పి.సి.సర్కార్

From tewiki
Jump to navigation Jump to search
Protul Chandra Sorcar
ప్రోతుల్ చంద్ర సర్కార్
200px
పి.సి.సర్కార్
జననం(1913-02-23)1913 ఫిబ్రవరి 23
మరణం1971 జనవరి 6(1971-01-06) (వయస్సు 57)
Ashaikawa, Hokkaidō, Japan
వృత్తిఇంద్రజాలికుడు
జీవిత భాగస్వాములుబసంతి దేవి

పి.సి.సర్కార్ (P. C. Sorcar) (జ: ఫిబ్రవరి 23, 1913 - మ: జనవరి 6, 1971) గా పిలువబడే ప్రొతుల్ చంద్ర సర్కార్ గొప్ప భారతీయ ఐంద్రజాలికుడు. దేశవిదేశాల్లో లెక్కలేనన్ని ఇంద్రజాల ప్రదర్శనల నిచ్చాడు. అతనికి ముగ్గురు కుమారులు. మానిక్ సర్కార్, దర్శకుడు, ఎనిమేటర్, లేసర్ నిపుణుడు. పి.సి.సర్కార్ జూనియర్, పి.సి.సర్కార్ యంగ్లు ఇంద్రజాలికులు.

బాల్యం, ఇంద్రజాలం

సర్కార్ బెంగాల్ (ఇప్పుడు బంగ్లాదేశ్‌లో ఉంది) లోని తంగైల్ జిల్లా, ఆశిక్‌పూర్‍లో జన్మించాడు. శివనాథ్ ఉన్నత పాఠశాల‌లో చదివాడు. తన తొలి ఇంద్రజాల పాఠాలు, ఇంద్రజాలికుడు గణపతి చక్రవర్తి నుండి నేర్చుకొన్నాడు. 1930 దశకం నుండి కోల్‌కతా, జపాను, ఇతర దేశాలలో ప్రదర్శనల కీర్తిని గడించాడు. తన 58 వ ఏట, జపాన్లో ఇంద్రజాల ప్రదర్శన యిస్తుండగా, గుండెపోటుతో మరణించాడు.

చందమామలో 1950-1960లలో ఇంద్రజాలంగురించి వ్రాసేవారు. ఇంద్రజాలం ఆధారంగా నెల నెలా కథలు వెలువడేవి. పి.సి.సర్కార్ జూనియర్త న తండ్రి గురించి ఇలా అన్నారు. :"మా నాన్నగారు ఇంద్రజాలాన్ని ఆషామాషీగా కాకుండా , నూటికి నూరుపాళ్ళు ఆ కార్యక్రమానికి న్యాయం చేసేవారు. ప్రతి ప్రదర్శన ముందు మా ఇంట్లో తన అసిస్టెంట్లచేత రిహార్సల్స్ చేసేవారు. చాటుగా ఆ రిహర్సల్సు చూసే నాకు మాజిక్ పై ఆసక్తి పెరిగింది." సర్కారు తన కుమారుడితో మాజిక్ నేర్చుకో, కానీ చదువును మాత్రం ఎప్పుడూ అశ్రర్ధ చేయవద్దని చెప్పేవారట. తండ్రి మాటపై సర్కార్ కోల్‌కతా విశ్వవిద్యాలయంలో కెమిస్ట్రీతో బాటు సైకాలజీలో కూడా డిగ్రీ చేశారు. సంస్కృతంతో బాటు ఇతర భాషలలో కూడా సర్కార్ ప్రావీణ్యం సంపాదించారు. పన్నెండేళ్ళ వయసులోనే డార్జీలింగ్ వెళ్ళి మాజిక్ ప్రదర్శన ఇచ్చాడు. మాజిక్ నేర్చుకొంటే కొంతే వస్తుంది. మన ఆలోచనలను ఎప్పటికప్పుడు జోడించి అభివృద్ధి చేసుకోవాలని అంటారు పి.సీ.సర్కార్. 1992లో లేజర్ పక్రియతో ఆయన రైలునే మాయం చేసినట్లు భ్రమ కలిగించారు. ఏడాదికి 400 పైగా ప్రదర్శనలు ఇచ్చే సర్కార్ మాజిక్ లోని రహస్యాలు తెలిసిపొతే ప్రదర్శన రక్తి కట్టదు అంటారు.. సర్కార్ కుమార్తె మేనక ఓహియో యూనివర్సిటీలో ఎంబిఎ పూర్తి చేసి తండ్రితో మాజిక్ ప్రదర్శనలిస్తున్నది

అవార్డులు, పురస్కారాలు

  • 1. భారత ప్రభుత్వం కోల్‌కతాలోని ఒక పెద్ద వీధికి, జాదు సమ్రాట్ పి.సి.సర్కార్ సారణి అని నామకరణం చేసి, అతనిని సమ్మానించింది.
  • 2. పి.సి.సర్కార్ 1964లో, భారత రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డును అందుకొన్నాడు.
  • 3. ద స్ఫింక్స్ ( ఆస్కర్ ఆఫ్ మ్యాజిక్ ) - యు.ఎస్.ఎ., 1964, 1954.
  • 4. ద గోల్డెన్ లారెల్ - జర్మనీ దేశం, 1956
  • 5. ద రాయల్ మెడలియన్ - జర్మన్ మ్యాజిక్ సర్కిల్.

ఇవి కూడా చూడండి

మూలాలు

బయటి లింకులు

  • [1] పి.సి.సర్కార్ అంతర్జాతీయ గ్రంథాలయం
  • [2] పి.సి.సర్కార్ బంగ్లాపీడియా
  • [3] భారత మెజీషియన్ల వెబ్‌సైట్
  • Postage Stamp on P.C. Sorcar Issued (The Hindu, 2010)

వంశవృక్షం