పాతమాగులూరు

From tewiki
Jump to navigation Jump to search


పాతమాగులూరు
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాThe ID "Q<strong class="error">String Module Error: Match not found</strong>" is unknown to the system. Please use a valid entity ID.
జనాభా
(2011)
ప్రాంతీయ ఫోన్ కోడ్+91 ()

పాతమాగులూరు , ప్రకాశం జిల్లా, సంతమాగులూరు మండలానికి చెందిన గ్రామం.[1] పిన్ కోడ్ నం. 523 302., యస్.టీ.డీ.కోడ్ 08404. లువా తప్పిదం: Coordinates must be specified on Wikidata or in |coord=

సమీప మండలాలు

నరసరావుపేట, బల్లికురవ, రొంపిచర్ల.

గ్రామానికి సాగు/త్రాగునీటి సౌకర్యం

తారకరామ తంగేడుమిల్లి మేజరు ఎత్తిపోతల పథకం.

గ్రామ పంచాయతీ

  1. 2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీ షేక్ సైదా, రెండు సంవత్సరములకు సర్పంచిగా, ఏకగ్రీవంగా ఎన్నికైన్నారు. తరువాత శ్రీ చవల రాధాకృష్ణమూర్తి మూడు సంవత్సరములకు సర్పంచిగా బాధ్యతలు నిర్వర్తిస్తారు. [2]
  2. శ్రీ షేక్ సైదా, 2015, సెప్టెంబరు-22వ తేదీనాడు తన పదవికి రాజీనామ చేసారు. ఉపసర్పంచి శ్రీ చవల రాధాకృష్ణమూర్తికి, తాత్కాలిక సర్పంచ్ బాధ్యతలతోపాటు, చెక్ పవరును గూడా అందజేయుచూ డి.పి.ఓ. అఫీసునుండి ఉత్తర్వులు జారీ చేసారు. [6]&[7]

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయములు

శ్రీ కోదండరామాలయo

ఈ గ్రామంలో రు.40 లక్షలతో నిర్మించిన కోదండరామాలయంలో 2013 ఆగస్టు 24 శనివారంనాడు ఉదయం 8-27 గంటలకు శ్రీ కోదందరాముడు, సీతాదేవిల విగ్రహాల ప్రతిష్ఠ అత్యంత వైభవంగా జరిగింది. అనంతరం ధ్వజస్తంభ ప్రతిష్ఠ జరిగింది. ప్రత్యేక పూజాకార్యక్రమాలు నిర్వహించారు. ఐదు వేలమందికి అన్నదానం చేశారు. [3]

శ్రీ ప్రసన్నాంజనేయస్వామివారి ఆలయం

పాతమాగులూరు గ్రామ ప్రధాన కూడలిలోని ఈ ఆలయం రెండు శతాబ్దాల చరిత్ర గలది. ఈ ఆలయాన్ని గ్రామస్థుల సమష్టి కృషితో 15 లక్షల రూపాయల అంచనా వ్యయంతో పునర్నిర్మాణం చేశారు. ఈ ఆలయ పునఃప్రతిష్ఠ వేడుకలు, 2015, మే-29వ తేదీ శుక్రవారంనాడు, కన్నులపండువగా ప్రారంభమైనవి. 30వ తేదీ శనివారం ఉదయం మన్యుసూక్త, శాంతిహోమాలు, విగ్రహ, ఉత్సవ మూర్తులకు పంచామృతాభిషేకాలు, మూలమంత్ర జపాలు చేసారు. సాయంత్రం బలిహరణ, గ్రామోత్సవం, క్షీరాధివాసం, ధాన్యాధివాసం, పుష్పాధివాసం, మూలమంత్ర హోమాలు వైభవంగా నిర్వహించారు. 31వ తేదీ ఆదివారం ఉదయం 9-06 గంటలకు, జీర్ణోద్ధరణ, త్రయాహ్నిక, దీక్షాపూర్వక ప్రతిష్ఠా కార్యక్రమాన్ని వేదపండితులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ప్రాతఃకాలపూజ, నిత్యానుష్టాలు, మహాశాంతిహోమాలు, జీవన్యాసం, అష్టబంధన మహాపూర్ణాహుతి కార్యక్రమాలు చేపట్టినారు. స్వామిని వివిధ రకాల పుష్పాలతో ప్రత్యేకంగా అలంకరించారు. ఈ కార్యక్రమాలకు స్థానికులతోపాటు, పరిసరప్రాంతాలనుండి గూడా వచ్చిన భక్తులతో ఆలయప్రాంగణం కిటకిటలాడినది. ఈ సందర్భంగా గ్రామ విద్యార్థినులు ప్రదర్శించిన కోలాటప్రదరన పలువురిని ఆకట్టుకున్నది. అనంతరం విచ్చేసిన భక్తులకు అన్నసంతర్పణ నిర్వహించారు. [4]&[5]

మూలాలు

వెలుపలి లింకులు

[2] ఈనాడు ప్రకాశం; 2013, ఆగస్టు-3; 16వపేజీ. [3] ఈనాడు ప్రకాశం/అద్దంకి; 2013, ఆగస్టు-25; 2వపేజీ [4] ఈనాడు ప్రకాశం/అద్దంకి; 2015, మే-7; 2వపేజీ. [5] ఈనాడు ప్రకాశం/అద్దంకి; 2015, జూన్-1; 1వపేజీ. [6] ఈనాడు ప్రకాశం/అద్దంకి; 2015, సెప్టెంబరు-22; 3వపేజీ. [7] ఈనాడు ప్రకాశం/అద్దంకి; 2016, జనవరి-22; 1వపేజీ.