"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

ప్రాచీన సంఖ్యా విధానము

From tewiki
Jump to navigation Jump to search

ఇపుడు వాడుకలోనున్న అంకెలను గురించి, వాటి పుట్టుపూర్వోత్తరముల గురించి తెలిసికొనుట మనకు చాలా ఆసక్తి కలిగిస్తుంది. నేటి అంకెలు మన ప్రాచీన భారతీయులు ఉపయోగించిన లిపి నుండి, అరబ్బు అంకెల నుండి రూపొందాయి. ప్రాచీన భారతీయులు సంఖ్యా క్రమ విధానాన్ని దశ గుణాంక క్రమము అంటారు. ప్రతి స్థానము పది రెట్లు చొప్పున పెరుగుతూ ఉంటుంది.[1]

స్థానాల పేర్లు

ప్రాచీన సంఖ్యామానంలో స్థానవిలువలు
స్థానముల పేర్లు ఘాత రూపం విస్తరణ రూపం
ఏకము 100 1
దశ 101 10
శతం, వంద, నూరు 102 100
సహస్రం, వెయ్యి 103 1,000
ఆయుతము (దశ సహస్రము) 104 10,000
నియుతము (లక్ష) 105 1,00,000
ప్రయుతము (దశ లక్ష) 106 10,00,000
కోటి 107 1,00,00,000
దశ కోటి, పదికోట్లు 108 10,00,00,000
శత కోటి, వందకోట్లు, బిలియను 109 1,00,00,00,000
వెయ్యి కోట్లు 1010 10,00,00,00,000
అర్బుదం, నిఖర్వం 1011 1,00,00,00,00,000
మహార్బుదం, న్యర్బుదం 1012 10,00,00,00,00,000
ఖర్వం 1013 1,00,00,00,00,00,000
మహాఖర్వం 1014 10,00,00,00,00,00,000
పద్మం 1015 1,00,00,00,00,00,00,000
మహాపద్మం 1016 10,00,00,00,00,00,00,000
క్షోణి 1017 1,00,00,00,00,00,00,00,000
మహాక్షోణి 1018 10,00,00,00,00,00,00,00,000
శంఖం 1019 1,00,00,00,00,00,00,00,00,000
మహాశంఖం 1020 10,00,00,00,00,00,00,00,00,000
క్షితి 1021 1,00,00,00,00,00,00,00,00,00,000
మహాక్షితి 1022 10,00,00,00,00,00,00,00,00,00,000
క్షోభం 1023 1,00,,00,00,00,00,00,00,00,00,00,000
మహాక్షోభం 1024 10,00,00,00,00,00,00,00,00,00,00,000
నిధి 1025 1,00,00,00,00,00,00,00,00,00,00,00,000
మహానిధి 1026 10,00,00,00,00,00,00,00,00,00,00,00,000
పర్వతం 1027 1,00,00,00,00,00,00,00,00,00,00,00,00,000
పదార్థం 1028 10,00,00,00,00,00,00,00,00,00,00,00,00,000
అనంతం 1029 1,00,00,00,00,00,00,00,00,00,00,00,00,00,000
సాగరం 1030 10,00,00,00,00,00,00,00,00,00,00,00,00,00,000
అవ్యయం 1031 1,00,00,00,00,00,00,00,00,00,00,00,00,00,00,000
అచింత్యం 1032 10,00,00,00,00,00,00,00,00,00,00,00,00,00,00,000
అమేయం 1033 1,00,00,00,00,00,00,00,00,00,00,00,00,00,00,00,000
1034 10,00,00,00,00,00,00,00,00,00,00,00,00,00,00,00,000
భూరి 1035 1,00,00,00,00,00,00,00,00,00,00,00,00,00,00,00,00,000
మహాభూరి 1036 10,00,00,00,00,00,00,00,00,00,00,00,00,00,00,00,00,000
వృదం 1037 1,00,00,00,00,00,00,00,00,00,00,00,00,00,00,00,00,00,000
మహావృందం 1038 10,00,00,00,00,00,00,00,00,00,00,00,00,00,00,00,00,00,000

ఈ విధంగా స్థాన భెదాల చేత సంఖ్యలను తెలిపెటప్పుడు కొన్ని స్థానాలలో అంకెలేవీ లేకపోవచ్చును. అంకెలు లేని చోట్ల సున్నలు వ్రాయాలి. క్రీస్తు మరణించిన ఐదేండ్లకు ఈనాటి దాకా వాడుకలో నున్న అంకగణిత విధానాన్ని మన భారతదేశంలో కనుగొన్నారు. ఈ కాలంలో భారతదేశం విజ్ఞాన శాస్త్రాలకు పట్టు గొమ్మగాగణిత శాస్త్రానికి స్వర్ణయుగంగా భాసిల్లింది. దీనికి కారణం ఆర్యభట్టు, వరాహమిహిరుడు వంటి గణిత శాస్త్రవేత్తలు. మన పూర్వులు అధర్వణ వేదం లో అనేక గణిత సమస్యలను చర్చించారు. వాటిని అభ్యాసం చేసినచో అనేక క్లిష్టమైన గణిత సమస్యలనైనా సులభంగా గణించవచ్చు. భారతీయ గణిత విధానాన్ని గణిత శాస్త్రవేత్తలే కాక వ్యాపారస్తులు కూడా అభివృద్ధి చేశారని అంటారు. వారు ప్రతి దశాంశ స్థాయిలోను అంకెలను ఉపయోగించి ఖాళీలలో చుక్కలు పెట్టేవారట. తరువాత ఆ చుక్కలను తొలగించి సున్న ప్రవేశించింది. క్రీ.శ.800 ప్రాంతాలలో భారతీయ వర్తకులు బిడారులలో వర్తకం చేస్తూ పోయినపుడు బాగ్దాదు వారికి అరబ్బుల పాలనలో ఉన్న స్పెయిన్ కు చేరింది. యూదు పండితుల రచనల ద్వారా ఈ విధానం ఐరోపా దేశానికి ప్రవేశించింది.

గణిత శాస్త్రము విజ్ఞానమునకు తోడు వినోదాన్ని అందించుననుతకు సందేహం లేదు. గణిత సమస్యలు సాధించుటలో మెదదుకు మేత కలిగించి పిల్లల మనోవికాసమును పెంపొందుంచును.

మూలాలు

  1. Vemuri, V. Rao (2003-10). Telugu English Dictionary (in English). Asian Educational Services. ISBN 978-81-206-1637-0. Check date values in: |date= (help)

యివి కూడా చూడండి