పొట్లూరి హరికృష్ణ

From tewiki
Jump to navigation Jump to search
పొట్లూరి హరికృష్ణ

పొట్లూరి హరికృష్ణ తెలుగు రక్షణ వేదిక జాతీయ అధ్యక్షులు. తెలుగు పలుకు మాసపత్రికకు సంపాదకులు, కవి, రచయిత.[1]

దస్త్రం:Potluri Harikrishnaa.jpg
అనంతవాసికి అరుదైన గౌరవం

జననం

పొట్లూరి లక్ష్మీదేవి, రాధాకృష్ణ దంపతులకు సెప్టెంబర్ 10, 1979అనంతపురం జిల్లా, ఎల్లనూరు మండలంలోని కల్లూరు గ్రామంలో జన్మించారు.

దస్త్రం:Potluri Harikrishna0.jpg
రాజమండ్రిలో తెలుగు విశ్వవిద్యాలయం
దస్త్రం:Potluri Harikrishna3.jpg
తెలుగు భాషాభివృద్ధికి సహకరించాలి
దస్త్రం:Potluri Harikrishna1.jpg
మాతృభాషను కాపాడుకుందాం
దస్త్రం:Potluri Harikrishna2.jpg
చంద్రబాబుచే సత్కారం అందుకుంటున్న పొట్లూరి హరికృష్ణ

ప్రస్తుత నివాసం - వృత్తి/ప్రవృతి

ప్రస్తుతం హైదరాబాద్లో నివసిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికార భాషా సంఘం అధ్యక్షులుగా ఉన్నారు. తెలుగు రక్షణ వేదికకు జాతీయ అధ్యక్షులుగా, తెలుగు పలుకు మాసపత్రిక సంపాదకులుగా పనిచేస్తున్నారు. ప్రముఖ కవి, సాహితీ వేత్త, భాషోద్యమకారులు, వ్యాపారవేత్త ఖ్యాతిని దక్కించుకున్నారు..

ప్రచురితమయిన మొదటి కవిత

అమ్మకు ప్రాణాభివందనం


అమ్మ స్పర్శలో.. బ్రహ్మ.. బ్రహ్మ సృష్టిలో.. అమ్మ.. నవమాసాలు భారాన్ని భరిస్తూ - పునర్జన్మకి వాకిళ్ళు తెరుస్తూ.. గాయపడి - బాధపడి పచ్చిపయితో తన ప్రతిరూపాన్ని (ఓ పసిపాపను) ప్రపంచానికి పరిచయం చేసిన.. అమ్మకు ప్రాణాభివందనం అమ్మ ఒడిలో - తొలి బడిలో చనుపాలతో పెంచి - మురిపాలనే పంచి.. పసిపాపల ప్రపంచ భాషలో.... పలకించి - పులకించి, ఉగ్గుపోసి ఊసునేర్పిన.. నడకతో నడతను నేర్పిన.. అమ్మకు ప్రాణాభివందనం.. అమ్మ హృదయం - నా నివాస స్థలంలో మొలకేసిన మానవత్వం - నా మానసిక సాహిత్యం.... మనసుతో మనిషిలా - ప్రజాహిత పౌరుడిలా అక్షరాల్లో తలకట్టులా - ఆహార్యానికి పంచకట్టి తెలుగుజాతి వారసులుగా .... భారతీయత/జాతీయత నేర్పిన.. తెలుగమ్మకు ప్రాణాభివందనం.. అమ్మ పేరులో - అమ్మ ఊరిలో.. గుండె పిలుపులో - తెలుగు పలుకులో వేదాలలో శ్లోకాల్లా - త్యాగాల బాటలో సమైక్యతా పథంలో - మమైక్యతా రథంలో వందేమాతరం వారసులుగా.... దేశభక్తితో తీర్చిదిద్దిన .. భారతమ్మకు ప్రాణాభివందనం..

తెలుగు రక్షణ వేదిక

తెలుగు భాష ప్రమాదంలో ఉందా ? తెలుగు జాతి ప్రమాదంలో ఉందా ? తెలుగు లేని జాతిని ఎమనీ పిలవాలి ? ఆంగ్లేయులపాలనలో నాణేలమీద కనిపించిన తెలుగు .. తెలిగీయుల పాలనలో కనిపించక - వినిపించక పోతుంటే చూస్తుంటావా.. అంటూ ప్రశ్నిస్తూ 2008 సెప్టెంబరు 25లో !!.. స్వభాష స్వాభిమానంతో తెలుగు వారి ఐక్యత ఆత్మగౌరవం కాపాడుకుందాం ..!! తెలుగు కనపడాలి - తెలుగు వినపడాలి.. అనే నినాదంతో తెలుగు రక్షణ వేదిక ఏర్పాటు చేసారు.. తెలుగు రాష్ట్రాలలో (23) జిల్లాల కమిటీల ఏర్పాటు చేసుకోని.. కవులు-కళాకారులతో కలసి జిల్లాలవారిగ కార్యక్రమాలు నిర్వహించారు.. తెలుగు భాషోద్యమంలో.. ప్రాచీనహోదా, ప్రాచీనపీఠం, గ్రంథాలయాలు.. భాషా ఉద్యమాలులో.. చురుకైన పాత్ర పోషించారు.. ప్రాణం మీద ఏవిధంగా.. శరీరం శరీర అవయవాలు ఆధారపడి యున్నవో..ఆవిధంగా భాష మీద జ్ఞానవిజ్ఞానాలు మానాభిమానాలు, అధికారానా ధికారాలు.. సాహితీ, సాంస్కృతిక, సంప్రదాయాలు మొదలగు మానవాదికారాలన్ని ఆధారపడియున్నవి.. భాషాభిమానులతో కలిసి భాష ఆవశ్యకతను తెలియజేసారు..

తెలుగు పలుకు సాహిత్య మాసపత్రిక

ప్రపంచీకరణ నేపథ్యంలో, కంఫ్యూటరీకరణ జోరులో ప్రాంతీయ భాషలకు జరిగిన/జరుగుతున్న ప్రమాదాన్ని దృష్టిలోపెట్టుకొని.. ఆధునికలోకం తల్లిభాష ప్రయోజనాలు వివరిస్తూ.. యువకవులు, భాషాబిమానులు, సాహిత్యభిమానాలు, మేధావులు, రచనలు - సలహాలతో కొన్నిపత్రికల రూపంలో.. మరికొన్ని PDF'S రూపంలో www.telugupaluku.org ద్వారా తెలుగుభాష ఆవశ్యకత చైతన్య సందేశాలను చేరవేస్తున్నాము..

బిరుదులు - ప్రసంశలు

పురష్కారాలు

పొట్లూరి హరికృష్ణ తెలుగు భాషోద్యమంలో విశేషమైన కృషికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. తెలుగు భాషా పురస్కారంతో గౌరవించింది.. 2015 ఆగస్టు 29న ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు పురస్కారంతో పాటు రూ. 25 వేలు నగదు, మెమోంటో ఇచ్చి శాలువతో సత్కరిస్తారు.

పొట్లూరి హరికృష్ణ వారి సంస్థ తెలుగు రక్షణ వేదిక ద్వారా "తెలుగు భాష".. "తెలుగు సాహిత్యం".. "సంస్కృతి సాంప్రదాయాల" రక్షణలో భాగంగా వచన, రచన, పద్య, గద్య వివిధ భాష-సాహిత్య ప్రకియలో సేవలందిస్తున్న కవులు-కళాకారులను.. "తెలుగు జాతి".. "తెలుగు ఖ్యాతి".. "సామాజిక నిర్మాణం"లో భాగంగా వివిధ రంగాలలో విశిష్టసేవలను అందిస్తున్న సృజనలను-చైతన్యుల.. సేవలను ప్రశంసిస్తూ.. సన్మానిస్తూ (తెలుగు రత్న.. ART.. NTR, కవిరత్న.. కవితాశ్రీ.. ఉగాది) పురష్కారాలతో అభినందిస్తూ గౌరవిస్తున్నారు..

ప్రసంశలు

పొట్లూరి హరికృష్ణ.. కవులు - కళాకారులతో కలసి ఒక ఉద్యమస్ఫూర్తితో (ఎవరూ రానపుడు - చేయనపుడు) తెలుగు భాషకు సేవ చేస్తున్నారు.. ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు (29/08/2015)

పొట్లూరి హరికృష్ణ.. తెలుగు రక్షణ వేదిక ద్వారా భాషకు చేస్తున్న సేవను అభినందిస్తున్నాను.. వారికి సంపూర్ణ సహకారంతో నేనున్నాను.. మా అధ్యక్షులు సినీ హీరో - డాక్టర్ రాజేంద్రప్రసాద్ (21/02/2014)

పొట్లూరి హరికృష్ణ.. రెండు తరాల కవులు - కళాకారులకు వారధిగా - భాషాసేవ (పని) చేస్తున్నారు.. ప్రముఖ కవి రచయిత జోన్నవితులు రామలింగేశ్వర రావు (22/02/2013)

పొట్లూరి హరికృష్ణ.. యువ కవులను ప్రోత్సహిస్తూ తెలుగు పలుకు సాహిత్య మాసపత్రిక ద్వారా చేస్తున్న సాహిత్య సేవను మరువలేనిది.. నా కవితను ప్రచురణకు పంపుచున్నాను.. శ్రీ సి. నారాయణరెడ్డి విశ్వకవి, సాహితీవేత్త, జ్ఞానపీఠ పురస్కార గ్రహీత (22/02/2012)

చిత్రమాలిక

ఇతర లంకెలు

మూలాలు

  1. ఈనాడు ఆర్కైవ్స్ (7 August 2017). "తెలుగుభాషను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిది". Archived from the original on 15 ఆగస్టు 2017. Retrieved 29 October 2017.