"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."
ప్రమాదస్థితిలో ఉన్న జాతులు
Jump to navigation
Jump to search
ప్రమాదస్థితిలో ఉన్న జాతులు అనేవి అంతర్జాతీయ ప్రకృతి పరిరక్షణ సమితి (International Union for Conservation of Nature) అనే సంస్ధ ద్వారా సంరక్షణ స్ధితిలో భాగంగా వర్గికరించబడిన జాతులు. ఈ జాతుల యెుక్క ప్రత్యుత్పత్తి మరియు మనుగడ అభివృద్ధి చెందకపోతే ఇవి కూడా అంతరించే దశకు చేరుకుంటాయి.
ప్రధానంగా నివాసాలు కోల్పోవడం వల్ల కొన్ని జాతులు ప్రమాదస్థితిలో ఉన్నట్లుగా పరిగణించబడతాయి. ప్రమాదస్థితిలో ఉన్న జాతులు క్రమేపి అంతరించే జాతులుగా కూడా మారుతాయి. ఉదాహరణ - మిలటరి మాకేవ్.
ప్రస్తుతం 4728 జాతుల జంతువులు, 4914 జాతుల మెుక్కలూ ప్రమాదస్థితిలో ఉన్న జాతులుగా గుర్తించారు. 1998లో ఈ సంఖ్య 2815, 3222 గా ఉంది.[1]
ఇవి కూడా చూడండి
- కనుమరుగైన జాతులు
- ఆవాసాల నుండి కనుమరుగైన జాతులు
- తీవ్రంగా అంతరించే స్థితిలో ఉన్న జాతులు
- అంతరించే జాతులు