"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

ప్రీతీ జింటా సినిమాల జాబితా

From tewiki
Jump to navigation Jump to search
దస్త్రం:PreityZinta.jpg
జాన్-ఎ-మాన్(2006) సినిమా ఫంక్షన్ లో ప్రీతీ

ప్రీతీ జింటా ప్రముఖ బాలీవుడ్ నటి. 1998లో దిల్ సే.. లో సహాయ నటి  పాత్రతో తెరంగేట్రం చేశారు ఆమె. ఆ తరువాత సోల్జర్ సినిమాలో  నటించారు. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది.[1][2] ఈ రెండు సినిమాల్లోని నటనకు గానూ ప్రీతీ ఆ ఏడాది ఫిలింఫేర్ ఉత్తమ నటి డెబ్యూ పురస్కారాన్ని కూడా అందుకున్నారు.[1] ఆ తరువాత సంఘర్ష్(1999), క్యా కెహనా(2000) వంటి సినిమాల్లో నటించారు. క్యా కెహనా మంచి హిట్ గానే నిలిచింది.[1][3] అదే ఏడాది హర్ దిల్ జో ప్యార్ కరేగా, మిషన్ కాశ్మీర్ వంటి సినిమాల్లో నటించారు. మిషన్ కాశ్మీర్ చిత్రం ఆ ఏడాది అతి ఎక్కువ వసూళ్ళు చేసిన మూడో చిత్రంగా నిలిచింది.[4]

2001లో దిల్ చాహ్తా హై సినిమాలో నటించారు ప్రీతీ.[5] అదే ఏడాది చోరీ చోరీ చుప్కే చుప్కే సినిమాలో నటించి, విమర్శకులను, ప్రేక్షకులను మెప్పించారామె.[6] 2002లో కేవలం దిల్ హై తుమ్హారా సినిమాలో కనిపించారు ప్రీతీ. ఈ సినిమా ఫ్లాప్ అయింది.[7][8] 2003లో ఆమె నాలుగు సినిమాలు చేశారు. అనిల్ శర్మ దర్శకత్వంలో, సన్నీ డియోల్ తో కలసి ది హీరో సినిమాలో నటించారు. ఆ సినిమా అప్పటికి బాలీవుడ్ లోనే అతి ఎక్కువ ఖర్చుతో నిర్మించిన సినిమా.[9] ఆ తరువాత అర్మాన్ సినిమాలో ప్రతినాయిక పాత్రలో నటించారు ప్రీతీ.[10] కోయీ.. మిల్ గయా, కల్ హో నా హో సినిమాల్లో చేశారు ఆమె.[11] ఈ రెండు చిత్రాలూ బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచాయి. కల్ హో నా హో  సినిమాలోని నటనకు ఫిలింఫేర్ ఉత్తమ నటి పురస్కారం అందుకున్నారు ప్రీతీ.[12]

2004లో ఆమె నటించిన లక్ష్య చిత్రం పెద్దగా విజయం సాధించలేదు. ఈ సినిమాలో ప్రీతీ విలేఖరి పాత్రలో కనిపించారు.[13] అదే ఏడాది యశ్ చోప్రా తీసిన వీర్-జారా సినిమాలో షారుఖ్ ఖాన్ సరసన నటించారు ఆమె.[14] ఆ ఏడాదికిగానూ ఈ చిత్రం అతి ఎక్కువ వసూళ్ళు సాధించిన సినిమాగా నిలిచింది.[15] 2005లో సలాం నమస్తే, 2006లో కభీ అల్విదా నా కెహనా సినిమాల్లో నటించారు ప్రీతీ. ఈ రెండు చిత్రాలూ భారత్ లో హిట్ కావడమే కాక, విదేశీ మార్కెట్లోనూ మంచి లాభాలు సాధించాయి.[16][17] సలాం నమస్తేలో రేడియో జాకీగా,[18] కభీ అల్విదా.. చిత్రంలో ఇష్టం లేని వివాహం చేసుకున్న అమ్మాయిగా ఆమె నటన ప్రేక్షకుల విమర్శకుల ప్రశంసలు అందుకుంది.[3][19] జాన్-ఎ-మాన్(2006), ఝూం బరాబర్ ఝూం(2007) వంటి ఫ్లాప్ సినిమాల్లో నటించారు ఆమె.[20][21] 2008లో హెవెన్ ఆన్ ఎర్త్ అనే కెనడా చిత్రంలో నటించారు ప్రీతి. ఈ సినిమా ఆమె మొట్టమొదటి అంతర్జాతీయ చిత్రం.[1] 

2011లో గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్ - ఎబి ఇండియా తోడేగా, అప్ క్లోజ్ & పర్సనల్ విత్ పిజెడ్ అనే రియాలిటీ షోలకు వ్యాఖ్యాతగా వ్యవహరించారు ప్రీతి. అదే ఏడాది ఆమె తన నిర్మాణ సంస్థ పి.జెడ్.ఎన్.జెడ్ మీడియాను స్థాపించారు.[22]  2013లో ఇష్క్ ఇన్ పారిస్ సినిమాను నిర్మించారు ప్రీతీ. ఈ చిత్రం పెద్దగా విజయం సాధించలేదు.[23]

మూలాలు