పృథ్వీ వెంకటేశ్వరరావు

From tewiki
Jump to navigation Jump to search
పృథ్వీ వెంకటేశ్వరరావు
దస్త్రం:Prudvi VenkateshwaraRao.jpg
జననంమే 10, 1928
మరణంమార్చి 22, 2008
జాతీయతభారతీయుడు
వృత్తిరంగస్థల నటుడు
తల్లిదండ్రులుకోటి నాగేశ్వరరావు, రత్తమ్మ

పృథ్వీ వెంకటేశ్వరరావు (మే 10, 1928 - మార్చి 22, 2008) ప్రముఖ రంగస్థల నటుడు.[1]

జననం - ఉద్యోగం

వెంకటేశ్వరరావు 1928, మే 10న కోటి నాగేశ్వరరావు, రత్తమ్మ దంపతులకు ప్రకాశం జిల్లా, చీరాల మండలం, దేవాంగపురిలో జన్మించాడు.

రంగస్థల ప్రస్థానం

సంగీత కుంటుబమవడంతో వెంకటేశ్వరరావు చిన్నప్పటినుండే నాటకాలలో నటించడం ప్రారంభించాడు. ఈలపాట రఘురామయ్య దగ్గర నటనలో శిక్షణ తీసుకున్నాడు. గయోపాఖ్యానం నాటకంలోని నారదుని పాత్రలో రంగస్థలంపై అడుగుపెట్టాడు. విజయవాడ లోని శ్రీ రాజరాజేశ్వరి నాట్యమండలి, రాజమండ్రి లోకి చింతా సుబ్బారావు ట్రూపు ప్రదర్శించిన అనేక నాటకాలలో నటించాడు.

ప్రముఖ రంగస్థల నటులైన కళ్యాణం రఘురామయ్య, పులిపాక వెంకటప్పయ్య, అద్దంకి శ్రీరామమూర్తి, పులిపాటి వెంకటేశ్వర్లు, మాధవపెద్ది వెంకటరామయ్య, పంచాంగం పువ్వుల సూరిబాబు, పువ్వుల అనసూయ, ఆవేటి పూర్ణిమ, పువ్వుల రాజేశ్వరి, వేమూరి గగ్గయ్య, పీసపాటి నరసింహమూర్తి, షణ్ముఖి ఆంజనేయ రాజు, నిడుముక్కల సుబ్బారావు లతో కలిసి నటించాడు. టి. శ్రీరాములుతో కలిసి వెంకటేశ్వరరావు ఇచ్చిన రామాంజనేయ యుద్ధం గ్రామఫోన్ రికార్డు అప్పట్లో అత్యధిక సంఖ్యలో అమ్మడుపోయాయి.

నటించినవి:

పురస్కారాలు

వినండి

మూలాలు

  1. నాటక విజ్ఞాన సర్వస్వం, తెలుగు విశ్వవిద్యాలయం కొమర్రాజు వెంకట లక్ష్మణరావు విజ్ఞాన సర్వస్వం కేంద్ర ప్రచురణ, హైదరాబాదు, 2008, పుట.573.