ఫుట్‌బాల్ క్లబ్ ఇంటర్నేజనలే మిలనో

From tewiki
Jump to navigation Jump to search

ఫుట్‌బాల్ క్లబ్ ఇంటర్నేజనలే మిలనో, మామూలుగా ఇంటర్నేజనలే లేదా ఇంటర్‌ గా పరిచితమైనది, ఒక ఫుట్‌బాల్ క్లబ్ ఇది మిలన్, లోంబర్డీ, ఇటలీకి చెందిన క్లబ్. ఇటలీ వెలుపల ఈ క్లబ్‌ని తరచుగా ఇంటర్ మిలన్ అని పిలుస్తుంటారు.[1][2] ఇంటర్ జట్టు ఇటలీ ఛాంఫియన్లు, 2009–10లో వీరి విజయంతో వరుసగా అయిదవ టైటిల్ గెల్చుకుని ఆల్-టైమ్ రికార్డును సమం చేశారు.[3] ప్రస్తుతం ఇంటర్ జట్టు యూరోప్‌కి ఛాంపియన్‌లు.

నలుపు మరియు నీలం పట్టీలు గల దుస్తులను ధరించి, వీరు 1908 నుంచి ఇటాలియన్ ఫస్ట్ డివిజన్‌లో ఆడారు. ఈ క్లబ్ పద్దెనిమిది ఇటాలియన్ లీగ్ పతకాలు, ఆరు ఇటాలియన్ కప్‌లు మరియు అయిదు ఇటాలియన్ సూపర్ కప్‌లతో సహా 29 జాతీయ ట్రోఫీలను గెల్చుకుంది. అంతర్జాతీయ స్థాయిలో, వీరు మూడు యూరోపియన్ కప్/ఛాంపియన్స్ లీగ్‌ను గెల్చుకున్నారు; మొట్టమొదటగా 1964 మరియు 1965లో వరుసగా రెండు యూరోపియన్ కప్‌లను గెల్చుకున్నారు ఆపై 45 ఏళ్ల తర్వాత 2010లో కూడా ఈ కప్ గెలుచుకున్నారు, అదే సీజన్‌లో కోప్పా ఇటాలియా మరియు స్కుడెట్టో టైటిల్స్ గెల్చుకున్న తర్వాత, కనీవినీ ఎరుగని రీతిలో (ఇటాలియన్ టీమ్‌ కోసం) మూడుసార్లు పతకాలు గెలుచుకున్నట్లయింది. క్లబ్ 1991, 1994 మరియు 1998లలో మూడు UEFA కప్‌లు, 1964 మరియు 1965లలో రెండు ఇంటర్నేషనల్ కప్‌లు గెల్చుకుంది.

ఇంటర్ ఇటలీలోని అతి పెద్ద స్టేడియం అయిన గిసెప్పీ మిజ్జా స్టేడియంలో (దీన్ని శాన్ సిరో అని కూడా అంటారు) ఆడింది, ఏంజెలో మోరాట్టి స్పోర్ట్స్ సెంటర్‌లో (లా పినెటినా అని కూడా అంటారు) శిక్షణ పొందారు, ఇది కోమో సమీపంలోని అపియానో జెంటైల్‌లో 30 కిలోమీటర్ల దూరంలో ఉంది.

చరిత్ర

ఆరంభ సంవత్సరాలు (1908–1952)

1909–10 లో స్కుడెట్టో గెలిచినా మొదటి ఇంటర్ సైడ్.

మిలన్ క్రికెట్ మరియు ఫుట్‌బాల్ క్లబ్ (43 మంది సభ్యుల), మధ్య "విభేదం" నేపథ్యంలో, ఈ క్లబ్‌ని 1908 మార్చి 9న ఫుట్‌బాల్ క్లబ్ ఇంటర్నేజనల్ మిలనో పేరిట స్థాపించారు. ఇటాలియన్ మరియు స్విస్‌ జాతీయులకు చెందిన ఒక గ్రూప్ (గియోర్గియో, క్లబ్ లోగో డిజైన్ చేసిన పెయింటర్, బోస్సార్డ్, లానా, బెర్టోలోని, డె ఒల్మా, ఎన్రికో హింటర్‌మాన్, అర్టురో హింటర్‌మాన్, కార్లో హింటర్‌మాన్, పియట్రో డెలోరో, హ్యూగో మరియు హాన్స్ రైట్‌మన్, వొయెల్కిల్, మానెక్, విఫ్ట్, మరియు కార్లో అర్డుస్సీ)లు AC మిలన్ టీమ్‌లో ఇటాలియన్‌ల ఆధిపత్యాన్ని భరించలేక వారినుంచి విడిపోయి, ఇంటర్నేజనల్ ఆవిర్భావానికి దారి తీశారు. ప్రారంభం నుంచి, క్లబ్ విదేశీ ఆటగాళ్లకోసం తలుపులు తెరిచి ఉంచింది, ఆ విధంగా అది తన సంస్థాపక పేరుకు తగినట్లుగా మెలిగింది.

క్లబ్ తన మొట్టమొదటి స్కుడెట్టో (ఛాంపియన్‌షిప్‌)ను 1910లో గెలుచుకుంది మరియు రెండోసారి 1920లో గెల్చుకుంది. మొట్టమొదటి స్కుడెట్టో కెప్టెన్ మరియు కోచ్ విర్గిలియో ఫోసాట్టి, ప్రపంచ యుద్ధం Iలో మరణించాడు. 1922లో ఇంటర్ సెర్రీ Aలో గ్రూప్ Bలో ఉండేది, సీజన్ మొత్తంలో 11 పాయింట్లు మాత్రమే సాధించడంతో చివరి స్థానంలో వచ్చింది. ప్రతి గ్రూప్‌లో చివరి స్థానంలో వచ్చిన జట్టు తనకు తానుగా వైదొలుగుతుంది. చివరినుంచి రెండో స్థానంలో వచ్చిన జట్లు తొలగింపు ముందటి 'సాల్వేషన్' టోర్నమెంట్‌లో స్థానం దక్కించుకుంటాయి. సీరీస్ B ఆర్థికంగా వినాశకర స్థితిలో ఉండిన సంవత్సరంలో సీరీస్ Aలో ఇంటర్ పాల్గొనేందుకు అనుమతించవలసిందిగా ఇంటర్ మరియు లా గజెట్టా డెల్లో స్పోర్ట్ ఎడిటర్ (కొలంబో)లు FIGCకి అభ్యర్థించాయి. 1923లో సీరీస్ Aలో ఇంటర్ కొనసాగేందుకు అనుమతించడం ద్వారా సీజన్‌కు ముందు కొన్నివారాల పాటు ఇంటర్ జట్టును FIGC కాపాడింది. 1928 ఫాసిస్ట్ పాలనాకాలంలో క్లబ్ మిలనీస్ యూనియనె స్టోర్టివాలో విలీనం కావలసి వచ్చింది మరియు అంబ్రోసియానా SS మిలనోగా తన పేరు మార్చుకుంది.[4] ఈ దఫా వీళ్లు రెడ్ క్రాస్ ముద్రించిన తెల్ల షర్టులను ధరించారు. షర్ట్ డిజైన్ మిలన్ నగర పతాక మరియు అధికారిక చిహ్నాలచే ప్రభావితమైంది, క్రీస్తు శకం 4వ శతాబ్ది మిలన్ ఋషి అయిన సెయింట్ అంబ్రోస్ పతాక నుంచి తీసుకోబడింది. రానున్న కొత్త అధ్యక్షుడు ఒరెస్టె సిమోనోట్టి క్లబ్ పేరును 1929లో AS అంబ్రోసియానా గా మార్చాలని నిర్ణయించాడు. ఏమయినప్పటికీ, మద్దతుదారులు మాత్రం జట్టును "ఇంటర్" అని పిలవడం కొనసాగించారు. కొత్త అధ్యక్షుడు పొజ్జాని వాటాదారుల ఒత్తిడికి తలవంచి జట్టు పేరును AS అంబ్రోసియానా-ఇంటర్‌గా మార్చాడు.

వీరి మొట్టమొదటి కొప్పా ఇటాలియా (ఇటాలియన్ కప్)ను గిసెప్పె మీజ్జా నేతృత్వంలో 1938–39లో గెల్చుకున్నారు, శాన్ సిరో స్టేడియంకి అధికారికంగా పేరు పెట్టాక మీజ్జాకు గాయం తగిలినప్పటికీ 1940లో అయిదో లీగ్ ఛాంపియన్‌షిప్ జరిగింది. ప్రపంచ యుద్ధం II ముగిసిన తర్వాత, క్లబ్ తన పాత పేరుకు దగ్గరగా ఉండే ఇంటర్నేజనల్ FC మిలనోగా మళ్లీ ఆవిర్భవించింది, అప్పటినుంచి దీనికి ఈ పేరే స్థిరపడింది.

లా గ్రాండె ఇంటర్

యుద్ధం నేపథ్యంలో, ఇంటర్నేజనల్ 1953లో తన ఆరవ ఛాంపియన్‌షిప్‌ను 1954లో ఏడవ ఛాపియన్‌షిప్ గెల్చుకుంది. ఈ పతకాల నేపథ్యంలో, ఇంటర్ తన చరిత్రలో ఉత్తమ సంవత్సరాలను చవిచూసింది, ఈ కాలాన్ని లా గ్రాండె ఇంటర్ (ది గ్రేట్ ఇంటర్) అని అభిమానంగా పిలుచుకుంటున్నారు. ఈ కాలంలోనే హెలెనియో హెర్రెరా ప్రధాన కోచ్‌గా, క్లబ్ 1963, 1965, 1966 సంవత్సరాలలో మూడు లీగ్ ఛాంపియన్‌‌షిప్‌లు గెల్చుకుంది. ఇంటర్ వరుసగా రెండు యూరోపియన్ కప్ విజయాలను గెల్చుకోవడం కూడా ఈ దశాబ్దంలో అత్యంత సుప్రసిద్ధ క్షణాలలో పొందుపర్చబడింది. 1964లో, ఇంటర్ ఆ టోర్నమెంట్లలో తొలిదాన్ని సుప్రసిద్ధ స్పానిష్ క్లబ్ రియల్ మాడ్రిడ్‌పై ఆడి గెల్చుకుంది. తదుపరి సీజన్‌లో తమ స్వంత హోమ్ స్టేడియం శాన్ సిరోలో ఆడుతూ వారు రెండు సార్లు మాజీ ఛాంపియన్‌లైన బెన్‌ఫికాను ఓడించారు.1966–67 సీజన్‌లో ఇంటర్నేజనల్ మళ్లీ యూరోపియన్ కప్ ఫైనల్‌కు వెళ్లింది కాని లిస్బన్‌లో కెల్టిక్‌ చేతిలో 2–1తో ఓడిపోయింది.

1960లలోని స్వర్ణయుగాన్ని అనుసరించి, ఇంటర్ తన 11వ లీగ్‌ని 1971లోనూ, పన్నెండవ లీగ్‌ని 1980లో గెల్చుకోగలిగింది. ఇంటర్ జట్టు 1972లో యూరోపియన్ కప్ ఫైనల్‌లో అంటే అయిదేళ్లలో రెండోసారి జోహాన్ క్రయిఫ్‌కి చెందిన అజాక్స్ చేతిలో 2–0 తేడాతో ఓడిపోయింది. 1970 మరియు 1980లలో ఇంటర్ 1977–78 మరియు 1981–82లో మరో రెండు కోప్పా ఇటాలియాస్ పతకాలను తన ఖాతాలో కలుపుకుంది.

జర్మన్ ద్వయం ఆండ్రియాస్ బ్రెహ్మ్ మరియులోథార్ మాట్టాస్, మరియు అర్జెంటైన్ రామోన్ డియాజ్‌ల నేతృత్వంలో ఇంటర్ 1989 సెరీ A ఛాంపియన్‌షిప్‌ను కోచ్ జియోవన్ని ట్రప్టోని ఆధ్వర్యంలో గెల్చుకుంది. తోటి జర్మన్ జుర్గెన్ క్లిన్స్‌మాన్ మరియు ఇటాలియన్ సూపర్‌కప్‌లు తర్వాతి సీజన్‌లో తోడయ్యాయి కాని ఇంటర్ తన టైటిల్‌ను ఎక్కువకాలం అట్టే నిలుపుకోలేకపోయింది.

కష్ట కాలాలు (1990–2004)

1990లు క్లబ్‌కు నిరాశాపూరితమైన కాలం. వారి మేటి ప్రత్యర్థులు మిలన్ మరియు జువెంటిస్ దేశీయంగాను, ఐరోపా‌లోనూ విజయాలు సాధించాయి, తన స్థాయిలలో సగటు స్థితితో ఇంటర్ వెనుకబడిపోయింది, వారి ఘోరమైన ముగింపు 1993–94లో జరిగింది, వారు పోటీనుంచి వైదొలగడానికి కేవలం ఒక్క పాయింట్ తేడాతో నిలిచారు. కాకుంటే, 1991, 1994, మరియు 1998 సంవత్సరాలలో మూడు UEFA కప్ విజయాలతో వీరు ఆ దశాబ్దంలో కొంతవరకు యూరోపియన్ విజయాన్ని సాధించారు.

1995లో ఎర్నెస్టో పెల్లెగ్రిని నుంచి మాస్సిమో మోరాట్టిని కొనుగోలు చేశాక, రొనాల్డో, క్రిస్టియన్ వైరీ, మరియు హెర్నాన్ క్రెస్పో వంటి మేటి క్రీడాకారుల దన్నుతో ఇంటర్ క్లబ్ మరింత విజయాలు సాధిస్తానని వాగ్దానం చేసింది, ఈ కాలంలోనే బదలాయింపు రుసుము విషయంలో ఇంటర్ క్లబ్ రెండు దఫాలు ప్రపంచ రికార్డు బద్దలు గొట్టింది.[citation needed] 1997లో బార్సెలోనా జట్టునుంచి రొనాల్డోని €19.5 మిలియన్‌లకు, 1999లో లాజియో నుంచి క్రిస్టియన్ వైరీని €31 మిలియన్‌లకు కొన్నారు. ఏమైనా, 1990లు నిరాశాపూరితమైన దశాబ్దంగా కొనసాగింది, ఇంటర్ చరిత్రలో కనీసం ఒక సెరై A ఛాంపియన్‌షిప్ గెల్చుకోవడంలోనూ విఫలమైన ఏకైక దశాబ్దంగా ఇది నిలిచింది. ఇంటర్ అభిమానుల విషయానికి వస్తే, ఆ కల్లోల కాలంలో ఎవరిని తప్పుపట్టాలో గుర్తించడం కష్టమైపోయింది, దీంతో కంపెనీ అధ్యక్షుడికి, మేనేజర్లకు, కొంతమంది జట్టు సభ్యులకు కూడా సంబంధాలు సన్నగిల్లాయి.

ఇంటర్ ఛైర్మన్ మాస్సిమో మోరాట్టి తర్వాత అభిమానులకు లక్ష్యంగా మారాడు, ప్రత్యేకించి తామెంతో అభిమానించే కోచ్ లుయిగి సిమోనిని పదవినుంచి తొలగించాక, 1998-99 సీజన్‌లో కొద్ది గేమ్‌లను మాత్రమే ప్రకటించాక, ఒక్క రోజు ముందుగా 1998 ఇటాలియన్ మేనేజర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును అందుకున్న తరువాత మొరాట్టి తన కాంట్రాక్టును ముగించడానికి నిర్ణయించుకున్నాడు. 1998-99 సీజన్‌లో ఇంటర్ పదేళ్ల కాలంలో మొదటిసారిగా యూరోపియన్ కాంపిటీషన్‌లో అర్హత సాధించడంలో విఫలమై పేలవమైన రీతిలో ఎనిమిదవ స్థానంలో వచ్చింది.

1999-00 సీజన్‌లో మాస్సిమో మొరాట్టి మరోసారి స్టార్ క్రీడాకారులతో ఒప్పందం చేసుకోవడం ద్వారా జట్టులో కీలకమైన మార్పులను తీసుకువచ్చాడు. ఇంటర్ కంపెనీలో ప్రధాన మార్పు ఏందంటే మాజీ జువెంటుస్ మేనేజర్ మార్సెల్లో లిప్పిని నియమించడం. అత్యదిక శాతం అభిమానులు మరియు ప్రెస్ కూడా ఎట్టకేలకు ఇంటర్ విన్నింగ్ ఫార్ములాను దొరకబుచ్చుకుందని భావించారు. ఇతర ఒప్పందాలు ఏంజెలో పెరుజ్జి మరియు ఫ్రెంచ్ దిగ్గజం లారెంట్ బ్లాంక్‌లతో పాటు మాజీ జువెంటుస్ క్రీడాకారులు క్రిస్టియన్ వైరీ మరియు వ్లాదిమిర్ జుగోవిచ్‌‌లతో జరిగాయి. ఈ సీజన్‌లో ఇంటర్ కాస్త ముందంజ వేసింది ఎందుకంటే వారికి యూరోపియన్ "వ్యాకులత" కలగలేదు. మరోసారి వారు అంతుచిక్కకుండా ఉన్న స్కుడెట్టోను గెల్చుకోవడంలో విఫలమయ్యారు. ఏదేమైనా, వారు 1989 నుంచి తమ మొట్టమొదటి దేశీయ విజయానికి సన్నిహితంగా రాగలిగారు, కోప్పా ఇటాలియా ఫైనల్‌కు చేరుకున్న ఇంటర్, లాజియో చేతిలో ఓడిపోయి దానికి స్కుడెట్టో విజయంతోపాటు దేశీయ కప్ డబుల్‌ కూడా సాధించిపెట్టారు.

తదుపరి సీజన్, మరింత వినాశకరంగా దెబ్బతీసింది. సూపర్‌కోప్పా ఇటాలియా మ్యాచ్‌లో లాజియో జట్టుపై చక్కటి ఆట ప్రదర్శించిన ఇంటర్ కొత్తగా చేరిన రాబర్ట్ కీనె ద్వారా ముందంజ వేసింది – కాని చివరకు 4–3తో ఓడిపోయింది. మొత్తంమీద చూస్తే, వారు ప్రారంభం కానున్న సీజన్‌లో చక్కగా ఆడేలాగే కనిపించారు. తర్వాత జరిగిందేమిటంటే వారు ఛాంపియన్స్ లీగ్‌లో స్వీడిష్ క్లబ్ హెల్సింగ్‌బోర్గ్ చేతిలో ఓడిపోయి ప్రిలిమినరీ రౌండ్‌లోనే ఇంటిముఖం పట్టి మళ్లీ నిరాశ పరిచారు. అల్వారో రెకోబా డ్రా చేసుకునే అవకాశాన్ని చివరి నిమిషంలో పెనాల్టీ ద్వారా పొందాడు కానీ, తను మళ్లీ తప్పాడు, తన ప్రయత్నాన్ని గోల్ కీపర్ స్వెన్ ఆండర్సన్ అడ్డుకున్నాడు, ఆ సమయంలో మేనేజర్‌గా ఉన్న మార్సెల్లో లిప్పీ కొత్త సీజన్‌లో ఒకే ఒక్క ఆట తర్వాత పదవినుంచి తప్పించబడ్డాడు. ఈ ఆటలో ఇంటర్ జట్టు సెరీ A పోటీలో మొట్టమొదటిసారిగా రెగ్గీనా జట్టు చేతిలో ఓడిపోయారు. ఈ కాలం పొడవునా, ఇంటర్ తమ పొరుగు జట్టైన మిలన్ చేతిలో ఓడిపోయారు, మిలన్ ఇటు స్వదేశంలోనూ, అటు ఐరోపా లోనూ విజయాలు సాధిస్తోంది. అలాగే తమ నగర ప్రత్యర్థుల చేతిలో వరుసగా ఓటములతో ఇంటర్ బాగా దెబ్బతింది, 2000-01లో వీరు 6–0తో ఘోరంగా ఓడిపోయారు. చరిత్రలో "స్వదేశం"లో వారికి ఇదే తొలి ఘోరపరాజయం. మార్కో టార్డెల్లి లిప్పీ స్థానంలో ఎంపిక చేయబడ్డాడు కాని ఫలితాలను మెరుగుపర్చడంలో విఫలమయ్యాడు, దీంతో ఈ మ్యాచ్‌ను కోల్పోయిన మేనేజర్‌గా ఇంటర్ అభిమానుల దృష్టిలో ఉండిపోయాడు. ఈ కాలంలో దెబ్బతిన్న జట్టులో ఇతర సభ్యులు క్రిస్టియన్ వైరీ మరియు ఫాబియో కాన్నవరో, మిలన్‌లో వీరిద్దరికీ ఉన్న రెస్టారెంట్లను మిలన్‌తో ఓటమి తర్వాత జనం ధ్వంసం చేశారు. శాన్ లొరెంజో జట్టు నుంచి ఇవాన్ కొర్డోబా వచ్చి చేరినప్పటికీ, అది తదుపరి సంవత్సరాలలో జట్టు మెరుగుదలకు తోడ్పడింది.

ఈ కాలం మొత్తంగా ఇంటర్ అభిమానులు జట్టు ఆటకు నిరసనగా విధ్వంసానికి దిగడంతో పాటు కొందరు ప్లేయర్లకు వ్యతిరేకంగా స్టేడియం బయట బానర్లు కట్టడం, నిరసన తెలుపడం చేస్తూ వచ్చారు. కొన్ని సందర్భాలలో అభిమానులు కుర్వా నోర్డ్ ఏర్పాటు చేశారు, అంటే స్టేడియంలో ఒక భాగాన్ని అన్ని మ్యాచ్‌లలోనూ ఖాళీగా ఉంచారు. ఈ కాలంలోనే ఇంటర్ తరచుగా ఛాంపియన్‌షిప్ ఫేవరైట్లలో ఒకరిగా భావించబడుతూ వచ్చింది. ఇది ఇంటర్‌కి వ్యతిరేకంగా మిలన్‌ను జనం ప్రశంసించేంతవరకూ పోయింది — "లుగ్లియో అగోస్టో" (జూలై మరియు ఆగస్టు; ఇలా ఎందుకు జరిగిందంటే, వేసవి నెలల కాలంలో ప్రెస్ అభిప్రాయం ప్రకారం, ప్రారంభం కాకముందే ఛాంపియన్‌షిప్‌ను ఇంటర్ గెలుచుకుంది, తాము చేసిన వాగ్దానాన్ని నిజం చేయనందుకే ఇలా చేశారు.

2002లో, ఇంటర్, UEFA కప్ సెమీ ఫైనల్స్‌కు చేరుకోగలిగింది, స్కుడెట్టో కప్‌ కైవసం చేసుకునేందుకు వారికి మరో 45 నిమిషాల సమయం కూడా ఉంది, రోమ్ స్టేడియో ఒలింపికోలో సీజన్ ఫైనల్‌మ్యాచ్‌లో వారు లాజియోపై ఒక గోల్ ముందంజలో ఉండవలసి ఉంది, సైరీ A పట్టికలో ఇంటర్ అగ్రస్థానంలో నిలిచింది. అయితే, రెండో స్థానంలో ఉన్న జువెంటస్, చివరకు మూడో స్థానంలో ఉన్న రోమా కూడా ఈ పోటీలో విజయం సాధించగలిగితే వారే టైటిల్ ఎగురవేసుకుపోగలరు. ఫలితంగా, లాజియో అభిమానులు కొందరు వాస్తవానికి ఈ మ్యాచ్‌లో ఇంటర్‌కి బహిరంగంగా మద్దతు పలికారు, ఎందుకంటే ఇంటర్ విజయం సాధిస్తే లాజియో చిరకాల ప్రత్యర్థి అయిన రోమా జట్టును ఛాంపియన్‌షిప్ గెల్చుకోకుండా అడ్డుకోవచ్చు. 24 నిమిషాలలో ఇంటర్ 2–1 తో నిలిచింది. తొలి అర్ధ భాగం ఇంజురీ సమయంలో లాజియో స్కోరును సమం చేయడమే కాక రెండో సగ భాగం ఆటలో మరి రెండు గోల్స్ సాధించి విజయం సాధించింది, దీంతో ఉడినెస్ జట్టుపై 2–0 విజయంతో జువెంటస్ జట్టు ఛాంపియన్‌షిప్‌ను ఎగురేసుకుపోయింది. ఈ మ్యాచ్ జరిగిన రోజు – 5 May 2002 – ఈనాటికీ ఇంటర్ జట్టును వెంటాడుతోంది.

2002–03లో ఇంటర్ గౌరవనీయమైన రెండో స్థానం పొందింది మరియు 2003 ఛాంఫియన్స్ లీగ్ సెమీ ఫైనల్స్‌లో మిలన్‌తో పోటీ పడే అవకాశం ఇచ్చింది. అయితే మిలన్ జట్టుతో ఇంటర్ 1–1తో డ్రా చేసుకున్నప్పటికీ ఇంటర్ అదే మైదానంలో రెండు మ్యాచ్‌లూ ఆడినప్పటికీ కోల్పోయిన గోల్స్ నిబంధన వల్ల ఓడిపోయింది. ఇది మరొక నిరాశకలిగించే ఘటనే కాని మొత్తం మీద వారు సరైన దారికి వచ్చారు.

అయితే మరోసారి మాస్సిమో మోరాట్టి అసహనం అతడిలో మంచి గుణాలను హరించింది, హెర్మన్ క్రెస్పో ఒక సీజన తర్వాత అమ్మివేయబడ్డాడు మరియు కొద్ది ఆటలు మాత్రమే ఆడినప్పటికీ హెక్టర్ క్యూపర్‌ని సాగనంపారు. అల్బర్టో జాకెరోని రంగంమీదికి వచ్చాడు, ఇంటర్ జట్టు జీవితకాల అభిమానే అయినప్పటికీ ఇతడు 2002లో ఇంటర్ జట్టుపై 4-2 తేడాతో గెలిచిన లాజియో జట్టు బాధ్యుడిగా ఉండేవాడు, దీంతో అభిమానులు ఇతడిని అనుమానంగా చూశారు. జువెంటస్‌పై ట్యురిన్‌లో 3-1తో, శాన్ సిరోపై 3-2 తేడాతో రెండు అద్భుత విజయాలు సాధించిపెట్టడం తప్ప, జాకెరోని ఇంటర్ జట్టుకు ఒరగబెట్టిందేమీ లేదు, ఈ సీజన్ కూడా ప్రత్యేకత లేకుండానే ముగిసింది. గ్రూపులో మూడో స్థానంతో సరిపెట్టుకున్న తర్వాత తొలి రౌండ్‌లోనే UEFA ఛాంపియన్స్ లీగ్ నుంచి ఇంటర్ జట్టు వైదొలిగింది. పైగా, వీరు పర్మా జట్టు కంటే ఒక పాయింట్ ఆధిక్యతతో నాలుగో స్థానంలో నిలబడటం ద్వారా ఛాంఫియన్స్ లీగ్‌కు అర్హత మాత్రమే సాధించగలిగారు. 2003-04లో ఇంటర్‌కి మేలు జరిగిందంటే జనవరి 2004లో డెజాన్ స్టాన్‌కోవిక్ మరియు అడ్రియానోలు జట్టులోకి రావడమే, ఈ ఇద్దరు దృఢమైన క్రీడాకారులు హెర్మన్ క్రెస్పో మరియు క్లారెన్స్ సీడోర్ఫ్‌ల నిష్క్రమణ తర్వాత ఏర్పడిన ఖాళీని పూరించారు.

పునరుత్థానం

2005 జూన్ 15న ఇంటర్నేజనలె జట్టు రెండు చోట్ల జరిగిన ఫైనల్ పోటీలో (మిలన్‌లో 1–0తో, రోమ్‌లో 2-0తో), రోమా జట్టును ఓడించి కోప్పా ఇటాలియా టైటిల్ గెల్చుకుంది, ఆగస్టు 20న జరిగిన పోటీలో 2004-05 సెరై A ఛాంపియన్స్ జువెంటస్‌పై అదనపు సమయంలో 1-0తో విజయం సాధించి (ఈ టైటిల్‌ని కోల్పోక ముందు) సూపర్‌కొప్పా ఇటాలియానా టైటిల్‌ను గెల్చుకుంది. ఈ సూపర్ కప్ విజయం 1989 తర్వాత ఇంటర్ గెల్చుకున్న మొదటి టైటిల్, యాదృచ్ఛికంగా అదే సంవత్సరం అది స్కుడెట్టోని 2006కి ముందు చివరిసారిగా గెల్చుకోవడం విశేషం. 2006 మే 11న మరోసారి రోమాపై 4-1 సగటు విజయంతో ఓడించడం ద్వారా (రోమ్‌లో A 1–1 స్కోరుతో, శాన్ సిరో వద్ద 3-1తో) ఇంటర్ జట్టు తమ కోప్పా ఇటాలినా ట్రోఫీని గెల్చుకుంది.

ఇంటర్ జట్టు 2005-06 సెరై A ఛాంపియన్‌షిప్‌ను గెల్చుకుంది, జువెంటస్ మరియు మిలన్ నుంచి పాయింట్లు కొల్లగొట్టిన తర్వాత సీజన్ ఫైనల్ లీగ్ టేబుల్‌లో ఈ జట్టు అగ్రస్థానంలో నిలిచింది, జువెంటస్, మిలన్ జట్లు రెండూ ఆ సంవత్సరం మ్యాచ్ ఫిక్సింగ్ కుంభకోణంలో కూరుకుపోయాయి. 2006 జూలై 14న ఇటాలియన్ ఫెడరల్ అప్పీల్ కమిషన్ సెరై A క్లబ్‌లు జువెంటస్, లాజియో, ఫియొరెంటినా, రెగ్గీనా మరియు మిలన్ జట్లు మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడ్డాయని కనుగొంది. ఈ కుంభకోణంలో పాల్గొన్న అయిదు క్లబ్బులను శిక్షించింది. ఫలితంగా, జువెంటస్ జట్టును సెరై Bకి దించెయ్యడంతో (వారి చరిత్రలో ఇదే తొలిసారి) మరియు సిటీ ప్రత్యర్థులు మిలన్‌కి 8 పాయింట్లు తగ్గించడంతో రానున్న 2006-07 సెరై A సీజన్‌లో సెరై A టైటిల్ నిలుపుకోవడంలో ఇంటర్ ఫేవరైట్‌గా మారింది.

ఈ సీజన్‌లో, ఇంటర్ జట్టు సెరై Aలో 17 వరుస విజయాలతో రికార్డు బద్దలు గొట్టింది, 2006 సెప్టెంబరు 25న లివోర్నోపై స్వంత గడ్డపై 4-1 విజయంతో ప్రారంభించిన ఇంటర్ 2007 ఫిబ్రవరి 28న స్వంతగడ్డపై ఉడినెసెపై 1-1తో డ్రాతో సీజన్ ముగించింది. 2007 ఫిబ్రవరి 25న కెటానియా వద్ద 5-2తో విజయం సాధించి, "బిగ్ 5" నుంచి (ఇంగ్లండ్, ఇటలీ, స్పెయిన్, ఫ్రాన్స్, మరియు జర్మనీలలో అగ్రశ్రేణి లీగ్‌లు) బాయెర్న్ మ్యూనిచ్ మరియు రియల్ మాడ్రిడ్ రెండు జట్లూ సాధించిన 15 మ్యాచ్‌ల ఒరిజినల్ రికార్డును ఇంటర్ బద్దలు గొట్టింది. పతకాలకోసం ఈ పందెం దాదాపు అయిదు నెలలు కొనసాగింది, ఇది యూరోపియన్ లీగ్ ఫుట్‌బాల్‌ చరిత్రలో ఉత్తమ ప్రదర్శన, బెనెఫికా (29 విజయాలు), సెల్టిక్ (25 విజయాలు) మరియు PSV (22 విజయాలు) మాత్రమే దీనికంటే ఉత్తమంగా నిలిచాయి. జట్టు ప్రదర్శనను వెనక్కు తోసివేసే పోటీలలో రెగ్గీనా మరియు పాలెర్మో జట్ల చేతిలో (వరుసగా) 0–0 మరియు 2–2 తేడాతో ఇంటర్ జట్టు డ్రా చేసుకుంది, తొలి సగభాగం ఆటలో పాలెర్మో 2-0తో ముందంజలో ఉన్నప్పటికీ ఇంటర్ జట్టు ద్వితీయార్థంలో కోలుకుంది. అయితే సీజన్ ముగింపుకు వచ్చేసరికి వారు తమ అద్భుత విజయాల తీరును కొనసాగించలేకపోయారు, దేశీయ సీజన్‌లో శాస్ సిరో వద్ద జరిగిన తొలి గేమ్‌ను 3-1తో రోమాకు సమర్పించుకున్నారు, రోమా చివరి రెండు గోల్స్ ఆట చివర్లో సాధించడం విశేషం. ఇంటర్ ఒకే ఒక సంవత్సరం సెరై A పోటీల్లో అపజయం లేకుడా ఆస్వాదించింది.

2007 ఏప్రిల్ 22న స్టేడియో అర్టెమియో ఫ్రాంచీ వద్ద 2-1తో సెయినా జట్టును ఓడించిన తర్వాత ఇంటర్ వరుసగా రెండో పర్యాయం సెరై A ఛాంపియన్స్‌ని గెల్చుకుంది. ఇటాలియన్ ప్రపంచకప్ విన్నింగ్ డిఫెండర్ మార్కో మెటెరాజ్జీ 18వ, 60వ నిమిషాల్లో రెండు గోల్స్ సాధించాడు, వీటిలో రెండో గోల్ పెనాల్టీ కింద వచ్చింది. సెరై A మరియు UEFA ఛాంపియన్స్ లీగ్ పోటీలు రెండింటినీ గెలవడంతో ఇంటర్ జట్టు 2007–08 సీజన్ ప్రారంభించింది. జట్టు లీగ్‌పోటీలలో బాగా ప్రారంభించింది, తొలి దశ మ్యాచ్‌లలో పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది, ఛాంపియన్స్ లీగ్ నాకౌట్ దశకు అర్హత సాధించింది. అయితే ఫిబ్రవరి 19న జరిగిన ఛాంపియన్స్ లీగ్ పోటీలో లివర్‌పూల్‌ చేతిలో 2-0తో కుప్పగూలిపోవడంతో ఇంటర్ జట్టు మేనేజర్ రాబర్టో మేన్సిని భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది, అలాగే దీని తర్వాత వరుసగా మూడు సెరై A గేమ్స్‌ని కూడో చేజార్చుకోవడంతో స్వదేశంలో వీరి ఆట గతి కూడా అదృష్టానికి బాగా దూరమైంది (సాంపడోరియాతో, లీగ్ పోటీల్లో ప్రధాన ప్రత్యర్థఇ రోమా జట్టుతో డ్రా చేసుకున్నారు, తర్వాత సీజన్‌లో స్వంతగడ్డపై తొలి ఓటమిని నపోలీచేతిలో ఎదుర్కొన్నారు. ఛాంపియన్స్ లీగ్ పోటీల్లో లివర్‌పూల్ చేతిలో ఓటమితో నిష్క్రిమించిన తర్వాత మాన్సిని తన ఉద్యోగానికి రాజీనామా చేయబోతున్నట్లు ప్రకటించాడు, అయితే ఆ మరుసటి రోజు తన అభిప్రాయాన్ని మార్చుకున్నాడు.

ఫలితాలలో మెరుగుదల సాధించడంతో ఇంటర్ జట్టు రెండు సార్లు స్కుడెట్టో రేస్‌లో విజయావకాశాలకు దగ్గరగా వచ్చారు కాని, నగర ప్రత్యర్థులు మిలన్‌ చేతిలో ఓటమి, సెయినా రోమా జట్ల చేతిలో స్వంతగడ్డపై పోటీలను డ్రా చేసుకోవడంతో ఛాంపియన్‌షిప్ చివరి రౌండ్‌కు కేవలం ఒక పాయింట్ దూరంలో ఉండిపోయింది. తర్వాత ఇంటర్ జట్టు పార్మా వద్ద గెలుపొందింది, స్వీడిష్ స్ట్రయికర్ గ్లాటాన్ ఇబ్రహిమోవిక్ ఈ ఆటలో రెండు గోల్స్ చేయడంతో విజయం దక్కింది, అప్పటికే మోకాలి గాయంతో బాధపడుతున్న గ్లాటాన్ తన జట్టుకు స్కోరు తేవాలని బెంచ్‌కి వచ్చాడు.

ఈ విజయంతో, క్లబ్ మే 29న మాన్సినిని తొలగించాలని నిర్ణయించింది, ఛాంపియన్స్ లీగ్‌లో లివర్‌పూల్ జట్టు చేతిలో పరాజయం పొందిన తర్వాత అతడు చేసిన ప్రకటనలు అతడిపై వేటుకు కారణమయ్యాయి.[5] జూన్ 2న మాజీ FC పోర్టో మరియు చెల్సియా బాస్ జోస్ మౌరిన్హోను తమ క్లబ్ కొత్త కోచ్‌గా, గ్యుసెప్పె బరేసిని అతడి సహాయకుడిగా నియమిస్తున్నట్లు ఇంటర్ తన అధికారిక వెబ్‌సైట్‌లో ప్రకటించింది. దీంతో 2008-09 సీజన్‌లో ఇటలీలో పదవీచ్యుతుడైన ఏకైక విదేశీ కోచ్‌గా మౌరిన్హో ఘనత సాధించాడు.[6] 2008 వేసవిలో జరిగే జట్టు మార్పిడిలో మౌరిన్హో కేవలం ముగ్గురినే అదనంగా చేర్చుకున్నాడు, వారు మాన్సిని,[7] సుల్లె ముంటారి[8], మరియు రికార్డో క్వారెస్మా.[9] ఇంటర్ ప్రధాన కోచ్‌గా మౌరిన్హో తొలి సీజన్‌లో నెరజ్జూరి, ఇటాలియన్ సూపర్ కప్ గెల్చుకున్నాడు మరియు వరుసగా నాలుగో టైటిల్ కూడా గెల్చుకున్నప్పటికీ, మాంచెస్టర్ యునైటెడ్‌ చేతిలో ఓడిపోవడంతో వలుసగా మూడోసారి కూడా ఛాంపియన్స్ లీగ్ తొలి నాకౌట్ దశలోనే పోటీలనుంచి వైదొలిగారు. లీగ్ టైటిల్‌ని వరుసగా నాలుగో సారి గెల్చుకోవడంలో ఇంటర్ టోరినో మరియు జువెంటిస్‌ జట్ల సరసన నిలిచింది, ఈ రెండు జట్లు మాత్రమే ఈ ఘనత సాధించగా ఇంటర్ జట్టు గత 60 ఏళ్లలో ఈ ఫీట్ సాధించిన తొలి జట్టుగా నమోదైంది.

మూడు విజయాలు (2010)

2010 UEFA ఛాంఫియన్స్ లీగ్ ఫైనల్ ప్రారంభ జట్టువరుస

ఇంటర్ 2009–10 ఛాంపియన్స్ లీగ్‌లో మరింత అదృష్టాన్ని చవి చూసింది, మౌర్నిహో మాజీ జట్టు 3-1 సగటు విజయంతో చెల్సియాని తొలగించడం ద్వారా క్వార్టర్‌ పైనల్స్‌కి దూసుకెళ్లింది, ఆ మూడేళ్లలో నెరజ్జూరి జట్టు నాకౌట్ రౌండ్‌లోనే వెనక్కు వెళ్లిపోవడం ఇదే తొలిసారి. తర్వాత ఇంటర్ CSKA మాస్కో జట్టును 2–0తో ఓడించడం ద్వారా సెమీ పైనల్స్‌లోకి దూసుకెళ్లింది, దీంట్లో ఇది రెండు లెగ్స్‌లోనూ విజయం సాధించింది.[10] సెమీ ఫైనల్ తొలి దశలో గత ఛాంఫియన్లు బార్సెలోనాపై 3-1తో ఇంటర్ గెలుపొందింది. రెండో లెగ్ పోటీలో, ఇంటర్ 1-0తో ఆటను కోల్పోయింది కాని తమ అయదవ యూరోపియన్ కప్/ఛాంపియన్స్ లీగ్ ఫైనల్ పోటీల్లో ప్రత్యర్థి బాయెర్న్ మ్యూనిచ్‌పై 3-2తో ముందంజ వేసింది. డీగో మిలిటో రెండు గోల్స్ సాధించడంతో వారు మ్యాచ్‌ను 2-0తో గెలుచుకున్నారు మరియ ఐరోపా ఛాంపియన్లు అయ్యారు..[11] రోమాపై రెండు పాయింట్లతో నెగ్గడం ద్వారా వింటర్ జట్టు 2009–2010 సెరై A టైటిల్ కూడా గెల్చుకున్నది. రోమా జట్టుపైనే ఫైనల్‌లో 1-0తో గెలవడం ద్వారా 2010 కోప్పా ఇటాలియాను కూడా గెల్చుకున్నారు.[12]

ఒకే సీజన్‌లో స్కుడెట్టో, ది కోప్పా ఇటాలియా మరియు ప్రఖ్యాత ఛాంపియన్ల్ లీగ్ టైటిళ్లు గెల్చుకోవడం ద్వారా ఇంటర్నేజనలే మిలనే మూడు విజయాలు సాధించింది, ఈ ఫీట్ సాధించిన మొట్టమొదటి ఇటాలియన్ జట్టుగా వాసికెక్కింది. అయితే, జోస్ మౌరిన్హో లేకుంటే ఈ గౌరవాలను నిలబెట్టుకునే అవకాశం ఉండేది కాదు, 2010 మే 28న స్పానిష్ క్లబ్ రియల్ మాడ్రిడ్ జట్టు బాధ్యతలు చేపట్టడానికి అతడు అంగీకరించాడు.[13]

2010 ఆగస్టు 21న రోమా జట్టును 3-1తో ఓడించిన ఇంటర్ 2010 సూపర్‌కోప్పా ఇటాలియానాను గెల్చుకుంది, సంవత్సరంలో వారికిది నాలుగో ట్రోపీ కావడం విశేషం.

=== ఇతర చారిత్రక సమాచారం

===

ఇంటర్నేజనలే 1908 నుంచి తమ చరిత్ర మొత్తంలో ఇటాలియన్ అగ్రస్థానం నుంచి ఎన్నడూ తొలగించబడలేదు, ఈ వాస్తవాన్ని నెరజ్జుర్రి అభిమానులు అత్యంత గౌరవంతో చూస్తారు. దీంతో పోలిస్తే మిలన్ రెండు సార్లు తొలగించబడింది. 2006 నాటికి, కాల్సియోపోలి కుంభకోణం నేపథ్యంలో 2006-07 సీజన్‌లో జువెంటస్' సెరై Bకి దిగిపోవడంతో, ఇంటర్ తన గౌరవాన్ని నిలబెట్టుకున్న ఏకైక క్లబ్‌గా మారిపోయింది. శతాబ్దం పాటు అగ్రస్థానంలో ఉండటం ద్వారా ప్రపంచంలో ఏ క్లబ్ కూడా ఇంత సుదీర్ఘకాలం ఒకే స్థాయిలో ఉన్న చరిత్రను సాధించలేదు.

ఇంటర్నేజనలె ప్రస్తుత అధ్యక్షుడు యజమానిగా మాస్సిమో మోరాట్టి ఉన్నాడు. అతడి తండ్రి ఏంజెలో 1960లలో క్లబ్ స్వర్ణయుగపు రోజుల్లో ఇంటర్ అధ్యక్షుడిగా ఉండేవాడు.

రంగులు, బ్యాండ్జ్ మరియు మారుపేర్లు

దస్త్రం:FC Internazionale logo.png
క్రితం బాడ్జ్.

ఇంటర్ లోగో

ఇంటర్ సంస్థాపకులలో ఒకరైన పెయింటర్ గియోర్‌గియో ముగ్గియాని 1908లో ఇంటర్ మొట్టమొదటి లోగో రూపకల్పనకు బాధ్యత వహించాడు. మొదటి డిజైన్‌లో అనేక వృత్తాల మధ్య 'FCIM' అక్షరాలు చెక్కబడ్డాయి, ఇది క్లబ్ బ్యాడ్జిగా రూపొందింది. తర్వాతి సంవత్సరాలలో లోగోలోని వివరాలు మరింత ఉత్తమంగా సవరించబడినప్పటికీ, ఈ డిజైన్ ప్రాథమిక అంశాలు మాత్రం అలాగే కొనసాగాయి. 1998లో తన చిహ్నాన్ని కొత్త బ్లాండ్‌తో క్లబ్ పరిచయం చేసినప్పటికీ, చిన్న చిన్న సౌందర్య సంబంధిత సవరణలు చేసింది తప్పితే తన ఒరిజనల్ డిజైన్‌ని మాత్రం మార్పు చేయలేదు.

రంగులు

మూస:Football kit box 1908లో స్థాపించబడింది మొదలుకుని, ఇంటర్ జట్టు నలుపు, నీలం పట్టీలనే ధరిస్తూ వస్తోంది. నలుపు రాత్రిని ప్రతిబింబించజడానికి, నీలం ఆకాశాన్ని ప్రతిబింబించడానికి ఎంపిక చేయబడిందని పుకార్లు కూడా వ్యాపించాయి.[14] ప్రపంచ యుద్ధం IIలో స్పల్పకాలం మినహాయిస్తే, ఇంటర్ జట్టు నలుపు, నీలం పట్టీలను ధరించడం కొనసాగించింది, దీంతో వీటికి నెరజ్జూరిగా మారు పేరు కూడా స్థిరపడిపోయింది..[15] ఒక సందర్భంలో ఇంటర్ తన నలుపు, నీలి యూనిఫారాలను కూడా వదిలివేయాలని ఒత్తిడికి గురైంది. 1928లో, ఇంటర్ పేరు, ఫిలాసఫీ పాలక ఫాసిస్ట్ పార్టీకి ఇబ్బంది కలిగించింది. ఫలితంగా, అదే సంవత్సరం 20 ఏళ్లు పూర్తి చేసుకున్న ఈ పాత క్లబ్ యూనియన్ స్పోర్టివా మిలనెసెతో విలీనం కాబడింది. ఈ కొత్త క్లబ్‌కు మిలన్ సెయింట్ జ్ఞాపకార్థం అంబ్రోసినా SS మిలనో అనే పేరు పెట్టారు.[16] మిలన్ పతాకం (తెలుపు నేపథ్యంలో రెడ్ క్రాస్) సాంప్రదాయిక నలుపు, నీలి పతాక స్థానాన్ని ఆక్రమించింది.[17] రెండో ప్రపంచ యుద్ధం తర్వాత, ఫాసిస్టులు అధికారంనుంచి కూల్చివేయబడ్డాక, క్లబ్ తమ ఒరిజనల్ పేరు, రంగులను తిరిగి అమల్లోకి తెచ్చింది. 2008లో, ఇంటర్ తాను దరించే షర్ట్‌కు రెడ్ క్రాస్ తగిలించి, శతాబ్ది ఉత్సవాలను జరుపుకుంది. తమ నగర పతాకను దృష్టిలో ఉంచుకుని, ఇంటర్ జట్టు తన మూడవ కిట్‌పై ఈ విధానాన్ని ఉపయోగించడం ఈనాటికీ కొనసాగిస్తోంది.

పాము

ఇటలీలోని పుట్‌బాల్ క్లబ్బులకి జంతువులు తరచుగా ప్రాతినిధ్యం వహిస్తాయి, I1బీసిఓన్గా పిలవబడే గడ్డిపాము లేదా పాము ఇంటర్‌కు ప్రతినిధి. మిలన్ నగరానికి పాము ముఖ్యమైన చిహ్నం, మిలన్ హెరాల్డ్రీలలో తరచుగా దవడల మధ్య మనిషిని కలిగి ఉండి చుట్టలు చుట్టుకున్న పాము కనబడుతుంది. హౌజ్ ఆఫ్ స్ఫోర్జా (ఇతడు పునరుజ్జీవనోద్యమ కాలంలో మిలన్ నుండి ఇటలీని పరిపాలించాడు.) మిలన్ నగరం, చారిత్రక మిలన్ యొక్క డచ్చీ (ఒక 400 సంవత్సరాల పాటు పవిత్ర రోమన్ సామ్రాజ్యం యొక్క రాష్ట్రంగా ఉండేది మరియు ఇన్‌సెర్బియా యొక్క ఆయుధాల పైపూతగా ఉండటంతో, ఈ చిహ్నం ప్రసిద్ధి పొందింది. 2010-11 సీజన్ కొరకు ఇంటర్ యొక్క ఆవలి కిట్ సర్పాన్ని ప్రదర్శిస్తుంటుంది.

ప్రస్తుత బృందం

మరింత సమాచారం కోసం FC ఇంటర్నేజనలే మిలనో సీజన్ 2010-11ను చూడండి.

ఆటగాళ్ళు

మూస:Fs start మూస:Fs player మూస:Fs player మూస:Fs player మూస:Fs player మూస:Fs player మూస:Fs player మూస:Fs player మూస:Fs player మూస:Fs player మూస:Fs player మూస:Fs player మూస:Fs player మూస:Fs player మూస:Fs player మూస:Fs mid మూస:Fs player మూస:Fs player మూస:Fs player మూస:Fs player మూస:Fs player మూస:Fs player మూస:Fs player మూస:Fs player మూస:Fs player మూస:Fs player మూస:Fs player మూస:Fs player మూస:Fs player మూస:Fs player మూస:Fs end

ఋణంపై ఓడుట

మూస:Football squad start మూస:Football squad player మూస:Football squad player మూస:Football squad player మూస:Football squad player మూస:Football squad player మూస:Football squad player మూస:Football squad player మూస:Football squad player మూస:Football squad mid మూస:Football squad player మూస:Football squad player మూస:Football squad player మూస:Football squad player మూస:Football squad player మూస:Football squad player మూస:Football squad end

ప్రాధమిక


ఆటాడని సిబ్బంది

మూస:Fb cs header మూస:Fb cs staff మూస:Fb cs staff మూస:Fb cs staff మూస:Fb cs staff మూస:Fb cs staff మూస:Fb cs staff మూస:Fb cs staff మూస:Fb cs staff మూస:Fb cs staff మూస:Fb cs staff మూస:Fb cs staff మూస:Fb cs staff మూస:Fb cs staff మూస:Fb cs staff మూస:Fb cs staff మూస:Fb cs staff మూస:Fb cs staff మూస:Fb cs footer

విశ్రాంత సంఖ్యలు

3 - Italy గియాసింటో ఫాక్‌చెట్టి, లెఫ్ట్ బ్యాక్, 1960-1978 (మరణానంతర సత్కారం) . 2006 సెప్టెంబరు 8న సంఖ్య పదవీ విరమణ చేసింది. చొక్కా ధరించవలసిన చివరి ఆటగాడు అర్జెంటీనియన్ సెంటర్ బ్యాక్ నికోలాస్ బర్డిస్సొ, ఇతడు మిగిలిన సీజన్ కొరకు 16వ సంఖ్య గల చొక్కాను తీసికొన్నాడు.[18]

ప్రముఖ క్రీడాకారులు

అధ్యక్ష చరిత్ర

ఇంటర్‌కు క్లబ్ చరిత్రలో అసంఖ్యాకమైన అధ్యక్షులు ఉన్నారు, వారిలో కొందరు క్లబ్బు యొక్క యజమానులు కాగా, ఇతరులు గౌరవాధ్యక్షులు. దిగువ వారి పూర్తి జాబితా ఇవ్వబడింది.[19]

ప్రెసిడెంట్ మస్సిమో మొరట్టి
  valign="top"
పేరు సంవత్సరాలు
గియోవన్ని పరమితియోట్టి 1908–1909
ఎట్టోర్ స్ట్రాస్ 1909–1910
కార్లో డి మెడిసి 1910–1912
ఏమిలియో హిర్జెల్ 1912–1914
లుయిగి అన్స్బచార్ 1914
గియుసేప్పి విస్కోంటి డి మోడ్రోన్ 1914–1919
గియోర్గియో హుల్స్స్ 1919–1920
  valign="top"
పేరు సంవత్సరాలు
ఫ్రాన్సేస్కో మౌరో 1920–1923
ఎన్రికో ఒలివెట్టి 1923–1926
సెనటోర్ బోర్లేట్టి 1926–1929
ఎర్నెస్టో టోర్రుసియో 1929–1930
ఒరేస్టి సిమోనోట్టి 1930–1932
ఫెర్దినన్డో పోజ్జాని 1932–1942
కార్లో మస్సరోని 1942–1955
  valign="top"
పేరు సంవత్సరాలు
Angelo Moratti 1955–1968
Ivanoe Fraizzoli 1968–1984
Ernesto Pellegrini 1984–1995
Massimo Moratti 1995–2004
Giacinto Facchetti 2004–2006
Massimo Moratti 2006-ప్రస్తుతం

నిర్వాహక చరిత్ర


ఇంటర్నేజనలే చరిత్రలో, క్లబ్బుకు 55మంది శిక్షకులు శిక్షణ నిచ్చారు. తొలి కార్యనిర్వాహకుడు విర్జిలియో ఫోస్సటి. ఇంటర్నేషనల్ శిక్షకుడిగా తొమిదేళ్ళ (వరుసగా ఎనిమిది సార్లు) సుదీర్ఘ పాలనా బాధ్యత హెలెనియో హెర్రెరాకు ఉంది, ఇంకా అతడు ఇంటర్ చరిత్రలో మూడు స్కుడెట్టీ, రెండు యూరోపియన్ కప్పులు, మరియు రెండు ఇంటర్ కాంటినెంటల్ కప్పులతో అత్యంత విజయవంతమైన శిక్షకుడు. 2008 జూన్ 2న నియమింపబడిన జోస్ మౌరిన్‌హొ, సెరియా ఎ లీగ్ టైటిల్ మరియు సూపర్‌కొప్పా ఇటాలియానాలను గెలవటం ద్వారా ఇటలీలో తన తొలి సీజన్‌ని పూర్తి చేసాడు, రెండవ సీజన్లో ఇటాలియన్ చరిత్రలో అతడు మొదటి “ట్రైబల్”ను, 2009-2010 సీజన్లో సెరియా ఎ లీగ్ టైటిల్, కొప్పా ఇటాలియా మరియు UEFA ఛాంపియన్స్ లీగ్లను గెలిచి, ఇంటర్ చరిత్రలో రెండవ అత్యంత విజయవంతమైన శిక్షకుడిగా పరిణమించాడు.

రాఫెల్ బెనిటేజ్, ఇంటర్స్ ప్రస్తుత మానేజర్.
జోస్ మురిన్హొ, ఇటాలియన్ చరిత్ర లో 2009–2010 సీజన్ లందు ఇంటర్ తో మొదటి "ట్రేబిల్" విజేత.
  valign="top"
పేరు జాతీయత సంవత్సరాలు
విర్గిలియో ఫస్సాటి Italy 1909–1915
నినో రేసేగొట్టి
ఫ్రాన్సిస్కో మోరో
Italy 1919–1920
బాబ్ స్పోటిష్వుడ్ ఇంగ్లాండు 1922–1924
పోలో స్కీడ్లర్ Italy 1924–1926
అర్పడ్ వేస్జ్ Hungary 1926–1928
జోజ్సేఫ్ వియోల Hungary 1928–1929
అర్పడ్ వేస్జ్ Hungary 1929–1931
ఇస్త్వన్ తొత్ Hungary 1931–1932
అర్పడ్ వేస్జ్ Hungary 1932–1934
గ్యుల ఫెల్ద్మంన్ Hungary 1934–1936
అల్బినో కార్రరో Italy 1936
అర్మండో కాస్తేల్లజ్జి Italy 1936–1938
టోనీ కార్గ్నేల్లి ఆస్ట్రియా 1938–1940
గియుసేప్పే పెరుచేట్టి Italy 1940
ఇటాలో జంబెర్లేట్టి Italy 1941
ఇవో ఫియోరెన్టిని Italy 1941–1942
గియోవాన్ని ఫెర్రారి Italy 1942–1945
కార్లో కార్కానో Italy 1945–1946
నినో నుత్రిజియో Italy 1946
గియుసేప్పే మేజ్జా Italy 1947–1948
కార్లో కార్కానో Italy 1948
డై అస్ట్లే Wales 1948
గియులియో కాప్పెల్లి Italy 1949–1950
అల్దో ఒలివిరి Italy 1950–1952
ఆల్ఫ్రెడో ఫోని Italy 1952–1955
అల్దో కామ్పటెల్లి Italy 1955
గియుసేప్పే మేజ్జా Italy 1955–1956
అన్నిబలే ఫ్రోస్సి Italy 1956
లుగి ఫెర్రేరో Italy 1957
గియుసేప్పే మేజ్జా Italy 1957
జెస్సి కార్వేర్ ఇంగ్లాండు 1957–1958
గియుసేప్పే బిగోగ్నో Italy 1958
అల్దో కామ్పటెల్లి Italy 1959–1960
కామిల్లో అచిల్లి Italy 1960
గియులియో కాప్పెల్లి Italy 1960
  valign="top"
పేరు జాతీయత సంవత్సరాలు
హెలెనియో హీర్రెర Argentina 1960–1968
ఆల్ఫ్రెడో ఫోని Italy 1968–1969
హీరిబెర్టో హీర్రెర మూస:Country data PRY 1969–1971
గియోవన్ని ఇంవర్నిజ్జి Italy 1971–1973
ఎనియ మసీరో Italy 1973
హెలెనియో హీర్రెర Argentina 1973
ఎనియ మసీరో Italy 1974
లుస్ సువరేజ్ స్పెయిన్ 1974–1975
గియుసేప్పే చియప్పెల్ల Italy 1976–1977
యూగేనియో బెర్సేల్లిని Italy 1977–1982
రినో మార్చేసి Italy 1982–1983
లుయిగి రాదిసు Italy 1983–1984
ఇలరియో కాస్టాజ్ఞార్ Italy 1984–1986
మారియో కోర్సో Italy 1986
గియోవాన్ని ట్రాపట్టోని Italy 1986–1991
కర్రడో ఒర్రికో Italy 1991
లుయిస్ సువరేజ్ స్పెయిన్ 1992
ఒస్వల్దో బాగ్నోలి Italy 1992–1994
గియంపీరో మారిని Italy 1994
ఒట్టావియో భయాంచి Italy 1994–1995
లూయిస్ సువరేజ్ స్పెయిన్ 1995
రాయ్ హోద్గ్సన్ ఇంగ్లాండు 1995–1997
లుసియనో కాస్టేల్లిని Italy 1997
లుయిగి సిమోని Italy [౮౫] ౧౯౯౮–
మిర్సియా లుసేస్కు Romania 1998–1999
లుసియనో కాస్టేల్లిని Italy 1999
రాయ్ హోద్గ్సన్ ఇంగ్లాండు 1999
మర్సేల్లో లిప్పి Italy 1999–2000
మార్కో తర్దేల్లి Italy 2000–2001
హెక్టర్ రాల్ కూపర్ Argentina 2001–2003
కర్రాడో వేర్దేల్లి Italy 2003
అల్బెర్టో జాచ్చేరోని Italy 2003–2004
రోబెర్టో మంసిని Italy 2004–2008
జోసె మౌరింహో పోర్చుగల్ 2008–2010
రాఫెల్ బెనితెజ్ స్పెయిన్ 2010–

మద్దతుదారులు మరియు ప్రత్యర్ధులు


స్టాడియో గియుసేప్పే మేజ్జా దగ్గర కర్వ లో ఇంటర్ డిస్ప్లేను తయారు చేసారు.

ఇటాలియన్ వార్తాపత్రిక లా రిపబ్లికా, 2007 ఆగస్టులో జరిపిన పరిశోధన ప్రకారం, ఇటలీలో ఇంటర్, అత్యంత ఆదరణ పొందిన క్లబ్బులలో ఒకటి. [20] చారిత్రకంగా, మిలాన్ నగరంలోని ఇంటర్ అభిమానుల్లో అత్యధిక వర్గం మధ్య-తరగతి ఉన్నత వర్గ మిలానీయులు కాగా, AC మిలన్ అభిమానులు క్లిష్టంగా శ్రామిక-వర్గాల వారు, మరియు ప్రముఖ భాగం దక్షిణ ఇటలీ నుండి వలస వచ్చిన వారు.[15]

ఇంటర్ యొక్క సాంప్రదాయ అల్ట్రాస్ సమూహం బాయ్స్ సాన్ ; 1969లో ప్రారంభింపబడి, వారు పాతవారిలో ఒకరు కావటం కారణాన, వారికి సాధారణంగా అల్ట్రాస్ యొక్క చరిత్రలో ప్రముఖ స్థానం ఉంది. రాజకీయంగా, ఇంటర్ యొక్క అట్ట్రాస్ లజియోలో సత్సంబంధాలు కలిగి ఉండి సాధారణంగా కుడి-భుజంగా పరిగణింపబడతారు. ప్రధాన సమూహమైన బాయ్స్ సాన్తో పాటుగా, మరో నాలుగు ప్రముఖ సమూహాలున్నాయి: వైకింగ్, ఇర్రిడుసిబిలి, అల్ట్రాస్, మరియు బ్రియన్జా అల్కూలికా .

ఇంటర్ యొక్క పలు మౌఖిక అభిమానులు కర్వా నొర్డ్, లేదా గియుసెప్పె మియజ్జా స్టేడియం యొక్క ఉత్తర వంపులో సమావేశం కావడంతో ప్రసిద్దులై ఉన్నారు. ఈ సుదీర్ఘమైన సాంప్రదాయం, కర్వా నొర్డ్ క్లబ్బు యొక్క కరుడుగట్టిన మద్దతుదారులకు పర్యాయపరంగా పరిణమించింది, తమ జట్టుకు మద్దతునిచ్చేందుకు వీరు జెండాలు ఊపుతారు మరియు నినాదాలు వ్రాసిన బానర్లను మడత బెట్టరు.

2007 లో ఇంటర్ అభిమానులు సంబరాలు.

ఇంటర్‌కు పలువురు ప్రత్యర్థులు ఉన్నారు, వారిలో ఇద్దరు ఇటాలియన్ ఫుట్‌బాల్లో అత్యంత ప్రముఖులు; మొదటగా, వారు అంతర నగర పోటీలలో AC మిలాన్‌తో డెర్బీ డెల్లా మడొన్నియా పాల్గొంటారు, ఈ ప్రత్యర్థిత్వం మిలాన్‌తో ఇంటర్ 1908లో విచ్ఛిన్నమైనప్పటి నుండి కొనసాగుతోంది.[15] డెర్బీ పేరు ఆశీర్వదించబడిన కన్నెమేరీని ఉటంకిస్తుంది, మిలాన్ కాథెడ్రెల్ మీద గల ఆమె విగ్రహం నగరం యొక్క ప్రధాన ఆకర్షణలలో ఒకటి. క్రీడాపోటీ సాధారణంగా ఒక సజీవ వాతావరణాన్ని సృష్టిస్తుంది, పోటీకి ముందు అసంఖ్యాక (తరచుగా హాస్యపూర్వక లేదా అప్రియమైనవిగా) బ్యానర్లు ప్రదర్శింపబడతాయి. సాధారణంగా మంటలు ఉంటాయి, అయితే రెండవ పాదంలో మిలాన్ మరియు ఇంటర్‌కు మధ్య 12 ఏప్రిల్ నాటి క్వార్టర్-ఫైనల్ క్రీడాపోటీ గుంపులోని ఇంటర్ మద్దతుదారుడి నుండి విసరబడిన ఒక మంట మిలన్ కీపర్ డీడాను భుజంపై తాకిన తర్వాత 2005 ఛాంపియన్స్ లీగ్ విడిచిపెట్టటానికి అవి కూడా దారి తీసాయి.[21]

అత్యంత ప్రముఖమైన మరో ప్రత్యర్థిత్వం జువెంటస్తో; డెర్బీ డీ’ఇటాలియా లో అవి రెండూ పాల్గొన్నాయి. 2006 సెరియా A మ్యాచ్-ఫిక్సింగ్ కుంభకోణం వరకూ, అవి రెండూ సిరియా A లోపల ఎప్పుడూ ఆడని, కేవలం ఇటాలియన్ క్లబ్బులు, కుంభకోణంలో జెవెంటస్ వెనకబడటం కనబడింది. ఇటీవలి సంవత్సరాలలో, పోస్ట్-కాల్సింఫొలి, ఇంటర్‌లు ప్రత్యర్థిత్వాన్ని పెంచుకున్నాయి, ఇంటర్‌కు అన్నిటిలో రన్నర్-అప్‌ను పూర్తి చేసిన, ఇంటర్ యొక్క అయిదు స్కూడెట్టా 2005-2010 సీజన్లలో ఒకటి గెలుపొందిన రోమాతో ప్రత్యర్థిత్వాన్ని పెంచుకున్నాయి. రెండు పక్షాలు కూడా 5 కొప్పా ఇటాలియా ఫైనల్స్ మరియు నాలుగు సూపర్కొప్పా ఇటాలియానా ఫైనల్స్లో 2006 నుండి పోటీ పడుతున్నాయి. బొలోగ్నా మరియు అటలాంటా వంటి ఇతర కబ్లులు కూడా వారి ప్రత్యర్థులుగా పరిగణింపబడతారు.

గౌరవాలు

జాతీయ టైటిళ్ళు

Serie A: :*Winners (18): 1909–10, 1919–20, 1929–30, 1937–38, 1939–40, 1952–53, 1953–54, 1962–63, 1964–65, 1965–66, 1970–71, 1979–80, 1988–89, 2005–06కాల్సియోపోలి కుంభకోణం నేపథ్యంలో ఈ టైటిల్‌ని కోర్టుల ద్వారా బహూకరించారు., 2006–07, 2007–08, 2008–09, 2009–10 :*Runners-up (13): 1932–33, 1933–34, 1934–35, 1940–41, 1948–49, 1950–51, 1961–62, 1963–64, 1966–67, 1969–70, 1992–93, 2002–03 Coppa Italia: :*విజేతలు (6): 1938–39, 1977–78, 1981–82, 2004–05, 2005–06, 2009–10 :*Runners-up (6): 1958–59, 1964–65, 1976–77, 1999–00, 2006–07, 2007–08 Supercoppa Italiana: :*విజేతలు (5): 1989, 2005, 2006, 2008, 2010 :*Runners-up (3): 2000, 2007, 2009 ===అంతర్దాతీయ టైటిళ్లు=== కింది టైటిళ్లు UEFA మరియు FIFAలు గుర్తించిన వాటిని మాత్రమే కలిగి ఉన్నాయి. ====European titles==== European Cup/UEFA Champions League: :*Winners (3): 1963–64, 1964–65, 2009–10 :*Runners-up (2): 1966–67, 1971–72 UEFA Cup/UEFA Europa League: :*Winners (3): 1990–91, 1993–94, 1997–98 :*Runners-up (1): 1996–97 UEFA Super Cup: :*Runners-up (1): 2010 ====ప్రాంతీయ అంతర్జాతీయ టైటిల్లు==== Mitropa Cup: :*Runners-up (1): 1932–33 ====ప్రపంచ వ్యాప్త టైటిళ్లు==== Intercontinental Cup: 2004 వరకూ, ప్రపంచ ఛాంపియన్‌ను గుర్తించేందుకు ప్రధాన పోటీ ఇంటర్ కాంటినెంటల్ కప్ (ఫుట్‌బాల్)/ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్ క్లబ్ యొక్క కప్ (“యూరోపియన్/సౌత్ అమెరికన్ కప్”గా పిలవబడుతుంది); అప్పటి నుండి అది “FIFA క్లబ్ వరల్డ్ కప్”. :*“‘విన్నర్స్(2)”’: 1964 ఇంటర్ కాంటినెంటల్ కప్/1964, 1965 ఇంటర్ కాంటినెంటల్ కప్/1965==వ్యక్తిగత గౌరవాలు==“‘FIFA వరల్డ్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్/ప్రపంచ వార్షిక ఆటగాడు”’ : దిగువ ఇవ్వబడిన ఆటగాళ్ళు FC ఇంటర్నేషనల్ మిలానో ఆడుతుండగా FIFA వరల్డ్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ బహుమతిని గెలుచుకున్నవారు: :*Germany 1991 – Lothar Matthäus :*బ్రెజిల్ 1997 – Ronaldo :*బ్రెజిల్ 2002 – Ronaldo Ballon d'Or/European Footballer of the Year :కింది క్రీడాకారులు FC ఇండర్నేజనలే మిలానోకు ఆడుతూ బలాన్ d'ఓర అవార్డును గెల్చుకున్నారు : :*Germany 1990 – Lothar Matthäus :*బ్రెజిల్ 1997 – Ronaldo UEFA Club Footballer of the Year :కింది క్రీడాకారులు ఇంటర్నేజనలేకి ఆడుతూనే UEFA Club ఫుట్‌బాలర్ ఆప్ ది ఇయర్ అవార్డును గెల్చుకున్నారు: :*బ్రెజిల్ 1998 – Ronaldo :*Argentina 2010 – Diego Milito ==ఒక కంపెనీగా FC ఇంటర్నేషనల్ మిలానొ== క్లబ్ అధ్యక్షుడు మాస్సియో మెరట్టి వాణిజ్య మరియు రోజువారీ క్రీడాదాయాలని పెంచేందుకు అదే విధంగా UEFA యూరో 2016 నాడు ఉపయోగించేందుకు 2010-2013 సెరియా A సీజన్ కాలంలో ఒక కొత్త స్టేడియాన్ని నిర్మించాలని ప్రణాళిక రచించాడు. ఇంటర్ యొక్క ప్రస్తుత స్టేడియం, ది గియుసెప్పె మియజ్జా, మిలాన్ నగర యాజమాన్యం క్రింద ఉంది, రోజు వారీ క్రీడా టిక్కెట్ల నుండి దాదాపు సగం ఆదాయాన్ని అది పొందుతోంది.

2008–09 సీజన్‌లో సలహాదారులు డిలోయిట్టెచే ప్రచురింపబడిన ది ఫుట్‌బాల్ మనీ లీగ్ ప్రకారం, ఇంటర్ €196.5 మిలియన్ ఆదాయాన్ని నమోదు చేసి, 9వ స్థానంలో ఉంది, ఆ స్థానాల జాబితాలో జువెంటస్‌కు వెనక మరియు AC మిలన్‌కు ముందున ఉంది. క్లబ్బు, గత సీజన్ ఆదాయం కన్నా €172.9 మిలియన్ల మించిన ఆదాయం కలిగి ఉండి, ప్రముఖమైన మరియు, గత సీజన్ కంటే ఒక తక్షాణాధిక లాభాన్ని పొందింది. ఫుట్‌బాల్ మనీ లీగ్ యొక్క తొలిదశ నుండి, మొదటి సారిగా ఇంటర్ తన నగర ప్రత్యర్థులు AC మిలన్‌ను స్థానాల జాబితాలో అధిగమించింది.

ఆదాయ శాతాలు రోజు వారీ క్రీడా పోటీలు (14%, €28.2మి.), ప్రసారాలకి (59%, €115.7మి., +7%, +€8మి.) మరియు వాణిజ్యపరంగా (27%, €52.6మి., +43%, €15.8మి.). కిట్ ప్రాయోగికులు నైక్ మరియు పిరెల్లి, వాణిజ్య ఆదాయాలకు వరసగా €18.1మి. మరియు €9.3మి.ను వివరణగా ఇచ్చారు, కాగా ప్రసారా ఆదాయాలు ఛాంపియన్ లీగ్ పంపిణీ ద్వారా €1.6మి. (6%) ప్రోత్సాహించబడ్డాయి.

2010/2011 సీజన్ కొరకు, సెరియా A క్లబ్బులు, కబ్బు TV హక్కులను స్వతంత్రంగా కంటే సంయుక్తంగా బేరామాడ ప్రారంభించనున్నాయి. ఇది చిన్న క్లబ్బులని నష్టాల నుండి పైకి తీసి ఇంటర్ యొక్క ప్రసార ఆదాయాలని తగ్గించడంలో ఫలితం చూపగలదని అంచనా వేయబడింది.

ఇంటర్ యొక్క రోజు వారీ క్రీడాదాయం ప్రతి గృహక్రీడకి కేవలం €1.1మి. మాత్రమే, ఆరుగురు పైస్థాయి సంపాదనా పరులతో పోలిస్తే €2.6మి.

డిలోయిట్టె ఇటాలియన్ ఫుట్‌బాల్‌లోని వ్యవహారాలు, ప్రత్యేకించి రోజు వారీ క్రీడాదాయ వ్యవహారాలు యూరోపియన్ రాకాసులతో పోలిస్తే ఇంటర్‌ను వెనక్కిలాగుతున్నాయని, మరియు ప్రపంచ వేదిక మీద సెరియా A క్లబ్ మరింత పోటీ నివ్వగలిగేందుకు తమ స్వంత స్టేడియాలను వృద్ధి చేసుకుంటే ఫలితం ఉంటుందనీ అభిప్రాయపడ్డాడు.[22]

=== కిట్ ప్రదాతలు మరియు ప్రాయోజికులు

===
సంవత్సరాలు ప్రాయోజికులు
1981–1982 ఇన్నో-హిట్
1982–1991 మిసుర
1991–1992 ఫిత్గర్
1992–1995 ఫియోరుక్కి
1995—ఇప్పటివరకు పిరెల్లి
సంవత్సరాలు కిట్ ప్రదాతలు
1979–1982 పుమ
1982–1986 మేక్స్పోర్ట్
1986–1988 లి కోక్ స్పోర్టిఫ్
1988–1991 ఉహల్సపోర్ట్
1991–1998 ఉంబ్రో
1998—ఇప్పటివరకు నైకి

సూచికలు

 1. "Chelsea 0 – 1 Inter Milan (agg 1 – 3)". BBC Sport. 2010-03-16. Retrieved 2010-03-16.
 2. http://www.lequipe.fr/Football/FootballFicheClub120.html
 3. ["ఇటలీ – చాంపియన్ల జాబితా" http://www.rsssf.com/tablesi/italchamp.html]
 4. "Storia". FC Internazionale Milano. Retrieved 2007-09-06.
 5. "F.C. Internazionale statement". FC Internazionale Milano. 2008-05-29. Retrieved 2008-05-29.
 6. "Nuovo allenatore: Josè Mourinho all'Inter" (in Italian). FC Internazionale Milano. 2008-06-02. Retrieved 2008-06-02.CS1 maint: unrecognized language (link)
 7. "Official: Inter sign Mancini". Goal.com. 2008-07-20. Retrieved 2008-07-20.
 8. "Official: Inter sign Muntari". Goal.com. 2008-07-28. Retrieved 2008-08-15.
 9. Adam, Scime (2008-09-01). "Official: Quaresma Joins Inter". Goal.com. Retrieved 2008-09-01.
 10. http://www.tsn.ca/soccer/story/?id=316882. Missing or empty |title= (help)
 11. "Bayern Munich 0 – 2 Inter Milan". BBC Sport. 2010-05-22. Retrieved 2010-05-24.
 12. "Jose Mourinho's Treble-chasing Inter Milan win Serie A". BBC Sport. 2010-05-16. Retrieved 2010-05-24.
 13. "Mourinho unveiled as boss of Real". BBC News. 2010-05-31.
 14. "9 marzo 1908, 43 milanisti fondano l'Inter". ViviMilano.it. 2007-06-24.
 15. 15.0 15.1 15.2 "AC Milan vs. Inter Milan". FootballDerbies.com. 2007-07-25.
 16. http://emeroteca.coni.it/?q=node/6&f=822&p=1
 17. "Ambrosiana S.S 1928". Toffs.com. 2007-06-24.
 18. http://www.inter.it/aas/news/reader?L=en&N=23876&stringa=facchetti%203
 19. "Tutti I Presidenti". InterFC.it. 2007-06-08.
 20. "Research: Supporters of football clubs in Italy" (in Italian). La Repubblica official website. August 2007.CS1 maint: unrecognized language (link)
 21. "Milan game ended by crowd trouble". BBC.co.uk. 2007-07-25.
 22. https://www.deloitte.co.uk/registrationforms/pdf/DeloitteFML2010.pdf

బాహ్య లింకులు

అధికార వెబ్‌సైట్‌లు

మూస:F.C. Internazionale Milano మూస:Serie A మూస:Football in Italy మూస:Champions League 2008-09 మూస:Original Italian Serie A clubs