"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

ప్రపంచ జల దినోత్సవం

From tewiki
Jump to navigation Jump to search

ప్రపంచ నీటి దినోత్సవం ఐరాస జరిపే వార్షిక దినోత్సవం. దీన్ని ఏటా మార్చి 22 న జరుపుతారు. ఇది మంచినీటి ప్రాముఖ్యతను తెలియజేస్తుంది. మంచినీటి వనరుల స్థిరమైన నిర్వహణ గురించి చెప్పేందుకు ఈ రోజును ఉపయోగిస్తారు. [1] 1992 బ్రెజిల్ లోని రియో డి జనీరోలో పర్యావరణం, అభివృద్ధిపై ఐక్యరాజ్యసమితి ఏర్పాటు చేసిన సమావేశం (UNCED) ఎజెండా 21 లో ఈ దినోత్సవాన్ని మొదట ప్రతిపాదించారు. తొలి ప్రపంచ నీటి దినోత్సవం 1993 లో జరిగింది.[2]

ఆ రోజు ఇతివృత్తంగా పరిశుభ్రమైన నీరు, పారిశుధ్యం, పరిశుభ్రత లకు సంబంధించిన అంశాలపై దృష్టి పెడుతుంది. ఇది సస్టైనబుల్ డెవలప్మెంట్‌లోని ఆరవ లక్ష్యానికి అనుగుణంగా ఉంటుంది.[3] ప్రతి సంవత్సరం ప్రపంచ నీటి దినోత్సవం సందర్భంగా ఐరాస ప్రపంచ నీటి అభివృద్ధి నివేదిక (WWDR) విడుదల అవుతుంది.

యుఎన్-వాటర్ ప్రపంచ జల దినోత్సవానికి కన్వీనరు. ప్రతి సంవత్సరం, ఆ రోజునటి థీమ్‌గురించి దానిపట్ల ఆసక్తి ఉన్న ఐరాస సంస్థలతో సంప్రదిస్తుంది. [4] 2020 యొక్క థీమ్ "నీరు, వాతావరణ మార్పు". ఈ రెండు సమస్యల మధ్య విడదీయరాని అనుసంధానం ఎలా ఉందో పరిశీలిస్తుంది. [5] COVID-19 మహమ్మారి కారణంగా, 2020 ప్రచారంలో చేతులు కడుక్కోవడం గురించి, పరిశుభ్రత గురించి సందేశాలను ఇచ్చి ప్రోత్సహించింది. ప్రచారానికి మద్దతు ఇస్తూ సురక్షితంగా ఉండటానికి మార్గదర్శకత్వం ఇచ్చింది.

2019 నాటి థీమ్ "ఎవరినీ వెనకబడ నివ్వం". [6] 2014 నుండి 2018 సంవత్సరాలకు ఇతివృత్తాలు "నీరు, శక్తి" [7], "నీరు, సుస్థిర అభివృద్ధి" [8], "నీరు, ఉద్యోగాలు" [9], "నీటిని ఎందుకు వృథా చేస్తారు?" [10], "నీటొ కోసం ప్రకృతి"[11]

ప్రపంచ జల దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా వివిధ రకాల కార్యక్రమాలతో జరుపుకుంటారు. ఇవి నాటకం గాని, మ్యూజికల్, లేదా ప్రకృతిలో లాబీయింగ్ గానీ కావచ్చు. ఆ రోజున నీటి ప్రాజెక్టుల కోసం డబ్బును సేకరించే ప్రచారాలను కూడా చేపట్టవచ్చు.

మూలాలు