"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

పూనూరు

From tewiki
Jump to navigation Jump to search

మూస:Infobox India AP Village

పూనూరు, ప్రకాశం జిల్లా, యద్దనపూడి మండలానికి చెందిన గ్రామం. పిన్ కోడ్: 523 169., ఎస్.టి.డి.కోడ్ = 08594.[1]

Lua error in మాడ్యూల్:Mapframe at line 597: attempt to index field 'wikibase' (a nil value).

సమీప గ్రామాలు

గన్నవరం 4 కి.మీ, ఇడుపులపాడు 4 కి.మీ, తనుబొద్దివారిపాలెం 4 కి.మీ, చిమటావారిపాలెం 4 కి.మీ, ద్రోణాదుల 5 కి.మీ.

సమీప మండలాలు

పశ్చిమాన మార్టూరు మండలం, తూర్పున పరుచూరు మండలం, దక్షణాన ఇంకొల్లు మండలం, దక్షణాన జే.పంగులూరు మండలం.

గ్రామానికి రవాణా సౌకర్యాలు

  1. గుంటూరు జిల్లా చిలకలూరిపేట పట్టణం నుండి మండలంలోని ముఖ్య గ్రామాలైన అనంతవరము, యనమదల, యద్దనపూడి, గన్నవరం లను కలుపుతూ పూనూరుకు ఆర్.టీ.సీ.బస్సు ఉంది.
  2. గుంటూరు నుండి పర్చూరు, నూతలపాడు, చింతగుంటపాలెంలను కలుపుతూ పూనూరుకు ఆర్.టీ.సీ బస్సు ఉంది.

గ్రామంలో మౌలిక వసతులు

  1. ఇక్కడ తపాళా కార్యాలయం, టెలిఫోన్ ఎక్సేంజి ఉన్నాయి. ఇక్కడ గవర్నమెంట్ హొమియోపతి డిస్పెన్సరీతో బాటు ఆంధ్రా బ్యాంక్ కూడా ఉన్నాయి.

గ్రామానికి వ్యవసాయం, సాగునీటి సౌకర్యం

నాగార్జున సాగర్ కాలువ ద్వారా సాగు నీటి వసతి కలిగిన ఈగ్రామంలో ఎక్కువశాతం నల్లరేగడి నేలలు. సుమారు 5300 ఎకరాల పంట పొలాలలో 1000 ఎకరాలవరకు మాగాణి. మెట్టపొలాలలో మినుము, శనగ, మొక్కజొన్న, మిరప, జూటు, ప్రత్తి ముఖ్యమైన పంటలు. ఇటీవల కొద్ది విస్తీర్ణంలో కూరగాయలను కూడా పండిస్తున్నారు.

గ్రామంలో ప్రధాన వృత్తులు

వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు

గ్రామములోని ఈ అలాయాలు 14వ శతాబ్దం నాటివి.

శ్రీ వేణుగోపాలస్వామివారి ఆలయం

ఈ ఆలయంలో, స్వామివారి ఊరేగింపుకై, 30 అడుగుల ఎత్తయిన రథం తయారు చేయించారు వేదపండితుల ఆధ్వర్యంలో, శాంతిహోమం నిర్వహించారు.

శ్రీ రామకృష్ణ ధ్యానమందిరము

శ్రీ రామకృష్ణ ధ్యానమందిరము ఇక్కడ ప్రత్యేక ఆకర్షణ. ఇది చెరువు మధ్య ఉన్న చిన్న దీవిలో నిర్మించబడి కన్యాకుమారిలోని వివేకానంద రాక్ మెమోరియల్ ను గుర్తుకు తెస్తుంది.

గణాంకాలు

2001 వ .సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 6,038.[2] ఇందులో పురుషుల సంఖ్య 2,976, మహిళల సంఖ్య 3,062, గ్రామంలో నివాస గృహాలు 1,564 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 1,996 హెక్టారులు.

జనాభా (2011) - మొత్తం 6,047 - పురుషుల సంఖ్య 2,918 -స్త్రీల సంఖ్య 3,129 - గృహాల సంఖ్య 1,735

మూలాలు