"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

పాప్ స్మియర్ పరీక్ష

From tewiki
Jump to navigation Jump to search
దస్త్రం:Cervical AIS, ThinPrep.jpg
Cytological specimen (ThinPrep) from a patient who was later diagnosed with cervical adenocarcinoma in situ.

యోనిలో ఏదైనా మైల వుంటే పాప్ స్మియర్ పరీక్ష (Papanicolaou test, Pap smear test, Pap test, Cervical smear) చేస్తారు. ఇవి వైద్యంలో కాన్సర్ను తొలిదశలోనే గుర్తించే సులువైన పరీక్ష. తద్వారా గర్భకోశ కాన్సర్ ను నివారించవచ్చును. ఈ పరీక్షను ఆవిష్కరించిన జార్జియోస్ పాపనికొలావ్ (Georgios Papanikolaou) పేరుమీద పిలువబడుతుంది.[1]

ఈ పరీక్ష అందరికీ అందుబాటులో ఉండేవిధంగా అభివృద్ధి చేశారు. కొద్దిపాటి శిక్షణతో గర్భాశయ గ్రీవం, యోని లోపలి నుండి జీవకణాలను స్పేట్యులా (Spatula), సిరంజీ (Syringe), బ్రష్ (Brush) ల సహాయంతో తొలగించి, ఒక గాజు పలక (Glass slide) మీద సన్నని పొర మాదిరిగా చేసి, దానికి రంగులు వేసి, సూక్ష్మదర్శిని (Microscope) తో పరీక్షిస్తారు. జీవకణాలలో కనిపించే కాన్సర్ లక్షణాల ఆధారంగా వ్యాధి నిర్ధారణ చేస్తారు. ఇవే కాకుండా కొన్ని రకాల వైరస్, ట్రైకోమోనాస్ వంటి జీవకారకాలను కూడా ఈ పరీక్ష ద్వారా గుర్చించవచ్చును.

సామాన్యంగా మహిళలు అందరూ ఈ పాప్ పరీక్ష చేయించుకోవడం మంచిది. ఈ పరీక్ష ప్రతి సంవత్సరం లేదా ఐదు సంవత్సరాల కొకసారి చేసుకోవడం అవసరం. ఏదైన లోపం కనిపిస్తే ఇది 3-12 నెలల కొకసారి మళ్ళి మళ్ళి చేయించుకోవాలి. కొందరిలో ప్రత్యేకమైన కాల్పోస్కోపీ (Colposcopy) పరీక్ష అవసరం అవుతుంది. దీని సహాయంతో ముక్క పరీక్ష (Biopsy test) చేయవలసి వుంటుంది.

మూలాలు

  1. O'Dowd MJ, Philipp EE. The History of Obstetrics & Gynaecology. London: Parthenon Publishing Group; 1994: 547

en:Pap smear