పోలిశెట్టి

From tewiki
Jump to navigation Jump to search

శ్రీ పోలిశెట్టి లేదా పోలిసెట్టి వారి వంశీయులు కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలలోనూ, రాయలసీమజిల్లాల్లోనూ, కోస్తాఆంధ్ర జిల్లాల్లో ప్రధానంగా ఉభయ గోదావరి, కృష్ణ, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లోనూ, కొన్ని తెలంగాణా జిల్లాల్లోనూ విస్తరించి ఉన్నారు.

వీరి పూర్వీకులు కర్నాటకలోని ఐహాలుకు చెందిన చాళుక్య వంశీయులు. 14వ శతాబ్దమున విజయనగర సామ్రాజ్య యిమ్మడి దేవరాయల కాలములో సైనిక వ్యాపార కుటుంబాలుగా రాజమహేంద్రవరము రాజ్యం చేరి రాజమహేంద్రవరము, ద్రాక్షారామంలో స్థిరపడినవారు. హోయసల, చోళ, విజయనగర రాజులకు రాజబందువులు. మానవ్యస గోత్రోద్భవులు. వీరు ప్రధానంగా తరతరాలుగా వ్యాపార రంగంలో ప్రాముఖ్యతనందిన క్షత్రియ బలిజ కులానికి చెందినవారు. రాచకుటుంబాలకు చెంది తరతరాలుగా కొన్ని వందల సంవత్సరాలు రత్నాల వ్యాపారాలలో ప్రాముఖ్యత గడించుటవలన వీరు రత్నాలబలిజవారు లేదా రాచబలిజవారు అని పిలవబడెను. గోదావరి జిల్లాల్లో విస్తరించి ఉండిన రాజమహేంద్రవరము రాజ్యం ప్రాంతములో 14వ శతాబ్దమునుండీ ప్రముఖులుగా ఉన్నందున వీరికి రాజమహేంద్రవర బలిజవారు అని కూడా పేరు గలదు.

తెలుగు దేశానికి చెందిన వ్యాపార కుటుంబాలుగా ఉండుట వలన వీరు తెలగ బలిజ లేదా తెలగాలు అని కూడా పిలవబడినట్టు తెలుస్తుంది.

పూర్వం నుండీ ఆంధ్రలో గ్రామ పెద్ద అధికారిని కాపు లేదా పెద్దకాపు అని పిలిచేవారు. బలిజ కులస్తులైన యీ పోలిశెట్టివారు కూడా తీరాంద్రలో 18వ శతాబ్దం నుండీ "కాపు" అనే "గ్రామపెద్ద" అధికార పదవిని చేపట్టడం జరిగింది.

18వ శతాబ్దం నుండీ యీ కులస్తులు ఎక్కువగా పట్టణాలూ వ్యాపారాలు వదిలి, గ్రామాలు చేరి వ్యవసాయాలు మొదలు పెట్టడంతో బలిజకులస్తులని చెప్పబడే వీరు కూడా ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాల్లో 20వ శతాబ్దం నుండీ కాపులు అని పిలవబడుతున్నారు.

ద్రాక్షారామ పోలిశెట్టి వారి వంశ శాఖలవారు చల్లపల్లి, కొప్పర్రు గ్రామాలలో 16 వ శతాబ్దము నుంచి నివసిస్తున్నారు. వీరునూ గూడాల, అత్తిలి, తణుకు ప్రాంతాలలో విస్తరించియున్న పోలిశెట్టి వారందరు ఒకే వంశవృక్షానికి చెందినవారని వీరి వద్దగల ప్రాచీన వంశవృక్షాల ద్వారా తెలియుచున్నది. వీరిలో చాలా కుటుంబీకులు ఇప్పుడు మానవ్యస, ఆత్రేయస, బరద్వాజస, శెట్టిపాల, జనపాల, నరపాల, పైడిపాల, ధనపాల, జనకుల, ధనపతుల, పసుపులేటి ఇలా రకరకాల గోత్రాలు చెప్పుకొనుచున్నారు.

యీ వంశమునుండి యెందరో ప్రసిధ్ధులు, డాక్టర్లు, లాయర్లు, వ్యాపారవేత్తలు రాష్ట్ర వ్యాప్తంగా విస్థరించి ఉన్నారు.

కొందరు ప్రముఖులు

 • శ్రీ పోలిశెట్టి సదాశివరాయశెట్టివర్మ గారు,గొప్ప వ్యాపారి, విజయనగర రె౦డవ దేవరాయల సేనాని
 • శ్రీ పోలిశెట్టి రాయప్పరాజవర్మ దళవాయి గారు, గొప్ప వ్యాపారి, విజయనగర తుళువ వీర నరసి౦హరాయల రాజబ౦ధువు, సేనాని
 • శ్రీ పోలిశెట్టి గున్నయ్యశెట్టి నాయకమహాపాతృడు గారు, రాజమహే౦ద్రవర౦ దేశాయి
 • శ్రీ పోలిశెట్టి నరసప్పశెట్టి నాయక మహాపాత్రుడు గారు, రాజమహే౦ద్రవర౦ దేశాయి
 • శ్రీ పోలిశెట్టి అమ్మన్న నాయుడు గారు, వాణిజ్య౦
 • శ్రీ పోలిశెట్టి చౌదరి గారు, వాణిజ్య౦
 • రావు సాహెబ్ శ్రీ పోలిశెట్టి రంగనాయకులు నాయుడు గారు, (గొప్ప ఇంజనీరుగా బ్రిటీషు ప్రభుత్వము గుర్తింపు పొన్దినవారు)
 • మహాదాత శ్రీ పోలిశెట్టి కమలనాభం నాయుడు గారు, కాపులపాలెం, యానాం
 • శ్రీ పోలిశెట్టి వెంకటరత్నం నాయుడు గారు, భూస్వామి, పీ. మల్లవరం ఎస్టేటుదారు,దంగేరు జమీందారు గారు (1875-1955)
 • శ్రీ పోలిశెట్టి మంగయ్య నాయుడు గారు, టీ. చల్లపల్లి గ్రామ మున్సబు గారు, యిజారాదార్లు
 • శ్రీ పోలిశెట్టి నరసప్ప నాయుడు గారు, టీ. చల్లపల్లి గ్రామ పెత్తందారు గారు, యిజారాదార్లు
 • ధర్మదాత రావుబహద్దూర్ శ్రీ పోలిశెట్టి ధర్మారాయుడు గారు, టీ. చల్లపల్లి యెష్టేట్ గ్రామాల పెత్తందారు గారు
 • శ్రీ పోలిశెట్టి వెంకటరత్నం గారు, గూడాల గ్రామ పెత్తందారు గారు
 • శ్రీ పోలిశెట్టి స్వామి నాయుడు గారు, స్వతంత్ర సమరయోధులు, జుస్టిస్ పార్టీ లీడర్, తూర్పు గోదావరి జిల్లా బోర్డ్ మెంబరు గూడాల
 • శ్రీ పోలిశెట్టి విశ్వేశ్వర రావు గారు, స్వతంత్ర సమరయోధులు, గూడాల
 • శ్రీ పోలిశెట్టి తిరుపతి రాయుడు గారు, కొప్పర్రు (నరసాపురం) గ్రామ మున్సబు గారు
 • శ్రీ పోలిశెట్టి వెంకట సుబ్బారావు గారు, కొప్పర్రు (నరసాపురం) గ్రామ మున్సబు గారు
 • శ్రీ పోలిశెట్టి రాదాకృష్ణ దాసు గారు, కొప్పర్రు (నరసాపురం) గ్రామ మున్సబు గారు
 • శ్రీ పోలిశెట్టి సత్తిరాజు గారు, ఫేమస్ "తాపేశ్వరం కాజా" రూపశిల్పి, తాపేశ్వరం
 • శ్రీ పోలిశెట్టి సాంబమూర్తి నాయుడు గారు, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ లో అడిషనల్ సెక్రటరీగా చేసారు
 • శ్రీ పోలిశెట్టి శేషావతారం గారు, స్వతంత్ర సమరయోధులు, కొప్పర్రు (నరసాపురం), యమ్.ఎల్.ఎ., 1967 - పాలకొల్లు
 • శ్రీ పోలిశెట్టి వీర వెంకట సత్య నారాయణ మూర్తి గారు, దంగేరు జమీందారీ భూస్వాములు - "భట్టి విక్రమార్క" సినిమా నిర్మాత

మూలాలు

 1. పోలిశెట్టి వారి వంశ చరిత్ర

లింకులు

శ్రీ పోలిశెట్టి వారి పూర్తి చరిత్ర [1] [2]