"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

బాదామి చాళుక్యులు

From tewiki
Jump to navigation Jump to search

బాదామీ

దక్షిణాపథమును పాలించిన రాజవంశములలో బాదామీ చాళుక్య వంశము ప్రసిద్ధమైనది[1]. ఈ వంశీయులు వివిధ ప్రాంతములందు రాజ్యములను స్థాపించి పాలించారు. బాదామీ చాళుక్యులు, ముదిగొండ చాళు క్యులు, ఎలమంచిలి చాళుక్యులు, సౌరాష్ట్ర చాళుక్యులు , వేములవాడ చాళుక్యులు, కల్యాణి చాళుక్యులు, పిఠాపుర చాళుక్యులు , నిరవద్యపుర చాళుక్యులు పేర్కొనదగినవారు. బాదామీ నగరాన్ని రాజధానిగా పాలించిన చాళుక్యులు వంశీయు శాఖా రాజ్యములకు మూల పురుషులు. ప్రధాన చాళుక్య వంశమునికి చెందిన యువ రాజులు, రాజుల సోదరులు  శాఖా రాజ్యములను స్థాపించారు. వీరు ఆయా ప్రాంతములకు రాజప్రతినిధులుగ ఉండి క్రమంగా స్వతంత్ర రాజ్యాలను నెలకొల్పినారు.

చరిత్ర

బాదామి చాళుక్య రాజులు పదకొండు మంది సుమారు రెండు వందల సంవత్సరములు దక్షిణాపథమును పాలించినారు. దక్షిణాపథ (దక్షిణ భారత) రాజకీయులందు ప్రధాన పాత్ర వహించి, యజ్ఞయాగాది క్రతువు లొనర్చి, అనేక దేవాలయములను నిర్మించి, వాటి నిర్వహణమునకు బ్రాహ్మణులకు అనేక అగ్రహారములను, భూ సువర్ణాది దానముల నొసంగి, ప్రజోపయోగ నిర్మాణములను చేపట్టి: నిర్వహించి భారతదేశ చరిత్రలో సముచిత స్థాన మాక్ర మించినారు.బాదామీ చాళుక్య రాజ్యస్థాపనతో దక్షిణాపథ రాజ కీయములం దొక నూతన శక మారంభమైనది. శాత వాహన, ఇష్వాకు, విష్ణుకుండిన, వాకాటక, కదంబ, పల్లవ, బృయత్పలాయనాది రాజవంశీయులు బ్రహ్మత్రక్ష తేజోత్ళతులు.బ్రాహ్మణ వంశజుల పాలన మంతరించిన పిదప చాళుక్యుల పాలన మారంభమైనది. వీరు చతుర్థ కులజులు కొన్ని శాసన ములందు క్షత్రియులుగ వర్ణింపబడినవారు.బాదామీ నగరము వాతాపిగా ప్రసిద్ధిగాంచినది. దక్షిణాపథమున రాజకీయ కేంద్రముగా, గొప్ప వ్యాపార కేంద్రముగా నున్న వాతాపీ నగరమును చాళుక్య రాజులు అపురూప శిల్ప సౌందర్యముతో నొప్పారు దేవాలయ ములతోను, శత్రు దుర్భేద్యమైన దుర్గముతోను, ఉత్తుంగ సౌధములతోను, విశాలమైన రాజవీధులతోను, సమస్త సౌకర్యములతోను అలరారునట్లు తీర్చిదిద్దినారు.బాదామీ వంశ స్థాపనమున దక్షిణాపథ దక్షిణ భారతములం దంతకు పూర్వము వర్ధిల్లిన బౌద్ధ, జైన మతములు క్షీణింపదొడగినవి. హైందవ మతము, వైదిక కార్యకలాపములు పునరుద్ధరింపబడినవి.

బాదామీ చాళుక్య వంశీయుల చరిత్ర నిర్మాణము శాసనములు, 2. సమకాలిక రాజవంశముల నకు చరిత్రలు, 8. కట్టడములు-నిర్మాణములు, 4. దేవాలయ ములు, 5ీ. సాహిత్యము, 6. శిల్పము, 7. నాణెములు, విదేశీయుల వ్రాతలు ముఖ్యాధారములుగ నున్నవి.దక్షిణాపథ, దక్షిణ భారతములతోను, ముఖ్యముగా .తీరాంధ్ర, రాయలసీమ, తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతములతోను ఈ వంశీయులకు మనిష్ఠ సంబంధము లున్నవి.సాహసోపేతులైన బాదామీ చాళుక్యులు దక్షిణ భారత చక్రవర్తులుగా కీర్తి గాంచిన పల్లవ రాజ వంశీయు లతో ననేక యుద్ధము లొనర్పవలసి వచ్చినవి. అట్లే భారతోత్తర భాగమున చక్రవర్తిగా కీర్తి వహించిన.హర్షవర్ణ నుని దక్షిణాపథ దండయాత్రను నిరోధించి అతని నోడించినారు. వీరి చరిత్ర దక్షిణాపథ చరిత్ర, చారిత్ర కులు దక్షిణాపథ చరిత్రకు, అందు ముఖ్యముగా ఇజ్వాకు విష్ణుకుండిన, బాశుక్యాది రాజవంశముల చరిత్ర కెక్కువ ప్రాధాన్యమును, చరిత్రలో సముచిత స్థానమును కలిగింప లేదు. విష్ణుకుండినుల పాలనానంతరము ఏడవ శతాబ్ది ప్రథమ పాదమునుండి కాకతి రాజ్య స్థాపనమువరకు అనగా క్రీ. 1050 వరకు తెలంగాణ చరిత్రము మరుగునపడి యున్నది. సుమారు నాల్గున్నర శతాబ్దుల కాలము తెలం గాణము, తీరాంధ్ర, మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతములను బాదామి చాళుక్య, రాష్ట్రకూట, కల్యాణీ చాళుక్య వంశీ యులు, వారి సామంత మాండలికులు పాలించినారు.

బాదామి చాళుక్యుల వంశ వృక్షం

జయసింహ వల్లభుడు (క్రి. శ  500-520 )

రణ రాగుడు (క్రి. శ  520-540 )

1వ పులకేశి (క్రి. శ  540-566 )


1వ కీర్తి వర్మ (క్రి. శ  566-596 )

మంగలేశుడు (క్రి. శ596-610)


(1వ కీర్తి వర్మ (క్రి. శ  566-596 ) కుమారులు)

2వ పులకేశి (క్రి. శ 610-642)

కుబ్జవిష్ణు వర్ధనుడు

ధరశ్రయ జయసింహుడు


2వ పులకేశి (క్రి. శ 610-642) వంశం

ఆదిత్య వర్మ

చంద్రాదిత్యుడు

రణరాగుడు

1వ విక్రమాదిత్యుడు

జయసింహుడు


1వ విక్రమాదిత్యుడు (క్రి. శ 655-681) [2]

వినయాదిత్యుడు (  క్రి. శ 681- 696)

2వ విక్రమాదిత్యుడు (క్రి. శ 733-744

కీర్తి వర్మ (క్రి. శ744 - 755

మూలాలు

  1. ప్రసిద్దమైనది, దక్షిణపథము (22-02-2021). Check date values in: |date= (help); Missing or empty |title= (help); Missing or empty |url= (help)
  2. 1వ, 681 (24-02-2021). "బాదామి చాళుక్యులు". Check date values in: |date= (help)CS1 maint: numeric names: authors list (link)