బాలి (చిత్రకారుడు)

From tewiki
Jump to navigation Jump to search
మేడిశెట్టి శంకర రావు
200px
బాలి
జననంమేడిశెట్టి శంకర రావు
సెప్టెంబరు 29, 1945
విశాఖపట్టణం జిల్లా, అనకాపల్లి
నివాస ప్రాంతంహైదరాబాదు
ఇతర పేర్లుబాలి
వృత్తిచిత్రకారుడు,కార్టూనిస్ట్
భార్య / భర్తకీ.శే. ధనలక్ష్మి
పిల్లలుకుమార్తె వైశాలి, కుమారుడు గోకుల్
తండ్రిమేడిశేట్టి లక్ష్మణరావు
తల్లిమేడిశేట్టి అన్నపూర్ణ
సంతకం150px

బాలి వ్యంగ్య చిత్రకారుడు. వీరు వేల సంఖ్యలో కథలకు, నవలలకు బొమ్మలు వేశారు. వీరి అసలు పేరు ఎం. శంకర రావు. వీరి స్వస్థలం అనకాపల్లి. జననం సెప్టెంబరు 29, 1945.

వ్యక్తిగత జీవితం

బాలి తండ్రి మిలిటరీలో పని చేసేవారు. తన చిన్నతనంలోనే బాలి తన తండ్రిని కోల్పోయారు. తల్లి పెంపకంలో పెరిగి పెద్దయ్యి, తన తల్లి ముగ్గులు వేస్తూండగా గమనిస్తూ, చిత్రకళమీద ఆసక్తిని పెంచుకున్నారు. చదువు అనకాపల్లిలోనే జరిగింది. చదువుకునే రోజులలో డ్రాయింగ్ క్లాసంటే ఎక్కువ ఇష్టపడేవారు. ఇంటర్మీడియెట్ వరకు చదివారు. చిత్రకళ మీద కలిగిన ఆసక్తితో సాధన చేశారు. వీరి వివాహం ధనలక్ష్మితో జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు, కుమార్తె వైశాలి, కుమారుడు గోకుల్. పిల్లలిద్దరూ ప్రస్తుతం అమెరికాలో ఉంటున్నారు. బాలి ప్రస్తుత నివాసం సీతాఫల్‌మండి, సికిందరాబాదు. వీరి భార్య మరణించారు.

చిత్రకారునిగా జీవనం

వీరు మొదట్లో ఎం.శంకరరావు, అనకాపల్లి అన్న పేరుతో కార్టూన్లు వేసేవారు. ఆ రోజులలో (1970లలో) ఆంధ్రపత్రిక వారు ఔత్సాహిక కార్టూనిస్టులను ప్రొత్సహించటానికి పోటీలు పెట్టారు . వీరికి మూడువారాలు వరుసగా మొదటి బహుమతి వచ్చిందట. ఈ బహుమతులుతో వచ్చిన ధైర్యంతో, మరింత సాధన చేసి తన నైపుణ్యానికి పదును పెట్టుకున్నారు. బొమ్మలను మంచి సమతూకంతో వెయ్యటం అలవడింది. కొంతకాలం పి.డబ్ల్యు.డి. (Public Works Department:PWD)లో గుమాస్తాగా పనిచేసినా, చిత్రకళ మీద ఉన్న మక్కువతో, "అమ్మే కావాలి" అన్న నవల చిన్న పిల్లల కోసం వ్రాసి, తానే బొమ్మలు వేసి, ఆంధ్రజ్యోతి వారపత్రికకు పంపారు. ఈ నవల, ఆంధ్రజ్యోతిలో ధారావాహికగా ప్రచురించబడి పాఠకుల మన్నన పొందినది. పురాణం సుబ్రహ్మణ్య శర్మ గారు వీరిని ఎంతగానో ప్రొత్సహించి కథలు వ్రాయించి, బొమ్మలు కూడా వేయించేవారు.

పురాణం సుబ్రహ్మణ్య శర్మ గారు వీరి పేరును బాలి గా మార్చి దీవించారు. అప్పటినుండి, అదే పేరుతో ఎన్నో బొమ్మలు, కార్టూన్లు వేసి మంచి పేరు తెచ్చుకున్నారు.

సంపాదకునిగా

బాలి చందు అనే బాలల సాహిత్య పత్రికకు సంపాదకత్వం వహించారు.[1]

  1. బాలి (2004). చందు. హైదరాబాదు: విశాలాంధ్ర. Retrieved 2020-07-13.