ప్రాస

From tewiki
Jump to navigation Jump to search

ఒక పద్యం లోని ప్రతి పాదం లోని రెండవ అక్షరాన్ని ప్రాస అంటారు. మొదటి పాదంలో రెండవ అక్షరం ఏ విధంగా ఉంటుందో తక్కిన పాదాలన్నింటిలో రెండవ అక్షరం ఆ విధంగానే ఉండాలి. దీనినే ప్రాస మైత్రి అంటారు.

నియమాలు

 • ప్రథమ పాదమందు ద్వితీయాక్షరము ఏ హల్లుండునో తక్కిన పాదములలో ఆ హల్లే ఉండవలయును.
 • ప్రాసాక్షరము ద్విత్వమైన, అన్ని పాదములందునూ అదే అక్షరము ద్విత్వముగను, సంయుక్తమైన అన్ని పాదములందునూ అదే హల్లు సముదాయము సంయుక్తముగను ఉండవలెను.
 • ప్రాస పూర్వాక్షరము గురువైన, అన్ని పాదములందునూ ప్రాస పూర్వాక్షరము గురువుగనూ, ప్రాస పూర్వాక్షరము లఘువైన, అన్ని పాదములందునూ ప్రాస పూర్వాక్షరము లఘువుగను ఉండవలెను.
 • ప్రాస పూర్వాక్షరము పూర్ణబిందువుతో కూడిన, అన్ని పాదములందునూ పూర్వాక్షరము పూర్ణబిందువుతో ఉండవలెను.
 • ద-ధ, ధ-థ, ఱ-ర, న-ణ, ల-ళ లకు ప్రాస కుదురును.

తెలుగు పద్యరీతులలో

ప్రాసభేదాలు

ప్రాస భేదాలు 17 రకాలుగా ఉన్నాయని అప్పకవి చెప్పడం జరిగింది.

 1. అర్థబిందు సమప్రాసం
 2. పూర్ణబిందు సమప్రాసం
 3. ఖండాఖండ ప్రాసం
 4. సంయుతాక్షర ప్రాసం
 5. సంయుతాసంయుత ప్రాసం
 6. రేఫయుత ప్రాసం
 7. లఘుద్విత్వ ప్రాసం
 8. వికల్ప ప్రాసం
 9. ఉభయ ప్రాసం
 10. అనునాసిక ప్రాసం
 11. ప్రాసమైత్రి ప్రాసం
 12. ప్రాసవైరం
 13. స్వవర్గజ ప్రాసం
 14. ఋప్రాసం
 15. లఘుయకార ప్రాసం
 16. అభేద ప్రాసం
 17. సంధిగత ప్రాసం

బాహ్య లంకెలు