"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

ఫాదర్ లూయిజీ ఫెజ్జోనీ

From tewiki
Jump to navigation Jump to search

డాక్టర్ ఫాదర్ లూయిజీ ఫెజ్జోని కుష్టురోగుల వైద్యుడు.47ఏళ్లపాటు నల్గొండ లో నివసించి కుష్టు రోగులకు విశేష సేవలందించారు. డాక్టర్ ఫెజ్జోని ఇటలీ దేశంలోని ఎలస్కో గ్రామంలో 1931 జూలైలో జన్మించారు. ఆయన తండ్రి అంజిలో, తల్లి లుచియా. అభాగ్యులకు, కుష్ఠురోగ పీడితులకు సేవ చేయాలనే తలంపుతో 1966లో వరంగల్‌ కు చేరుకున్నారు. అక్కడ బిషప్ బెరాటా వద్ద ముందుగా ఇంగ్లీషు మాట్లాడటం నేర్చుకున్నారు. "మానవ సేవే మాధవసేవ" అని నమ్మి ఆచరించి చూపిన మహోన్నత వ్యక్తి. 1967 లో నల్లగొండ జిల్లాలో ఊరూరా తిరుగుతూ కుష్ఠు రోగులు ఎక్కడ ఉంటే అక్కడకు స్వయంగా వెళ్లి వారి పుండ్లు కడిగి, కట్లు కట్టి, మందులు అందించాడు. అచేతనంగా ఉన్న రోగులకు ఆధ్యాత్మిక చింతన అవసరం అని తలంచాడు. రోమన్ క్యాథలిక్ క్రైస్తవ భక్తిని బోధించాడు. పెజ్జోని రోగులకు శారీరక, మానసిక స్వస్థత చేకూర్చేందుకు తన సేవా కార్యక్రమాలకు భంగం వాటిల్లుతుందని, వివాహం కూడా చేసుకోకుండా ఆజన్మ బ్రహ్మచారి గా జీవించాడు.లూయిజీ ఫెజ్జోనిని రోగులు ప్రత్యక్ష్య దైవంగా భావించేవారు. 1977లో నల్లగొండ నుంచి ఆయన ఇటలీ వెళ్లి పోవాలనుకున్నారు. కానీ ఇక్కడి రోగులు ఆయన వెళ్లడానికి ఒప్పుకోలేదు. కేవలం 6 నెలలు మాత్రమే ఇటలీ వెళ్లి కుష్టు వ్యాధి నివారణకు, చికిత్సకు ప్రత్యేకమైన శిక్షణ పొంది వచ్చారు. జిల్లాలో రోగుల రాక పెరగడంతో ఇటలీ నుంచి కుష్ఠు వ్యాధి చికిత్సలో శిక్షణ పొందిన సిస్టర్ స్టెల్లా, సిస్టరు అసుందలను నల్లగొండకు రప్పించారు. లెప్రసీ ఆస్పత్రి, పాఠశాల, కాన్వెంట్, పేషంట్ల కోసం 1700 ఇళ్లతో 2కాలనీలు కట్టించారు. 7తరగ తి నుంచి పెద్ద చదువులు చదువుకునే రోగుల పిల్లలకు ఇంజినీరింగ్ లాంటి పెద్ద చదువులకు కూడా ఆర్థిక సహాయాన్ని అందించారు. కుష్టురోగం భారి నుంచి బయటపడిన వారికి ఉద్యోగాలిచ్చి ఆదుకున్నారు.12.11.2013 న నల్లగొండలోని లెప్రసీ ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు.

విశేషాలు

  • "దైవమే నాతో సేవ చేయిస్తుంది.నాగొప్పతనం ఏమీ లేదు".
  • "సేవలకు ఎలాంటి ప్రచారం అక్కర్లేదు"

Lua error in మాడ్యూల్:Authority_control at line 369: attempt to index field 'wikibase' (a nil value).