బండారు రామారావు

From tewiki
Jump to navigation Jump to search
బండారు రామారావు
దస్త్రం:Bandaru Ramarao.jpg
జననంఆగష్టు 12, 1932
మరణం1977
జాతీయతభారతీయుడు
వృత్తిరంగస్థల నటుడు, నాటక సమాజ నిర్వాహకుడు, ఉపాధ్యాయుడు
తల్లిదండ్రులుసుబ్బయ్య, సుబ్బమ్మ

బండారు రామారావు రంగస్థల నటుడు, నాటక సమాజ నిర్వాహకుడు, ఉపాధ్యాయుడు.[1]

జననం

రామారావు 1932, ఆగష్టు 12న సుబ్బయ్య, సుబ్బమ్మ దంపతులకు ప్రకాశం జిల్లా, అద్దంకిలో జన్మించాడు.

రంగస్థల ప్రస్థానం

రామారావు తండ్రి సుబ్బయ్య భాగవతాలు చెప్పేవాడు. దాంతో చిన్నప్పటినుండే రామారావుకు కళలపట్ల ఆసక్తి కలిగి నాటకాలలో నటించడం ప్రారంభించాడు. 1952 వరకు దుద్దుకూరు బాలమిత్ర నాటకసమాజలు ప్రదర్శించిన నాటకాలలో నటించిన రామారావు, ఒంగోలు లో డాలు బెంజిమన్, గడ్డం రామానుజులు, యాదల రాజశేఖర్, జి.వి. శేషు, జి. ఆదయ్య వంటి ప్రముఖులతో కలిసి శ్రీ రామ నాట్యమండలిని స్థాపించాడు.

వేమూరి గగ్గయ్య, రేలంగి, ధూళిపాళ సీతారామశాస్త్రి పులిపాటి వెంకటేశ్వర్లు, షణ్ముఖి ఆంజనేయ రాజు, ఈలపాట రఘురామయ్య, బందా కనకలింగేశ్వరరావు, బుర్రా సుబ్రహ్మణ్యశాస్త్రి, అద్దంకి మాణిక్యరావు, చెంచు రామారావు, రేబాల రమణ వంటి నటులతో నటించాడు. శ్రీ కృష్ణుడు, హరిశ్చంద్ర పాత్రలు రామారావుకు విశేష ఖ్యాతిని తెచ్చిపెట్టాయి. గుంటూరు సమీపంలోని చెరుకుపల్లి లో శ్రీకృష్ణరాయబారంలోని పడకసీనుకు సంబంధించిన శ్రీకృష్ణపాత్రకు నిర్వహించిన పోటీలో బండారు రామారావుకు ప్రథమ బహుమతి లభించింది. ఈ పోటీలకు నటుడు మాధవపెద్ది వెంకట్రామయ్య న్యాయనిర్ణేతగా వ్యవహరించాడు. గుర్రం జాషువా రచించిన శ్మశాన వాటికలోని పద్యాలను సత్యహరిశ్చంద్ర కాటి సన్నివేశంలో పరిచయం చేశాడు.

నటించిన నాటకాలు

 1. సత్యహరిశ్చంద్ర
 2. బొబ్బిలియుద్ధం
 3. శ్రీకృష్ణ రాయబారం
 4. కురుక్షేత్రం
 5. గయోపాఖ్యానం
 6. రామాంజనేయ యుద్ధం
 7. భీమాంజనేయ యుద్ధం
 8. పల్నాటి యుద్ధం
 9. బాలనాగమ్మ
 10. విముక్తి
 11. అసూయ

మరణం

రామారావు 1977లో మరణించాడు.

మూలాలు

 1. నాటక విజ్ఞాన సర్వస్వం, తెలుగు విశ్వవిద్యాలయం కొమర్రాజు వెంకట లక్ష్మణరావు విజ్ఞాన సర్వస్వం కేంద్ర ప్రచురణ, హైదరాబాదు, 2008, పుట.526.