"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

పోలాప్రగడ రాజ్యలక్ష్మి

From tewiki
Jump to navigation Jump to search

పోలాప్రగడ రాజ్యలక్ష్మి ప్రముఖ కథా/నవలా రచయిత్రి. ఈమె 1938లో తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఆలమూరు గ్రామంలో జన్మించింది. ఈమె ఆలమూరు గరల్స్ హైస్కూలులో విద్యనభ్యసించింది. ఈమె భర్త ప్రముఖ రచయిత పోలాప్రగడ సత్యనారాయణమూర్తి. ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం ప్రచురించిన కవితా సంపుటిలో ఈమె కవితలు అచ్చయ్యాయి. ఈమె కథారచనలపై నాగార్జున విశ్వవిద్యాలయంలో ఎమ్‌.ఫిల్, వ్యక్తిత్వము - సాహిత్యము పై ఆంధ్ర విశ్వవిద్యాలయం పి.హెచ్.డి., రెల్లుపొదలు నవల హిందీ అనువాదంపై ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎమ్‌.ఫిల్ స్థాయిలో పరిశోధనలు జరిగాయి. వివిధ సంస్థలు ఈమెను సత్కరించాయి. సఖ్యసాహితికి వైస్ ప్రెసిడెంటుగా, ఆంధ్ర మహిళాసభ ట్రస్ట్ బోర్డు సభ్యురాలిగా సేవలను అందజేస్తున్నది. ఈమె కథలు, నవలలు, కవితలు కొన్ని ఇంగ్లీషు, హిందీ భాషలలో అనువదించబడ్డయి.

రచనలు

నవలలు

 1. శరన్మేఘం
 2. శృతి తప్పిన వీణ
 3. గాజు మేడ
 4. దరిచేరిన కెరటం
 5. శిలలూ - సెలయేళ్ళు
 6. విరిసిన వెన్నెల
 7. ఇటు ఊరు - అటు ఏరు
 8. కొత్త చిగుళ్ళూ - మంచు బిందువులు
 9. రెల్లు పొదలు
 10. ప్రేమాలయం
 11. బంగారు కెరటాలు

కథాసంపుటాలు

 1. రాజ్యలక్ష్మి కథలు
 2. నింగీ - నేలా
 3. చక్కెరబొమ్మ
 4. కొత్తవెలుగు
 5. అనుబంధాలు

వ్యాసాలు

 1. కావ్యనాయికలు
 2. రేడియో వ్యాసాలూ ప్రసంగాలు
 3. వ్యాసావళి

జీవిత చరిత్రలు

 1. కనుపర్తి వరలక్ష్మమ్మ (కేంద్రసాహిత్య అకాడెమీ వారి మోనోలాగ్)

కవితాసంపుటి

 1. కవితల పందిరి

సత్కారాలూ పురస్కారాలు

 1. 1971 - ఆంధ్రజ్యోతి కథల పోటీలో బహుమతి
 2. 1983 - వనిత కథలపోటీలో బహుమతి
 3. 1988 - తిక్కవరపు సుదర్శనమ్మ అవార్డు
 4. 1990 - ఉన్నవ లక్ష్మీనారాయణ అవార్డు (నాగార్జున విశ్వవిద్యాలయం)
 5. 1994 - పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం చే ఉత్తమ రచయిత్రి పురస్కారం
 6. 1999 - మద్రాసు తెలుగు అకాడెమీ వారి సాహిత్య పురస్కారం
 7. 2002 - ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వారి సాహిత్య పురస్కారం
 8. 2003 - సుశీలా నారాయణరెడ్డి అవార్డు

మూలాలు

Lua error in మాడ్యూల్:Authority_control at line 369: attempt to index field 'wikibase' (a nil value).