పేరాయపాలెం

From tewiki
Jump to navigation Jump to search

"పేరాయపాలెం" ప్రకాశం జిల్లా అద్దంకి మండలానికి చెందిన గ్రామం.[1]


పేరాయపాలెం
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాThe ID "Q<strong class="error">String Module Error: Match not found</strong>" is unknown to the system. Please use a valid entity ID.
జనాభా
(2011)
ప్రాంతీయ ఫోన్ కోడ్+91 ()

లువా తప్పిదం: Coordinates must be specified on Wikidata or in |coord=

గ్రామ పంచాయితీ

2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి నిర్వహించిన ఎన్నికకలో శ్రీ యానం రామాంజనేయులు, సర్పంచిగా ఎన్నికైనారు. ( ఈనాడు ప్రకాశం/అద్దంకి; 2015,సెప్టెంబరు-10; 2వపేజీ.)

గ్రామానికి వ్యవసాయం, సాగునీటి సౌకర్యం

ఈ గ్రామంలో 2008లో రు. 1.3 కోట్ల నాబార్డ్ నిధులతో శ్రీ లక్ష్మీనరసింహ ఎత్తిపోతల పథకం ఏర్పాటయినది. పేరాయపాలెం గ్రామానికి ఆనుకొని, నిత్యం నిండుకుండలా ప్రవహించే దోర్నపు వాగుపై ఈ పథకాన్ని ఏర్పాటు చేసారు. దీని ద్వారా 500 ఎకరాలకు సాగు నీరు అందించాలని లక్ష్యం. ఈ పథకం పూర్తి స్థాయిలో వినియోగంలోకి వస్తే, పేరాయపాలెంతో పాటు ధేనువకొండ గ్రామాల భూములు గూడా సస్యశ్యామలం అవుతాయి. దోర్నపు వాగు అంచున, పంపు హౌస్ నిర్మించి 70 హెచ్.పి. సామర్ధ్యంగల 3 విద్యుత్తు పంపు సెట్లను అమర్చారు. ఈ పథకం నుండి ఒక కిలోమీటరు దూరం పొడవున ప్రధాన కాలువ నిర్మించారు. దీనికి అనుసంధానంగా, వ్యవసాయ భూములకు సాగునీరు సరఫరా చేసెటందుకు అవసరమైన చిన్నకాలువలు ఏర్పాటు చేసారు. ఇది రెండేళ్ళపాటు రైతులకు అడపాదడపా ఉపయోగపడింది. తరువాత ఈ పథకం మూలన పడినది.[1]

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు

శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయం

పేరాయపాలెం గ్రామంలో కొండపై వేంచేసియున్న ఈ ఆలయంలో, ప్రతి సంవత్సరం వైశాఖ పౌర్ణమికి స్వామివారి కళ్యాణం వైభవంగా నిర్వహించెదరు. [2]

మూలాలు

వెలుపలి లింకులు

[1] ఈనాడు ప్రకాశం/ఒంగోలు; 2014,మే-16; 2వపేజీ. [2] ఈనాడు ప్రకాశం/అద్దంకి; 2015,మే-6; 1వపేజీ.