ప్రతిభా పిక్చర్స్

From tewiki
Jump to navigation Jump to search
దస్త్రం:TeluguFilmPoster Balaraju 1948.jpg
ప్రతిభా సంస్థ నిర్మించిన అత్యుత్తమ చిత్రం బాలరాజు (1948)

ప్రతిభా పిక్చర్స్ పాతతరం తెలుగు చలనచిత్ర నిర్మాణ సంస్థ. దీనిని ప్రముఖ నిర్మాత, దర్శకుడైన ఘంటసాల బలరామయ్య 1940 సంవత్సరంలో స్థాపించారు. ఇంతకుముందు శ్రీరామా ఫిలిమ్స్, కుబేరా పిక్చర్స్ పేరుతో కొన్ని చిత్రాలు నిర్మించి ప్రతిభా పిక్చర్స్‌ను స్థాపించారు. ఈ సంస్థ నిర్మించిన అత్యుత్తమ చిత్రం 1948లో విడుదలైన బాలరాజు. 1950లో కేవలం 19 రోజులలో శ్రీ లక్ష్మమ్మ కథ చిత్రాన్ని నిర్మించి విడుదల చేసిన ఘనత ఈ సంస్థకు దక్కింది. 1955లో విడుదలైన రేచుక్క చిత్ర నిర్మాణ సమయంలో ఘంటసాల బలరామయ్య హఠాత్తుగా మరణించడంతో ఆ చిత్రాన్ని పి.పుల్లయ్య పూర్తి చేశారు. బలరామయ్య మరణం తర్వాత ఆయన కుమారుడు ప్రతిభ పిక్చర్స్ పతాకం మీద రెండు చిత్రాలు నిర్మించారు. అవి ఏది నిజం (1956), దొంగలున్నారు జాగ్రత్త (1958). ఏది నిజం చిత్రాన్ని ప్రముఖ నటుడు, వీణవిద్వాంసుడు ఎస్.బాలచందర్ తీయగా, దొంగలున్నారు జాగ్రత్తను ప్రముఖ సంగీతదర్శకుడు భీమవరపు నరసింహారావు తీయడం విశేషం.

చిత్రసమాహారం