"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

ప్లాస్మాత్వచం

From tewiki
Jump to navigation Jump to search

జంతు కణంలోని కణపదార్దాన్ని సైటోప్లాసం అనీ, దాన్ని ఆవరించి వున్న త్వచాన్ని కణత్వచం లేదా ప్లాస్మాత్వచం అని పిలుస్తారు.

కణ ప్రత్యేకతలు

 • కణం ఒక జీవ ప్రమాణంగా, జీవ ప్రమాణం ఒక కణంగా భావించడమే కణానికి ఉన్న ప్రత్యేకత .
 • కనిష్ఠ జీవ పదార్ద రాశిలో తగిన జీవక్రియలు ఉండటమే ఈ ప్రత్యేకత.
 • కణాంతర్భాగం లోని పరిస్థితులు కణబహిర్భాగాన ఉన్న పరిస్థితులకు విబిన్నంగా, జీవ క్రియలు జరగడానికి అనుకూలంగా ఉండడానికి కారణం ప్లాస్మాత్వచం అనే కణాంగమే.
 • జంతు కణాలన్నింటిలో సాగే గుణం కలిగి వరణాత్మక పారగమ్యత కలిగిన పొరతో ఆవరించి ఉంటుంది.
 • 1885 సం.లో సి..క్రామర్, నగేలి అనే శాస్త్రవేతలు ఈ త్వచన్ని కణత్వచం అని పేర్కొన్నారు.
 • 1931 లో J.Q. ప్లవర్ అనే శాస్త్రవేత్త దీన్ని ప్లాస్మాలెమ్మాగా నామకరణం చేశాడు
 • డి.రాబర్ట్ సన్ అనే శాస్త్రవేత్త ఈ కణత్వచన్ని ప్లాస్మాత్వచంగా వర్ణించాడు.ప్రస్తుతం ఈ పేరే వాడుకలో ఉంది.
 • ప్లాస్మత్వచం నిర్మాణం దాదాపు 1959 లో రాబర్ట్ సన్ పరికల్పన చేసిన ప్రమాణ త్వచన్ని పోలి ఉంటుంది.
 • ఈ విదంగా 35A ప్రమాణాల మందంలో ఉన్న మధ్య పొర రెండు ఫాస్పోలిపిడ్ పొరలతో ఏర్పడి ఉంటుందని, దానికిరువైపులా 20A ప్రమాణాల మందంతో రెండు ప్రోటీను పొరలు ఉండి మొత్తం 75A ప్రమాణాల మందం ఉన్న ఈ లైపో ప్రోటీన్ త్వచన్ని ప్రమాణ త్వచం అంటారు.

రసాయనిక నిర్మాణం

 • ప్లాస్మ త్వచం కొవ్వు పదార్దాలు, ప్రోటీన్లు, కొన్ని ఆలిగో సాకరైడ్లు, నీరు మొదలైన పదార్దాలతో ఏర్పడి ఉంటుంది.
 • ముఖ్యంగా ఇది లిపిడ్లు, ప్రోటీన్లతో ఏర్పడి ఉంటుంది.
 • కాబట్టి దీన్ని లైపోప్రోటీన్ త్వచం అని అంటారు.

లిపిడ్లు

 • లిపిడ్లు ముఖ్యంగా ఫాస్ఫోలిపిడ్లు, కొలెస్టిరాల్ రూపంలో ఉంటాయి ఫ్పాస్పోలిపిడ్లు రెండు రకాలు 1. న్యూట్రల్ ఫాస్పోలిపిడ్లు

ఆసిడ్ ఫాస్ఫోలిపిడ్లు

 • న్యూట్రల్ ఫాస్పోలిపిడ్లు;- వీటికి విద్యుదావేశం లేదు. ప్లాస్మాత్వచంలో ఇవి యుగళ త్వచంగా దగ్గరగా బంధించబడి ఉంటాయి. ఉదా; ఫాస్ఫాటిడిల్ కోలిన్
 • ఆసిడ్ ఫాస్ఫోలిపిడ్లు;- ఇవి ఋణ విద్యుత్ ఆవేశాన్ని కలిగిన ప్రోటీన్లతో కలిసి ఉంటాయి. ఉదా; ఫాస్ఫాటిడిల్ ఐనోసిటాల్

ప్రోటీన్లు

ప్లాస్మాత్వచంలో రెండు రకాలైన ప్రోటీన్లు ఉంటాయి. అవి

 1. నిర్మాణాత్మక ప్రోటీన్లు
 2. క్రియాత్మక ప్రోటీన్లు

నిర్మాణాత్మక ప్రోటీన్లు నిర్మాణాత్మక ప్రోటీన్లు త్వచానికి యాంత్రిక శక్తి ఇవ్వడంలో తోడ్పడతాయి. ఈ నిర్మాణాలు ప్లాస్మా పొరకు వెన్నెముక వంటిది. ఇవి రెండు రకాలు

 1. పరిదీయ ప్రోటీన్లు
 2. అంతర్గత ప్రోటీన్లు

ఉదాహరణ - ఎర్ర రక్త కణాలో స్పెక్ట్రిన్

క్రియాత్మక ప్రోటీన్లు;-ప్లాస్మాతవచంలో ఉండే క్రియాత్మక ప్రోటీన్లు అనేక క్రియలను నిర్వర్తిస్తాయి. ప్లాస్మాత్వచం నుంచి దాదాపు 30 రకాల ఎంజైం లను వేరు పరచారు. వాటిలో కొన్ని ఆల్కలైన్ ఫాస్పటేజ్ RNA ఉదా; ATP-ase, ప్లాస్మాత్వచ నిర్మాణం;- దీని నిర్మాణాన్ని సూచించే అనేక సిద్దాంతాలు ద్వీస్తర సిద్దాంతం; డేవ్ సన్, డానియెల్లీ, అనే శాస్త్రవేత్తలు 1952 లో ప్రతిపాదించారు

 • దీని ప్రకారం రెండు వరసలలో ఉన్న ఫాస్ఫోలైపిడ్ అణువులు రెండు ప్రోటీన్ పొరల మద్యన అమరి వుంటాయి.
 • జల సఖ్య గుణం గల ధ్రువశిరో భాగాలు వెలుపల వైపునకు అమరి ఉండి ప్రోటీన్ అణువులలో హైడ్రోజన్ బంధాల ద్వారా కలపబడి ఉంటుంది.

త్రిస్తర సిద్దాంతం; దీన్ని జె.డేవిడ్ రోబర్ట్ సన్ అనే శాస్త్రవేత్త ప్రతిపాదించారు.

 • దీని ప్రకారంప్లాస్మాత్వచం మందం దాదాపు 75A లు ఉంటుంది
 • అందులో మద్య వున్నకొవ్వు 35A లు దానికి ఇరువైపులా 20A ప్రమాణాల మందం ఉన్న రెండు ప్రోటీన్ పొరలు ఉంటాయి.

మైసిల్లార్ నమూనా; హిల్లియర్, హాఫ్ మన్ అనే శాస్త్రవేత్తలు ప్రతిపాదించారు.

 • 1953లో ప్లాస్మ త్వచం పటలికా రహితమైన అమరికలో ఉంటుందని వర్ణించారు.
 • ఈ సిద్దాంతం ప్రకారమం పాస్పోలిపిడ్లు లోపలి వైపున గోళాకారంలో ఉన్న మైసెల్లై అనే ఉపభాగాలుగా ఏర్పడి ఉంటాయి.
 • ఈ మైసెల్లై ప్లాస్మాత్వచంలో భాగాలుగా అమరి ఉంటాయి.
 • ఒక్కో మైసెల్లైలో 6-8 ఫాస్పోలిపిడ్ అణువులు అమరి ఉంటాయి.

ద్రవరూప మొజాయిక్ నమూనా; సింగర్-నికోల్సన్ 1972 లో ప్రతిపాదించాడు.

 • దీన్ని శాస్త్రవేత్తలు అందరూ ఆమోదించారు
 • వీరి పరికల్పన ప్రకారం1. లిపిడ్లు, ప్రోటీన్లు మొజాయిక్ విధానంలో అమరి ఉంటాయి.

2.జీవ సంబంధ త్వచాలన్ని అసమగ్ర ద్రవ రూప నిర్మాణాలు. అందులో లిపిడ్, ప్రోటీన్ భాగాలు ద్విస్తరిత లిపిడ్ పొరలో స్థానాంతర చలనం చేయగలిగే స్థితిలో ఉంటాయి.

ప్లాస్మాత్వచం విధులు

ప్లాస్మాత్వచం ద్వారా వివిధ పద్ధతులలో రవాణా చెందుతుంది.1. ఆస్మాసిస్ 2.నిష్క్రియా రవాణా 3. సక్రియా రవాణా 4. ఎండోసైటోసిస్ 5. ఎక్సోసైటాసిస్

ఆస్మాసిస్ దీనిని ద్రవాభిసరణ అని కూడా అంటారు.

 • నీరు మొదలయిన ద్రవ పదార్ధాలు ప్లాస్మాత్వచం ద్వారా తక్కువ గాఢత నుండి అధిక గాడ ద్రావణం లోకి రెండు ద్రావణాల గాఢత సమానం అయ్యే వరకు ప్రవహిస్తాయి.
 • ఈ ప్రక్రియను ఆస్మాసిస్ అని అంటారు.

నిష్క్రియా రవాణా దీనిని వ్యాపనం అని కూడా అంటారు.

 • వివిధ పదార్థాల యొక్క అయాన్లు, అణువులు అధిక గాఢత నుండి తక్కువ గాఢత గల ప్రదేశాలకు ప్రయాణిస్తుంది.
 • ఈ ప్రక్రియను వ్యాపనం అని అంటారు

సక్రియా రవాణా- రసాయనిక ప్రవణత గాఢతకు వ్యతిరేకంగా ప్లాస్మాత్వచం ద్వారా వివిధ పదార్దాల రవాణాను సక్రియా రవాణా అంటారు. ఈ పద్ధతిలో వివిధ పదార్ధాలు అల్ప గాఢతల నుంచి అధిక గాఢత గల ప్రదేశాలకు వెలుతుంది. ఉధా; .చిన్న పేగు కుడ్యంలో గల ఉపకళాకణాలలో గ్లూకోజు అమైనో ఆమ్లాల గాఢత చిన్న పేగు కుహరంలో కంటే కొన్ని వందల రెట్లు అధికంగా ఉన్నప్పటికి కుహురం నుంచి కణాలలోకి ఈ పదార్థాల రవాణా సక్రియా రవాణా పద్ధతిలో జరుగుతుంది. ఎండోసైటోసిస్; ఈ పద్ధతిలో ప్లాస్మాత్వచం పదార్దలను వాటి చుటూ ఆశయాల నేర్పరచి జాంతవ భక్షన పద్ధతిలో కణంలోకి గ్రహిస్తుంది. దీన్ని అంతర గ్రహణం అంటారు. ఇవి 2 రకాలు1. కణపాణం 2. కణ భక్షణ