"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

బషీరుద్దీన్‌ ముహమ్మద్‌

From tewiki
Jump to navigation Jump to search

బషీరుద్దీన్‌ ముహమ్మద్‌ గారు గేయ రచయిత. వీరు ప్రధానంగా ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను ప్రజల వద్దకు తీసుకెళ్ళడానికి అనువుగా చాలా పాటలు రాశారు. ఆయన రాసిన పలు పాటలు వివిధ పత్రికల్లో చోటు ప్రచురింపబడ్డాయి.

బాల్యము

నల్గొండ జిల్లా మర్యాలలో 1931 జనవరి 5న జన్మించారు.

  • తల్లిదండ్రులు ఖైరాతున్నీసా, ఎం.డి జలాలుద్దీన్‌
  • కలంపేరు: ఘామడ్‌ నల్గొండవి
  • చదువు: మెట్రిక్‌
  • ఉద్యోగం: జిల్లా ఆరోగ్య శాఖలో ఉద్యోగము చేసి పదవీ విరమణ పొందారు

రచనా వ్యాసంగము

వీరు రచనా వ్యాసంగం 1970 లో ఆరంభించారు. ప్రధానంగా ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను ప్రజల వద్దకు తీసుకెళ్ళడానికి అనువుగా చాలా పాటలు రాశారు. ఆయన రాసిన పలు పాటలు వివిధ పత్రికల్లో చోటు చేసుకున్నాయి.లోక గీతాలు పేరున(2008)వీరు వ్రాసిన పాటలు ప్రచురితమయ్యాయి. వీరి లక్ష్యం ప్రజలను మంచి మార్గం దిశగా చైతన్యపర్చడం.

Lua error in మాడ్యూల్:Authority_control at line 369: attempt to index field 'wikibase' (a nil value).