బాబు సాహెబ్

From tewiki
Jump to navigation Jump to search
బాబు సాహెబ్
జననం1937
మరణం1975
జాతీయతభారతీయుడు
వృత్తిరంగస్థల నటుడు

బాబు సాహెబ్ (1937-1975) ప్రముఖ రంగస్థల నటుడు.[1]

జననం

బాబు సాహెబ్ 1937 లో కర్నూలు జిల్లా, బనగానపల్లె సమీపంలోని చెరువుపల్లి లో జన్మించాడు. ఈయన తండ్రిపేరు షేక్ కతాల్ సాహెబ్.

రంగస్థల ప్రస్థానం

శ్రావ్యమైన కంఠస్వరం కలిగిన బాబు సాహెబ్ బాలనటుడుగా నాటకరంగంలోకి అడుగుపెట్టి, పురుష పాత్రలతో పాటు స్త్రీ పాత్రలలో కూడా నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. లలిత కళాసమితి సభ్యుడైన ఈయన ఆ సంస్థ ప్రదర్శించిన వివిధ నాటకాలలో నటించాడు. పైడి లక్ష్మయ్య రచించి, వీరయ్యచారి దర్శకత్వంలో ప్రదర్శించిన వేమారెడ్డి మల్లమ్మ నాటకంలో భద్రయ్య, పద్మమ్మ పాత్రలలో నటించి అప్పటి రాష్ట్రపతి బాబూ రాజేంద్ర ప్రసాద్, సర్వేపల్లి రాధాకృష్ణన్ వంటి ప్రముఖుల ప్రశంసలు పొందాడు. ప్రభుత్వ ఆసుపత్రిలో ఫార్మసిస్టుగా పనిచేస్తూనే ప్రవృత్తిగా ఎంచుకున్న నాటకరంగంలో పనిచేశాడు.

నటించిన నాటకాలు

  1. శ్రీకృష్ణరాయబారం (శ్రీ కృష్ణుడు, కర్ణుడు)
  2. బొబ్బిలియుద్ధం (రంగరాయుడు)
  3. సత్య హరిశ్చంద్ర (నక్షత్రకుడు)
  4. వేమారెడ్డి మల్లమ్మ (భద్రయ్య, పద్మమ్మ)

మరణం

1975 లో బొబ్బిలి యుద్ధం నాటకంలో రంగరాయుడు పాత్రలో నటించిన బాబు సాహెబ్ ప్రదర్శనానంతరం మరణించాడు.

మూలాలు

  1. నాటక విజ్ఞాన సర్వస్వం, తెలుగు విశ్వవిద్యాలయం కొమర్రాజు వెంకట లక్ష్మణరావు విజ్ఞాన సర్వస్వం కేంద్ర ప్రచురణ, హైదరాబాదు, 2008, పుట.434.