"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

పూసలపాడు (బెస్తవారిపేట)

From tewiki
Jump to navigation Jump to search

మూస:Infobox India AP Village

పూసలపాడు, ప్రకాశం జిల్లా, బెస్తవారిపేట మండలానికి చెందిన గ్రామం.[1] పిన్ కోడ్:523 334. ఎస్.టి.డి.కోడ్:08406.

గ్రామచరిత్ర

Lua error in మాడ్యూల్:Mapframe at line 597: attempt to index field 'wikibase' (a nil value).

గ్రామ భౌగోళికం

ఈ గ్రామం బెస్తవారిపేట నుండి సుమారు 6 కిలోమీటర్ల దూరంలో ఉంది.

సమీప గ్రామాలు

సోమిదేవిపల్లి 3 కి.మీ, మోక్షగుండం 4 కి.మీ, పిట్టికాయగుళ్ల 6 కి.మీ, నేకనాంబాదు 7 కి.మీ, దర్గా 8 కి.మీ.

సమీప మండలాలు

ఉత్తరాన కంభం మండలం, పడమరన రాచర్ల మండలం, పడమరన గిద్దలూరు మండలం, దక్షణాన కొమరోలు మండలం.

గ్రామంలో విద్యా సౌకర్యాలు

  1. జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల.
  2. మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాల.

ప్రభుత్వ వైద్య సౌకర్యం

ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రం.

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు

ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం, శ్రీరామనవమికి శ్రీ సీతారాముల కళ్యాణం వైభవంగా నిర్వహించెదరు. ఈ సందర్భంగా గ్రామంలో ఎడ్ల బలప్రదర్శన పోటీలు నిర్వహించి, గెలుపొందిన ఎడ్ల యజమానులకు బహుమతులు అందజేస్తారు.

శ్రీ పెద్దమ్మ దేవస్థానం

ఈ గ్రామంలో నూతనంగా శ్రీ పెద్దమ్మ దేవస్థానం నిర్మాణం పూర్తయినది.

శ్రీ ఆంజనేయస్వామివారి ఆలయం

పూసలపాడు బస్సుస్టాండువద్ద, నూతనంగా నిర్మించిన ఈ ఆలయ ప్రతిష్ఠా మహోత్సవాలలో భాగంగా, ఆలయంలో పూజలు నిర్వహించారు. గణపతి, విగ్రహపూజలు, జలాధివాసం, సుందరకాండ పారాయణం, పుష్పాధివాసం తదితర పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారి గ్రామోత్సవం నిర్వహించారు. మద్యాహ్నం విచ్చేసిన భక్తులకు అన్నదానం నిర్వహించారు.

శ్రీ పోలేరమ్మ తల్లి ఆలయం

ఈ ఆలయంలో అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవం నిర్వహించినారు. దేవతామూర్తుల విగ్రహాల వద్ద గణపతి పూజ, జలాధివాసం, హోమాలు, ధాన్యాదివాసం చేపట్టినారు. అనంతరం వేద మంత్రోచ్ఛారణల మధ్య మేళతాళాలతో అంగరంగ వైభవంగా పోలేరమ్మ, పోతురాజుల విగ్రహాలను ప్రతిష్ఠించినారు. ఈ సందర్భంగా అమ్మవారి దర్శనం కోసం వచ్చిన భక్తులతో ఆలయం క్రిక్కిరిసి పోయినది. అలయ కమిటీ, గ్రామపెద్దల ఆధ్వర్యంలొ అన్నప్రసాద వితరణ నిర్వహించినారు.

శ్రీ మడియాలస్వామివారి ఆలయం

పూసలపాడులో మడియాలస్వామి తిరునాళ్ళు, నిర్వహించారు. భక్తులు బోనాలు, కుంకుమబండ్లు కట్టినారు. గ్రామంలో ఊరేగింపు నిర్వహించారు. అనంతరం బస్సుస్టాండు సమీపంలోని ఆలయం వద్ద స్వామికి విశేషపూజలు నిర్వహించారు. పంచామృతాభిషేకాలు, అభిషేకాలు కుంకుమార్చనలు నిర్వహించారు.

గణాంకాలు

జనాభా (2011) - మొత్తం 5,466 - పురుషుల సంఖ్య 2,852 - స్త్రీల సంఖ్య 2,614 - గృహాల సంఖ్య 1,402;

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 5,794.[2] ఇందులో పురుషుల సంఖ్య 3,009, మహిళల సంఖ్య 2,785, గ్రామంలో నివాస గృహాలు 1,269 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 2,512 హెక్టారులు.

మూలాలు

వెలుపలి లంకెలు

  • గ్రామం గణాంకాల వివరణకు ఇక్కడ చూడండి.[1]