"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."
పొట్లపల్లి శివాలయం
పొట్లపల్లి శివాలయం | |
---|---|
పొట్లపల్లి శివాలయం పొట్లపల్లి శివాలయం | |
భౌగోళికాంశాలు: | 18°07′55″N 79°12′30″E / 18.13194°N 79.20833°ECoordinates: 18°07′55″N 79°12′30″E / 18.13194°N 79.20833°E |
స్థానము | |
దేశము: | భారత దేశము |
రాష్ట్రము: | తెలంగాణ |
జిల్లా: | సిద్ధిపేట జిల్లా |
ప్రదేశము: | పొట్లపల్లి |
నిర్మాణశైలి, సంస్కృతి | |
ప్రధానదైవం: | శివుడు |
నిర్మాణ శైలి: | దక్షిణ భారతదేశం |
చరిత్ర | |
కట్టిన తేదీ: (ప్రస్తుత నిర్మాణము) | సా.శ.1055-75 |
నిర్మాత: | మొదటి ప్రోలరాజు |
పొట్లపల్లి శివాలయం తెలంగాణ రాష్ట్రం, సిద్ధిపేట జిల్లా, హుస్నాబాద్ మండలం పొట్లపల్లి గ్రామంలో ఉన్న శివాలయం.[1] 1055-75 మధ్యకాలంలో కాకతీయుల వంశానికి చెందిన మొదటి ప్రోలరాజు ఈ శివాలయం నిర్మించారు.[2]
చరిత్ర
గ్రామంలోని కుమ్మరి పోచయ్య ఇంట్లో కాకతీయుల కాలంనాటి అరుదైన శివలింగం బయటపడడంతో గ్రామస్థులు ఆ శివలింగానికి పూజలు చేశారు. అప్పటివరకు చినుకు కూడా పడని పరిస్థితిలో శివలింగం బయటపడ్డాక తర్వాత కుంభవృష్టితో వర్షం కురవడంతో సాక్షాత్తు వరుణ దేవుడే వచ్చి శివలింగానికి జలాభిషేకం చేశాడని, అప్పట్నుంచి స్వామివారిని స్వయంభువుగి నిత్యం కొలుస్తూ పూజలు చేస్తున్నారు.
ప్రయాణ వివరాలు
రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నుంచి 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న సిద్దిపేట చేరుకొని, అక్కడ్నుంచి 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న హుస్నాబాద్ వెళ్లి అక్కడ నుంచి 3 కిలోమీటర్ల దూరంలో పొట్లపల్లి ఉన్న శివాలయానికి చేరుకోవచ్చు.
మూలాలు
- ↑ ఈనాడు, ప్రధాన దేవాలయాలు. "పొట్లపల్లి శ్రీ స్వయంభూరాజేశ్వరస్వామి". Archived from the original on 16 July 2018. Retrieved 8 April 2018.
- ↑ వెబ్ ఆర్కైవ్, నమస్తే తెలంగాణ, బతుకమ్మ (ఆదివారం సంచిక) (8 April 2018). "పంచమఠ పీఠభూమి.. పొట్లపల్లి శివాలయం!". అరవింద్ ఆర్య పకిడే. Retrieved 8 April 2018.