"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

పెరుగు రామకృష్ణ (కవి)

From tewiki
Jump to navigation Jump to search
పెరుగు రామకృష్ణ
200px
పెరుగు రామకృష్ణ
జననం(1960-05-27)మే 27, 1960
నెల్లూరు, ఆంధ్రప్రదేశ్
వృత్తిసహాయ వాణిజ్యపన్నుల శాఖాధికారి
ప్రసిద్ధిభారతీయ రచయిత, కవి
మతంహిందూ
భార్య / భర్తసుజనారామం (కవయిత్రి)
పిల్లలుసాహిత్య కళ్యాణచక్రవర్తి , శ్రీనిధి
తండ్రిపెరుగు వెంకటేశ్వర్లు
తల్లికమలమ్మ

పెరుగు రామకృష్ణ (జననం 27 మే 1960), ప్రముఖ రచయిత, కవి. ఈయన ఇప్పటివరకూ 4 కవిత్త్వం పుస్తకాలు, 2 చిన్ని కథల పుస్తకాలు ప్రచురించారు. ఇతని కవితల్లో ఆంగ్లంలోని FLEMINGO అనే కవితల సంకలనం ప్రముఖమైనది. ఈయన UWA వారి Outstanding Intellectual of 21st Century ఇంకా రంజనీ కుందుర్తి నేషనల్ అవార్డ్, కజకిస్థాన్‌ సాహిత్య పురస్కారం తదితర బహుమానాలు కూడా గెలుచుకున్నారు.[1]

జీవిత విశేషాలు

పెరుగు రామకృష్ణ 27 మే 1960 న నెల్లూరు జిల్లాలో కమలమ్మ, వెంకటేశ్వర్లు దంపతులకు జన్మించారు.[2] ఆయన తండ్రి పెరుగు వెంకటేశ్వర్లు పద్యకవి. ఆయన సోదరుడు ఫణికుమార్ కూడా ఆంగ్లం, తెలుగు భాషల్లో కవి.ఫణికుమార్ తన 27వ యేట మరణించాడు. రామకృష్ణ నెల్లూరు జిల్లా లోని జయంపు అనే చిన్న గ్రామంలో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పాఠశాల విద్యను పూర్తిచేసారు. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో బి.ఎ (ఆంగ్ల లిటరేచర్) ను, ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి ఎం.ఎ (పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్) లను పూర్తి చేసారు. పి.జి.డి.సి.ఎ కూడా చదివారు. నాన్నగారి చంధస్సు పద్యాలు, భావ కవితలు, ఆన్నయ్య పణికుమార్‌ మదిలో మెదలి అక్షర రూపం దాల్చిన కవితలతో ఉత్తేజితుడై చదువుకునే రోజులలో తెలుగు ఉపాధ్యాయులు రంగారెడ్డి ప్రోత్సాహంతో కలం పట్టారు. పదిహేనేళ్ల చిరు ప్రాయంలోనే ఆయన కలం నుండి వెలుబడిన తొలికవిత ‘విలువ‘ . ఈ విలువ కవితలు ప్రజా హృదయాల్లోకి దూసుకుపోయాయి.[3]

అచ్చ తెలుగు కవిత్వంలో దూసుకు పోతున్న రామకృష్ణ వృత్తిరీత్యా సహాయ వాణిజ్యపన్నుల శాఖాధికారి. ఆయన కవితలు భారతీయ సంస్కృతీ సంప్రదాయాలకు అద్దం పట్టే విధంగా ఉంటాయి.

ఆయన హైకూ కవి, అనువాదకుడు. ఆయన నెల్లూరు జిల్లా లోని పులికాట్ సరస్సు నకు వలస వచ్చిన పక్షుల గూర్చి ఆంగ్ల కవిత్వం ద్వారా తెలియజేసి ప్రసిధ్దుడైనాడు. ఆయన వ్రాసిన అనేక కవితలు, హైకూలు తెలుగు వార్తాపత్రికలు, జర్నల్స్ లో ప్రచురితమైనాయి. ఆయన చేసిన అనువాదాలు 21 అంతర్జాల జర్నల్స్, అంతర్జాల సైట్స్ లో ప్రచురితమైనాయి.

రచనలు

గుంటూరు శేషేంద్ర శర్మ, నాగభైరవ కోటేశ్వరరావు, అద్దేపల్లి రామమెహన్‌రావులను గురుతుల్యుగా భావించే రామకృష్ణ ఎన్నో రచనలు చేశారు.

 • వెన్నెల జలపాతం (కవిత) (1996)
 • శ్వేత సంతకాలు (1999) (ఆరుగురు రచయిత ల కవితా సంకలనం)
 • నువ్వెల్లిపోయాక (దీర్ఘ కవిత) (2003)
 • కథాకళి పేరుతో నెల్లూరు కథలకు సంపాదీయకత్వం. (2004)
 • ప్లెమింగో (దీర్ఘ కవిత): (2006):సూళ్లూరుపేట ప్రాంతంలో వలస వచ్చి విడిదిచేసే సైబీరియా, నైజీరియా పక్షులను కవితావస్తువుగా తీసుకుకొని పక్షలను వలచి, మలచి వ్రాసిన ఆ కవితా హృదయాలను వోలాలడించింది.
 • ప్లెమింగో (2007), ఆంగ్లం,హిందీ,మలయాళం,కన్నడం.. భాషల్లో అనువాదం.
 • నానీల మినీ కవిత్వం. (2007)
 • పరావర్తనం (ఆడియో పోయిట్రీ బుక్)
 • ముంజలు (బిలింగుల్ మిని పోయిట్రీ కలక్షన్)

గౌరవ పదవులు

 • నాగపూర్ లోని ఇంటర్నేషనల్ బెనొవెలెంట్ రీసెర్చి ఫోరం సభ్యులు.
 • నెల్లూరు జిల్లా అధికార భాషా కమిటీ సభ్యులు.
 • చెన్నై లోని యునైటెడ్ రైటర్స్ అసోసియేషన్ సభ్యులు.
 • నెల్లూరు జిల్లా రచయితల సంఘం ప్రధాన కార్యదర్శి ( 1998-2008)
 • డా.సి.నారాయణరెడ్డి గారిచే రంజని-కుందుర్తి నేషనల్ పోయట్రీ అవార్డును 2003 లో అందుకున్నారు.

వ్యక్తిగత జీవితం

పెరుగు రామకృష్ణకి సుజనారామంతో వివాహం జరిగింది . ఈ దంపతులకు ఇద్దరు కుమార్తెలు. ఒకరు శ్రీమతి సాహిత్య కళ్యాణచక్రవర్తి కాగా మరొకరు కుమారి శ్రీనిధి. ఈయన సతీమణి సుజనా కూడా కవయిత్రి, ప్రభుత్వ పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయిని. మహిళల సమస్యలపైన గళం విప్పే ఆమె కలం మహిళలకు చేదోడు వాదోడుగా పనిచేస్తుంది. వృత్తిరీత్యా ఆమె నెల్లూరు జిల్లా రూరల్‌ మండలం ఆమంచర్ల ప్రభుత్వ ఉన్నత పాఠశా లలో తెలుగుబాషా పండితులుగా పనిచేస్తున్నారు. ఆమె కలం నుండి జాలువారిన పసిపిల్లల మనోవికాసం, నడవడిక కోసం మల్లెమెగ్గలు, మౌనబాష్పం, శ్వేత సంతకాలు అందరినీ ఆకట్టు కుంటాయి. ఆమె జాతీయ స్థాయి అవార్డులు కూడా అందుకున్నారు. వీరిద్దరూ కలిసి సాహితీ ప్రపంచంలో తారా జువ్వల్లా దూసుకు పోతున్నారు.

అవార్డులు,రివార్డులు

 • UWA అవుట్ స్టాండింగ్ ఇంతలెక్చుయల్ ఆఫ్ 21 సెంచరీ అవార్డు, చెన్నై.
 • 2000లో మిలీనియం ఎక్స్‌రే ప్రధాన అవార్డును ప్రముఖ కవి జ్వాలముఖి చేతుల మీదగా అందుకున్నారు.
 • 2003లో రంజనీ కుందుర్తి జాతీయ ప్రధాన అవార్డును జ్ఞానపీఠ అవార్డు గ్రహీత డాక్టర్‌ సి. నారాయణరెడ్డి చేతులమీదుగా అందుకున్నారు.
 • 2007లో అవుట్‌స్టాడింగ్‌ ఇంటలె క్చువల్‌ ఆఫ్‌ ట్వంటీపస్ట్‌ సెంచరీ అవార్డును యుజిసి చైర్మన్‌ సుఖ్‌దేవ్‌ థొరాటే చేతులు మీదుగా అందుకున్నారు.
 • 2007లో అటా వేడుకల పురస్కారాన్ని మంత్రివర్యులు ఆనం రామనారాయణ రెడ్డి చేతుల మీదుగా అందుకున్నారు.
 • 2007 లో నెల్లూరు జిల్లా కలెక్టర్‌ ద్వారా ప్రశంసా పత్రాన్ని పొందారు.
 • 2007 లో అమెరికా వారి నుండి ప్రతిష్ఠాత్మక ఎడిటర్స్‌ ఛాయిస్‌ అవార్డు పొందడం జరిగింది.
 • 2008లో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ విశిష్ట కవి పురస్కరాన్ని (స్వరధారి ఉగాది ) అనాటి ముఖ్యమంత్రి స్వర్గీయ డాక్టర్‌ వై.ఎస్‌.రాజశేఖర్‌రెడ్డి చేతుల మీదుగా అందుకున్నారు.
 • 2008లో అదే సంవత్సరం మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి చేతుల మీదగా మహాత్మ జ్యోతిరావు పూలే విశిష్ట పురస్కారాన్ని అందుకున్నారు.

ఇవేగాకుండా ఎన్నో అవార్డులు, రివార్డులను ఆయన అందుకున్నారు.

టెలివజన్ ఛానల్ లో

నెల్లూరు లోని స్థానిక టెలివిజన్ ఛానెల్‌లో మై ఫేవరేట్‌ బుక్‌ పేరుతో ప్రతి శని, ఆది వారలలో ఉదయం 7.30నిమిషలకు శుభోదయం కార్యక్రమంలో యువతను ప్రభావితం చేసే అంశాలతో కార్యక్రమం చేస్తున్నారు.ఈ కార్యక్రమంలో ఇప్పటి వరకు సినారే, అద్దేపల్లి శివారెడ్డి, డాక్టర్‌ గోపికృష్ణ వంటి గొప్ప గొప్ప రచయితల పుస్తకలను పరిచయం చేశారు.

చిత్రమాలిక

మూలాలు

 1. "Perugu Ramakrishna biography". Archived from the original on 13 అక్టోబర్ 2008. Retrieved 20 August 2012. Check date values in: |archivedate= (help)
 2. "PERUGU RAMAKRISHNA, Poet, Haiku Poet and Translator". Archived from the original on 2016-03-04. Retrieved 2015-06-28.
 3. కవిత్వ పంట పండిస్తున్న సాహితీ కుటుంబం[permanent dead link]

ఇతర లింకులు

Lua error in మాడ్యూల్:Authority_control at line 369: attempt to index field 'wikibase' (a nil value).