పోతవరం (నాగులుప్పలపాడు)

From tewiki
Jump to navigation Jump to search


పోతవరం
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాThe ID "Q<strong class="error">String Module Error: Match not found</strong>" is unknown to the system. Please use a valid entity ID.
జనాభా
(2011)
ప్రాంతీయ ఫోన్ కోడ్+91 ()

పోతవరం, ప్రకాశం జిల్లా, నాగులుప్పలపాడు మండలానికి చెందిన గ్రామం.[1] పిన్ కోడ్ నం. 523183, ఎస్.టి.డి.కోడ్ = 08592.

గ్రామ భౌగోళికం

సమీప గ్రామాలు

కండ్లగుంట 3 కి.మీ, H.నిడమానూరు 3 కి.మీ, నాగులుప్పలపాడు 3 కి.మీ, చదలవాడ 4 కి.మీ, పమిడిపాడు 6 కి.మీ.

సమీప మండలాలు

పశ్చిమాన మద్దిపాడు మండలం, ఉత్తరాన కొరిసపాడు మండలం, తూర్పున చినగంజాము మండలం, ఉత్తరాన జే.పంగులూరు మండలం.

సమీప పట్టణాలు

మద్దిపాడు 8.7 కి.మీ, కొరిశపాడు 13.4 కి.మీ, ఒంగోలు 16.5 కి.మీ, చినగంజాం 16.8 కి.మీ.

గ్రామంలో విద్యా సౌకర్యాలు

జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల మాతృభాషా దినోత్సవం సందర్భంగా, ఇటీవల ఒంగోలులో, జిల్లా రచయితల సంఘం ఆధ్వర్యంలో, తెలుగుభాష విశిష్టతపై వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ఈ పోటీలలో ఈ పాఠశాలలో చదువుచున్న షేక్ మస్తాన్ బీ అను విద్యార్థిని ప్రథమ బహుమతిని కైవసం చేసుకున్నది. [4]

గ్రామంలో మౌలిక వసతులు

వీధి దీపాలు

ఈ గ్రామంలో వాటర్ షెడ్ పథకం మంజూరయినది. ఈ పథకం క్రింద 5 సౌర విద్యుద్దీపాల ఏర్పాటుకు అనుమతి లభించింది. ఒక్కో దీపానికి రు. 3500 చొప్పున పంచాయతీ వారు తమ వాటా క్రింద జమ చేయాల్సి ఉంది. దీనికి తగిన నిధులు పంచాతీలో లేనందు వలన, సర్పంచ్ శ్రీమతి నన్నూరి సునీతమ్మ, తమ ట్రస్టు నుండి స్వంత నిధులు 20,000-00 రూపాయలు (దీపాలకు, ఇతర ఖర్చులకు కలిపి) వెచ్చించి, ఈ 5 సౌర విద్యుద్దీపాలను ఏర్పాటు చేసారు. ఈ ఐదు దీపాలు బాగా వెలుగుతుండటంతో గ్రామస్థుల స్పందన బాగున్నది. దీనితో గ్రామానికి, నిర్వహణ ఖర్చు లేకుండా, నిరంతరంగా విద్యుద్దీపకాంతులు వెలసినవి. [2]

గ్రామ పంచాయతీ

కీ.శే. బెజవాడ సుబ్బారాయుడు, మాజీ సర్పంచ్.

2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి నిర్వహించిన ఎన్నికలలో శ్రీ నార్నే అంజయ్య సర్పంచిగా ఎన్నికైనారు. [3]

గ్రామంలోని ప్రముఖులు (నాడు/నేడు)

  1. గౌరవనీయులు కీ.శే. శ్రీ పొనుగుపాటి కోటేశ్వరరావు గారు, ఒంగోలు మాజీ శాసనసభ్యులు.
  2. surapureddy anjireddy.
  3. గౌరవనీయులు కీ.శే. శ్రీ బెజవాడ ఆదిశేషయ్య గారు- గ్రామ పెద్ద

గణాంకాలు

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 2,820.[2] ఇందులో పురుషుల సంఖ్య 1,416, మహిళల సంఖ్య 1,404, గ్రామంలో నివాస గృహాలు 745 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 725 హెక్టారులు.

జనాభా (2011) - మొత్తం 2,669 - పురుషుల సంఖ్య 1,320 - స్త్రీల సంఖ్య 1,349 - గృహాల సంఖ్య 755
  • గ్రామం గణాంకాల వివరణకు ఇక్కడ చూడండి.[1]

మూలాలు

వెలుపలి లంకెలు

[2] ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు; 2014,ఆగస్టు-29; 1వపేజీ. [3] ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు; 2015,నవంబరు-14; 2వపేజీ. [4] ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు; 2016,ఫిబ్రవరి-24; 2వపేజీ.