ప్రీతా రెడ్డి

From tewiki
Jump to navigation Jump to search
డాక్టర్ ప్రీతా రెడ్డి
Preetha Reddy at the World Economic Forum on India 2012.jpg
ప్రపంచ ఆర్ధిక వేదిక వద్ద భారతదేశంలో 2012న ప్రీతారెడ్డి
జాతీయతభారతీయురాలు
విద్యాసంస్థస్టెల్లా మేరీస్ కాలేజ్, చెన్నై, మద్రాసు విశ్వవిద్యాలయం [1]
వృత్తిమేనేజింగ్ డైరెక్టర్, అపోలో హాస్పిటల్స్

భారతదేశం యొక్క అతిపెద్ద ఆరోగ్య సంస్థలుగా ఉన్న అపోలో హాస్పిటల్స్ (చెన్నై) యొక్క మేనేజింగ్ డైరెక్టర్ ప్రీతా రెడ్డి. ఈమె ఆరోగ్య పరిశ్రమ విభాగంలో భారతదేశం యొక్క మార్గదర్శక మహిళా వ్యాపారవేత్తలలో ఒకరు. ఈమె సెప్టెంబరు 2012 లో వైద్య సాంకేతిక సంస్థ మెడ్ట్రానిక్ యొక్క స్వతంత్ర నిర్దేశకులుగా బోర్డుకు ఎన్నికయ్యారు. ఈమె అపోలో హాస్పిటల్స్ గ్రూప్ వ్యవస్థాపక ఛైర్మన్ డాక్టర్ ప్రతాప్ చంద్ర రెడ్డి కుమార్తె. ప్రతాప్‌రెడ్డి 02-07-2014న అపోలో హాస్పిటల్స్ గ్రూప్ వైస్ ఛైర్‌పర్సన్‌గా ప్రీతా రెడ్డికి పదోన్నతి ఇచ్చారు. 1989లో అపోలో హాస్పిటల్స్‌లో సంయుక్త మేనేజింగ్ డైరెక్టర్‌గా లాంఛనంగా చేరిన ప్రీతా రెడ్డి, ఐదేళ్ల తరువాత గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ బాధ్యతలు స్వీకరించారు.

విద్య

ఈమె రసాయనశాస్త్రంలో మద్రాసు విశ్వవిద్యాలయం నుండి బ్యాచులర్ ఆఫ్ సైన్స్ డిగ్రీని, అన్నామలై విశ్వవిద్యాలయం నుంచి పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ లో మాస్టర్స్ డిగ్రీని పొందారు.

తోబుట్టువులు

ఈమెకు ముగ్గురు సోదరీమణులు, సునీత రెడ్డి, సంగీత రెడ్డి, శోభన కామినేని వీరందరూ అపోలో హాస్పిటల్స్ లో డైరెక్టర్లుగా పనిచేస్తున్నారు.

మూలాలు

  • ఈనాడు దినపత్రిక - 04-07-2014