"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

పారాణి

From tewiki
Jump to navigation Jump to search

పారాణిని పెళ్ళి సమయంలో పెళ్ళికొడుకు, పెళ్ళికూతురు కాళ్ళకు చేతులకు పూసి అందంగా తీర్చిదిద్దుతారు. ఇది గోరింటాకు వలె ఉన్నప్పటికి వాడినప్పటికి దీనికి ప్రత్యేక స్థానం ఉంది. దీనిని పెళ్ళి సమయంలో వధువరుల అలంకరణలో ఒక సాంప్రదాయంగా వాడుతున్నారు.

పారాణిని తయారు చేసే విధానం

ఒక దబరను తీసుకొని దానిలో ఒక చిన్న గ్లాసును ఉంచి దాని చుట్టూ చిన్న చిన్న ఎండిన కొబ్బరి చిప్ప పలుకులు లేదా బెల్లం ముక్కలు వేసి దానిని ఒక పొయ్యి మీద ఉంచి ఈ దబరపై నీటితో నింపిన మరొక దబరను ఉంచి వేడి చేయాలి. వేడి చేసిన కొంతసేపటికి దబరలోని నీరు ఆవిరి రూపం దాల్చి కింది దబరలో ఉంచిన చిన్న గ్లాసులో నీరుగా మారుతుంది. ఈ విధంగా తయారైన నీరు విడిగా ఉంచుకొని పారాణి అవసరమయినప్పుడు ఈ నీటిలో మంచి కుంకుమను కలుపుట ద్వారా పారాణిని తయారు చేసుకుంటారు.

మొహంది కోన్

గోరింటాకు

ఇవి కూడా చూడండి

బయటి లింకులు