బాంబే స్టాక్ ఎక్ఛేంజీ

From tewiki
Jump to navigation Jump to search

ఆసియా ఖండంలోనే అతిపురాతనమైన స్టాక్ ఎక్స్ఛేంజీ బాంబే స్టాక్ ఎక్స్ఛేంజీ (Bombay Stock Exchange) (Marathi: मुंबई शेयर बाजार). దీనిని ముంబాయిలోని దలాల్ స్ట్రీట్ లో 1875లో స్థాపించారు. ఈ స్టాక్ ఎక్స్ఛేంజీలో ప్రస్తుతం భారతదేశానికి చెందిన సుమారు 4800కి పైగా కంపెనీలు లిస్టింగ్ అయ్యాయి. 2007 ఆగస్టు నాటికి ఈ స్టాక్ ఎక్స్ఛేంజీలో లిస్టింగ్ అయిన కంపెనీల పెట్టుబడి విలువ 1.11 ట్రిలియన్ డాలర్లు. దక్షిణాసియాలో ప్రస్తుతం ఇంత విలువ కల్గియున్న స్టాక్ ఎక్స్ఛేంజీ ఇదొక్కటే. 2007 అక్టోబరు 29న దీని ఇండెక్స్ 20,000 దాటి రికార్డు సృష్టించింది. 2008, జనవరి 10న 21,000 దాటింది. 2008, జనవరి 21న 1400 పాయింట్లను కోల్పోవడం బాంబే స్టాక్ ఎక్స్ఛేంజీ చరిత్రలోనే అత్యంత భారీ పతనం.