"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

ఫ్లోరెన్స్ నైటింగేల్

From tewiki
Jump to navigation Jump to search
ఫ్లోరెన్స్ నైటింగేల్
Florence Nightingale CDV by H Lenthall.jpg
జననంమే 12, 1820
ఫ్లోరెన్స్, ఇటలీ
మరణంఆగష్టు 13, 1910
లండన్, యునైటెడ్ కింగ్ డమ్
వృత్తిసమాజ సేవకురాలు, నర్సు
ప్రసిద్ధిPioneering modern nursing
తండ్రివిల్లియం ఎడ్వర్డ్ షోర్
తల్లినైటింగేల్ నీ స్మిత్
పురస్కారములుRoyal Red Cross (1883)
Lady of Grace of the Order of St John (LGStJ)
Order of Merit (1907)
సంతకంFlorence Nightingale Signature.svg
Young Florence Nightingale

ఫ్లోరెన్స్ నైటింగేల్ (మే 12, 1820 - ఆగష్టు 13, 1910) సమాజ సేవకురాలు, నర్సు.

రోగులకు వైద్యులు ఇచ్చే ఔషధం ఎంత ముఖ్యమో, నర్సులు చేసే సేవలు కూడా అంతే ముఖ్యము. లేడి విత్ ది లాంప్ గా పేరెన్నికగన్న ఫ్లోరెన్స్ నైటింగేల్ చేసిన సేవలవలన మరణించే రోగుల సంఖ్య బాగా తగ్గింది. యుద్ధంలో దెబ్బ తిన్న ప్రతి సైనికుడికి తాను బ్రతుకుతాను అన్న ఆశ చిగురించేది. ఎంతో గొప్పింటి పిల్ల ఐన ఫ్లోరెన్స్ నైటింగేల్ నర్సింగ్ చేయడానికే నిశ్చయించుకుంది. ఎన్నో కష్టాలు ఎదురైనా చిరునవ్వుతో ఎదుర్కొన్నది .ఆ రోజుల్లోనే ఒక విధంగా సంఘం మీద తిరగబడింది. స్త్రీలు ఇంటిపట్టునే ఉండాలన్న కట్టుబాట్లను ఛేదించింది. అవివాహితలు ఇంటి పనులు, చర్చి పనులే చేయాలనీ ఆరోజుల్లో చెప్పేవారు. తన తండ్రి విలియం ఎడ్వర్డ్ ఎంతో ధనికుడు . తన కుమార్తెలకు గణితం, భూగోళం వ్యాకరణం చరిత్రతోపాటు గ్రీకు, లాటిన్ భాషలు బోధించేవాడు.అయినా పేదలకు, అనాథలకు సేవ చేయాలన్న అభిలాష ఫ్లోరెన్స్ నైటింగేల్ కు పుట్టుకతోటే వచ్చి వయస్సుతోపాటు పెరిగింది.

1812 మే 12 న ఫ్లారెన్స్ ఇటలీలో పుట్టింది. తల్లి ఫానీ నైటింగేల్ చాల అందగత్తె. ఫ్లోరెన్స్ కన్నా పెద్దది ఒక అక్క ఉండేది. తండ్రితోపాటు అక్కచెల్లెళ్ళు ఇద్దరు ఊర్లు తిరిగేవారు. ఆ రోజుల్లో ఆస్పత్రులు అధ్వాన్న స్ధితిలో ఉండేవి. శుచి, శుభ్రత, ఏమాత్రం ఉండేవికావు. అయినాకూడా ఫ్లోరెన్స్ నైటింగేల్ నర్సింగు పని చేయడానికే నిర్ణయించుకుంది.తన తల్లి సాహితి ప్రపంచంలో ధ్రువతారగా వెలగాలని కోరినా,ఫ్లోరెన్స్ నైటింగేల్, జర్మనీలో కైసర్ సంస్థను గూర్చి విని, అక్కడే పని చేయాలనీ నిర్ణయించుకుంది.ఇద్దరు బిడ్డల్ని దత్తత తీసుకుని పెంచడం మొదలుపెట్టింది.1852 లో ఐర్లాండ్ వెళ్ళింది. అక్కడి ఆసుపత్రులను చూడగానే వాటిల్లో విప్లవాత్మకమైన మార్పులను తీసుకురావలనుకోన్నది. 1853 లో సిస్టర్స్ ఆఫ్ చారిటికి వెళ్ళింది. తిరిగి లండన్ వచ్చి, తన నాయనమ్మకు సేవ చేయడానికి రాగా అక్కడ కలరా వ్యాపించింది. వెంటనే ఆసుపత్రులకు వెళ్లి రోగులకు, పగలు, రాత్రి అనక సేవలందించింది. పరిశుభ్రతకు ప్రాధాన్యమిచ్చి రోగులకు మంచి ఆహారం అందించింది. 1854-56 లో క్రిమియాలో ఘోర యుద్ధం జరిగింది. ఫ్లారెన్స్ వచ్చి తోటి నర్సులను కూడగట్టుకొని యుద్ధంలో గాయాలైన సైనికులకు నిరుపమానమైన సేవలందించింది. వారికీ ధైర్యం చెప్పింది. సాటి నర్సులు వారిని విసుక్కునేవారు. ఎ పని దొరక్క ఈ పనికి వచ్చాం అనేవారు. కానీ ఎంతో ధనిక కుటుంబం లోనుంచి వచ్చిన ఈమె కోరి ఈ పనిని ఎంతో శ్రద్ధతో,ఇష్టంతో చేసేది. ఎంతో గుండె నిబ్బరంతో, చిమ్మ చీకట్లో కూడా చిరు దీపం వెంట తీసుకుని వెళ్లి సేవలు చేసేది. రోగుల ముఖం మీద చిరునవ్వు ఆమె చేతిలో దీపంలాగా వెలిగేది.

మొదట్లో ఆమెనుచూసి అధికారులు జ్వలించి పోయేవారు. తరువాత ఆమె నిరుపమాన సేవకు ముగ్ధులయ్యారు. వారికి రోజూ, రోగులకు కావాల్సిన మందులు పరికరాలను పంపమని అభ్యర్ధనలు పంపి తెప్పించేది. చాల సార్లు తన స్వంత డబ్బు ఖర్చు పెట్టి అన్ని తెప్పించేది. ఆసుపత్రులలో చోటు సరిపోకపోతే, అధికారులను ఒప్పించి పాత ఇళ్ళను, భవంతులను ఆసుపత్రులుగా మార్చేది. రాత్రులలో రెండు, మూడు గంటలే పడుకుని అహర్నిశలు పని చేసేసరికి ఆమె చిక్కి పోయింది.అయినా రోగులకు ఆమె ఆరాధ్య దైవం. ఆమె నడచిన దారి అతి పవిత్రం. వారు విక్టోరియా రాణి మరణిస్తే ఫ్లారెన్స్ ను రాణి చేస్తామని" అనేవారట.ఆమె ఎక్కడికి వెళ్ళినా సైనికులు అడవి పూలతో పుష్ప గుచ్చాలనిచ్చేవారట. అది చూసి తోటి డాక్టర్లు,నర్సులు అసూయ చెందేవారట. అయినా ఆమె తన సేవలను మానకుండా చేస్తూండగా ఒకనాడు స్పృహ తప్పి పడిపోయింది. సైనికులకు వచ్చిన జ్వరమే ఆమెకు వచ్చింది. కాసిల్ ఆసుపత్రిలో ఆమెను రోగిగా చేర్చుకున్నారు . ఆమెను చూసి మిగతా రోగులు,కన్నీరు కార్చారు. కొంచెం బాగా అవగానే ఆమె తిరిగి క్రిమియా, స్కుటారి ఆసుపత్రుల మధ్య తిరుగుతూ రోగులకు సేవలందించింది.

తాగుడుకు డబ్బు ఖర్చు పెట్టకండి. మీ ఇళ్ళకి డబ్బు పంపండి.వారి భుక్తి గడుస్తుంది అని నైటింగేల్ చెప్పేది .గ్రంథాలయాలు.చదువుకునే గదులు అందరికి అందుబాటులో ఉండేటట్లు చూసి అక్షరాస్యతను పెంచింది. ఆమె నోట్స్ఆన్ హాస్పిటల్స్, నోట్స్ ఆన్ నర్సింగ్, అనే గ్రంథాలను వ్రాయడమే కాకుండా, విక్టోరియా రాణికి, ప్రభుత్వ అధికారులకి హాస్పిటల్స్ బాగు కొరకు అభ్యర్థనలను పంపింది.అప్పటినుంచే నుర్సులకు తప్పనిసరిగా శిక్షణను ఇవ్వడం ప్రారంభమైంది. 1860 జూన్ 24 న నైటింగేల్ ట్రైనింగ్ స్కూల్ ఫర్ నర్సేస్ అనే సంస్థను లండన్ లో స్థాపించారు. ఆమెను' మదర్ ఆఫ్ మోడరన్ నర్సింగ్' గా గుర్తించారు..

భారత దేశానికి కూడా ఆమె ఇతోధిక సేవలనందించింది. 1859 లో విక్టోరియా రాణి ఆరోగ్య సంస్కరణల కొరకు ఒక కమిషన్ను నియమించింది. చెన్నై నగరపు మేయర్ ఆడ నర్సులకు శిక్షణను ప్రోత్సహించారు. నగర పారిశుధ్యం మెరుగు పడింది. ఫ్లారెన్స్ సలహాలతో మన దేశంలో మరణాల రేటు తగ్గింది. మళ్లీ ఒక ఫ్లారెన్స్ పుట్టి మన ప్రభుత్వ ఆసుపత్రుల పరిస్థితి మెరుగు పదాలని కోరుకుందాం . 1910 ఆగస్ట్ 13 లో ఫ్లారెన్స్ మరణించిన, సేవా నిరతిగల ప్రతి నర్సు లోను ఆమె కలకాలం జీవించి ఉంటుంది. రోగులు జ్యాపకమున్చుకోవలసిన ఆదర్శ మూర్తి .

Lua error in మాడ్యూల్:Authority_control at line 369: attempt to index field 'wikibase' (a nil value).