పి. వి. రమణ (నాటక రచయిత)

From tewiki
Jump to navigation Jump to search
పి.వి. రమణ
దస్త్రం:PV Ramana.jpg
జననంఆగష్టు 15, 1939
మరణంజనవరి 27, 2004
జాతీయతభారతీయుడు
వృత్తినాటక రచయిత, పరిశోధకుడు, సమీక్షకుడు, న్యాయ నిర్ణేత, నాటకరంగ అధ్యాపకుడు

పి.వి. రమణ (ఆగష్టు 15, 1939 - జనవరి 27, 2004) ప్రముఖ నాటక రచయిత, పరిశోధకుడు, సమీక్షకుడు, న్యాయ నిర్ణేత, నాటకరంగ అధ్యాపకుడు. ఆధునిక తెలుగు నాటకరంగం గురించి సాధికారికంగా, సమగ్రంగా విశ్లేషించగలిగినవారిలో ఒకరైన రమణ తెలుగు సాంఘిక నాటకం అనే అంశంపై ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పరిశోధన చేసి డాక్టరేట్ పొందాడు.[1]

జననం

రమణ 1939, ఆగష్టు 15న సికింద్రాబాద్లో జన్మించాడు.

రంగస్థల ప్రస్థానం

1953లో పల్లెపడుచు నాటకంలోని కామేశం పాత్ర ద్వారా నటుడిగా రంగ ప్రవేశం చేసిన రమణ అనేక నాటకాలలో ప్రధాన పాత్రలలో నటించాడు.

నటించినవి

 1. ఆకాశరామన్న
 2. కీర్తిశేషులు
 3. మాస్టర్జీ
 4. దొంగవీరడు
 5. ఇదా ప్రపంచం
 6. బి.ఎ. ఫస్ట్ క్లాస్
 7. ఎన్.జి.ఓ.
 8. మానవుడు

రచించినవి

 1. ఆకురాలిన వసంతం
 2. వెంటాడే నీడలు
 3. దేవతలెత్తిన పడగ
 4. చలిచీమలు
 5. మహావీర కర్ణ
 6. ప్రతాపరుద్ర
 7. మహాస్సు
 8. మానవతకూ నిండాయి నూరేళు
 9. లోలకం
 10. మృత్యునీడ
 11. కళ్యాణమే ఒక కానుక
 12. ప్రేమ పోరాటం
 13. గురువుగారూ మన్నించండి

ఇతర రచనలు

గ్రంథాలు:

 1. తెలుగు సాంఘిక నాటకం - పాశ్చాత్య నాటక ప్రభావం
 2. ప్రపంచ నాటకరంగం, ద్రవిడ నాటక రచనలు - సారూప్యాలు,
 3. తెలుగు నాటకం-వస్తు వైవిధ్యం,
 4. ప్రపంచ నాటకరంగం - తెలుగు నాటకం-తులనాత్మక పరిశీలన

వ్యాసాలు:

 1. ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమి, ఆంధ్రప్రదేశ్ నాటక అకాడమీ ప్రచురించిన ప్రత్యేక సంచికలకు పరిశోధనాత్మక వ్యాసాలు, వివిధ పత్రికలకు ప్రత్యేక సంచికలకు 200కు పైగా నాటకరంగంపై వ్యాసాలు రాశాడు
 2. 1991లో మధురైలో జరిగిన దక్షిణ భారతదేశ నాటకరంగ సదస్సులో తెలుగు నాటక ప్రతినిధిగా పాల్గొని పత్ర సమర్పణ చేశాడు
 3. 1989లో ఆకాశవాణి, విజయవాడ కేంద్రం నిర్వహించిన అఖిల భారతస్థాయి నాటక రచనల పోటీలకు, ఆటా నిర్వహించిన నాటక రచనల పోటీలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించే నంది నాటకాలకు న్యాయనిర్దేతగా వ్యవహరించాడు
 4. ఆధునిక నాటకరంగ తీరుతెన్నులపై ఆకాశవాణి, దూరదర్శన్ కేంద్రాల ద్వారా ప్రసంగాలు చేశాడు

పదవులు

 1. ఖమ్మం జిల్లా బయ్యారం లో తెలుగు అధ్యాపకుడుగా, ప్రధానోపాధ్యాయుడిగా పనిచేశాడు.
 2. తెలుగు విశ్వవిద్యాలయం రంగస్థల కళలశాఖ అధిపతిగా పనిచేశాడు.

పురస్కారాలు

 1. 1991-1992లో రాష్ట్ర ప్రభుత్వ ఉత్తమ అధ్యాపక పురస్కారం పొందాడు
 2. 1993లో తెలుగు విశ్వవిద్యాలయం ఉత్తమ నాటక రచయిత పురస్కారం అందుకున్నాడు
 3. 1997లో మద్రాస్ తెలుగు అకాడమీ ఉగాది పురస్కారం పొందాడు
 4. జవ్వాది కల్చరల్ ట్రస్ట్ (నిడదవోలు) ఉత్తమ నాటక విమర్శకుడు పురస్కారంతోపాటు నాటక శిరోమణి, నాటకరంగ కరదీపిక వంటి బిరుదులు

మరణం

దాదాపు 50కిపైగా కథలు వివిధ వార, మాసపత్రికలో ప్రచురించిన పి.వి.రమణ 2004, జనవరి 27 న మరణించాడు.

మూలాలు

 1. నాటక విజ్ఞాన సర్వస్వం, తెలుగు విశ్వవిద్యాలయం కొమర్రాజు వెంకట లక్ష్మణరావు విజ్ఞాన సర్వస్వం కేంద్ర ప్రచురణ, హైదరాబాదు, 2008, పుట.485.