"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

పింఛను

From tewiki
Jump to navigation Jump to search

ఉద్యోగం ద్వారా ఇంక ఎంత మాత్రము క్రమమైన సంపాదన పొందలేని ప్రజలకు ఆదాయం సమకూర్చుటకు కల్పించబడిన ఒక ఏర్పాటు పింఛను అనబడుతుంది.[1] పింఛను అనేది పరిహార భత్యముగా భావించకూడదు. మొదటిది క్రమమైన వాయిదాలలో చెల్లించబడితే, రెండవది ఏక మొత్తంగా చెల్లించబడుతుంది.

పదవీ విరమణ పధకము, లేదా వృద్దాప్య పధకము అనే పదాలు పదవీ విరమణ వలన మంజూరు చేయబడే పింఛనును సూచిస్తాయి.[2] ఈ పదవీ విరమణ పధకాలు యజమానుల చేత, బీమా కంపెనీల చేత, ప్రభుత్వం చేత, లేదా ఉద్యోగ సంఘాలు, వ్యాపార వర్గములు వంటి ఇతర సంస్థలచే ఏర్పాటు చేయబడతాయి. USA లో పదవీ విరమణ పధకాలుగా పిలవబడే వీటిని UK మరియు ఐర్లాండ్ లలో సాధారణంగా పింఛను పధకాలు అని, ఆస్ట్రేలియా మరియు న్యూజిలాండ్ లలో వృద్దాప్య పధకములు లేదా సూపర్ [3] అని పిలుస్తారు. పదవీవిరమణ పింఛనులు విలక్షణముగా సంవత్సరానికి ఒకసారి చెల్లించేటట్లు మరియు జీవిత ప్రమాద బీమా కలిగి ఉండేటట్లు ఉంటాయి.

యజమాని ద్వారా ఉద్యోగి ప్రయోజనం కొరకు ఏర్పాటు చేయబడిన ఈ పింఛనులను సాధారణంగా వృత్తి పింఛను లేదా యాజమాన్య పింఛను అని సూచిస్తారు. శ్రామిక సంఘాలు, ప్రభుత్వాలు లేదా ఇతర సంఘాలు పింఛను నిధిని సమకూరుస్తాయి. వృత్తి పరమైన పింఛనులు పరిహారమును లక్ష్యంగా చేసుకొని సాధారణంగా ఉద్యోగులకు ప్రయోజనకరంగా, యజమానులకు పన్ను రూపేణా ప్రయోజనకరంగా ఉంటాయి. చాలా పింఛనులు అదనపు భీమా సౌకర్యం కలిగి ఉండి, అతనిపై ఆధారపడిన లేదా వికలాంగులైన వారికి కూడా ఆర్థిక ప్రయోజనాలు సమకూరుస్తాయి. ఇతర వాహకాలు (లాటరీ చెల్లింపులు, ఉదాహరణకి వార్షిక చెల్లింపులు) వంటివి ఇదే విధమైన చెల్లింపు పద్ధతులను కలిగి ఉంటాయి.

పింఛను అనునది సాధారణంగా పదవీ విరమణ చెందిన వ్యక్తులు స్వీకరించే చెల్లింపులను వివరిస్తుంది. సాధారణంగా ఇవి ముందస్తుగా నిర్ణయించబడిన న్యాయపరమైన ఒప్పందాలను కలిగి ఉంటాయి. పదవీ విరమణ పింఛను తీసుకొను వ్యక్తిని పింఛనుదారుడు లేదా విశ్రాంత ఉద్యోగి అని అంటారు.

Contents

పింఛను-రకాలు

ఉద్యోగ ఆధారిత పింఛను (పదవీవిరమణ పధకాలు)

ఉద్యోగం ద్వారా ఇంక ఎంత మాత్రము నిలకడ సంపాదన పొందలేని ప్రజలకు ఆదాయం సమకూర్చుటకు కల్పించబడిన ఒక ఏర్పాటు పదవీ విరమణ పధకము అనబడుతుంది. పదవీ విరమణ తరువాత నిశ్చిత ప్రయోజనాలను పొందుటకు తన ఉద్యోగిత కాలంలో ఉద్యోగి మరియు యజమానుల ఇద్దరి ఉమ్మడి నిధిని పదవీ విరమణ పధకాలు సాధారణంగా కలిగి ఉంటాయి. పదవీ విరమణ తరువాత ఆదాయం కోసం పన్నురహిత సంచిత నిధి ఏర్పాటు చేసే వాహకంగా ఇది ఒక భిన్నమైన పన్నేతర పొదుపు. శ్రామిక సంఘాలు, ప్రభుత్వ ఏజెన్సీలు, స్వయం నిధి పధకాల వంటి ఇతర మార్గాల ద్వారా కూడా నిధులను సమకూర్చుకోవచ్చు. కాబట్టి పింఛను పధకాలు ఒక రకమైన నిలిపి ఉంచబడిన పరిహారాలు. SSAS UK లోని ఒక ఉద్యోగి ఆధారిత పింఛను.

సామజిక మరియు రాజ్య పింఛనులు

చాలా దేశాలు వారి పౌరులు మరియు నివాసకులు పదవీ విరమణ (లేదా కొన్ని పరిస్థితులలో వికలాంగులుగా మారిన) చేసిన తరువాత ఇచ్చే ఆదాయాల కొరకు నిధులను సమకూరుస్తున్నాయి. తరువాతి ప్రయోజనాలను పొందుటకు పౌరుని పని కాల జీవితం అంతా దీని కొరకు చెల్లింపులు జరుపవలసి ఉంటుంది. రాష్ట్ర పింఛను యొక్క ప్రాతిపదిక ఒక చందాపై ఆధారపడిన ప్రయోజనం మరియు వ్యక్తి యొక్క చందా చెల్లింపు చరిత్రపై ఇది ఆధారపడి ఉంటుంది.

ఉదాహరణకు UK వారి జాతీయ బీమా లేదా USA లోని సామజిక భద్రతా పధకాలను గమనించండి.

వికలాంగ పింఛనులు

కొన్ని పధకాలు అవయవ లోపాలతో ఉండే వ్యక్తుల కొరకు కల్పించబడి ఉంటాయి. వికలాంగ సభ్యునికి పదవీ విరమణ వయస్సు కన్నా ముందుగానే ఈ పధకాలలో ప్రవేశము కల్పించబడుతుంది.

వృధ్ధాప్య పింఛనులు

భారతదేశం వంటి కొన్ని దేశాలు 60, 65, 80 సంవత్సరాలు దాటిన ముసలివారికి ఆసరాగా వృద్ధాప్యపు పింఛన్లు ఇస్తున్నాయి. ఇటీవల భారత దేశ ఆర్థిక మంత్రి తన బడ్జెట్ట్లులో వృద్దాప్యపు పించును పొందటానికి వయస్సును 65 నుంచి 60 ఏళ్ళకు తగ్గించినట్లు 2011 ఫిబ్రవరి 28 నాటి బడ్జెట్ లో వెల్లడించింది. వారికి నెలకు రూ.200 పింఛను ఇస్తారు. 80 ఏళ్లు దాటిన వారిక్ రూ.500 పింఛను ఇవ్వటానికి కూడా భారత ప్రభుత్వం 2011-12 బడ్జెట్టులో 2011 ఫిబ్రవరి 28 నాడు ప్రకటించింది.

ఎయిడ్స్ రోగులకు పింఛన్లు

అంధ్రప్రదేశ్ ప్రభుత్వం వికలాంగులకు, వృద్ధులకు, వితంతువులకు పింఛన్లు ఇస్తున్న విధంగానే ఇకపై ఎయిడ్స్‌ రోగులకు కూడా నెలకు రెండువందల రూపాయలు పింఛను ఇవ్వడానికి నిర్ణయించింది. 2011 మార్చి 8 మంగళవారం నాడు నెల్లూరు కలెక్టర్‌ కార్యాలయానికి ప్రభుత్వం నుండి ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఎయిడ్స్‌ రోగులకు రచ్చబండ కార్యక్రమానికి ముందే పింఛన్లు ఇవ్వాలని నిర్ణయించినప్పటికీ వివిధ కారణాల వల్ల అమలు కాలేదు. ఈ క్రమంలో నెల్లూరు కలెక్టర్‌, నెల్లూరు జిల్లాలోని ఎయిడ్స్‌ వ్యాధి గ్రస్థుల జీవన స్థితిగతులపై ప్రభుత్వానికి నివేదిక ఇచ్చాడు. ఆ ప్రకారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వం నిర్ణయించిన మార్గ దర్శక సూత్రాల ప్రకారం పింఛనుకి అర్హులయ్యే వ్యక్తులు ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఎఆర్‌టి సెంటర్లలో ఒక సంవత్సరం ఎయిడ్స్‌ లేదా హెచ్‌ఐవిలో చికిత్స పొందినట్లు రూఢి పత్రం ఉండాలని అన్నారు. 2011 మార్చి 15 తేదీలోగా ఎయిడ్స్‌ వ్యాధి గ్రస్థులు వివరాలు పంపితే దరఖాస్తుల పరిశీలన అనంతరం వచ్చేనెల నుండి అర్హులకు పిఛన్లు ఇవ్వడం జరుగుతుందని ప్రభుత్వం తెలియచేసింది. ఇటీవల నెల్లూరు జిల్లా యంత్రాంగం నిర్వహించిన సర్వే ప్రకారం, నెల్లూరు జిల్లాలో 3200 మంది ఎయిడ్స్‌ వ్యాధి గ్రస్థులున్నట్లు, నెల్లూరు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఎయిడ్స్‌ వ్యాధి గ్రస్థులకు సంబంధించిన నివేదిక అనంతరం వారి బ్యాంక్‌ అకౌంట్లల్లోకి పించన్లు జమచేయడం జరుగుతుందని వైద్య ఆరోగ్య శాఖ అధికారి తెలిపాడు.

అభయ హస్తం

 • 'అభయ హస్తం' ప్రభుత్వం పేదప్రజలకు (ముఖ్యంగా వృధ్హులకు, మహిళలకు) ప్రకటించిన ఒక సంక్షేమ పథకం. ఈ పథకం కింద ప్రతినెలా లబ్ధిదారులకు రూ.500 చొప్పున పింఛన్లు ఇవ్వాలి. కానీ అధికారులు రూ.200, రూ.300 మాత్రమే ఇచ్చారు. ఏడాదిగా లక్షన్నర మంది మహిళలకు ఈ పద్ధతిలోనే పింఛన్లు ఇచ్చారు. ఈ విషయం పట్టణ ఇందిరా క్రాంతి పథం (ఐ.కే.పి) సమీక్షలో బయటపడింది. 'అభయహస్తం పథకం'ద్వారా ఇవ్వ వలసిన రూ.500ను ప్రభుత్వాధికారులు తమ దగ్గర ఉంచుకొని, సామాజిక పింఛన్లు పథకం కింద నెలకు రూ.200 చొప్పున చెల్లిస్తున్నారు. దీనితో, ఒక్కొక్క లబ్ధిదారు, ప్రతినెలా రూ.300 వరకు నష్టపోయారు. ఎంతమందికి ఈ పద్ధతిలో తక్కువ పింఛను చెల్లించారో తెలియ చేయాలని పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా) కోరింది. 'అభయహస్తం' లబ్ధిదారులకు డిసెంబరు 2010, జనవరి 2011 పింఛన్లు కలిపి ఇచ్చే అవకాశముందని గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు వెల్లడించారు. పింఛను నవీకరణ (మార్పు) కోసం రూ.365 చొప్పున వసూలు చేశారు. ప్రభుత్వం ఈ పథకం కింద జీవిత బీమా సంస్థ (ఎల్.ఐ.సి)కి చెల్లించాల్సిన వాటా సకాలంలో విడుదల చేయలేదు. దీనితో, పింఛన్ల చెల్లింపులు నిలిచిపోయాయి. ఇది తెలిసిన ప్రభుత్వం, వెంటనే తన వాటా రు.70 కోట్లు బడ్జెట్టు చెల్లించేందుకు ఆదేశాలు ఇచ్చింది. ఈ సొమ్ము ఎల్.ఐ.సీ.కి చేరడానికి నాలుగైదు రోజులు పడుతుంది. దీనితో, పింఛన్లు ఆలస్యం అవుతాయి. అభయహస్తం పథకం కింద పింఛన్లు చెల్లించడానికి నెల నెలా లబ్ధిదారుల ఇళ్ళకు వెళ్ళి పరిశీలించాలని ప్రభుత్వం ఆదేశించింది. లబ్ధిదారులు అందరూ పింఛను తీసుకుంటున్న ప్రాంతాలలో నివాసం ఉంటున్నారా, లేదా, ఇతర ప్రాంతాలకు వెళ్ళారా, చనిపోయారా, వంటి వివరాలు నెల నెలా నమోదు చేసి ప్రధాన కార్యాలయాలకు పంపాలని సూచన చేసారు. ఈ వివరాల ప్రకారమే, పింఛన్లు చెల్లింపు చేస్తామని ప్రభుత్వం తెలిపింది. ప్రతినెలా లబ్ధిదారుల జాబితా సక్రమంగా ఉందని అనుకుంటేనే, పింఛన్లు విడుదల చేయాలని అనుకున్నారు. చనిపోయిన వారి వివరాలు ఎప్పటికప్పుడు సేకరించాలని అధికారులను ఆదేశించారు.

వృద్ద్ధ కళాకారులకు పింఛన్లు

పింఛనులు - ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వము

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వంలో పనిచేసి విశ్రాంతి తీసుకుంటున్న పింఛను దారుల వయస్సు 75 ఏళ్ళు దాటితే, వయస్సును బట్టి బేసిక్ పింఛను మొత్తంపై 15 నుంచి 40 శాతం వరకు ఎక్కువ సొమ్ము వస్తుంది. 2010 పే రివిజన్ కమిటీ సిఫార్సుల మేరకు, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం 2011 ఏప్రిల్ 13 న ఉత్తర్వులు జారీచేసినట్లు, ఈ ఉత్తర్వులను వెంటనే అమలు ఛేయాలని అన్ని జిల్లాల ట్రేజరీ కార్యాలయాలకు ఆదేశాలు పంపింది. విశ్రాంత ఉద్యోగుల వయస్సు ధ్రువీకరణ పత్రాలను కూడా పరిశీలించమని కూడాచెప్పింది. వయస్సు పెరిగే కొద్దీ, ఆరోగ్య సమస్యలతో, డబ్బు సమస్యలతో, బాధ పడేవారికి ఈ ఉత్తర్వులు కొంత ఊరట కలిగిస్తాయి. ఆం.ప్ర. ప్రభుత్వం, మొదట ప్రభుత్వ ఉద్యోగులకే, ఈ సౌకర్యం ఇవ్వాలని అనుకున్నది. కానీ ప్రజలనుంచి, ప్రజాప్రతినిధులనుంచి వచ్చిన విన్నపాల వలన, కుటుంబ పింఛను దారులకు కూడా అమలు అయ్యేలాగ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తరువుల వలన, 75 ఏళ్ల వయస్సు దాటిన పింఛను దారులకు, వారి బేసిక్ పింఛను మొత్తంపై 15 శాతం ఎక్కువ సొమ్ము, లభిస్తుంది. 85 ఏళ్ళ వయస్సు దాటిన వారికి 25 శాతం, 90 ఏళ్ల వయస్సు దాటిన వారికి 30 శాతం, 95 ఏళ్ళు దాటిన వారికి 40 శాతం చొప్పున ఎక్కువ డబ్బు లభిస్తుంది. ఆం.ప్ర. రాష్ట్రంలో 6 లక్షలమంది వరకు పింఛను దారులున్నట్లు అంచనా. వీరిలో 75 ఏళ్ళ నుంచి 100 ఏళ్ళ వయస్సు కలిగిన వారి వరకు వయస్సును ఋజువు చేసే పత్రాలను స్వీకరించి, వారికి రావలసిన శాతం పింఛను డబ్బు పెంచేందుకు అధికారులు ప్రయత్నాలు మొదలు పెట్టారు. ప్రభుత్వ ఉద్యోగులకు పుట్టిన తేదీ ధ్రువీకరణ పత్రాలు ఉంటాయి కాబట్టి వారికి సమస్య ఉండదు. ఎటొచ్చీ, కుటుంబ పింఛను దారులకు పుట్టిన తేదీ పత్రాలు, ఉండవు. అందుకని, వారు తమ వయస్సు నిర్ధారణకు వీలుగా తమ ఓటరు గుర్తింపు కార్డు, పాన్ కార్డులలో ఏదో ఒకటి, తహశీల్దారు వంటి అధికార్లతో ధ్రువీకరించి, దరఖాస్తు చేయవలసి ఉంటుంది (నకలు మాత్రమే ధ్రువీకరించాలి).

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని, భవన నిర్మాణ కార్మికులకు, ఇతర నిర్మాణ కార్మికులకు పింఛను సౌకర్యము.

రాష్ట్ర భవన ఇతర నిర్మాణ కార్మికులకు కేంద్ర ప్రభుత్వం అమలుచేస్తున్న స్వావలంబన పథకం కింద పెన్షన్ పథకాన్ని అమలుచేయాలని నిర్ణయించినట్టు రాష్ట్ర భవన, ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు ఛైర్మన్ ఎస్ గోపాల్ 2011 ఆగస్టు 5 నాడు రాజమండ్రిలో చెప్పారని వార్తాపత్రికలు ప్రచురించాయి. రాష్ట్ర భవన, ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు రిజిస్ట్రేషన్ పొంది సభ్యులుగా కొనసాగుతున్న కార్మికులు 60ఏళ్లు పూర్తిచేసుకున్న తరువాత ఈ పథకంలో పెన్షన్ పొందడానికి అర్హులు. రాష్ట్రంలోని చిత్తూరు, వరంగల్, విశాఖ జిల్లాల్లో ప్రయోగాత్మకంగా పెన్షన్ పథకాన్ని అమలుచేస్తున్నారు. పెన్షన్ పథకంలో చేరాలనుకునే కార్మికులు వెయ్యి రూపాయలు చెల్లిస్తే, దానితో సమానంగా కేంద్రప్రభుత్వం వెయ్యి రూపాయలు చెల్లిస్తుంది అయితే కార్మికులు చెల్లించాల్సిన రూ.1000లో రాష్ట్ర భవన, ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు రూ.800 సమకూరుస్తోంది. నిర్మాణ కార్మికుడు, కేవలం రూ.200 చెల్లిస్తే సరిపోతుంది. 18ఏళ్ల నుండి 60ఏళ్లలోపు వయస్సున్న వారు ఈ పథకంలో చేరేందుకు అర్హులు. సభ్యుల వయస్సు, చెల్లించిన ప్రీమియం ఆధారంగా పెన్షన్ లభిస్తుంది. ఉదాహరణకు 50ఏళ్ల వయస్సున్న కార్మికులు ఈ పథకంలో చేరిన పక్షంలో 60ఏళ్లు నిండిన తరువాత నెలకు రూ.700 పెన్షన్ లభిస్తుందన్నారు. అంతకన్నా, చిన్న వయసులో చేరితే, నెలకు మరింత ఎక్కువ పించను దొరుకుతుంది. ఈ క్రింద ఇచ్చిన రెండు చట్టాలు, ఆధారంగానే, దేశంలో ఉన్న 85 లక్షలమంది (నేషనల్ సాంపిల్ సర్వే 1987-88 ప్రకారము) భవన నిర్మాణ కార్మికులకు, ఇతర నిర్మాణ కార్మికులకు రక్షణ ఏర్పడుతుంది.

పింఛనులు - క్రోడీకరణ

కేంద్ర ప్రభుత్వం, వివిధ పింఛను పథకాలను క్రోడీకరించేందుకు, నిర్ణయం తీసుకుంచి. ఈ బాధ్యతలను, వ్రైవేటు సంస్థలకు అప్పగించనుంది. మార్చి 2011 నాటికి, ఈ వ్యవహారాన్ని పూర్తి చేసేందుకు, కేంద్ర ప్రభుత్వము, టెండర్లను పిలిచింది. ఇందిరాగాంధీ జాతీయ వృద్ధాప్య పింఛను పథకం, వితంతు, వికలాంగ పింఛను పథకాలను, కేంద్ర ప్రభుత్వము అమలు చేస్తున్నది. అదే విధంగా, రాష్ట్రాలుకూడా మరికొన్ని పింఛనులు ఇస్తున్నాయి. ఈ, అన్ని రకాల పింఛనులను, దృష్టిలో ఉంచుకొని, వీటి అమలుకు సంబంధించి ఒకే ఒక్క సాఫ్త్‌వేర్ ను రూపొందించడం, పారదర్శకత పాటించడం, అనే రెండు ఉద్దేశాలతో, కేంద్రప్రభుత్వము నిర్ణయము తీసుకుంది. నవంబరు 2011 లో ఢిల్లీలో జరిగిన రాష్ట్రాల మంత్రుల సమావేశంలో, సామాజిక పింఛనుల పథకంపై సమీక్ష జరిగింది. వృద్ధాప్య పింఛనుల కింద ఇచ్చే మొత్తం సొమ్ముని 2006 ఏప్రిల్ నెల నుంచి రూ. 200 కు పెంచుతూ, అంతే మొత్తం సొమ్ముని రాష్ట్రాలు కూడా తమ వాటాగా ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం చెప్పింది. ఈ విషయం మీద ఆంధ్రప్రదేశ్, ఒడిషా, బీహార్, మరికొన్ని రాష్ట్రాలు ఇంతవరకూ ఉలుకూ పలుకూ లేదు. ఇందిరమ్మ పథకం కింద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేకంగా పింఛనులు ఇస్తోందని, అందువలన, ఆ మొత్తం సొమ్ముని పెంచలేదని ప్రభుత్వం చెబుతుంది.

ప్రయోజనాలు

పదవీ విరమణ పధకాలు పొందే ప్రయోజనాల దృష్ట్యా నిర్దిష్ట ప్రయోజన పధకాలు లేదా నిర్దిష్ట చందా చెల్లింపు పధకాలుగా వర్గీకరించబడ్డాయి.[4] నిర్దిష్ట ప్రయోజన పధకము సభ్యుని జీతము మరియు ఎన్ని సంవత్సరాలు అతను పధకములో సభ్యునిగా ఉన్నాడు అనే విషయంపై ఆధారపడి ఒక నిర్ణీత సూత్రము ఆధారంగా కొంత కచ్చితమైన చెల్లింపుకు భరోసా ఇస్తుంది. నిర్దిష్ట చందా చెల్లింపు పధకములో ఎంత సొమ్ము చందాగా చెల్లించారు మరియు వాటిని పెట్టుబడి పెట్టిన వాహకాల పనితీరు ఆధారంగా పదవీ విరమణ చెల్లింపు నిర్ణయించబడుతుంది.

నగదు శేషము పధకము వంటి కొన్ని పదవీ విరమణ పధకాలు నిర్దిష్ట ప్రయోజన పధకము మరియు నిర్దిష్ట చందా చెల్లింపు పధకముల లక్షణాలు రెండింటిని కలిగి ఉంటాయి. ఆ పధకాలను సాధారణంగా మిశ్రిత పధకాలుగా వ్యవహరిస్తారు. అటువంటి పధకాల నమూనాలు 1990 తరువాత నుండి US లో ప్రజాదరణ పొందుతూ ఉన్నాయి. ఉదాహరణకు నగదు శేషపు పధకము మరియు పింఛను ఈక్విటీ పధకము.

నిర్దిష్ట ప్రయోజన పధకాలు

సంప్రదాయక నిర్దిష్ట ప్ర్రయోజన పధకము (DB) అనేది పెట్టుబడులపై వచ్చే లాభాల మీద ఆధారపడకుండా ఒక సూత్రాల సమితి ద్వారా పదవీ విరమణ ప్రయోజనాలు లెక్కించే ఒక పధకము. US లో మూస:Uscsub ప్రత్యేకించి, నిర్దిష్ట ప్రయోజన పధకము అనగా నిర్దిష్ట చందా చెల్లింపు పధకము (క్రింద చూడండి) కాని ఒక పింఛను పధకము. అలాగే నిర్దిష్ట చందా గల ఒక పధకము. సంప్రదాయకంగా నిర్దిష్ట ప్రయోజనాలను ఉద్యోగి పదవీ విరమణ తరువాత ఉద్యోగికి అందించే ఒక సంప్రదాయక పింఛను పధకమే నిర్దిష్ట ప్రయోజన పధకము.

సంప్రదాయకంగా పదవీ విరమణ పధకాలు ప్రత్యేకించి ఆ ఉద్దేశం కోసమే భారీ వ్యాపార సంస్థలచే నిర్వహింపబడుతూ ఉంటాయి లేదా ప్రభుత్వ కార్మికుల కొరకు ప్రభుత్వమే తనకు తానుగా నిర్వహిస్తుంది. సంప్రదాయక నిర్దిష్ట ప్రయోజన పధకము అనేది ఆఖరి జీతపు పధకము. ఇందులో చెల్లించబడే పింఛను అతను పనిచేసిన సంవత్సరాలను సభ్యుని పదవీ విరమణ నాటి జీతంతో గుణించి, దానిని సంచిత రేటుతో గుణించగా వచ్చు లబ్ధానికి సమానము. చివరికి అందుబాటులో ఉన్న సంచిత మొత్తమే నెలసరి పింఛను లేదా ఏక మొత్తము. కాని, సాధారణంగా నెలసరి మొత్తముగా ఉంటుంది.

నిర్దిష్ట ప్రయోజన పధకము లోని ఆర్థిక ప్రయోజనాన్ని ఉద్యోగి జీతము, పనిచేసిన సంవత్సరాలు, పదవీ విరమణ నాటి వయస్సు మొదలైన ఇతర కారకాల కూర్పుతో ఏర్పడిన సూత్రము ద్వారా నిర్ధరింపబడుతుంది. ఒక చిన్న ఉదాహరణ ఒక కంపెనీలో సభ్యుడు పనిచేసిన కాలానికి అనుగుణంగా ఏర్పరచిన నమూనా ఆధారంగా నెలకి కొంత మొత్తం ఇచ్చేదే డాలర్స్ టైమ్స్ సర్వీసు పధకము. ఉదాహరణకు ఒక సంవత్సరం సర్వీసుకు $100 చొప్పున చెల్లించే పధకము, 30 సంవత్సరాల సర్వీసు కలిగి, పదవీ విరమణ చేసిన సభ్యునికి నెలకు $3,000 లు సమకూరుస్తుంది. సంఘటిత కార్మికులలో ఈ పధకము బాగా ఆదరణ పొందింది. ఆఖరి భత్యపు సగటు (FAP) అనేది సంయుక్త రాష్ట్రాలలో అత్యంత సాధారణంగా ఉపయోగిస్తున్న నిర్దిష్ట ప్రయోజన పింఛను పధకము. ఈ FAP పథకములలో ఉద్యోగి సర్వీసులో చివరి సంవత్సరం జీతపు సరాసరి ఆధారంగా ప్రయోజన భత్యాన్ని నిర్ధారిస్తారు.

కొన్ని సంవత్సరాల సగటు జీతము అనగా డాలరు యొక్క విభిన్న విలువల సరాసరి లెక్కింపు అని అర్ధము. ఉదాహరణకు జీతాన్ని 5 సంవత్సరాల సగటుపై మదింపు చేసి, మరియు 2009లో పదవీ విరమణ చెందితే అప్పుడు 2004 డాలర్ల విలువపై 2004 జీతాన్ని 2005 డాలర్ల విలువపై జీతంతో సరాసరి. ఇదేవిధంగా మిగిలినవి లెక్కిస్తారు. 2004 డాలర్ విలువ తరువాత సంవత్సరాలలో డాలర్ల విలువ కన్నా ఎక్కువ విలువ కలిగి ఉంటుంది. అప్పుడు పింఛనును మొదటి సంవత్సరం డాలరు విలువలో అనగా 2009 డాలరు విలువలో ఈ గణనలో వచ్చిన అతి తక్కువ డాలరు విలువపై చెల్లిస్తారు. సంవత్సర సగటు జీతంపై గల ద్రవ్యోల్బణం కొనుగోలు శక్తి మరియు ధరలపై గణనీయమైన ప్రభావం చూపిస్తుంది.రెండు కూడా ద్రవ్యోల్బణంచే కుదించబడతాయి.

ఈ ద్రవ్యోల్బణ ప్రభావాన్ని జీతాలను పదవీ విరమణ మొదటి సంవత్సరపు డాలరు విలువపై సావంత్సరిక సగటుగా మార్చటం ద్వారా తొలగిస్తారు మరియు సమతుల్యం చేస్తారు.

యునైటెడ్ కింగ్డంలో రిజిస్టరు చేయబడిన పింఛను పధకాల చట్టాల ప్రకారం ప్రయోజనాలను ప్రత్యేకంగా ద్రవ్యోల్బణ సూచి (రిటైల్ ధరల సూచితో (RPI)) జత చేస్తారు.[5] ఉద్యోగి పదవీ విరమణ నాటి ద్రవ్యోల్బణ పింఛను యొక్క కొనుగోలు శక్తిని ప్రభావితం చేస్తుంది. పెరిగిన ద్రవ్యోల్బణ రేటు నియమిత సంవత్సరిక పింఛను కొనుగోలు శక్తిని హరిస్తుంది. ద్రవ్యోల్బణ రేటుతో సంవత్సర పింఛనును పెంచటం ద్వారా ఈ ప్రభావం నుండి ఉపశమనం కలిగించవచ్చు (సాధారణంగా ఇది సంవత్సరానికి 5% చొప్పున ఉంటుంది). ఈ పద్ధతి ఉద్యోగికి ప్రయోజనకరంగా ఉంటుంది. ఎందుకంటే, ఇది పింఛను యొక్క కొనుగోలు శక్తిని కొంత వరకు నిలకడగా ఉంచుతుంది.

పింఛను పధకము ముందస్తు పదవీ విరమణను అనుమతించినట్లయితే, చెల్లించే చెల్లింపులు కుదించబడతాయి. ఎందుకంటే, విశ్రాంత ఉద్యోగి ఎక్కువ కాలం పాటు భత్యాలను అందుకునే అవకాశం ఉంది. US లో (ERISA చట్టాల ప్రకారం) ఏ కుదింపు భిన్నము అయినా సంచిత విరమణ సంచిత కుదింపు భిన్నము కన్నా తక్కువ లేదా సమానము అయినప్పుడు మాత్రమే అంగీకరించబడుతుంది.[6]

ఉద్యోగులు వారి సాధారణ పదవీ విరమణ వయస్సు కన్నా (65 సంవత్సరాలు) ముందుగానే పదవీ విరమణ చెందుటను ప్రోత్సహించుటకు గాను, చాలా DB పధకాలు ముందస్తు పదవీ విరమణ అవకాశాలను కలిగి ఉంటున్నాయి. కంపెనీలు తక్కువ జీతాలకు యువ ఉద్యోగులను తీసుకునే అవకాశం ఉంటుంది. అందులో కొన్ని అదనపు తాత్కాలిక లేదా ఉప ప్రయోజనాలను కల్పిస్తున్నాయి. అవి కొంతకాలం పాటు అనగా సాధారణంగా పదవీ విరమణ వయస్సు వచ్చే వరకు చెల్లింపబడుతూ ఉంటాయి.[7]

నిధుల లభ్యత

నిర్దిష్ట ప్రయోజన పధకములు అనేవి మూలనిధి కలిగి కాని లేదా మూలనిధి లేకుండా కాని ఉంటాయి.

మూలనిధి లేని నిర్దిష్ట ప్రయోజన పధకములో ఎటువంటి స్థిర ఆదాయాలు సమకూర్చబడి ఉండవు మరియు ఆర్థిక ప్రయోజనాలను యజమాని గాని, పింఛను ప్రయోజకుడు గాని వాటిని చెల్లించవలసిన సమయంలో చెల్లిస్తారు. ప్రపంచంలో పింఛను పధక ఏర్పాట్లు చేసిన చాలా దేశాలలో మూలనిధి లేకుండా కార్మికుల చెల్లింపులు మరియు పన్నుల ఆదాయం నుండి ప్రయోజనాలు నేరుగా చెల్లించబడుతున్నాయి. ఈ విధమైన ఆర్థిక మద్దతును పే-యాజ్-యూ-గో (PAYGO or PAYG) అని అంటారు.[8] చాలా ఐరోపా దేశాలలోని సామాజిక భద్రతా వ్యవస్థ మూలనిధి లేకుండా[ఉల్లేఖన అవసరం], ప్రయోజనాలను ప్రస్తుత పన్నుల ద్వారా మరియు సామాజిక భద్రతా చెల్లింపు ఆదాయం నుండి నేరుగా చెల్లింపులు జరుపుతున్నవి. కెనడాలోని జీతం ఆధారిత విరమణ పధకము (CPP) మూలనిధిని కలిగి ఉండి, ఆ ఆస్తులను CPP పెట్టుబడి బోర్డు పర్యవేక్షిస్తుండగా, U.S. సామాజిక భద్రతా వ్యవస్థ మూలనిధిని కలిగి ఉండి పెట్టుబడులను ప్రత్యేకమైన U.S. ట్రెజరీ బాండ్స్ లలో ఉంచుతుంది.

మూలనిధి పధకంలో యజమాని యొక్క చందాలు మరియు కొన్నిసార్లు సభ్యుల చందాలు ప్రయోజనాల చెల్లింపులు ఎదుర్కోవటానికి ఒక పధకంలో పెట్టుబడి పెడతారు. భవిష్యత్తులో పెట్టుబడులపై వచ్చే ప్రతిఫలాలు మరియు భవిష్యత్తులో చెల్లించబోయే ప్రయోజనాలు ముందుగా తెలియవు. కాబట్టి, ఇంత మొత్తము చందాలు ప్రయోజనాల చెల్లింపుకు సరిపోతాయని హామీ ఇవ్వటం సాధ్యం కాదు. పింఛను నిధి భవిష్యత్తు చెల్లింపుల బాధ్యతను నిశ్చయంగా తట్టుకుంటుందో లేదో అని గణకుడు పధకము యొక్క స్థిరాస్తులు మరియు జవాబుదారీతనాలను మదింపు చేసిన దానిపై ఆధారపడి చెల్లించే చందాలను క్రమముగా పునఃపరిశీలిస్తూ ఉంటారు. అంటే నిర్దిష్ట పింఛను పధకములో పెట్టుబడి నష్టాలు మరియు పెట్టుబడి ప్రయోజనాలు ఒక మోస్తరుగా యజమాని లేదా ప్రయోజకుడు అంచనా వేస్తారు. కాని వ్యక్తిగతంగా కాదు. పధకము పూర్తిగా నిధులను సమకూర్చుకోలేకపోతే, పధక ప్రయోజకుడు పధకాన్ని కొనసాగించుటకు అవసరమైన ఆర్థిక వనరులు కలిగి ఉండడు. USA, UK మరియు ఆస్ట్రేలియా వంటి అనేక దేశాలలో నిర్దిష్ట ప్రయోజన పధకాలలో ఎక్కువ భాగము మూల నిధిని కలిగి ఉన్నాయి.[ఉల్లేఖన అవసరం] ఎందుకంటే ప్రభుత్వాలు మూల నిధిని కలిగి ఉన్న పధకాలకు పన్ను ప్రోత్సాహకాలు కల్పిస్తున్నాయి ( ఆస్ట్రేలియాలో అవి తప్పనిసరి). సంయుక్త రాష్ట్రాలలో చర్చి ఆధారితం కాని ప్రైవేటు యజమానులు కచ్చితంగా బీమా ప్రీమియాన్ని పింఛను ప్రయోజన హామీ కార్పోరేషన్ కు చెల్లించాలి. ఇది ఒక ప్రభుత్వ ఏజెన్సీ. వాలెంటరీ ప్రైవేటు పింఛను పధకాలను నిర్వహించటం మరియు అంతరాయం లేకుండా సమయానికి పింఛను ప్రయోజనాలను చెల్లించేటట్లు చూసే పాత్ర వీటిది.

విమర్శలు

సాంప్రదాయక నిర్దిష్ట ప్రయోజన పధకము నమూనా (వారి నిలకడైన సంచిత పొడుపు రేటు మరియు పదవీ విరమణ వయస్సు దగ్గర పడుతున్న కొద్దీ తగ్గిపోతున్న వడ్డీ డిస్కౌంట్ సమయము కారణంగా) సంచిత ప్రయోజనాలతో J-ఆకారపు రూపు సంతరించుకుంటుంది. ప్రస్తుత ప్రయోజన విలువలు ఉద్యోగస్తుల వృత్తి ప్రారంభంలో నిదానంగా వృద్ది చెందుతూ, మధ్య కాలంలో గమనించదగ్గ వేగాన్ని అందుకుంటాయి. మరో మాటలో చెప్పాలంటే యువ ఉద్యోగస్తుల కంటే సీనియర్ ఉద్యోగులకు పింఛను నిధి ఎక్కువగా ఉంటుంది (వయస్సు పై ఆధారపడి). అవి ముగింపు దశలో ఎక్కువ నగదు ప్రయోజనాలను అందించుచున్నప్పటికీ, నిర్దిష్ట ప్రయోజన పింఛను పధకాలు, నిర్దిష్ట చెల్లింపు పధకాల కంటే తక్కువ చలనశీలతను కలిగి ఉంటాయి. చాలా పధకాలు ఏమైనప్పటికీ పదవీ విరమణ చేసిన వారు, వారి చందాల చిన్న పెట్టుబడుల ప్రతిఫలాల నష్టాన్ని లేదా మరణాంతరం వారి పదవీ విరమణ సొమ్ము నష్టాలను భరించకుండా ఉండేటట్లు సంవత్సరానికి ఒకసారి ప్రయోజనాలను చెల్లిస్తున్నాయి. ఓపెన్-ఎన్డేడ్ లక్షణాలను కలిగి ఉంది యజమానులకు కలుగుతున్న నష్టాల కారణంగా చాలా మంది యజమానులు ఇటీవల సంవత్సరాలలో నిర్దిష్ట ప్రయోజన పధకము నుండి నిర్దిష్ట చందా చెల్లింపు పధకానికి మారుతున్నారు. యజమానికి కలిగే ఈ నష్టాలు కొన్ని సార్లు ప్రయోజన నిర్మాణంలోని విచక్షణ కారకాల వల్ల తక్కువ చేయబడతాయి. ఉదాహరణకు పదవీ విరమణకు ముందు తరువాత సంచిత పింఛనులో వడ్డిరేటు పెంపుదలలో గల హామీ.

వయస్సు పక్షపాతంతో చలనశీలత తగ్గటం మరియు ఓపెన్ ఎన్డేడ్ నష్టాలు ఉండటంతో నిర్దిష్ట ప్రయోజన పధకాలు తక్కువ చలన ఉద్యోగులు గల పెద్ద పెద్ద యజమానులకు అనగా ప్రభుత్వ రంగంలోని వారికీ బాగా సరిపోతాయి ( వీటికి పన్ను చెల్లింపుల ద్వారా ఓపెన్ ఎన్డేడ్ మద్దతు లభిస్తుంది).

కొన్ని సార్లు నిర్దిష్ట ప్రయోజన పధకాలు పిత్రార్జితాలని విమర్శించబడుతుంటాయి. ఎందుకంటే అవి పధకము యొక్క యజమానులను లేదా పధక త్రాస్తిలను వారి ఉద్యోగస్తుల యొక్క ప్రయోజనాల గురించి, కుటుంబ నిర్మాణాల గురించి, జీవన విధానాల గురించి నిర్ణయాలు తీసుకోమని కోరుతుంటాయి. ఏదైనప్పటికీ, అనేక సందర్భాలలో నిర్దిష్ట చందా చెల్లింపు పధకాల కన్నా ఇవి యజమానులకు ఎక్కువ విలువైనవి ( ముఖ్యంగా నిర్దిష్ట చెల్లింపు పధకంలో యజమాని ఎక్కువ చెల్లించవలసి ఉంటుంది) అందుచేత పై విమర్శా చాలా సత్య దూరమైనది.

నిర్దిష్ట ప్రయోజన పధక ఖరీదును సులభంగా లెక్కించలేము. ఇందుకు ఒక గణకుడు లేదా గణన సాఫ్ట్ వేర్ అవసరము. అయినప్పటికీ, అందుబాటులో ఉన్న మంచి పరికరాలతో నిర్దిష్ట ప్రయోజన పధకము వెలను ఆర్థిక స్వీకృతాలతో ఎల్లప్పుడూ అంచనా వేయగలము. ఈ స్వీకృతాలు సరాసరి పదవీ విరమణ వయస్సు మరియు ఉద్యోగస్తుల జీవన కాలము,పింఛను పధకము పెట్టుబడులపై సంపాదించే ప్రతిఫలాల ఆదాయము మరియు U.S. లోని పింఛను ప్రయోజన హామీ కార్పోరేషన్ వారు విధించే అదనపు పన్నులు లేదా లెవీలను కలిగి ఉంటాయి. ఒక నిష్ణాతునిచే రూపొందించబడిన ఈ అమరికలో ప్రయోజనాలకు రక్షణ ఉన్న చందా చెల్లింపులు మాత్రము అనిశ్చితంగానే ఉంటున్నాయి.

ఉదాహరణలు

ఉద్యోగుల జీతాల పట్టిక లేదా ఇతర పన్నుల ద్వారా నిధులు సమకూర్చబడేవే కాకుండా చాలా దేశాలు ప్రభుత్వ ప్రాయోజిత పదవీ విరమణ ప్రయోజనాలను అందిస్తున్నాయి. సంయుక్త రాష్ట్రాలలోని సామజిక భద్రతా వ్యవస్థ నిర్దిష్ట ప్రయోజన పింఛను ఏర్పాటు లాంటిదే అయినప్పటికీ, అందులో ఒకటి ప్రైవేటు యాజమాన్యం అందించే పింఛను కన్నా విభిన్నముగా ఏర్పాటు చేయబడింది.

UK లో పనిచేసి జాతీయ భీమాకు కొంత మొత్తం చెల్లింపులు చేసిన వ్యక్తులు తమ సాధారణ పదవీ విరమణ తరువాత రాజ్య పింఛను పధకము నుండి కొంత ఆదాయాన్ని ఆశిస్తుంటారు. రాజ్య పింఛను పధకము ప్రస్తుతము రెండు భాగాలుగా విడగొట్టబడింది. ప్రతిపాదిత రాజ్య పింఛను S2P అని పిలవబడే రాజ్య రెండవ (శ్రేణి) పింఛను పధకము. జాతీయ భీమాకు సరిపోయినన్ని సంవత్సరాలపాటు చెల్లింపులను వ్యక్తులు చేసి ఉన్నట్లయితే వారి ప్రాతిపదిక రాజ్య పింఛనుకు అర్హత పొందుతారు. S2P పింఛను పధకము సంపాదనతో సంబంధం కలిగి ఉంటుంది మరియు ప్రతి సంవత్సరము పొందే ఆదాయాలపై వ్యక్తి ఎంత మొత్తాన్ని పొందాలని ఆశిస్తాడో అనే దానిపై ఆధారపడి ఉంటుంది. వారి పని కాలంలో వారికి సరిపోయిన పింఛను పధకాన్ని ఎన్నుకొని దానిలో చెల్లింపులు చేసే విషయాన్ని బట్టి వ్యక్తులు రాజ్యము చెల్లించే S2P చెల్లింపులను ఎన్నుకునే అవకాశం ఉంటుంది. మరికొన్ని వివరాల కోసం UK పింఛను ఒడంబడికను చూడండి.

నిర్దిష్ట చందా చెల్లింపు పధకములు

నిర్దిష్ట చందా చెల్లింపు పధకములో చందాలు ప్రతి సభ్యుని యొక్క వ్యక్తిగత ఖాతాలలో జమచేయబడతాయి. ఈ చందాలు పెట్టుబడి పెట్టబడతాయి, ఉదాహరణకు స్టాక్ మార్కెట్లలో మరియు పెట్టుబడులపై వచ్చిన రాబడులు (లాభాలుగాని నష్టాలుగాని) వ్యక్తిగత ఖాతాలలో జమచేయబడతాయి. పదవీ విరమణ తరువాత ఆ సభ్యుని ఖాతాని పదవీ విరమణ ప్రయోజనాలను కల్పించుటకు ఉపయోగిస్తారు, కొన్నిసార్లు వార్షిక పింఛను కొనుగోలు ద్వారా క్రమమైన ఆదాయము కల్పించబడుతుంది. ఇటీవలి సంవత్సరాలలో నిర్దిష్ట చందా చెల్లింపు పధకములు ప్రపంచ వ్యాప్తంగా విస్తరించబడ్డాయి మరియు ప్రస్తుతము చాలా దేశాలలోని ప్రైవేటు సెక్టారులలో నిర్ణయాత్మక పధకాల రూపంలో ఉన్నాయి. ఉదాహరణకు US లోని నిర్దిష్ట ప్రయోజన పధకముల సంఖ్య క్రమముగా తగ్గుముఖం పడుతుంది. అనేకానేకమంది ఉద్యోగస్తులు పెద్ద మొత్తములో నిర్దిష్ట ప్రయోజన పధకము నుండి విడిపోయి, నిర్దిష్ట చందా చెల్లింపు పధకములను కోరుకుంటూ పింఛను చెల్లింపుల కొరకు చూస్తున్నారు.

నగదు చెల్లింపు అనేది ఉద్యోగి జీతము నుండి కొంత నిలుపుదల చేయటం ద్వారా కాని, యజమాని చందా ద్వారా గాని జరుగుతుంది. నిర్దిష్ట చందా చెల్లింపు పధకములోని చలనశీలత నిర్దిష్ట ప్రయోజన పధకములోని చలనశీలతతో చట్ట ప్రకారం ఏవిధమైన భేదాన్ని కలిగి ఉండదు. అయినప్పటికీ, నిర్దిష్ట చందా చెల్లింపు పధకములోని నిర్వహణ ఖర్చులు మరియు ప్రయోజితుని యొక్క సౌఖ్యవంతమైన నిర్ణయాత్మక జవాబుదారీతనము వలన వాడుకలో నిర్దిష్ట చందా చెల్లింపు పధకము సాధారణంగా ఎక్కువ చలనశీలతను కలిగి ఉంటున్నాయి.

నిర్దిష్ట చందా చెల్లింపు పధకములో పెట్టుబడి నష్టాలు, పెట్టుబడి ప్రయోజనాలను ప్రతి వ్యక్తి/ఉద్యోగి/విశ్రాంత ఉద్యోగి ఊహించుకోగలుగుతాడు. అంతేగాని ప్రయోజితుడు/యజమాని కాదు. దీనికి తోడుగా సభ్యుల వార్షిక పింఛనులను వారి పదవీ విరమణ నాటి పొదుపు నిధులతో కొనుగోలు చేయనవసరము లేదు మరియు భావి జీవితంలో స్థిరాస్తులపై వచ్చే నష్టాలను భరించవలసి ఉంటుంది. (ఉదాహరణకు యునైటెడ్ కింగ్డమ్ లో వార్షిక పింఛనులను ఏక మొత్తంగా కొనుటకు న్యాయపరమైన అనుమతులు తీసుకోవలసి ఉంటుంది.)

నిర్దిష్ట చందా చెల్లింపు పధకము యొక్క విలువను వెంటనే గణించగలము. కాని నిర్దిష్ట చందా చెల్లింపు పధకములోని ప్రయోజనాలు మాత్రము ఉద్యోగి తన స్థిరాస్తులను ఉపయోగించుకొనే సమయము నాటి ఖాతా నిల్వలపై ఆధారపడి ఉంటుంది. కనుక ఈ అమరికలో చందా చెల్లింపు తెలుస్తుంది కాని ప్రయోజనము మాత్రము తెలియదు (గణించే వరకు).

నిర్దిష్ట చందా చెల్లింపు పధకములో సభ్యునికి పెట్టుబడి నిర్ణయాలపై నియంత్రణ ఉన్నదనుట నిజమైనప్పటికీ, పధక ప్రయోజకుడు పెట్టుబడి ఎంపికపై మరియు నిర్వహణ జాగ్రత్తలతో పాటు గమనించదగ్గ స్థాయిలో ఆస్తుల పెట్టుబడి పధకాలపై ధన సంబంధమైన బాధ్యతలు కలిగి ఉంటాడు.

ఉదాహరణలు

సంయుక్త రాష్ట్రాలలో నిర్దిష్ట చందా చెల్లింపు పధకానికి న్యాయబద్ధమైన నిర్వచనమేమనగా, ప్రతి ఒక సభ్యునికి వ్యక్తిగత ఖాతా కలిగి ఉండి చందా చెల్లింపు వల్ల వచ్చే ప్రయోజనాలన్ని కేవలము ఆ ఖాతాకి చెల్లించబడుతూ ఆదాయాల నష్టాలు, లాభాలు, ఖర్చులు అన్ని ఆ ఖాతాకే చెంది ఉండడం (చూడుడుమూస:Uscsub). సంయుక్త రాష్ట్రాలలో నిర్దిష్ట చందా చెల్లింపు పధకాలకు ఉదాహరణలుగా వ్యక్తిగత పదవీ విరమణ ఖాతాలు (IRAs) మరియు 401 (k) పధకములు మొదలైనవి.

ఈ ఖాతాలలో, పదవీ విరమణ పధకాలకు కేటాయించిన నిధులను పెట్టుబడికి ఎటువంటి పధకాలను ఎన్నుకోవాలనే స్వేచ్ఛ కొంతవరకు లేదా మొత్తము బాధ్యత ఉద్యోగిపై ఉంటుంది. ముందుగా నిర్ణయించిన చిన్న చిన్నమ్యూచువల్ ఫండ్ల నుండి స్టాక్స్ లేదా ఇతర సెక్యూరిటీలను ఎంపిక చేసుకొనే వ్యాప్తిని కలిగి ఉంటుంది. స్వీయ నిర్వహణ పదవీ విరమణ పధకాలలో చాలావరకు పన్ను ప్రయోజన లక్షణాలను కలిగి ఉంటాయి మరియు కొన్ని యజమాని చెల్లించే చందా భాగంతో పోలికను కలిగి ఉంటాయి. కొంత అపరాధ రుసుము చెల్లించకుండా నిర్దిష్ట వయసు దాదాపు ఉద్యోగికి 59.5 సంవత్సరాల వయసు వచ్చువరకు స్టాక్ ఎక్సేంజ్ ల నుండి పధక నిధులను ముందుగా ఉపసంహరించుకొనే అవకాశం లేదు (కొన్ని మినహాయింపులకు లోబడి).

US లో నిర్దిష్ట చందా చెల్లింపు పధకాలన్నీ సెక్షన్ 415 పరిమితి అని పిలవబడే IRS షరతుల పరిధులకు లోబడి ఎంత మొత్తం చందా చెల్లించాలి అనేది ఉంటుంది. 2009లో ఉద్యోగులు జమ చేసిన చందా మరియు యజమానులు జమ చేసిన చందాలతో కలుపుకొని మొత్తము నిల్వ సొమ్ము $49,000 లు లేదా పరిహారంలో 100%లో ఏది తక్కువైతే దానికి పరిమితము చేయబడింది. యజమానుల యొక్క పరిమితి 2009లో $5,500 ల పెంపుదలకు అవకాశంతో $16,500 గా నిర్ణయించబడింది. ఈ సంఖ్యలు ద్రవ్యోల్బణ సూచి ప్రభావాలను సర్దుబాటు చేసే విధంగా ప్రతి సంవత్సరము పెంచబడుతూ ఉంటాయి.

మిశ్రిత మరియు నగదు నిల్వ పధకాలు

మిశ్రిత పధక నమూనా నిర్దిష్ట ప్రయోజన పధకము మరియు నిర్దిష్ట చందా చెల్లింపు పధక నమూనాల మిశ్రిత లక్షణాలను కలిగి ఉంటుంది.

నగదు శేష పధకము అనేది గణకులు (క్వష లిప్టన్, ఎవరైతే నగదు శేష పధకాన్ని చెప్పి సృష్టించారో అటువంటి) సూచనుల సహాయంతో యజమానులు తయారు చేసిన ఒక నిర్దిష్ట ప్రయోజన పధకము. ఇది నిర్దిష్ట చందా చెల్లింపు పధకము వలె కనపడుతుంది. ఇవి ఉహాత్మక ఖాతాలలో అవాస్తవ నిల్వ లను కలిగి ఉంటాయి. ఒక మోస్తరుగా ప్రతి సంవత్సరం ఈ పధక నిర్వాహకుడు ఖాతాదారుని యొక్క జీతంలో కొంత శాతముతో సమానమైన మొత్తాన్ని జమ చేస్తాడు. రెండవ జమ వడ్డీ జమగా పిలవబడుతుంది మరియు దానికదే సమకూరుతుంది. ఇవి వాస్తవ చందాలు కావు మరియు దీనిపై మరిన్ని చర్చలు ప్రారంభంలో సరిపోయిన పరిధి దాటి ప్రస్తుతము ఎక్కువగా భిన్నాభిప్రాయాలు వ్యక్తపరచుచున్నాయి. సాధారణంగా అవి పన్నుల కోసము, ఖాతాల కోసము మరియు నియంత్రణ ప్రయోజనాల కొరకు నిర్దిష్ట ప్రయోజన పధకముగా వ్యవహరించబడుతున్నాయి. నిర్దిష్ట ప్రయోజన పధకము వలె మిశ్రిత నమూనాలలో పెట్టుబడి నష్టాలు ఎక్కువగా పధక ప్రయోజకుడే భరించవలసి ఉంటుంది. నిర్దిష్ట చందా చెల్లింపు నమూనాలలో వలె పధక ప్రయోజనాలు, అవాస్తవ ఖాతా నిల్వలు అనే పదాలలో వ్యక్తపరుస్తూ ఉంటాయి మరియు సాధారణంగా ఉద్యోగ విరమణ నాటికి నగదు నిల్వల వలె చెల్లింపబడతాయి. ఈ లక్షణాలు సంప్రదాయక నిర్దిష్ట ప్రయోజన పధకముల కన్నా వాటికి ఎక్కువ చలనశీలతను కల్పిస్తున్నాయి మరియు చలన శ్రామిక శక్తి ఎక్కువగా గల వారిని బాగా ఆకర్షిస్తున్నాయి.

లక్షిత ప్రయోజన పధకములు అనేవి నిర్దిష్ట ప్రయోజన పధకములతో సరిపోయేటట్లు (లేదా పోలిన) తయారు చేయబడిన చందా చెల్లింపు పధకము.

విభిన్న రకాలైన పదవీ విరమణ పధకాలు

ప్రతి ఉద్యోగి తన పెట్టుబడి పధకాలను అతను లేదా ఆమె యొక్క వ్యక్తిగత అవసరాలు, ఆర్థిక పరిస్థితులపై ఆధారపడి ఎంత మొత్తం చందా చెల్లించాలో, ఏవిధంగా పెట్టుబడి పధకాలను సర్దుబాటు చేసే సామర్ధ్యాన్ని కలిగి ఉంటాడని నిర్దిష్ట చెల్లింపు పధకవాదులు ఎత్తి చూపుతుంటారు. ఏది ఏమైనప్పటికీ, స్పష్టమైన లాభాలు ఉన్నప్పటికీ, కొంత మంది శ్రామికులు కచ్చితమైన పెట్టుబడి వాహకాల ఎంపిక చేసుకోలేని స్థితి, స్వయంగా విరమణ నిధి కోసం డబ్బు చెల్లింపుల క్రమశిక్షణ కలిగి ఉండకపోవటం వంటి కనిపించని నష్టాలున్నాయి. చాలా మంది రిపబ్లికన్ నాయకులు సామజిక వ్యవస్థను కనీసం కొంత భాగమైనా స్వయం నిర్దేశిత పెట్టుబడి పధకంగా మార్చుటకు సుముఖులుగా ఉండటంతో ప్రస్తుతము U.S.లో దీనిపై జరుగుతున్న చర్చ కొంతవరకు సమాంతరీకరించబడింది.

పెట్టుబడి

పింఛనులో పెట్టుబడి పెట్టటానికి అనేక మార్గాలున్నాయి.

నిర్దిష్ట ప్రయోజన పధకము నిర్వచనం ప్రకారం అవి మూలధనాన్ని కలిగి ఉంటాయి. ఉద్యోగస్తులకు ఇచ్చే హామీ నిర్ణయించబడి ఉంటుంది. చందాలు వ్యక్తి యొక్క పని కాలమంతా తీసుకోబడతాయి.

చరిత్ర

జర్మనీ

ఆటో వాన్ బిస్మార్క్ యొక్క సామాజిక శాసనంలో భాగంగా, వృద్ధాప్య మరియు వికలాంగ బీమా బిల్లు 1889లో చట్టబద్దం అయింది. ఉద్యోగస్తులపైన విధించిన పన్ను ద్వారా ఆదాయాన్ని పొందిన, వృద్ధాప్య పింఛను పథకం, 65 సంవత్సరాల వయస్సు వచ్చిన ఉద్యోగస్తులకు వార్షిక పింఛను అందించే విధంగా రూపొందించబడింది. ఆ సమయంలో పర్షియన్ల యొక్క సగటు జీవిత కాలము కొన్ని సార్లు 45 సంవత్సరాలుగా ప్రతిపాదింపబడింది. నిజానికి ఈ సంఖ్య ఈ ప్రాంతములోని శిశు జననాల నుండి అత్యధికంగా ఉన్న శిశు మరణాలను మరియు తల్లుల మరణాల రేటును పట్టించుకోవటం లేదు. నిజానికి, బీమా పధకములోనికి ప్రవేశిస్తున్న ఒక వయోజనుని సగటు ఆయుర్దాయము 70 సంవత్సరములు. ఈ సంఖ్య గణకుల స్వీకృతాలలోను మరియు శాసనాలను కలిగి ఉంది.

సంయుక్త రాష్ట్రాలు

ప్రభుత్వ పింఛనులు వివిధ రకాల అనియిత మరియు శాసన ప్రమాణాలతో తిరుగుబాటు యుద్ధ మాజీలకు మరీ ఎక్కువగా అంతర్యుద్ధ మాజీలకు చెల్లించుటకు ప్రారంభించబడినవి. ఇవి బాగా గొప్పగా విస్తరించబడి అనేక రాష్ట్రాల మరియు స్థానిక ప్రభుత్వాలచే 19వ శతాబ్దపు మలికాలపు అభివృద్ధి శకములో ప్రారంభించబడినవి.

1920లో ప్రారంభించబడిన పౌర సేవల విరమణ పధకము (CSRS), ద్వారా సమాఖ్య పౌర పింఛనులు ప్రారంభించబడినవి. 1987లో కొత్త సమాఖ్య ఏజెన్సీ అయిన సమాఖ్య విరమణ పధకము (FERS), ప్రారంభించబడేటంత వరకు CSRS పదవీ విరమణ, వికలాంగ మరియు కుటుంబ పింఛనులను US సమాఖ్య ప్రభుత్వం చాలామంది పౌర ఉద్యోగులకు కల్పిస్తూ ఉంది.

2వ ప్రపంచ యుద్ధ కాలంలో పింఛను పధకాలు ఎక్కువ ప్రాచుర్యం పొందాయి. అప్పుడు శ్రామికుల జీతాలపై ఉన్న నిషేధం తొలగించబడి జీతాలు పెరిగాయి. 1980లలో నిర్దిష్ట ప్రయోజన పధకము, సంయుక్త రాష్ట్రాలలో బాగా ప్రాచుర్యం పొందిన సాధారణ తరగతి పదవీ విరమణ పధకము. అప్పటి నుండి నిర్దిష్ట చందా చెల్లింపు పధకములు సంయుక్త రాష్ట్రాలలో మరియు పాశ్చాత్య దేశాలలో సాధారణ తరగతి పదవీ విరమణ పధకాలుగా మారాయి.

ప్రస్తుత సవాళ్ళు

అనేక దేశాలలో వృద్ధ జనాభా అనేది ఒక పెరుగుతున్న సవాలు. జనన రేటు పడిపోవటం మరియు జీవన కాలం పెరగటం వల్ల జనాభాలో వృద్ధుల సంఖ్య అతి పెద్ద భాగమైంది. ఇది ప్రతి విశ్రాంత వ్యక్తికీ పనిచేసే శ్రామికులను కొంతమందిని మాత్రమే మిగులుస్తోంది. అంటే పింఛను వ్యవస్థలో మార్పులు లేదా పన్నులు పెంచటం చేయకపోతే, దాదాపు అన్ని అభివృద్ధి చెందిన దేశాలలోని ప్రభుత్వ మరియు ప్రభుత్వరంగ పింఛనుల ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలుతాయి. పదవీ విరమణ వయస్సును పెంచటం అనేది పింఛను వ్యవస్థలో ఒక రకమైన సంస్కరణ. ఆస్ట్రేలియా మరియు కెనడాలు దీనికి రెండు మినహాయింపులు. అక్కడ పింఛను వ్యవస్థ భవిష్యత్తులో ఏర్పడే చెల్లింపుల శేషాన్ని ముందు చూపుతో చెల్లింపగలది. ఉదాహరణకు కెనడాలో దీనిని ఎదుర్కోవటానికి 1998లో వార్షిక చెల్లింపులను 70% వరకు పెంచారు. వలసలను సాపేక్షంగా అనుమతించటం అనేది ఈ రెండు దేశాలకు ఉన్న మరొక ప్రయోజనం. అయినప్పటికీ, వాటి జనాభా U.S.లో వలె పెరగటం లేదు. కానీ పాశ్చాత్య దేశాలలో కెల్లా అత్యధిక జననరేటు కలిగి ఉండటం మరియు అధిక వలసలు దీనికి తోడవుతున్నాయి. కనుక U.S. జనాభాలో ఐరోపా, ఆస్ట్రేలియా, మరియు కెనడా లలో ఉన్నటువంటి వృద్ధత్వం కనబడుటలేదు.

సమాఖ్య ప్రభుత్వాలు ఖర్చులను నెట్టుకుని రావటానికి పింఛను పధకాల నిధులను మళ్లించటం సంయుక్త రాష్ట్రాలలోని రాజ్యాలలోను మరియు వ్యాపారాలను ప్రస్తుత కాలంలో ఉన్న మరొక సవాలు. ఉదాహరణకు 2009లో రాష్ట్రాలలో సింహభాగము వాటి రాష్ట్ర అప్పులను అధిగమించటానికి పింఛను ప్రయోజనాలను మళ్లించారు. PBGC మాజీ ఎజిక్యుటివ్ డైరెక్టర్ అయిన బ్రాడ్లీ బెల్ట్ (దివాలా తీసిన పరిస్థితులలో ప్రైవేటు సెక్టరుకు నిర్దిష్ట ప్రయోజన పింఛను పధకాలకు బీమా కలిగించే సమాఖ్య ఏజెన్సీ అయిన పింఛను ప్రయోజన హామీ కార్పోరేషన్) జనవాహిని ముందు అక్టోబరు 2004లో సాక్ష్యమిస్తూ, "నేను ప్రత్యేకంగా పింఛను భీమా నిధిని పన్నురహితంగా నష్ట భయములేని లోనుగా కంపెనీలు పునర్మించుటకు వీలుగా వాస్తవమైన పెరుగుదల వైఖరిపై ఊగిసలాడు ధోరణిని కలిగి ఉన్నాను. దురదృష్టవశాత్తు, ప్రస్తుత లెక్కింపు విధానము పింఛను బాధ్యతలను చివరి మజిలీ కన్నా తక్కువ నిరోధంతో ఇతర ప్రీమియం చెల్లింపుదారులపై లేదా ఎక్కువ పన్నుదారుల వైపు మరలుతోంది."

నగదు జమలు కటకటలాడటంతో ఈ సవాళ్ళు మరింతగా పెరిగిపోయాయి. దేశంలోని 100 అతి పెద్ద కార్పోరేట్ పింఛను పధకాల మొత్తము నిధులు 2007 చివరి నాటికి $86 బిలియన్ల మిగులుతో ఉన్న నిధులు 2008 చివరి నాటికి $217 బిలియన్ల లోటుతో $303 బిలియన్లకు చేరుకున్నాయి.[9]

== వివిధ దేశాలలో పింఛను వ్యవస్థలు ==

సామాజిక బీమా కోసము క్రింద పేర్కొన్న కొన్ని పధకాలను పరిగణలోనికి తీసుకోవచ్చు.

 • ఆస్ట్రేలియా
  • ఆస్ట్రేలియాలోని వృద్దాప్య పింఛను - ప్రైవేటు వృత్తిపరమైన పింఛనులు
  • సామాజిక భద్రత - పబ్లిక్ పింఛనులు
 • కెనడా
  • కెనడా పింఛను ప్రణాళిక

వయో వృద్ధులకు రక్షణ

  • క్యుబెక్ పింఛను ప్రణాళిక
  • పదవీ విరమణ పొదుపు పధకాల నమోదు
  • సస్కాట్చేవాన్ పింఛను పధకాలు
 • చైనా
  • హాంగ్ కాంగ్ - మండాటరీ ప్రావిడెంట్ ఫండ్
 • ఫిన్లాండ్ - కన్సానేలేక్ లైట్స్
 • భారత్ - ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా
 • మలేషియా - ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్
 • నెదర్లాండ్స్ - అల్జిమిన్ ఔదర్దోమ్స్ వెట్
 • న్యూజిలాండ్ - కివీ సేవర్
 • సింగపూర్ - సెంట్రల్ ప్రావిడెంట్ ఫండ్
 • స్వీడెన్ - సామాజిక భద్రత
 • యునైటెడ్ కింగ్‌డమ్
  • UK పింఛను ఒడంబడిక (సాధారణంగా)
  • స్వయం పెట్టుబడి గల వ్యక్తిగత పింఛనులు
 • అమెరికా సంయుక్త రాష్ట్రాలు
  • ప్రభుత్వ ఉద్యోగి పింఛనులు
  • సంయుక్త రాష్ట్రాలలోని పదవీ విరమణ పధకాలు
  • సాంఘిక భద్రత

మార్కెట్ నిర్మాణాలు

పింఛను నిధి యొక్క పెట్టుబడుల మార్కెట్ ఇంకా U.K. మరియు U.S ఆర్థిక వ్యవస్థ చుట్టూ కేంద్రీకృతమై ఉంది. జపాన్ మరియు EU ల వైఫల్యం స్పష్టంగా కనబడుతోంది. 2005లో పింఛను నిధి పెట్టుబడుల మార్కెట్లో U.S.ప్రథమ స్థానంలో UK. తర్వాతి స్థానంలో ఉన్నాయి.

ఇటీవలి సంవత్సరాలలో పింఛను సంస్కరణలు ప్రపంచవ్యాప్తంగా ఊపందుకున్నాయి మరియు పదవీ విరమణ సెక్యూరిటీ ఆదాయాలను పంపిణి చేయటంలో మరియు రాబోయే సంవత్సరాలలో సెక్యూరిటీ మార్కెట్లను ప్రభావితం చేయటంలో పింఛను నిధి ఏర్పాట్లు ముఖ్య పాత్ర పోషిస్తున్నాయి.

వీటిని కూడా చూడండి

 • పెద్దల సంరక్షణ
 • ఆర్థిక సలహాదారు మరియు ఫీజు మాత్రమే పుచ్చుకునే ఆర్థిక సలహాదారు
 • జనరేషనల్ అకౌంటింగ్
 • పింఛనుల సంక్షోభం
 • పింఛను వ్యవస్థ
 • ప్రభుత్వ ఋణం

ప్రత్యేకించి

 • రోత్ 401 (k)
 • బాంక్ రప్ట్సీ కోడ్
 • ఇన్డివిడువల్ పెన్షన్ ప్లాన్ (IPP)
 • యునివర్సిటిస్ సూపర్ యాన్యుయేషన్ స్కీం
 • ప్రావిడెంట్ ఫండ్

సూచనలు

 1. Princeton WordNet, http://wordnetweb.princeton.edu/perl/webwn?s=pension, viewed 24 December 2008
 2. Princeton WordNet, http://wordnetweb.princeton.edu/perl/webwn?s=superannuation, viewed 24 December 2008
 3. "Industry SuperFunds - Home". Industrysuper.com. Retrieved 2010-09-17.
 4. "Private Pensions/Les pensions privées" (PDF). Retrieved 2010-09-17.
 5. "The Pensions Advisory Service". The Pensions Advisory Service. Retrieved 2010-09-17.
 6. Early Retirement Provisions in Defined Benefit Pension Plans. Ann C. Foster http://www.bls.gov/opub/cwc/archive/winter1996art3.pdf
 7. Qualified Domestic Relations Order Handbook By Gary A. Shulman p.199-200 Published by: Aspen Publishers Online, 1999 ISBN 0735506655, ISBN 9780735506657
 8. "Unfunded Pension Plans" OECD Glossary of Statistical Terms . సేకరణ తేదీ: జనవరి 8, 2009.
 9. Largest U.S. pension plans' assets fall $217 billion short, http://www.usatoday.com/money/perfi/retirement/2009-03-11-pension-plan-assets-short_N.htm, USA Today, citing a report by Watson Wyatt, 10 March 2009.

బాహ్య లింకులు