పి.వి.రాంప్రసాద్ రెడ్డి

From tewiki
Jump to navigation Jump to search

పెనక వెంకట రాంప్రసాద్ రెడ్డి భారతీయ వ్యాపారవేత్త, అరబిందో ఫార్మాకు సహ వ్యవస్థాపకుడు.[1][2]

జీవిత విశేషాలు

అతను తన సోదరుడితో కలిసి అరబిందో ఫార్మా కంపెనీని స్థాపించాడు. 2011 లో ఉత్పాదక లోపాల కోసం విధించిన యుఎస్ ఎఫ్.డి.ఏ దిగుమతిపై నిషేధం ఎత్తివేసిన తరువాత అతని వాటాలు గణనీయంగా పెరిగాయి. అరబిందో అమ్మకాలు పెరిగాయి, ఇది ఐరోపాలో కూడా విస్తరిస్తోంది.[3]

2012 డిసెంబర్ 1 నుండి అతను అరబిందో ఫార్మా USA INC కు ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా ఉన్నాడు. అరోబిందో ఫార్మా లిమిటెడ్‌లో 2012, జూన్ 1 నుండి ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా కూడా పనిచేశాడు. అరబిందో ఫార్మా లిమిటెడ్ నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా అతను తన సేవలను అందించాడు. అరబిందో ఫార్మా లిమిటెడ్‌కు అనుబంధ సంస్థలైన ఎపిఎల్ ఫార్మా థాయ్ లిమిటెడ్, ది ఎపిఎల్ హోల్డింగ్స్ INC, అరబిందో టోంగ్లింగ్ (డాటాంగ్), అరబిందో (డాటాంగ్) బయో ఫార్మా కో లిమిటెడ్ లకు డైరెక్టర్ గా ఉన్నాడు. 1986 లో అతను అరబిందో ఫార్మాలో చేరాడు. అరబిందో ఫార్మా లిమిటెడ్‌లో హోల్‌టైమ్ డైరెక్టర్‌గా కూడా పనిచేశాడు.

బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ నివేదికల ప్రకారం తన భార్య సునీలా రాణితో కలిసి, రెడ్డి అరబిందో ఫార్మాలో ముప్పై ఎనిమిది శాతం నియంత్రిస్తాడు.

2016 లో ఫోర్బ్స్ సంస్థ విడుదల చేసిన సంపన్నుల జాబితాలో అతను భారతదేశంలో 27వ, ప్రపంచంలో 688 వ వ్యక్తి. అప్పటికి అతని నికర ఆదాయం US$2.5 బిలియన్లు.[4][4][5][6] ప్రపంచ ఫార్మాస్యూటికల్ ఫ్రాంటియర్స్ 2008 లోఔషధ పరిశ్రమలో ముప్పై ఐదు మంది ప్రభావవంతమైన వ్యక్తులలో ఒకరిగా అతనిని ప్రకటించారు.

పెన్సిలిన్ ఉత్పత్తిలో ప్రపంచ స్థాయిలో అయిదు కంపెనీలలో ఒకటిగా నిలిచింది. ఇద్దరు పిల్లలు.

మూలాలు

  1. "The Hidden Pharma Billionaires". Business Today. 5 July 2015.
  2. "Penaka Venkata Ramaprasad Reddy-Co-founder of AurobindoPharma Ltd -" (in English). 2015-08-19. Archived from the original on 2020-07-12. Retrieved 2020-07-12.
  3. successstory.com https://successstory.com/people/pv-ramprasad-reddy. Retrieved 2020-07-12. Missing or empty |title= (help)
  4. 4.0 4.1 "The World's Billionaires – India". Forbes. Retrieved 7 September 2016.
  5. "2015 rankings". Forbes. Retrieved 7 September 2016.
  6. "Aurobindo Pharma founder P.V. Ramaprasad Reddy becomes billionaire". Livemint. 28 May 2014.