"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

బడి పిలగాల్ల కతలు

From tewiki
Jump to navigation Jump to search
బడి పిలగాల్ల కతలు
కృతికర్త: పెండెం జగదీశ్వర్
దేశం: భారత దేశం
భాష: తెలుగు
ప్రక్రియ: బాలల కథలు
ప్రచురణ: నవచేతన పబ్లిషింగ్ హౌస్
విడుదల: 2015 అక్టోబర్
ప్రచురణ మాధ్యమం: పుస్తకము
పేజీలు: 62


తెలంగాణ మాండలికంలో పెద్దవాళ్ళ కోసం బోలెడంత సాహిత్యం వచ్చింది. బాలసాహిత్యంలో ఈ దిశగా ప్రయత్నాలు జరిగినట్టు కనబడవు. యాదాద్రి - భువనగిరి జిల్లా కు చెందిన బాలసాహితీవేత్త పెండెం జగదీశ్వర్ పాఠశాల విద్యార్థులు తరచుగా చెప్పుకునే ఇరవై జానపద, హాస్యకథలను సేకరించి తెలంగాణ మాండలికంలో రూపొందించిన కథాసంకలనమే "బడి పిలగాల్ల కతలు". ఇది తెలంగాణ మాండలికంలో వచ్చిన తొలి బాలల కథాసంకలనంగా ప్రశంసలందుకుంది. ఇందులోని కథలకు నీకు నాకు టింగుబుర్ర, నైమాలూమ్, తోకవొయ్ కత్తొచ్చె డాం డాం డాం, నాకోసం యెవలేడుస్తరు? ఒక్కెంటికె రాణి - రొండెంటికెల రాణి, శెబాష్ - బద్మాష్, నాపేరు మొగడు, బుడుగు బుడుగు లొట్టయ్య, నాకు మూడు నీకు రొండు, బూకరోడు, పాటొస్తుంది మొదలైన ఆసక్తికరమైన శీర్షికలున్నాయి. ఈ కథలన్నీ గ్రామీణ ప్రాంతాల పిల్లల ఉచ్చారణను అనుసరిస్తూ రాయబడ్డాయి. ఎక్కడా మహాప్రాణాక్షరాలు కనబడవు. వాటి స్థానంలో అల్పప్రాణాలు ఉంటాయి. పుంటికూర, చారాన, అర్ర, మస్తు, యిజ్జతి, జాగ, పోరగాడు, దోస్తులు, జెల్ది, లడాయి, జెరశేపు, పొల్ల, లాషిగ, బోర్లబొక్కల, గమ్మతి మొదలైన తెలంగాణ పదజాలమంతా ఈ కథలనిండా కనిపిస్తుంది. ఇదివరకు రాయలసీమ మాండలికంలో నామిని సుబ్రహ్మణ్యం నాయుడు 'మా అమ్మ చెప్పిన కతలు' పేరుతో, ఉత్తరాంధ్ర మాండలికంలో బమ్మిడి జగదీశ్వర్ రావు 'అమ్మ చెప్పిన కతలు' పేరుతో పిల్లల కోసం జానపద కథాసంకలనాలు ప్రచురించారు. పెండెం జగదీశ్వర్ రాసిన ఈ 'బడి పిలగాల్ల కతలు'తో మూడు ప్రధాన మాండలికాలలో బాలసాహిత్య గ్రంథాలు వచ్చినట్లయ్యింది.