పేపర్ బాటిల్స్ లో కూల్ డ్రింక్స్

From tewiki
Jump to navigation Jump to search


మనం ప్రతిరోజు ఉదయం నిద్ర లేచిన దగ్గర నుండి పడుకునే వరకు  ప్లాస్టిక్ వాడకుండా ఉండలేము కానీ ఈ ప్లాస్టిక్[1] వల్ల కార్బన్ ఎలిమిషన్స్ పెరగడంతో పాటు ఆరోగ్య పరమైన ఇబ్బందులు ప్రతి ఒక్కరిలో నిత్యకృత్యము అయినప్పటికీ గత కొన్ని ఏండ్లు గా ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించేందుకు రకరకాల ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి,ప్రపంచంలో అతి పెద్ద ప్లాస్టిక్ పొల్యూటర్ అయిన కోక కోలా కంపెనీ కూడా కూల్ డ్రింక్స్ ను పేపర్ బాటిల్స్ లో తీసుకురావాలని ప్రయత్నాలు చేస్తోంది,కార్పొరేట్ కంపెనీలు కూడా తమ వంతుగా ప్లాస్టిక్ ను క్రమ క్రమంగా వాడకం తగ్గించడంలో భాగంగా ముందుకొస్తున్నాయి.ఇందుకుగాను 2030 నాటికి జీరో ప్లాస్టిక్ వెస్ట్ టార్గెట్ గా పెట్టుకుంది,దీనిలో భాగంగానే ఈ ఏడాది సమ్మర్ లో 2 వేల పేపర్ బాటిల్స్ తో ఫైలెట్ ప్రాజెక్ట్ ను ప్రారంభించింది.


ప్లాస్టిక్ వాడకం వల్ల నష్టాలు

ప్రపంచవ్యాప్తంగా నిమిషానికి  లక్ష ప్లాస్టిక్ బాటిల్స్ సేల్  అవుతున్నాయని  ఒక అంచనా ఉంది,వాటర్ బాటిల్స్ ,కూల్ డ్రింక్స్,ఆయిల్ డబ్బాలు,ఫుడ్ ప్యాకింగ్ కంటైనర్లు,ఇలా రకరకాల రూపాల్లో ప్లాస్టిక్ లేని లైఫ్ ఉహించుకోవడం కష్టంగా మారింది

వాతావరణం మార్పుకి కారణమవుతుంది ప్లాస్టిక్ కార్బన ఉద్గారాలు విడుదల చేయడం వల్ల, పర్యావరణనానికి తీరని నష్టం వాటిల్లుతుంది.


ప్రపంచంలో కెల్లా అత్యధిక ప్లాస్టిక్ వేస్టేజీ ప్రముఖ శీతల పానీయాల సంస్థ కోకా కోలా నుండే వస్తుందని పలు సర్వే లు తేల్చాయి, బ్రేక్ ఫ్రీ ప్రమ్ ప్లాస్టిక్ అనే ఎన్విరాన్మెంటల్ సంస్థ 55 దేశాల్లో చేసిన సర్వేలో టాప్ పొల్యూటర్ గా కోకా కోలా, దీని తర్వాత స్థానాల్లో నెస్లే,పెప్సీ సంస్థలు నిలిచాయి, కొన్ని రోజులుగా చేస్తున్న అధ్యయనల్లో కార్బన ఉద్గారాలు విడుదల చేసే వాటిలో కోకా కోలా సంస్థ నే టాప్ లో ఉంటుంది,అందుకని రానున్న కొన్ని సంవత్సరాల్లో ప్లాస్టిక్ ను రీసైక్లింగ్ చేస్తామని 2019 లో కోకా కోలా కంపెనీ ప్రకటించింది.

మూలాలు

  1. పేపర్ బాటిల్స్, ప్లాస్టిక్ (19/02/2021). https://epaper.v6velugu.com/m5/2999963/V6-Prabhatha-Velugu-Telugu-Daily-Newspaper/19-02-2020#page/1/1. Cite journal requires |journal= (help); Check date values in: |date= (help); Missing or empty |title= (help)