"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

పుల్లెల గోపీచంద్

From tewiki
Jump to navigation Jump to search
The National Coach, Indian Badminton Team, Shri Pullela Gopichand calls on the Prime Minister, Shri Narendra Modi, in New Delhi on May 02, 2016.jpg
పుల్లెల గోపీచంద్
వ్యక్తిగత సమాచారం
జననం (1973-11-16) 16 నవంబరు 1973 (వయస్సు 47)
నాగండ్ల
ప్రకాశం జిల్లా
ఆంధ్రప్రదేశ్
ఎత్తు1.88 మీ. (6 అ. 2 in)
బరువు74kg
దేశం భారతదేశం India
వాటంకుడి చేయి
పురుషుల సింగిల్స్
అత్యున్నత స్థానం5[1] (15 మార్చి 2001)
BWF profile

1973 నవంబర్ 16ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లా, నాగండ్లలో జన్మించిన పుల్లెల గోపీచంద్ (Pullela Gopichand) భారతదేశపు బ్యాడ్మింటన్ క్రీడాకారుడు. 2001లో చైనాకు చెందిన చెన్‌హాంగ్ ను ఓడించి ఆల్ ఇంగ్లాండ్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ గెల్చి ఈ ఘనతను సాధించిన రెండో భారతీయుడిగా నిల్చాడు. ఇంతకు పూర్వం 1980లో ఈ ఘనతను ప్రకాష్ పడుకోనె సాధించాడు. గోపీచంద్ సాధించిన అపురూప విజయానికి గుర్తింపుగా 1999లో అర్జున పురస్కారము, 2000-01 లో రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు లభించాయి. కాని ఆ తర్వాత దురదృష్టవశాత్తు తను గాయపడడంతో 2003లో అతని స్థానం 126 కు పడిపోయింది. 2005లో భారత ప్రభుత్వం అతనికి పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. ప్రస్తుతం గోపీచంద్ పుల్లెల్ల గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీని నిర్వహిస్తున్నారు. శిష్యురాలు సైనా నెహ్వాల్ బ్యాడ్మింటన్ రంగములో తన ప్రతిభను చాటుతున్నది.

జులై 29, 2009న భారత ప్రభుత్వం గోపీచంద్ కు "ద్రోణాచార్య పురస్కారము" ప్రకటించింది. 2014లో ఈయనకు ప్రతిష్ఠాత్మక పద్మభూషణ్ అవార్డు లభించింది.

మూలాలు

  1. "Historical Ranking". Badminton World Federation. Retrieved 7 February 2010.[permanent dead link]

బయటి లింకులు

Lua error in మాడ్యూల్:Authority_control at line 369: attempt to index field 'wikibase' (a nil value).