"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

బార్పేట జిల్లా

From tewiki
Jump to navigation Jump to search

లువా తప్పిదం: expandTemplate: template "Short description" does not exist

బార్పేట జిల్లా

বৰপেটা জিলা
Temple gates
శంకర్ దేవ్ సత్రా పట్బావుసి దేవాలయం
Barpeta district's location in Assam
Barpeta district's location in Assam
దేశంభారత దేశము
రాష్ట్రంఅసోం
పరిపాలన విభాగంLower Assam
జిల్లాకేంద్రంబార్పేట
విస్తీర్ణం
 • మొత్తం3,245 km2 (1 sq mi)
జనాభా
(2011)
 • మొత్తం16,93,190
కాలమానంUTC+5:30 (భారత కాలమానం)
ISO 3166 కోడ్IN-AS-BA
జాలస్థలిhttp://barpeta.gov.in/

బార్పేట జిల్లా (అస్సాఅమీ:বৰপেটা জিলা) అస్సాం రాష్ట్ర 27 జిల్లాలలో ఒక జిల్లా. జిల్లా కేంద్రంగా బార్పేట పట్టణం ఉంది.2001 గణాంకాలను అనుసరించి జిల్లా వైశాల్యం 3245చ.కి.మీ. జనసంఖ్య 16,42,420.

చరిత్ర

1983లో కామరూప్ జిల్లా నుండి కొంత భూభాం వేరు చేసి బార్పేట జిల్లా ఏర్పాటు చేయబడింది .[1] 2004 జూన్ 1 బస్కా జిల్లా ఏర్పాటు చేయబడిన సమయంలో జిల్లాలో అధికభాగం బస్క జిల్లాతో చేర్చబడింది.[1]

భౌగోళికం

బార్పేట జిల్లా వైశాల్యం 3245.[2] వైశాల్యపరంగా రష్యా లోని ఇతురప్ ఐలాండ్ వైశాల్యానికి సమం..[3]

ముఖ్యపట్టణాలు

  • బార్పేట : ఇది జిల్లా కేంద్రం అంతేకాక జిల్లాలో వైశాల్యంలో రెండవ స్థానంలో ఉంది. ఇది ప్రశాంతమైన, కాలుష్యరహితమైన పట్టణం. నగరంలో మితమైన మోటర్ వాహనాలు మాత్రమే ఉన్నాయి. నగరమంతటా శెలయేర్లు, నీటి కాలువలు ఉన్నాయి. వైష్ణవ సన్యాసి మహాదేవ్ స్థాపించిన బార్పేట సత్రం ప్రముఖ కేంద్రంగా ఉంది. గతంలో ఇది ట్రాంఫోర్ట్ పరిశ్రమకు కేంద్రంగా ఉంటూ ఉండేది. అయినప్పటికీ ఇది ఇప్పుడు తగ్గుముఖం పట్టింది. నగరం దంతం పనితనానికి ప్రత్యేకత కలిగి ఉంది.
  • హోలీ : ఇది జిల్లాలో రద్దిగా ఉండే వాణిజ్య కేంద్రం. ఇది బార్పేట రోడ్డు, బార్పేట పట్టణం మద్య ఉంది. ఇక్కడ పలు సంప్రదాయాలకు చెందిన ప్రజలు నివసిస్తున్నారు. జాతీయ రహదారి 31 నగరం మద్య నుండి పయనిస్తుంది. ఇక్కడ జరిగే అస్సామీ రాసలీల ఉత్సవంలో అనేక మంది పాల్గొంటారు. నగరంలో అధికంగా విద్యావంతులు ఉన్నారు. నగరంలో వక్కల పరిశ్రమలు అధికంగా ఉన్నాయి. రాష్ట్రంలో వక్కల తయారు చేస్తున్న నగరంగా దీనికి ప్రత్యేక గుర్తింపు ఉంది.
  • బార్పేట రోడ్డు : జిల్లాలో వైశాల్యపరంగా ప్రథమస్థానంలో ఉంది. ఇది పశ్చిమ అస్సాంలో ప్రధాన రద్ది అయిన వ్యాపారకేంద్రాలలో ఒకటి. నగర పరిసరాలలో ప్రజలు ప్రశాంతంగా జీవిస్తున్నారు.
  • సర్భోగ్ : ఇది జాతీయరహదారి 31 పక్కన ఉన్న చిన్న పట్టణం. ఇక్కడ పాలవారు విక్రయించే గేదె పెరుగు ప్రత్యేకత సంతరించుకుంది.
  • పత్సల : ఇది అస్సాం హాలీవుడ్‌గా ప్రత్యేకత సంతరుంచుకుంది. ఇక్కడ పలు మొబైల్ చలన చిత్ర ప్రదర్శన శాలలు ఉన్నాయి. ఈ పట్టణంలో విద్యావతులు అధికంగా ఉన్నారు. ఇది ఒక చిన్న పట్టణం.
  • బర్మర : ఇది ఒక చిన్న పట్టణం. చెంగ, రౌలీ మద్య ఇది రావాణా కేంద్రంగా ఉంది. ఇక్కడ వారాంతర సంత జరుగుతుంది. సంతలో పేదలకు, మద్యతరగతి వారికి అందుబాటులో వస్తువులు లభిస్తుంటాయి.
  • సర్తెబరి: ఇది జిల్లాలో గంటల తయారీకి గుర్తింపు పొందిన చిన్న పట్టణం.
  • కల్గచై : ఇది జిల్లా పశ్చిమ భాగంలో ఉన్న పట్టణం. ఇక్కడ బెంగాలీ భాష ముస్లిములు అధికంగా నివసిస్తున్నారు. ఇది ప్రముఖ విద్యాకేంద్రంగా, అస్సాంలోని బెంగాలీ భాధా ముస్లిం సాహిత్య కార్యకలాపాలకు ఇది ప్రత్యేకత సంతరించుకుంది.
  • భవానిపుర్, బార్పేట (అస్సాం): ఇది జాతీయరహదారి-31 పక్కన ఉంది. ఇది జిల్లాకు కేంద్రస్థానంలో ఉంది. నగరంలో మంచి సాంకేతిక వ్యవస్థ ఉంది. ఇది చక్కని విద్యావంతులు కలిగిన నగరం. అంతేకాక అధికంగా జనసాంధ్రత కలిగిన నగరం. నగరంలో ప్రబలమైన భవానీపురియా గోపాల్ ఆతా సత్రం ఉంది.
  • సరుపేట: ఇది ఒక వ్యాపార కూడలి. ఇది భవానిపూర్ సమీపంలో ఉంది.
  • జనియా : జనియా బజార్ ఇది ఎఫ్.ఏ.ఎ. ఎం మెడికల్ కాలేజ్ (బార్పేట) సమీపంలో ఉంది..

ఆర్ధికం

2006 గణాంకాలను అనుసరించి పచాయితీ రాజ్ మంత్రిత్వశాఖ భారతదేశ జిల్లాలు (640) లో వెనుకబడిన 250 జిల్లాలలో బార్పేట జిల్లా ఒకటి అని గుర్తించింది.[4] .బ్యాక్‌వర్డ్ రీజన్ గ్రాంటు ఫండు నుండి నిధులను అందుకుంటున్న అస్సాం రాష్ట్ర 11 జిల్లాలలో ఈ జిల్లా ఒకటి.[4]

విభాగాలు

సొర్భొగ్ కోక్రఝార్ పార్లమెంటు నియోజకవర్గంలో భాగంగా ఉంది. మిగిలిన 5 బార్పేట పార్లమెంటు నియోజకవర్గంలో ఉంది. [6]

2001 లో గణాంకాలు

విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య . 1,693,190,[7]
ఇది దాదాపు. గునియా-బిస్సౌ దేశ జనసంఖ్యకు సమానం.[8]
అమెరికాలోని. ఇదాహో నగర జనసంఖ్యకు సమం.[9]
640 భారతదేశ జిల్లాలలో. 292 వ స్థానంలో ఉంది.[7]
1చ.కి.మీ జనసాంద్రత. 632[7]
2001-11 కుటుంబనియంత్రణ శాతం. 21.4%.[7]
స్త్రీ పురుష నిష్పత్తి. 951:1000 [7]
జాతియ సరాసరి (928) కంటే. అధికం
అక్షరాస్యత శాతం. 65.03%.[7]
జాతియ సరాసరి (72%) కంటే. తక్కువ
  • 2001 గణాంకాలను అనుసరించి జిల్లాలో అధికంగా ముస్లిములు 977,943 (59.37%), తరువాత స్థానంలో హిందువులు 662,066, తరువాత స్థానంలో క్రైస్తవులు 5,267 ఉన్నారు.

మూలాలు

  1. 1.0 1.1 Law, Gwillim (25 September 2011). "Districts of India". Statoids. Retrieved 11 October 2011.
  2. Srivastava, Dayawanti et al. (ed.) (2010). "States and Union Territories: Assam: Government". India 2010: A Reference Annual (54th ed.). New Delhi, India: Additional Director General, Publications Division, Ministry of Information and Broadcasting (India), Government of India. pp. 1116. ISBN 978-81-230-1617-7. Retrieved 11 October 2011.CS1 maint: extra text: authors list (link)
  3. "Island Directory Tables: Islands by Land Area". United Nations Environment Program. 18 February 1998. Retrieved 11 October 2011. Iturup (Etorofu) 3,238km2
  4. 4.0 4.1 Ministry of Panchayati Raj (8 September 2009). "A Note on the Backward Regions Grant Fund Programme" (PDF). National Institute of Rural Development. Archived from the original (PDF) on 5 ఏప్రిల్ 2012. Retrieved 27 September 2011. Check date values in: |archive-date= (help)
  5. "List of Assembly Constituencies showing their Revenue & Election District wise break – up" (PDF). Chief Electoral Officer, Assam website. Archived from the original (PDF) on 22 మార్చి 2012. Retrieved 26 September 2011. Check date values in: |archive-date= (help)
  6. "List of Assembly Constituencies showing their Parliamentary Constituencies wise break – up" (PDF). Chief Electoral Officer, Assam website. Archived from the original (PDF) on 22 మార్చి 2012. Retrieved 26 September 2011. Check date values in: |archive-date= (help)
  7. 7.0 7.1 7.2 7.3 7.4 7.5 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 30 September 2011.
  8. US Directorate of Intelligence. "Country Comparison:Population". Retrieved 1 October 2011. Guinea-Bissau 1,596,677 July 2011 est. line feed character in |quote= at position 14 (help)
  9. "2010 Resident Population Data". U.S. Census Bureau. Retrieved 30 September 2011. Idaho 1,567,582 line feed character in |quote= at position 6 (help)

వెలుపలి లింకులు