"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

పిలకా గణపతిశాస్త్రి

From tewiki
Jump to navigation Jump to search

పిలకా గణపతి శాస్త్రి ( జ:ఫిబ్రవరి 24, 1911 - మ:జనవరి 2, 1983) కవి, వ్యాఖ్యాత, నవలా రచయిత, అనువాదకుడు, ఆర్ష విద్వాంసుడు, పత్రికా సంపాదకుడు.

జననం

1911, ఫిబ్రవరి 24తూర్పు గోదావరి జిల్లా కట్టుంగ గ్రామంలో జన్మించాడు. విజయనగరం సంస్కృత కళాశాలలో సాహితీ విద్యా ప్రవీణ పట్టా పొందాడు. ఆయన రాజమహేంద్రవరం ఆంధ్ర యువతీ సంస్కృత పాఠశాలలోను, వీరేశలింగం పాఠశాలలోను తెలుగు పండితుడుగా పనిచేశాడు. కవిగా, వ్యాఖ్యాతగా, నవలా రచయితగా, అనువాదకునిగా, ఆర్ష విద్వాంసుడుగా పత్రికా సంపాదకుడుగా విశేష ఖ్యాతి పొందాడు. పిలకా గణపతి శాస్త్రి ఆంధ్ర శిల్పి, ఆంధ్రభారతి, ఆంధ్రప్రభ వంటి పత్రికలకు సహాయ సంపాదకుడుగా పనిచేశాడు.

మరణం

గణపతి శాస్త్రిగారు జనవరి 2, 1983 లో మరణించారు. [[permanent dead link]]

రచనలు

నవలలు

  • విశాల నేత్రాలు (ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడెమీ బహుమతి)
  • హేమపాత్ర - విప్రనారాయణ కథ ఆధారంగా
  • అశోకవర్ధనుడు - అశోక చక్రవర్తి కథ
  • మీనాంబిక
  • కాశ్మీర పట్టమహిషి
  • గృహిణి - నాటకరంగం నేపథ్యంలో నటీనటుల సంబంధాలు-దాంపత్య జీవితంపై వాటి ప్రభావాలు చిత్రీకరిస్తూ వ్రాయబడిన పెద్ద నవల. ఈ నవలను తన అర్ధాంగి శ్యామలకు అంకితమిచ్చాడు.
  • [[ప్రాచీన గాథాలహర

వచనానువాదాలు

  • వ్యాసభారతం
  • హరివంశం
  • దేవీ భాగవతం
  • గృహ దహనం - శరత్‌బాబు బెంగాలీ నవల
  • రెడ్ లిల్లీ - అనటోల్ ఫ్రాన్స్

ఖండకావ్యాలు

  • విభ్రాంతామరుకము
  • రత్నోపహారం

మూలాలు

  1. http://www.andhrabhoomi.net/sahiti/sahi-402[permanent dead link]
  2. తెలుగు రథం[permanent dead link]
  3. పిలకా గణపతిశాస్త్రిగారి ప్రాచీన గాథాలహరి, ఇతర కథలు
  4. ప్రాచీన గాథాలహరిమీద నిడదవోలు మాలతి వ్యాసం

Lua error in మాడ్యూల్:Authority_control at line 369: attempt to index field 'wikibase' (a nil value).