పాలకుర్తి

From tewiki
Jump to navigation Jump to search
పాలకుర్తి
—  మండలం  —
జనగామ జిల్లా జిల్లా పటంలో పాలకుర్తి మండల స్థానం
పాలకుర్తి is located in తెలంగాణ
పాలకుర్తి
పాలకుర్తి
తెలంగాణ పటంలో పాలకుర్తి స్థానం
అక్షాంశరేఖాంశాలు: Coordinates: 17°39′56″N 79°25′39″E / 17.665614°N 79.427605°E / 17.665614; 79.427605
రాష్ట్రం తెలంగాణ
జిల్లా జనగామ జిల్లా
మండల కేంద్రం పాలకుర్తి
గ్రామాలు 21
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
జనాభా (2011)
 - మొత్తం 58,194
 - పురుషులు 29,315
 - స్త్రీలు 28,879
అక్షరాస్యత (2011)
 - మొత్తం 46.73%
 - పురుషులు 59.42%
 - స్త్రీలు 33.56%
పిన్‌కోడ్ 506252

పాలకుర్తి మండలం, తెలంగాణ రాష్ట్రం, జనగామ జిల్లాలో ఉన్న 12 మండలాల్లో ఉన్న ఒక మండలం.

ఈ మండలం పరిధిలో 21 గ్రామాలు కలవు. ఈ మండలం స్టేషన్‌ ఘన్‌పూర్‌ రెవెన్యూ డివిజన్ పరిధిలోకి వస్తుంది.[1]

మండల జనాభా

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం మొత్తం మండల జనాభా 58,194, పురుషులు 29,315, స్త్రీలు 28,879.

మండలంలోని రెవెన్యూ గ్రామాలు

కవి పాల్కురికి సోమనాథుడు జన్మస్థలం

సోమనాథుడు క్రీ.శ. 1190 లో పాలకుర్తి మండలం,పాలకుర్తి గ్రామంలో విష్ణురామిదేవుడు శ్రియాదేవి దంపతులకు జన్మించాడు.సోమేశ్వరుని భక్తుడై ఆ స్వామిమీద సోమనాథ స్తవం రాశాడు. జానపద తెలుగు కవిత్వానికి,ద్విపద ఛందస్సుకు ప్రాచుర్యాన్ని చేకూర్చాడు. వీర శైవ మతావలంబకుడు. తెలుగు, కన్నడ భాషలలో రచనలు చేశాడు. తెలుగులో ఆనాటి సంప్రదాయానికి భిన్నంగా దేశభాషలో ద్విపద రచనలు చేశాడు.

ప్రధాన వ్యాసం: పాల్కురికి సోమనాథుడు

మూలాలు

  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 234 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016

బయటి లింకులు