"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

పాథోజెన్

From tewiki
Jump to navigation Jump to search

జీవశాస్త్రంలో పాథోజెన్ అంటే ఏదైనా రోగాలను కలిగించే క్రిమి. ఈ పదం 1880వ దశకంలో వాడుకలోకి వచ్చింది.[1] సాధారణంగా ఈ పదాన్ని రోగకారకాలైన వైరస్, బ్యాక్టీరియా, ప్రోటోజోవా, శిలీంధ్రాలు లాంటి సూక్ష్మజీవులన్నింటికీ కలిపి వాడుతుంటారు. వీటిని గురించి అధ్యయనం చేసే శాస్త్త్రాన్ని పాథాలజీ అంటారు.

వ్యాప్తి

పాథోజెన్లు రకరకాల మార్గాల్లో ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందుతాయి. అవి గాలి ద్వారా, ప్రత్యక్షంగా లేక పరోక్షంగా తాకడం వల్ల, లైంగిక సంబంధం వల్ల, రక్తమార్పిడి ద్వారా, తల్లి పాల నుంచీ లేదా మరేదైనా శారీరక ద్రవాల ద్వారా కావచ్చు.

రకాలు

బ్యాక్టీరియా

సాధారణంగా కనిపించే 1 నుంచి 5 మైక్రోమీటర్ల పొడవుండే బ్యాక్టీరీయా మానవులకు హానికరమైనవి కావు అలాగని ఉపయోగకరమైనవీ కావు. వీటిలో చాలా స్వల్ప భాగం మాత్రమే అంటు రోగాలను కలుగజేస్తాయి. బ్యాక్టీరియా ద్వారా కలిగే ముఖ్యమైన రోగాల్లో క్షయ (టి. బి) వ్యాధి ఒకటి. ఇది మైకోబ్యాక్టీరియం ట్యూబర్క్యులోసిస్ అనే బ్యాక్టీరియా వల్ల సంక్రమిస్తుంది. దీని వల్ల ప్రపంచవ్యాప్తంగా 20 లక్షల మంది వరకు చనిపోతున్నారు. ఇందులో ఆఫ్రికావారే ఎక్కువ.

వైరస్

మశూచి, ఫ్లూ, గవదల అమ్మవారు, తట్టు, ఆటలమ్మ, ఎబోలా, రూబెల్లా మొదలైనవి వైరస్ ల వల్లే కలిగే కొన్ని వ్యాధులు. వైరసులు ప్రధానంగా 20 నుంచి 300 నానో మీటర్ల పొడవు ఉంటాయి.

మూలాలు

  1. "Pathogen". Dictionary.com Unabridged. Random House.