పాలిపోవడం

From tewiki
Jump to navigation Jump to search

పాలిపోవడం (Pallor) ఒక వ్యాధి లక్షణం. చర్మం, శ్లేష్మ పొరలలో ఆక్సీ హిమోగ్లోబిన్ తగ్గడం మూలంగా అవి పాలిపోయినట్లు కనిపిస్తాయి. ఇది ముఖం, అరచేతులలో కనిపిస్తుంది. ఇది కారణాన్ని బట్టి ఆకస్మికంగా గాని లేదా నెమ్మదిగా సంభవించవచ్చును.

శరీరం అంతా కనిపిస్తేనే పాలిపోవడం వైద్యపరంగా ప్రాముఖ్యత వహిస్తుంది. అనగా పెదాలు, నాలుక, అరచేతులు, నోరు మొదలైన శ్లేష్మ పొరలు కనిపించడం ముఖ్యము. చర్మం లోని మెలనిన్ వర్ణకం తగ్గడం వలన కలిగే పాలిపోవడం నుండి దీనిని వేరుగా గుర్తించాలి.

యూరోపియన్ సంతతి వారు జన్యుపరంగా తెల్లగా పాలిపోయినట్లు కనిపిస్తారు. సూర్యరశ్మిని తక్కువగా చూసేవారు కూడా అదే ప్రాంతానికి చెందిన ఇతరులతో పోలిస్తే తెల్లగా కనిపిస్తారు.

కారణాలు

మూలాలు

  1. Erowid.org, chemicals, amphetamines, amphetamines_effects