పాత్రికేయ వృత్తిలో మహిళలు

From tewiki
Jump to navigation Jump to search

పాత్రికేయం వృత్తిగా అయిన తరువాత, దీనిని కెరీర్ గా ఎంచుకునేందుకు మహిళలకు అవకాశాలు తక్కువగా ఉండేవి. అంతే కాక వృత్తిలో కూడా ఎంతో వివక్షను ఎదుర్కొన్నారు. నిజానికి 1890కు ముందు స్త్రీలు ఎడిటర్లుగా, విలేఖరులుగా, క్రీడా విశ్లేషకులుగా పని చేశారు.[1]

దేశాల వారీగా..

డెన్మార్క్

డెన్మార్క్ లో మహిళలు తమ భర్తల నుంచి వారసత్వంగా వచ్చిన పత్రికలకు ఎడిటర్లుగా పనిచేసేవారు. సోఫే మోర్సింగ్ దీనికి ఉదహారణగా నిలుస్తుంది.  1658లో ఆమె భర్త మరణం తరువాత ఈరోఫైషే వొచెంటిలిచె జైటుంగ్ పత్రికను నడిపింది. అయితే వారు తమ పత్రికలలో వార్తలు మాత్రం రాశేవారు కాదు.

చార్లెట్ట్ బాడెన్, ఈమె డెన్మార్క్ పత్రికల్లో వ్యాసాలు రాసిన మొట్టమొదటి మహిళ. 1786 నుండి 1793 వరకు వీక్లీ మోర్గెన్ పోస్ట్ లో అప్పుడప్పుడూ వ్యాసాలు రాస్తుండేది ఈమె. 1845లో డానిష్ వార్తాపత్రిక ఆధ్వర్యంలో నిర్వహించిన చర్చలో మేరీ అర్నెసెన్ పాల్గొంది. అప్పటికి బహిరంగ చర్చల్లో పాల్గొన్న మొట్టమొదటి మహిళ ఆమే. 1850 తరువాత ఇది సర్వ సాధారణమైపోయింది. 1849 నుండి 1871 మధ్య కాలంలో అతలియా ష్వార్ట్ జ్, కెరొలిన్ టెస్ట్ మాన్ వంటి వారిని జనాలు సెలబ్రిటీల్లా భావించేవారు. కెరొలిన్ యాత్రా వ్యాసాలు రాస్తుండగా, అతలియా పత్రికల్లో వ్యాసాలతో పాటు బహిరంగ చర్చల్లో చురుగ్గా పాల్గొనేది. 1870లో మహిళల ఉద్యమం ప్రారంభమై, స్వంత పత్రికలు నడుపుతూండేవారు. మహిళా సంపాదకులు, విలేఖర్లతో ఈ పత్రికలు నడిచేవి.

1880ల్లో డెనిష్ ప్రెస్ లలో మహిళలు పాత్రికేయ వృత్తిలో పనిచేయడం బాగా పెరిగింది. సోఫీ హార్టెన్(1848-1927) 1888లో సొరో ఏంట్స్ టిడెండోలో విలేఖరిగా పనిచేస్తూ, విలేఖరిగా తన కెరీర్ ను బాగా అభివృద్ధి చేసుకున్న మొట్ట మొదటి మహిళగా నిలిచింది.

Notes

  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-08-03. Retrieved 2017-03-11.