"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

ప్రసరణ వ్యవస్థ

From tewiki
Jump to navigation Jump to search
ప్రసరణ వ్యవస్థ
Circulatory System en.svg
The human circulatory system. Red indicates oxygenated blood, blue indicates deoxygenated.
లాటిన్ systema cardiovasculare

ప్రసరణ వ్యవస్థ (Circulatory system) అనేది వ్యాధులతో పోరాడటానికి సహాయం చేయటానికి మరియు హోమియోస్టాటిస్ని నిలబెట్టుకోవటానికి శరీర ఉష్ణోగ్రతను మరియు pHను స్థిరపరచటానికి సహాయం చేయటానికి శరీరంలోని కణముల నుండి మరియు కణములకు, పోషక పదార్దములు (ఎమినో ఆసిడ్స్ మరియు ఎలెక్ట్రోలైట్స్ వంటివి), వాయువులు, హార్మోన్లు, రక్త కణాలు, మొదలైన వాటిని సరఫరా చేసే ఒక అవయవ వ్యవస్థ. ఈ వ్యవస్థ ఖండితముగా ఒక రక్త పంపిణీ వలయముగా చూడబడినప్పటికీ, ప్రసరణ వ్యవస్థ రక్తమును పంపిణీ చేసే హృదయనాళ వ్యవస్థ తోనూ,[1] మరియు శోషరసమును పంపిణీ చేసే శోషరస వ్యవస్థ తోనూ[2] నిర్మితమైందని కొందరు భావిస్తారు. మానవులు, అదే విధంగా ఇతర సకశేరుకాలు, ఒక సంవృత హృదయనాళ వ్యవస్థను కలిగి ఉండగా (అనగా ధమనులు, సిరలు మరియు కేశనాళికల వలయాన్ని రక్తము ఎప్పటికీ విడువదు), కొన్ని అకశేరుక వర్గాలు బహిరంగ హృదయనాళ వ్యవస్థను కలిగి ఉంటాయి. అత్యంత ప్రాచీన జీవి ఫైలాలో ప్రసరణ వ్యవస్థ లేదు. శోషరస వ్యవస్థ కూడా ఒక బహిరంగ వ్యవస్థ.

గుండె, రక్తము, మరియు రక్త నాళములు మానవ ప్రసరణ వ్యవస్థలో ముఖ్య భాగములు. ప్రసరణ వ్యవస్థలో ఇవి ఉంటాయి: పుపుస ప్రసరణం, ఊపిరితిత్తుల గుండా ఒక "ఉచ్చు" ఇక్కడే రక్తం ఆమ్లజనీకృతమవుతుంది; మరియు దైహిక ప్రసరణం, ఆమ్లజనీకృతమైన రక్తాన్ని అందించటానికి మిగిలిన శరీరం గుండా ఒక "ఉచ్చు". ఒక సాధారణ వ్యక్తిలో ఐదు నుండి ఆరు క్వార్ట్ల (సుమారు 4.7 నుండి 5.7 లీటర్లు) రక్తం ఉంటుంది, ఇందులో రక్తపు రసి, ఎర్ర రక్త కణములు, తెల్ల రక్త కణములు, మరియు ప్లేట్లెట్స్ (రక్తం గడ్డ కట్టటానికి సహాయ పడే కణాలు) ఉంటాయి. గుండె పనిచేస్తూ ఉండేందుకు అవసరమైన పోషకాలను అందించేందుకు జీర్ణ వ్యవస్థ ప్రసరణ వ్యవస్థతో కలిసి పనిచేస్తుంది.

ప్రసరణ వ్యవస్థలో రెండు రకాల ద్రవాలు తిరుగుతూ ఉంటాయి: రక్తము మరియు శోషం. హృదయనాళ వ్యవస్థలో రక్తము, గుండె మరియు రక్త నాళములు ఉంటాయి. శోషరస వ్యవస్థలో శోషరసం, శోషగ్రంధులు, మరియు శోష నాళములు ఉంటాయి. హృదయనాళ వ్యవస్థ మరియు శోషరస వ్యవస్థ కలిసి ప్రసరణ వ్యవస్థను తయారు చేస్తాయి.

పుపుస ప్రసరణం

పుపుస ప్రసరణం హృదయనాళ వ్యవస్థలో ఒక భాగం, ఇది ఆమ్లజని-రహిత రక్తమును గుండె నుండి ఊపిరితిత్తులకు తీసుకువెళ్ళి, ఆమ్లజనితో కూడిన రక్తాన్ని తిరిగి గుండెకు చేరుస్తుంది.

వీనా కేవా నుండి ఆమ్లజని రహిత రక్తం గుండె యొక్క కుడి కర్ణికలోనికి ప్రవేశించి త్రిపత్ర కవటం ద్వారా కుడి జఠరికలోనికి ప్రసరిస్తుంది, అక్కడి నుండి అది పుపుస అర్ధచంద్రాకార కవటం ద్వారా ఊపిరితిత్తులకు వెళ్ళే పుపుస ధమనులలోనికి సరఫరా అవుతుంది. పుపుస సిరలు ఇప్పుడు ఆమ్లజని అధికంగా ఉన్న రక్తాన్ని తిరిగి గుండెకు చేరుస్తాయి, ఇక్కడ మిట్రల్ కవాటం (ద్విపత్ర కవాటం) గుండా ఎడమ జఠరికలోనికి ప్రసరించే ముందు ఇది ఎడమ కర్ణికలోనికి ప్రవేశిస్తుంది. అప్పుడు, ఆమ్లజనితో కూడిన రక్తం ఎడమ జఠరిక నుండి బృహద్ధమని గుండా బయటకు మరియు మిగిలిన శరీర భాగాలకు సరఫరా చేయబడుతుంది.

దైహిక ప్రసరణం

దైహిక ప్రసరణం అనేది హృదయనాళ వ్యవస్థలో ఒక భాగం, ఇది ఆమ్లజనితో కూడిన రక్తమును గుండె నుండి మిగిలిన శరీర భాగాలకు రవాణా చేసి, ఆమ్లజని-రహిత రక్తమును తిరిగి గుండెకు చేరుస్తుంది. దూరాన్ని అనుసరించి, దైహిక ప్రసరణం, శరీరంలోని ప్రతి భాగానికి రక్తమును రవాణా చేస్తూ, పుపుస ప్రసరణం కన్నా చాలా పొడవుగా ఉంటుంది.

హృదయ సంబంధ ప్రసరణం

హృదయ సంబంధ ప్రసరణ వ్యవస్థ గుండెకు రక్తాన్ని అందిస్తుంది. ఇది గుండెకు ఆమ్లజనితో కూడిన రక్తాన్ని అందించటం మూలంగా, నిర్వచనం ప్రకారం ఇది దైహిక ప్రసరణ వ్యవస్థలో ఒక భాగం.

గుండె

View from the front, which means the right side of the heart is on the left of the diagram (and vice-versa)

గుండె ఆమ్లజనితో కూడిన రక్తాన్ని శరీరానికి మరియు ఆమ్లజని లేని రక్తాన్ని ఊపిరితిత్తులకు సరఫరా చేస్తుంది. మానవ గుండెలో ప్రతి ప్రసరణకు ఒక కర్ణిక మరియు ఒక జఠరిక ఉంటాయి, మరియు ఒక దైహిక మరియు ఒక పుపుస ప్రసరణము రెంటితో మొత్తం నాలుగు గదులు ఉంటాయి: ఎడమ కర్ణిక, ఎడమ జఠరిక, కుడి కర్ణిక మరియు కుడి జఠరిక. కుడి కర్ణిక గుండెకు కుడి వైపున పైన ఉండే గది. కుడి కర్ణికకు తిరిగి వచ్చిన రక్తము ఆమ్లజని తొలగించబడిన రక్తము (ఆమ్లజని చాలా తక్కువగా ఉన్న) మరియు తిరిగి ఆమ్లజనీకృతమవటానికి మరియు కార్బన్ డై ఆక్సైడ్ ను తొలగించటానికి పుపుస ధమని గుండా ఊపిరితిత్తులలోనికి ప్రసరించటానికి కుడి జఠరిక లోనికి ప్రవేశిస్తుంది. ఎడమ కర్ణిక ఊపిరితిత్తుల నుండి అలాగే పుపుస సిర నుండి కొత్తగా ఆమ్లజనీకృతమైన రక్తాన్ని స్వీకరించి దానిని బృహద్ధమని గుండా వివిధ శరీర భాగాలకు సరఫరా చేయటానికి బలమైన ఎడమ జఠరిక లోనికి ప్రవేశిస్తుంది.

సంవృత హృదయనాళ వ్యవస్థ

మానవ హృదయనాళ వ్యవస్థలు మూసుకుని ఉంటాయి, అనగా రక్తము రక్త నాళముల వలయాన్ని ఎప్పటికీ విడువదు. అందుకు విరుద్ధంగా, ఆమ్లజని మరియు పోషకాలు రక్త నాళ పొరల మీదుగా ప్రసరించి మధ్యంతర ద్రవంలోనికి ప్రవేశిస్తాయి, ఇది ఆమ్లజని మరియు పోషకాలను లక్ష్య కణములకు, మరియు కార్బన్ డై ఆక్సైడ్ మరియు వ్యర్ధాలను వ్యతిరేక దిశకు చేరవేస్తుంది. ప్రసరణ వ్యవస్థ యొక్క మరియొక భాగం, శోషరస వ్యవస్థ, సంవృతం కాదు. గుండె శరీరం మధ్యలో రెండు ఊపిరితిత్తులకు మధ్యన ఉంటుంది. ఎడమవైపు హృదయ స్పందన అనుభవించటానికి కారణం ఎడమ వైపు ఉన్న ఎడమ జఠరిక రక్తమును సరఫరా చేస్తూ ఉండటం.

ఇతర సకశేరుకాలు

అన్ని సకశేరుకముల, అదే విధంగా అనిలిడ్ల (ఉదాహరణకు, వానపాములు) మరియు శీర్షపాదుల (స్క్విడ్ (చిన్న చేప) మరియు ఆక్టోపస్) ప్రసరణ వ్యవస్థలు, మానవులలో వలెనే సంవృతము . ఇప్పటికీ, చేపలు, ఉభయచరములు, సరీసృపములు, మరియు పక్షుల యొక్క వ్యవస్థలు ప్రసరణ వ్యవస్థ యొక్క పరిణామం యొక్క వివిధ దశలను సూచిస్తాయి.

చేపలలో, ఈ వ్యవస్థ కేవలం ఒకే వలయాన్ని కలిగి ఉంటుంది, ఇందులో రక్తం మొప్పల యొక్క కేశనాళికల గుండా మరియు శరీర కణజాలముల కేశనాళికల పైకి సరఫరా చేయబడుతుంది. దీనిని ఏక చక్ర ప్రసరణం అంటారు. అందువలన చేప గుండె కేవలం ఒంటరి పంపు (రెండు గదులను కలిగి ఉన్న).

ఉభయచరాలలోను మరియు చాలా సరీసృపాలలోను, జంట ప్రసరణ వ్యవస్థ ఉపయోగించ బడుతుంది, కానీ గుండె ఎల్లప్పుడూ రెండు పంపులుగా పూర్తిగా విడదీయబడదు. ఉభయచరాలు మూడు-గదుల గుండెను కలిగి ఉంటాయి.

సరీసృపములలో, గుండె యొక్క జఠర కుడ్యము అసంపూర్ణమైనది మరియు పుపుస ధమని ఒక సంకోచక కండరమును (స్పింక్టర్) కలిగి ఉంటుంది. ఇది రక్త ప్రసారం సాధ్యమయ్యే రెండవ మార్గానికి అనుమతిస్తుంది. రక్తం పుపుస ధమని గుండా ఊపిరితిత్తులకు ప్రసరించటానికి బదులు, ఈ రక్త ప్రవాహమును అసంపూర్ణ జఠర కుడ్యము ద్వారా ఎడమ జఠరికకు మరియు బృహద్ధమని ద్వారా బయటకు మళ్ళించటానికి స్పింక్టర్ సంకోచించవచ్చు. అనగా రక్తం కేశనాళికల నుండి గుండెకు మరియు ఊపిరితిత్తులకు బదులు తిరిగి కేశనాళికలకు ప్రసరిస్తుంది. ఈ విధానం ఎక్టోథెర్మిక్ (కోల్డ్-బ్లడెడ్) (శరీర ఉష్ణోగ్రతను క్రమబద్ధం చేసుకోలేని జీవులు) జంతువులలో వాటి శరీర ఉష్ణోగ్రతను నియంత్రించటానికి ఉపయోగపడుతుంది.

పక్షులు మరియు క్షీరదములలో గుండె మొత్తం నాలుగు గదుల కొరకు పూర్తిగా రెండు పంపులుగా విడిపోతుంది; పక్షులలో నాలుగు-గదుల గుండె క్షీరదముల గుండె నుండి స్వతంత్రంగా పరిణామం చెందిందని భావించబడుతోంది.

బహిరంగ ప్రసరణ వ్యవస్థ

బహిరంగ ప్రసరణ వ్యవస్థలో హీమోసీల్ అనే కుహరంలో ద్రవం (హీమోలింఫ్ అని పిలవబడుతుంది) అవయవాలను నేరుగా ఆమ్లజని మరియు పోషకాలతో తడుపుతుంది మరియు అక్కడ రక్తము మరియు మధ్యంతర ద్రవం మధ్య తేడా ఉండదు; ఈ మిశ్రమ ద్రవాన్ని హీమోలింఫ్ లేదా హేమోలింఫ్ అంటారు. చలన సమయంలో జంతువు యొక్క కండరాల కదలికలు హీమోలింఫ్ కదలికకు వీలు కల్పిస్తాయి, కానీ ప్రవాహాన్ని ఒక ప్రదేశం నుండి వేరొక దానికి మరల్చటం పరిమితము. గుండె సడలినప్పుడు, చివరలు-తెరుచుకొని ఉన్న రంధ్రాల (ఆస్టియా) ద్వారా రక్తం గుండె వైపుకు తిరిగి లాగబడుతుంది.

హీమోలింఫ్ శరీరం యొక్క అంతర్గత హీమోసీల్ అంతటినీ నింపుతుంది మరియు కణములు అన్నింటినీ చుట్టుముడుతుంది. హీమోలింఫ్ లో నీరు, అసేంద్రీయ లవణములు (ముఖ్యంగా Na+, Cl-, K+, Mg2+, మరియు Ca2+), మరియు సేంద్రీయ పదార్దములు (ముఖ్యంగా పిండిపదార్ధములు, మాంసకృతులు, మరియు కొవ్వులు) ఉంటాయి. ఆమ్లజనిని రవాణా చేసే ప్రధాన అణువు హీమోసైనిన్.

హీమోలింఫ్ లో హీమోసైట్స్ అనబడే స్వేచ్ఛగా తేలియాడే కణములు ఉంటాయి. ఆర్థ్రోపోడా వ్యాధి నిరోధక వ్యవస్థలో అవి పాత్ర పోషిస్తాయి.

ప్రసరణ వ్యవస్థ లేకపోవటం

చిపిట పురుగు (ఫైలం ప్లాటి హెల్మింతెస్) తో సహా కొన్ని జంతువులలో ప్రసరణ వ్యవస్థ ఉండదు. వాటి శరీర కుహరంలో ఏ విధమైన పొర లేదా చుట్టుకోబడిన ద్రవం ఉండవు. బదులుగా ఫారిన్క్స్ విస్తృతంగా శాఖీయుతమైన జీర్ణ వ్యవస్థకు దారి తీస్తుంది, ఇది పోషకములు అన్ని కణములకు నేరుగా వ్యాపించే సదుపాయాన్ని కలిగిస్తుంది. చిపిట పురుగు యొక్క ముందు నుండి వెనుకకు చదునుగా ఉన్న శరీర ఆకృతి జీర్ణ వ్యవస్థ నుండి లేదా ఆ జీవి యొక్క ఉపరితలం నుండి ఏ కణం యొక్క దూరమును అయినా కట్టడి చేసుంది. చుట్టూ ఉన్న నీటి నుండి ఆమ్లజని కణములలోనికి ప్రసరించగలదు, మరియు కార్బన్ డై ఆక్సైడ్ బయటకు ప్రసరించగలదు. తత్ఫలితంగా, ప్రతి కణము ఒక రవాణా వ్యవస్థ అవసరం లేకుండానే పోషకాలను, నీటిని మరియు ఆమ్లజనిని పొందగలదు.

జల్లి చేపల వంటి కొన్ని జంతువులు, వాటి ఉదరనాడీ కుహరం నుండి మరింత విస్తృతమైన శాఖీయతను కలిగి ఉంటాయి (ఇది జీర్ణక్రియ జరిగే స్థలంగా మరియు ప్రసరణ యొక్క రూపుగా పనిచేస్తుంది), జీర్ణక్రియ లోపలి పొరలలో ప్రారంభమవటంతో, ఈ శాఖీయత శరీర ద్రవాలు బాహ్య పొరలను చేరటానికి వీలు కల్పిస్తుంది.

కొలత ప్రమాణాలు

ఆరోగ్యం మరియు వ్యాధి

ఆమ్లజని రవాణా

సముద్ర-మట్ట పీడనం వద్ద గాలిని పీల్చుకునే ఒక ఆరోగ్యవంతమైన మానవునిలో ధమని రక్తం యొక్క నమూనాలో సుమారు ఉన్న 98.5% ఆమ్లజని హీమోగ్లోబిన్ అణువులతో రసాయనికంగా కూడుకుని ఉంటుంది. సుమారు 1.5% భౌతికంగా ఇతర రక్త ద్రవాలలో కరిగి ఉంటుంది మరియు హీమోగ్లోబిన్ కు అనుసంధానించబడి ఉండదు. హీమోగ్లోబిన్ అణువు క్షీరదములు మరియు అనేక ఇతర జాతులలోను ఆమ్లజని యొక్క ప్రధాన రవాణాదారు.

ఆవిష్కరణ చరిత్ర

ప్రసరణ వ్యవస్థ గురించిన విశేషాలు ఎబెర్స్ పాపిరస్ (పదహారవ శతాబ్దం BCE) లో మొదటగా కనిపించాయి, ఇది భౌతిక మరియు ఆధ్యాత్మిక రెండిటికీ సంబంధించిన 700 పైగా మందుచీటీలను మరియు మందులను కలిగి ఉన్న ఒక పురాతన ఈజిప్టియన్ వైద్య పాపిరస్. ఈ పాపిరస్ లో, ఇది ధమనులతో గుండెకు ఉన్న సంబంధాన్ని తెలియజేస్తుంది. గాలి నోటి ద్వారా ఊపిరితిత్తులకు మరియు గుండెకు చేరుతుందని భావించేవారు. గుండె నుండి, గాలి ధమనుల ద్వారా ప్రతి భాగానికీ రవాణా అవుతుంది. ప్రసరణ వ్యవస్థ గురించిన ఈ భావన ఘోరంగా విఫలమైనప్పటికీ, ఇది పూర్వపు శాస్త్ర సంబంధ ఆలోచనలలో ఒక దానిని సూచిస్తుంది.

ఆరవ శతాబ్దపు BCE లో, శరీరం గుండా అతి ముఖ్యమైన ద్రవాల ప్రసరణ గురించిన పరిజ్ఞానం పురాతన భారతదేశంలోని ఆయుర్వేద వైద్యుడు సుశ్రుతకి ఉంది.[3] ద్వివేది & ద్వివేది (2007) 'చానెల్స్' (కాలువలు) గా అభివర్ణించిన ధమనుల గురించిన పరిజ్ఞానం కూడా ఇతనికి ఉంది.[3] గుండె కవాటములు సుమారు నాలుగవ శతాబ్దం BCE సమయంలో హిప్పోక్రేటియన్ స్కూలులోని ఒక వైద్యుడి ద్వారా కనుగొనబడ్డాయి. అయినప్పటికీ అప్పటికి వాటి విధి సరిగ్గా అర్ధం చేసుకోబడలేదు. మరణం తర్వాత సిరలలోకి రక్తం చేరుకోవటంతో, ధమనులు ఖాళీగా కనిపిస్తాయి. పురాతన శరీర నిర్మాణ వైద్యులు అవి గాలితో నిండి ఉన్నాయని మరియు అవి గాలి యొక్క రవాణాకు అని అనుకున్నారు.

గ్రీకు వైద్యుడు, హీరోఫిలస్, సిరలు మరియు ధమనుల మధ్య తేడాను గుర్తించాడు కానీ నాడి (కొట్టుకోవటం) అనేది ధమనుల లక్షణము అని భావించాడు. ప్రాణంతో ఉన్న సమయంలో ధమనులను కోస్తే వాటి నుండి రక్తం వస్తుందని గ్రీకు శరీర నిర్మాణ వైద్యుడు ఎరాసిస్ట్రాటస్ గమనించాడు. ఈ నిజాన్ని అతను ఒక ధమని నుండి బయటకు వెళుతున్న గాలి యొక్క స్థానాన్ని సిరలు మరియు ధమనుల మధ్య ఉన్న అతి చిన్న నాళముల ద్వారా ప్రవేశించిన రక్తము ఆక్రమించటం అనే దృగ్విషయం ద్వారా సంభవిస్తుందని చెప్పాడు. ఆ విధంగా అతను కేశనాళికల గురించి ప్రస్తావించాడు కానీ రక్తం యొక్క వ్యతిరేక ప్రవాహంతో.[4]

రెండవ శతాబ్దం AD రోమ్ లో, గ్రీకు వైద్యుడు గాలెన్ రక్త నాళములు రక్తమను తీసుకు వెళతాయని తెలుసుకున్నాడు మరియు చెడురక్తమును (సిరలలోని) (ముదురు ఎరుపు) మరియు మంచి రక్తమును (ధమనులలోని) (కాంతివంతమైన మరియు పలుచని) గుర్తించాడు, ప్రతిదానికి ఒక స్పష్టమైన ప్రత్యేకమైన మరియు కర్తవ్యంతో. పెరుగుదల మరియు శక్తి కాలేయంలోని కైల్ నుండి తయారు చేయబడిన సిరల రక్తం నుండి ఉత్పన్నమవుతుంది, ధమనుల రక్తం న్యూమా (గాలి) ను కలిగి ఉండటం ద్వారా మరియు హృదయంలో ఉద్భవించటం ద్వారా చేతనను ఇస్తుంది. ఉత్పత్తి అయ్యే అవయవాల నుండి రక్తం అన్ని శరీర భాగాలకు ప్రసరిస్తుంది, అక్కడ అది ఖర్చవుతుంది మరియు గుండెకు లేదా కాలేయానికి రక్తం తిరిగి రాదు. గుండె రక్తమును చుట్టూ వెదజల్లదు, గుండె యొక్క చలనం వ్యాకోచం సమయంలో రక్తమును పీలుస్తుంది మరియు ధమనుల యొక్క నాడిగతి ద్వారా రక్తం చలిస్తుంది.

జఠరికల మధ్య ఉన్న గోడలోని రంధ్రాల గుండా ప్రసరించటం ద్వారా ఎడమ జఠరిక నుండి కుడి జఠరికలోనికి ప్రవేశించే సిరల రక్తం నుండి, ఊపిరితిత్తుల నుండి పుపుస ధమని ద్వారా గుండె యొక్క ఎడమ భాగానికి ప్రసరించిన గాలి నుండి మంచి రక్తం తయారవుతుందని గాలెన్ నమ్మాడు. మంచి రక్తం తయారవటం వలన 'సూటీ' వాయువులు తయారయి నిశ్వసించటానికి పుపుస ధమని గుండా ఊపిరితిత్తుల లోనికి కూడా ప్రసరిస్తుంది.

1025 లో, పర్షియన్ వైద్యుడు, అవిసెన్నా రచించిన ది కెనాన్ ఆఫ్ మెడిసిన్, "జఠరికల మధ్య రక్తం రవాణా అవటానికి జఠరిక గోడలో ఉన్న రంధ్రం యొక్క ఉనికి గురించిన గ్రీకు అభిప్రాయాన్ని పొరపాటుగా అంగీకరించింది." అయినప్పటికీ, అవిసెన్నా "హృదయ చక్రములు మరియు కవాటముల పనుల గురించి సరిగ్గా రాసాడు", మరియు తన ట్రీటైజ్ ఆన్ పల్స్లో "రక్త ప్రసరణ యొక్క ఆలోచనను కలిగి ఉన్నాడు".[5] గాలెన్ యొక్క తప్పుడు నాడీ సిద్ధాంతమును కూడా సరిచేస్తూ, అవిసెన్నా నాడీ గతి యొక్క మొదటి సరైన వివరణను అందించాడు: "నాడి యొక్క ప్రతి స్పందన రెండు చలనములను మరియు రెండు తాత్కాలిక విరామములను కలిగి ఉంటుంది. ఆ విధంగా, వ్యాకోచము : విరామము : సంకోచము : విరామము. [...] నాడి అనేది గుండె మరియు ధమనులలో ఒక చలనము ... ఇందులో సంకోచము మరియు వ్యాకోచము మార్చి మార్చి జరుగుతాయి."[6]

1242 లో, అరేబియన్ వైద్యుడు, ఇబ్న్ అల్-నఫిస్, పుపుస ప్రసరణం యొక్క ప్రక్రియను కచ్చితంగా వర్ణించిన మొదటి వ్యక్తి అయ్యాడు, దీనికి అతను కొన్నిసార్లు ప్రసరణ వైద్యశాస్త్రం యొక్క పితామహుడిగా భావించబడ్డాడు.[7] ఇబ్న్ అల్-నఫిస్ తన కామెంటరీ ఆన్ అనాటమీ ఇన్ అవిసెన్నా'స్ కెనాన్లో ఈ విధంగా ప్రకటించాడు:

"...గుండె యొక్క ఎడమ గది నుండి రక్తం ఎడమ గదికి తప్పని సరిగా రావాలి కానీ వాటి మధ్య ఏ విధమైన సరాసరి మార్గం లేదు. గుండె యొక్క మందపాటి గోడలో చిల్లులు లేవు మరియు కొంతమంది అనుకున్నట్లు కనిపించే రంధ్రాలు లేవు లేదా గాలెన్ భావించినట్లు కనిపించని రంధ్రాలు కూడా లేవు. కుడి గది నుండి రక్తం వీనా ఆర్టెరియోసా (పుపుస ధమని) ద్వారా ఊపిరితిత్తులకు ప్రవహించాలి, దాని పదార్దముల గుండా వ్యాపిస్తుంది, అక్కడి గాలితో కలుస్తుంది, గుండె యొక్క ఎడమ గదికి చేరుకోవటానికి ఆర్టెరియా వీనోసా (పుపుస సిర) గుండా ప్రసరించాలి మరియు అక్కడే ముఖ్యమైన ప్రాణం రూపొందుతుంది..."

దానికి తోడు, ఇబ్న్ అల్-నఫిస్ కి కేశనాళికా ప్రసరణం గురించిన జ్ఞానం ఉంది. అతను ఈ విధంగా ప్రకటించాడు "పుపుస ధమని మరియు సిరల మధ్య చిన్న అనుసంధానాలు లేదా రంధ్రములు (అరబిక్ లో మనఫిద్ ) ఉండాలి," ఈ ఆలోచన 400 సంవత్సరాలకు పైన కనుగొనబడిన కేశనాళిక వ్యవస్థ ముందటిది.[8] అయినప్పటికీ, ఇబ్న్ అల్-నఫిస్ యొక్క సిద్ధాంతం, ఊపిరితిత్తులలో రక్తం రవాణాకు మాత్రమే పరిమితం అయి ఉంటుంది మరియు శరీరమంతటికీ వ్యాపించదు.

చివరకు హీరోనిమస్ ఫాబ్రిసియస్ (పూర్వం వాటి విధిని గుర్తించకుండానే నాళముల యొక్క కవాటములను వర్ణించినవాడు) శిష్యుడైన విలియం హార్వే, అనేక పరిశోధనలు చేసి, 1628 లో Exercitatio Anatomica de Motu Cordis et Sanguinis in Animalibusను ప్రచురించాడు, ఇది "కేవలం ఊపిరితిత్తులే కాకుండా, సిరలు మరియు ధమను మధ్య శరీరమంతటా ప్రత్యక్ష అనుసంధానం ఉండి ఉండాలని చూపించింది. మరీ ముఖ్యంగా, హృదయ స్పందన శరీరం యొక్క అంత్య భాగాల వద్ద ఉన్న సూక్ష అనుసంధానాల ద్వారా నిరంతర రక్త ప్రసరణను ఉత్పత్తి చేసిందని అతను వాదించాడు. ఇది ఇబ్న్ అల్-నఫిస్ యొక్క శరీర నిర్మాణ శాస్త్రం మరియు గుండె మరియు ఊపిరితిత్తులలో రక్త ప్రసరణ యొక్క సూక్ష్మ తర్కాంశము నుండి గొప్ప ముందడుగు."[9] ఈ సిద్ధాంతం, దాని యొక్క కచ్చితంగా సరైన వివరణలతో వైద్య ప్రపంచాన్ని నెమ్మదిగా ఒప్పించింది. అయినప్పటికీ, హార్వే ధమనులను మరియు సిరలను అనుసంధానిస్తున్న కేశనాళికా వ్యవస్థను గుర్తించ లేకపోయాడు; వీటిని ఆ తర్వాత 1661 లో మార్సెల్లో మాల్పిఘి కనుగొన్నాడు.

ఇతర చిత్రములు

ఇవి కూడా చూడండి

సూచనలు

  1. "cardiovascular system" at Dorland's Medical Dictionary
  2. "circulatory system" at Dorland's Medical Dictionary
  3. 3.0 3.1 Dwivedi, Girish & Dwivedi, Shridhar (2007). History of Medicine: Sushruta – the Clinician – Teacher par Excellence . National Informatics Centre (Government of India).
  4. Anatomy - History of anatomy
  5. Mohammadali M. Shojaa, R. Shane Tubbsb, Marios Loukasc, Majid Khalilid, Farid Alakbarlie, Aaron A. Cohen-Gadola (29 May 2009), "Vasovagal syncope in the Canon of Avicenna: The first mention of carotid artery hypersensitivity", International Journal of Cardiology, Elsevier, 134 (3): 297–301, doi:10.1016/j.ijcard.2009.02.035CS1 maint: multiple names: authors list (link)
  6. Rachel Hajar (1999), "The Greco-Islamic Pulse", Heart Views 1 (4): 136-140 [138]
  7. Chairman's Reflections (2004), "Traditional Medicine Among Gulf Arabs, Part II: Blood-letting", Heart Views 5 (2), p. 74-85 [80].
  8. West, John B. (October 9, 2008), "Ibn al-Nafis, the pulmonary circulation, and the Islamic Golden Age", Journal of Applied Physiology, 105: 1877–80, doi:10.1152/japplphysiol.91171.2008CS1 maint: date and year (link)
  9. Peter E. Pormann and E. Savage Smith, Medieval Islamic medicine Georgetown University, Washington DC, 2007, p. 48.

వెలుపలి వలయాలు