయి.

అంతిమంగా, బుకానన్ రిఫార్మ్ పార్టీ అభ్యర్థిగా బ్యాలెట్ ప్రతిపత్తిని అందుకుంటాడని ఫెడరల్ ఎలెక్షన్స్ కమిషన్ తీర్పు చెప్పింది, దాంతోపాటు 1996 ఎన్నికలలో ఫెరోట్ సేకరించిన $12.6 మిలియన్ల ఫెడరల్ క్యాంపైన్ ఫండ్‌లను చూపించడంతో బుకానన్ నామినేషన్ గెల్చుకున్నాడు. ఆమోదం తెలుపుతూ తను చేసిన ప్రసంగంలో బుకానన్, యునైటెడ్ నేషన్స్ నుండి U.S. వైదొలగాలని, U.N.ని న్యూయార్క్ నుండి బహిష్కరించాలని, అంతర్గత రెవిన్యూ సర్వీస్, విద్యా శాఖ, ఇంధన శాఖ, గృహ, నగరాభివృద్ధి శాఖలను, వారసత్వ సంపదలపై పన్నులు, పెట్టుబడి లాభాలపై పన్నులను మరియు భవిష్యత్ కార్యాచరణ పథకాలను రద్దు చేయాలని ప్రతిపాదించాడు.

తన సహచరుడిగా బుకానన్ ఆఫ్రికన్-అమెరికన్ కార్యకర్త, లాస్ ఏంజెల్స్‌కు చెందిన పదవీవిరమణ చేసిన ఉపాధ్యాయుడు, ఎజోలా B. ఫోస్టర్‌ను ఎన్నుకున్నాడు. ఈ ఎన్నికల పోటీలో బుకానన్‌కు భవిష్యత్ సోషలిస్ట్ పార్టీ USA అధ్యక్ష అభ్యర్థి బ్రెయిన్ మూర్ మద్దతు ఇచ్చాడు, స్వేచ్ఛా వాణిజ్యంకి పోటీగా ధర్మబద్ధమైన వాణిజ్యానికి అతడు కట్టుబడినందువల్లే తాను 2000 సంవత్సరంలో బుకానన్‌కు మద్దతు పలికానని మూర్ 2008లో చెప్పాడు. అతడికి కొందరు ప్రగతిశీల వ్యక్తుల అండ ఉంది కాబట్టి, ఇది సామాన్యుడికి సహాయకారిగా ఉంటుందని నేను భావించాను."[21] ఆగస్ట్ 19న న్యూయార్క్ రైట్ టు లైఫ్ పార్టీ, తన కన్వెన్షన్‌లో, బుకానన్‌ను తమ నామినీగా ఎంచుకుంది, 90% జిల్లాలు అతడికి ఓటేశాయి[22].

2000 అధ్యక్ష ఎన్నికలలో, బుకానన్ 449,895 ఓట్లతో నాలుగో స్థానంలో నిలిచాడు. ఇది పాపులర్ ఓటులో 0.4%. (హగెలిన్ నేషనల్ లా పార్టీ అభ్యర్థిగా 0.1 శాతం దక్కించుకున్నాడు.) పామ్ బీచ్ కౌంటీ, ఫ్లోరిడాలో, బుకానన్ 3,407 ఓట్లు

 1. దారిమార్పు మూస:Em dash పొందాడు, పామ్ బీచ్ కౌంటీ ఉదారవాద అనుకూలత, అత్యధిక యూదు జనాభా, రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో తను సాధించిన ఓటింగ్‌తో పోలిస్తే ఇక్కడ తనకు వచ్చిన ఓట్లు అసంబద్ధంగా ఉన్నాయని కొంతమంది భావించారు. కౌంటీలో ప్రస్తుతం అపఖ్యాతి పాలైన "బటర్‌ఫ్లై బ్యాలెట్," ఫలితంగా ఇతడు అనుకోకుండానే వేలాది ఓట్లను పొందగలిగాడని అనుమానించారు. బుష్ ప్రతినిధి ఎరి ప్లెష్చర్ ప్రకటించాడు, "పామ్ బీచ్ కౌంటీ పాట్ బుకానన్ కంచుకోట కాబట్టే పాట్ బుకానన్ ఇక్కడినుంచి 3,407 ఓట్లను పొందాడు. అయితే, రిఫార్మ్ పార్టీ అధికారులు దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు, ఈ కౌంటీలో తమ మద్దతుదారుల సంఖ్య 400 నుండి 500 వరకు మాత్రమే ఉంటుందని వీరి అంచనా. ది టుడే షోలో కనిపించిన బుకానన్ ఇలా చెప్పాడు:
When I took one look at that ballot on Election Night. . . it's very easy for me to see how someone could have voted for me in the belief they voted for Al Gore.[23]

అతడి క్యాంపైన్ తన శ్వేతజాతి పునాదికి వెలుపల తన సందేశాన్ని వ్యాపింపజేసే లక్ష్యంతో సాగిందని, అయితే అతడి అభిప్రాయాలు మాత్రం మారలేదని కొంతమంది పరిశీలకులు చెప్పారు.[24]

2000 ఎన్నికల నేపథ్యంలో, సంస్కరణవాదులు పార్టీలో క్రియాశీలక పాత్ర చేపట్టవలసిందిగా కోరారు. బుకానన్ 2001లో పార్టీ కన్వెన్షన్‌కు హాజరైనప్పటికీ ఈ డిమాండ్‌ను తోసిపుచ్చాడు. మరికొన్ని సంవత్సరాల్లో, అతడు తన్ను తాను రాజకీయ స్వతంత్రుడిగా గుర్తించుకున్నాడు, నయా-కన్జర్వేటివ్ రిపబ్లికన్ పార్టీ నాయకత్వ దృక్పధంగా తాను భావిస్తున్నదాని నుండి వేరుకావడానికి అతడు సిద్ధపడలేదు. 2004 ఎన్నికకు ముందు, బుకానన్ మరోసారి తనను తాను రిపబ్లికన్‌గా గుర్తించుకుంటున్నట్లు ప్రకటించాడు. మరోసారి అధ్యక్ష ఎన్నికల్లో పోటీ పడాలనే ఆసక్తి తనకు లేదని ప్రకటించడమే కాక, 2004లో తిరిగి పోటీ చేయాలన్న బుష్ ప్రతిపాదనను పూర్తిగా బలపరుస్తున్నట్లు రాశాడు:

Bush is right on taxes, judges, sovereignty, and values. Kerry is right on nothing.[25]

వ్యక్తిగత జీవితానికి తిరిగిపోవడం

MSNBC వ్యాఖ్యాత

బుకానన్ బీయింగ్ ఇంటర్వ్యూడ్ ఇన్ 2008

తనను తిరిగి తీసుకోకూడదని CNN నిర్ణయించుకున్నప్పటికీ, బుకానన్ కాలమ్ కొనసాగింది.[26] బుకానన్ అండ్ ప్రెస్‌ను తిరిగి కలుపుతూ, పూర్తిగా వ్యత్యాసం కలిగిన క్రాస్‌పైర్ ఫార్మాట్‌ను MSNBC 2002 జూలై 15న బుకానన్ అండ్ ప్రెస్ పేరిట ప్రసారం చేసింది. "టెలివిజన్‌లో అద్భుతమైన ఒక గంటకాలం"గా గుర్తింపు పొందిన బుకానన్ అండ్ ప్రెస్ ఇంటర్వ్యూ చేస్తున్న ఇద్దరు అతిథులను ప్రసారం చేయడమే గాక టాప్ న్యూస్ కథనాలను వెలికి తెచ్చింది. ఇరాక్ యుద్ధ మేఘాలు అలుముకుంటున్నందువలన, బుకానన్ అండ్ ప్రెస్ తన విరోధాన్ని తగ్గించుకున్నారు, ఎందుకంటే ఇద్దరూ కూడా దాడిని వ్యతిరేకించారు. ప్రణాళికాబద్ధమైన దాడిని చర్చించేందుకు తామే మొట్టమొదటి కేబుల్ హోస్ట్‌లమని ప్రెస్ ప్రకటించింది.[27] MSNBC ఎడిటర్-ఇన్-ఛీఫ్ జెర్రీ నాష్మన్ ఒకసారి ఈ అసాధారణ స్థితిని గురించి సరదాగా వాపోయాడు:

So the point is why does only Fox [News Channel] get this? At least, we work at the perfect place, the place that's fiercely independent. We try to have balance by putting you two guys together and then this Stockholm syndrome love fest set in between the two of you, and we no longer even have robust debate.[28]

ఇతడి టాక్ షో ప్రారంభించడానికి కొద్ది గంటల ముందు, బుకానన్ MSNBCలో అంతగా ప్రాచుర్యం పొందని డోనాహ్యూ ప్రోగ్రాం ప్రీమియర్ గెస్ట్‌గా పాల్గొన్నాడు. హోస్ట్ ఫిల్ డోనాహ్యు మరియు బుకానన్ చర్చిని, రాజ్యాన్ని వేరు చేయడం గురించి చర్చించారు. డొనాహ్యూని "నిరంకుశుడు"[29]గా పిలిచిన బుకానన్, హోస్ట్ తన ఉద్యోగాన్ని భవిష్యత్ కార్యాచరణ ద్వారా పొందాడని ఆటపట్టించాడు.[30]

బుకానన్ అండ్ ప్రెస్‌‌ని 2003 నవంబరు 26న MSNBC అధ్యక్షుడు ఎరిక్ సోరెన్‌సోన్ రద్దు చేసిన తర్వాత, బుకానన్ MSNBCలో రాజకీయ విశ్లేషకుడిగా కొనసాగాడు. అతడు నెట్‌వర్క్ టాక్ షోలలో క్రమం తప్పకుండా కనిపించేవాడు. MSNBCలో స్కార్బోరోఫ్ కంట్రీ నైట్ షో నడుస్తున్నకాలంలో అతడు అప్పుడప్పుడూ దానిలో కనిపించేవాడు. బుకానన్ ఇప్పుడు మార్నింగ్ జో దాంతోపాటు హార్డ్‌బాల్, 1600 పెన్సిల్వేనియా ఎవెన్యూ, మరియు ది రేషియల్ మాడో షో లలో తరచుగా అతిథిగానూ, కో-హోస్ట్‌గాను కనిపిస్తుంటాడు.

యూదు సంస్థల నుండి ఆరోపణలు రావడంతో MSNBC తన వెబ్‌సైట్ నుండి బుకానన్ ఒపీనియన్ కాలమ్‌ను 2009 సెప్టెంబరులో తొలగించింది.[31] పోలండ్‌పై జర్మన్ దాడి 70 వార్షికోత్సవం సందర్భాన్ని ఉపయోగించుకున్న బుకానన్, జర్మనీపై బ్రిటన్ యుద్ధం ప్రకటించకుండా ఉండాల్సిందని వాదించాడు.[32]

ది అమెరికన్ కన్జర్వేటివ్ మేగజైన్

ఆర్థిక వ్యవస్థ, వలస మరియు విదేశీ విధానంపై మితవాద దృక్పధాన్ని ప్రకటించే కొత్త పత్రికను ప్రారంభించడానికి బుకానన్ 2002లో మాజీ న్యూయార్క్ పోస్ట్ ఎడిటోరియల్ పేజ్ ఎడిటర్ స్కాట్ మెక్‌కన్నెల్ మరియు ఫైనాన్షియర్ టకి దియోడోరకపులోస్‌లతో చేయి కలిపాడు. ది అమెరికన్ కన్జర్వేటివ్ మొట్టమొదటి సంచిక 2002 అక్టోబర్ 7న విడుదలైంది. పత్రికతో బుకానన్ అనుబంధం 2007లో ముగిసింది.

సుప్రీం కోర్టులో

యునైటెడ్ స్టేట్స్ సుప్రీం కోర్టుకు యూదు అయిన ఎలెనా కగన్ను బరాక్ ఒబామా ఎంపిక చేయడంపై బుకానన్ తన 2010 కాలమ్‌లో అసమ్మతి తెలిపాడు. బుకానన్ రాశాడు: "కగన్ నియామకం నిర్థారించబడితే, U.S. జనాభాలో 2 శాతం కంటే తక్కువగా ఉన్న యూదులు సుప్రీం కోర్టు స్థానాల్లో 33 శాతం కలిగి ఉన్నట్లవుతుంది. డెమోక్రాట్ల వైవిధ్యపూరితమైన ఆలోచన ఇదేనా?" ఉదారవాదులు తప్పకుండా "WASP వ్యతిరేకులు"గా ఉండాలని కూడా బుకానన్ సూచించాడు.[33][34]

రాజకీయ పదవులు

ఎన్నికల చరిత్ర

ఇవి కూడా చూడండి

సూచనలు

 1. Foley, Michael (2007). American credo : the place of ideas in US politics. Oxford University Press US. p. 318. ISBN 0199232679.
 2. 2.0 2.1 పాట్ బుకానన్ వంశవృక్షం
 3. "Pat Buchanan Biography". Thomson Gale. Retrieved 2006-11-01.
 4. "Pat Buchanan". NNDB. Retrieved 2006-11-01.
 5. నియోకాన్లు ఎందుకు డీక్సీని అంతగా ద్వేషిస్తున్నారు?
 6. 6.0 6.1 6.2 "The Iron Fist of Pat Buchanan". The Washington Post. 1992-02-17.
 7. "About Pat Bunchanan". Creators Syndicate. Retrieved 2007-01-21.
 8. "Buchanan Is Right On Trade Sanctions". Daily Policy Digest. National Center for Policy Analysis. 2000-01-03. Unknown parameter |= ignored (help)
 9. 9.0 9.1 9.2 9.3 9.4 9.5 9.6 Blumenthal, Sidney (1987-01-08). "Pat Buchanan and the Great Right Hope". Washington Post. p. C01. Retrieved 2006-11-01.
 10. 10.0 10.1 Paulsen, Monte (1999-11-22). "Buchanan Inc". Nation. Retrieved 2006-11-01.
 11. "Nixon aides say Felt is no hero". MSNBC. 2005-06-01. Retrieved 2006-11-01.
 12. 1992 నిక్సన్ ఇంటర్వ్యూ - పార్ట్ 2, బుష్ విదేశీ విధానం, CNN, ఏప్రిల్ 23, 1994 మరియు లారీ కింగ్ లైవ్ ట్రాన్‌స్క్రిప్ట్ #1102 (R-#469), CNN, ఏప్రిల్ 23, 1994.
 13. Is Buchanan Courting Bias? The Washington Post, February 29, 1992.
 14. quoted by Crossfire, CNN, February 24, 1992, Transcript # 514
 15. చార్లోట్టె హేస్ కాలమ్, ది వాషింగ్టన్ టైమ్స్ జూలై 27, 1990.
 16. Buchanan, Pat (1992-08-17). "1992 Republican National Convention Speech". Internet Brigade. Retrieved 2006-11-04.
 17. Kuhn, David Paul (2004-10-18). "Buchanan Reluctantly Backs Bush". CBSNews.com. Retrieved 2006-12-06.
 18. "The American Cause: About the Cause". The American Cause. Retrieved 2006-11-04.
 19. బుకానన్ ఎయిడ్ లీవ్స్ క్యాంపైన్ ఎమిడ్ ఛార్జెస్, ది యూనియన్ లీడర్ " ఫిబ్రవరి 16, 1996
 20. Republicans Wind Up Bare-Fisted Donnybrook in New Hampshire, by Brian Knowlton, International Herald Tribune, Tuesday, February 20, 1996
 21. "Q&A with Socialist Party presidential candidate Brian Moore". Independent Weekly. 2008-10-08.
 22. (2000-08-01) Right To Life Party Picks Buchanan, Ballot Access News.
 23. Tapper, Jake (2000-11-10). "Buchanan camp: Bush claims are "nonsense"". Salon. Retrieved 2008-11-30. Both McConnell and Cunningham say that they agree with the comments of Buchanan himself on Thursday's "Today" show Italic or bold markup not allowed in: |publisher= (help)
 24. సలోన్ న్యూస్ | నాట్ స్టాండింగ్ పాట్
 25. Third parties seen as thread to Bush, Steve Miller, Washington Times September 10, 2004
 26. Kurtz, Howard (2006-05-01). "Tony Snow's Washington Merry-Go-Round". Washington Post. p. C01. Retrieved 2006-12-05.
 27. Bill Press. "Making Air-Waves". Retrieved 2006-12-05.
 28. Buchanan and Press, November 19, 2002 broadcast.
 29. ఫుల్ కోట్: "దాన్ని తీసివేయి, ఫిల్. నీవు చేయదలచుకున్నది ఏమిటంటే, నేటివిటీ ప్లేలో ఏ యూదు పిల్లవాడిని తీసుకోవద్దని చెబుతున్నాను. నీవు చేయదలచుకున్నది ఏమంటే నేటివిటీ నాటకం వద్దు, పొత్తుకు ప్రతిన వద్దు, స్కూల్‌లో బైబిల్ వద్దు, టెన్ కమాండ్‌మెంట్స్ వద్దు. నీవు నియంతవు, ఫిల్, నీవొక నిరంకుశ లిబరల్‌వి మరియు నీకు ఆ విషయం కూడా తెలియదు."
 30. Acosta, Belinda (2002-07-26). "The Phil-ing Station". Austin Chronicle. Retrieved 2006-12-05.
 31. MSNBC రిమూవ్స్ బుకానన్ కాలమ్ డిఫెండింగ్ హిట్లర్ జ్యూవిష్ టెలిగ్రాఫిక్ ఏజెన్సీ 3 సెప్టెంబర్ 2009
 32. MSNBC రిమూవ్స్ బుకానన్ కాలమ్ ఫ్రమ్ సైట్ POLITICO 3 సెప్టెంబర్ 2009.
 33. "Buchanan complains that with Kagan, Supreme Court will have too many Jews". Retrieved May 14, 2010.
 34. "Are liberals anti-WASP?". Retrieved May 14, 2010.

పుస్తకాలు, కథనాలు

పుస్తకాలు

 • [[చర్చిల్, హిట్లర్ అండ్ ది అన్‌నెసెసరీ వార్: హౌ బ్రిటన్ లాస్ట్ ఇట్స్ ఎంపైర్ అండ్ ది వెస్ట్ లాస్ట్ ది వరల్డ్]] (మే 27, 2008) ISBN 0-307-40515-X
 • డే ఆఫ్ రికోనింగ్: హౌ హుబ్రిస్, ఐడియాలజీ, అండ్ గ్రీడ్ ఆర్ టియరింగ్ అమెరికా అపార్ట్ (నవంబర్ 27, 2007)

ISBN 0-312-37696-0

 • స్టేట్ ఆఫ్ ఎమర్జెన్సీ: ది ధర్డ్ వరల్డ్ ఇన్వేషన్ అండ్ కాంక్వెస్ట్ ఆఫ్ అమెరికా (ఆగస్ట్ 22, 2006) ISBN 0-312-36003-7
 • వేర్ ది రైట్ వెంట్ రాంగ్: హౌ నియోకన్జర్వేటివ్స్ సబ్‌వర్టెడ్ ది రీగన్ రివల్యూషన్ అండ్ హైజాక్డ్ ది బుష్ ప్రెసిడెన్సీ (2004) ISBN 0-312-34115-6
 • ది డెత్ ఆఫ్ ది వెస్ట్: హౌ డైయింగ్ పాపులేషన్స్ అండ్ ఇమ్మిగ్రాంట్ ఇన్వేషన్స్ ఇంపెరిల్ అవర్ కంట్రీ అండ్ సివిలైజేషన్ (2002) ISBN 0-312-28548-5
 • A Republic, Not an Empire: Reclaiming America's Destiny (1999) ISBN 0-89526-272-X
 • ది గ్రేట్ బిట్రేయల్: హౌ అమెరికన్ సావర్నిటీ అండ్ సోషల్ జస్టీస్ ఆర్ బీయింగ్ శాక్రిఫైస్డ్ టు ది గాడ్స్ ఆఫ్ ది గ్లోబల్ ఎకానమీ (1998) ISBN 0-316-11518-5
 • రైట్ ఫ్రమ్ ది బిగినింగ్ (1988) ISBN 0-316-11408-1
 • కన్జర్వేటివ్ ఓట్స్, లిబరల్ విక్టరీస్: వై ది రైట్ హాజ్ ఫెయిల్డ్ (1975) ISBN 0-8129-0582-2
 • ది న్యూ మెజారిటీ: ప్రెసిడెంట్ నిక్సన్ ఎట్ మిడ్-ప్యాసేజ్ (1973)

ప్రముఖ ప్రసంగాలు

ఎంచుకోబడిన కథనాలు

ది అమెరికన్ కాజ్ ఆర్కైవ్స్ సెవరల్ ఇయర్స్ ఆఫ్ బుకానన్స్ న్యూస్‌పేపర్ కాలమ్స్. VDARE ఆర్కైవ్స్ మెనీ ఆర్టికల్స్ రిటన్ బై బుకానన్.

ఇంటర్వ్యూలు

బాహ్య లింక్‌లు

బుకానన్-అనుబంధించబడినవి

వార్తలు మరియు విశ్లేషణ

క్యాంపైన్ సామగ్రి

సానుకూల దృక్పధాలు

 • బుకానన్ ఈజ్ రైట్ ఆన్ ట్రేడ్ శాంక్షన్స్, బ్రూస్ బార్ట్‌లెట్, కాలమ్ 2000 జనవరి 3
 • లెర్నింగ్ టు లవ్ పాట్ బుకానన్ క్నుట్ బెర్గర్, సియాటిల్ వీక్లీ, 2004 అక్టోబరు 13.
 • ది యాంటీ-బుకానన్ హిస్టీరియా, బర్టన్ ఎస్. బ్లుమెర్ట్, LewRockwell.com, 1999 నవంబరు 1.
 • బుకానన్ ఈజ్ రైట్ ఎబౌట్ రైట్, డారెల్ డౌ.
 • పాట్ బుకానన్, యాంటీవార్ క్యాండిడేట్ బై లియొనారా ఫులని, వరల్డ్‌నెట్‌డైలీ, 1999 డిసెంబరు 28.
 • మై గై: పాల్ బుకానన్ గోట్‌ఫైర్డ్ ఆన్ పాట్రిక్ బుకానన్, పాలసీ రివ్యూ, సమ్మర్ 1995.
 • బుకానన్: ది ఎపిలోగ్, స్కాట్ మెక్‌కొన్నెల్, VDARE, 2000 నవంబరు 26.
 • పోర్ట్రయిట్ ఆఫ్ ఏన్ అమెరికన్ నేషనలిస్ట్, బై జస్టిన్ రైమాండో, Antiwar.com, 1999 ఆగస్టు 16.
 • పాట్ బుకానన్ అండ్ ది మెనేస్, ముర్రే రోత్‌బార్డ్, 1990 లిబర్టేరియన్ డిఫెన్స్ ఆఫ్ బుకానన్.
 • ఈజ్ పాట్రిక్ బుకానన్ ఏన్ యాంటీ-సెమైట్?, బై జార్జ్ స్జామ్యులే, న్యూయార్క్ ప్రెస్, 1999 నవంబరు 4.
 • లైస్, మిత్స్, అండ్ విసియస్ స్లాండర్, ఆర్కైవ్డ్ "స్టూడెంట్స్ ఫర్ బుకానన్" 2000 నుండి ఇల్లినోయిస్ సైట్; లింకుల కలెక్షన్ కలిగి ఉంది.
 • పాట్ బుకానన్ ప్రొఫైల్ బై డెరెక్ వాలెస్, virtuemag.org.

వ్యతిరేక దృక్పధాలు

 • నో యువర్ రైట్-వింగ్ స్పీకర్స్: పాట్ బుకానన్, CampusProgress.org
 • పాట్ బుకానన్స్ స్కెలెటిన్ క్లోసెట్, RealChange.org.
 • ఓవర్‌వ్యూ అండ్ క్రిటిక్ ఆఫ్ బుకానన్స్ డీసెల్ ఇంజెన్ అసెర్షన్
 • పాట్ బుకానన్ ఆన్ జ్యూస్ అండ్ ఇజ్రాయెల్, యాంటీ-డిఫమేషన్ లీగ్, సెప్టెంబరు, 1999.
 • పాట్ బుకానన్ ఇన్ హిస్ ఓన్ వర్డ్స్, FAIR ప్రెస్ రిలీజ్ 1996 ఫిబ్రవరి 26
 • బుకానన్స్ వైట్‌ వేల్ లారెన్స్ ఆస్టర్, Frontpagemag.com 2004 మార్చి 19
 • విల్ ది రియల్ పాట్ బుకానన్ ప్లీస్ స్టాండ్ అప్?, బిల్ బార్న్‌వెల్, Lew Rockwell.com, 2000 మే 15.
 • ది ట్రూత్ ఎబౌట్ ట్రేడ్ ఇన్ హిస్టరీ, బ్రూస్ బార్ట్‌లెట్, కాటోస్ సెంటర్ ఫర్ ట్రేడ్ పాలసీ స్టడీస్, n.d.
 • ది బుకానన్ డాక్ట్రిన్, జాన్ జుడిస్, న్యూయార్క్ టైమ్స్, 1999 అక్టోబరు 3.
 • హూస్ ఆఫ్రెయిడ్ ఆఫ్ పాట్ బుకానన్?, జేక్ టాప్పర్, సలోన్, 1999 సెప్టెంబరు 4.
 • బుకానన్ అండ్ మార్కెట్, జెఫ్రీ ఎ. టక్కర్, Lew Rockwell.com, 2002 మార్చి 23.
 • గ్లింప్సెస్ ఆఫ్ ది డిక్లైన్ ఫోటో ఎస్సే ఫీచరింగ్ యంగ్ బుకానన్ సపోర్టర్స్, జూలై/ఆగస్టు 1996
 • హాకింగ్ రేసిజం -- పాట్ బుకానన్స్ లేటెస్ట్ బుక్ ఈజ్ ఎ వైట్ నేషనలిస్ట్ స్క్రీడ్, అలెగ్జాండర్ జైచిక్, ఫర్ ఆఫ్రో ఆర్టికల్స్, 2007 మార్చి 12.
 • ది యంగ్ టర్క్స్ కామెంటరీ 'పాట్ బుకానన్ డిఫెండ్స్ హిట్లర్'.

ఇతరాలు

Party political offices
అంతకు ముందువారు
Ross Perot
Reform Party Presidential candidate
2000 (4th)
తరువాత వారు
Ralph Nader

మూస:ReformPresidentialNominees మూస:United States presidential election, 1992 మూస:United States presidential election, 1996 మూస:United States presidential election candidates, 2000 మూస:MSNBC Personalities